Feed Section

Search

Recent Readers

Powered by Blogger.

Saturday 26 October 2013

Kovai Sarala

భర్త, పిల్లలు, హాబీలు.. అన్నీ సినిమానే..!


హైదరాబాద్ : ఆడవాళ్లకు సినిమా పరిశ్రమలోనే కాదు,
 దేవాలయాల్లాంటి ప్రదేశాలలో కూడా
 చేదు అనుభవాలు ఎదురౌతున్నాయి.
  - కోట్ బై కోవై సరళ
 ‘ప్రేమించడం హత్య చేసినంత మహా పాపం’.
 - కోట్ బై కోవై సరళ
 జీవితంలో ఎవరూ ఎవరి మీదా ఆధారపడకూడదు.
 - కోట్ బై కోవై సరళ
 సినిమాలే నా లైఫు, పర్సనల్ లైఫూ.
 - కోట్ బై కోవై సరళ
  కోట్ బై అని అంతా చెప్పుకునే స్థాయిలో
 చాలా పెద్ద జీవితాన్ని చూశారు కోవై సరళ!
 సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లోనే...
 జీవితం ఆమెను రెండు వైపుల నుంచి నొక్కేసింది!
 ఏం చెప్పినా చిటికెలో చేసేస్తుంది - ఒకవైపు
 ఆ అమ్మాయి ఉంటే మేం చెయ్యం - రెండో వైపు.
 ఇవాళ పిలిచి అడ్వాన్స్ ఇచ్చేవాళ్లు - ఒకవైపు
 మర్నాడు ఫోన్ చేసి ఇచ్చేయ్‌మనేవాళ్లు - రెండో వైపు.
 ఇంకా... ఇలాంటివే చాలా, చాలా, చాలా.
 అన్నిటినీ తట్టుకుని నిలబడ్డారు కోవై సరళ.
 ఈవారం ‘తారాంతరంగం’ చదవండి.
 అవడానికి కమెడియనే అయినా...
 ఆమె ప్రతి అనుభవంలో మీకు హీరోయినే కనిపిస్తుంది!
 ఎస్.
 వడివేలును కుమ్మినట్లు...
 పరిస్థితులతో తలపడి నిలబడిన ప్రతి స్త్రీ... హీరోయినే.

  సరళగారూ... మీ ఇంటి పేరు కోవైనా?
 కోవై సరళ: కాదు. మా తమిళంవాళ్లకి ఇంటి పేర్లుండవు. నాన్నగారి పేరు ఇంటిపేరు అవుతుంది. మా సొంత ఊరు కోయంబత్తూర్. ఆ సిటీని ‘కోవై’ అని పిలుస్తారు. ఆ ఊరినుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి, పత్రికలవాళ్లు కోవై సరళ అని రాయడం మొదలుపెట్టారు. దాంతో  అది పాపులర్ అయిపోయింది.

 అయితే  పుట్టి పెరిగిందంతా కోయంబత్తూర్‌లోనేనా?
 కోవై సరళ: అవును. నా బాల్యం, చదువూ అంతా అక్కడే. ప్లస్ టూ వరకూ చదివా. ఇంగ్లిష్, తమిళ్‌లో టైప్‌రైటింగ్ హయ్యర్ పాసయ్యాను. అప్పట్లో నేను టైప్ చేస్తుంటే.. అందరూ ఆశ్చర్యంగా చూసేవాళ్లు. అంత స్పీడ్ అన్నమాట. నాకు చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ఇష్టం. ప్లస్ టు తర్వాత సినిమాల్లోకి వెళదామనుకున్నాను కానీ ఇంట్లో ఒప్పుకోలేదు.

 మీ నాన్నగారు ఏం చేసేవారు?
 సరళ: లారీలు, బస్సులు ఉండేవి. ఆ బిజినెస్‌లో నష్టం వచ్చిన తర్వాత ఆయన ఓ ప్రైవేట్ ఉద్యోగంలో చేరారు. మా నాన్న మిలిటరీలో కూడా చేశారు. దాంతో స్ట్రిక్ట్‌గా ఉండేవారు. చిన్న పనైనా ఓ పద్ధతి ప్రకారం చేయాలనేవారు. సినిమాలకు వెళ్లనిచ్చేవారు కాదు. స్కూల్, ఇల్లు, టైప్‌రైటింగ్ క్లాస్ తప్ప వేరే ప్రపంచం తెలియదు.

 మీకు బ్రదర్స్, సిస్టర్స్ ఉన్నారా?
 సరళ: నలుగురు అక్కయ్యలు, ఓ అన్నయ్య. నాన్నగారు స్ట్రిక్ట్ అయినప్పటికీ నాకేదైనా కావాలంటే మారాం చేసి, మంకు పట్టు పట్టి మరీ సాధించుకునేదాన్ని. డ్రామాల్లో అయినా యాక్ట్ చేయనివ్వాలంటూ స్ట్రైక్ చేశాను. అయినా నాన్న మనసు కరగలేదు. దాంతో ఓ రోజంతా ఉపవాసం ఉన్నాను. ఇక, లాభం లేదనుకుని అనుమతించారు. ఒక డ్రామాలో యాక్ట్ చేశా. భలే అనిపించింది. అమ్మానాన్నను బతిమాలుకుని ఎలాగోలా 20 డ్రామాల్లో యాక్ట్ చేసేశాను. డ్రామాల ద్వారా సంపాదించిన అనుభవంతో సినిమాల్లో యాక్ట్ చేయొచ్చన్నది నా అభిప్రాయం.

 మరి... సినిమాల్లోకి రావడానికి ఎంత పెద్ద స్ట్రయిక్ చేశారేంటి?
 సరళ: లక్కీగా అలా చేయాల్సిన అవసరంలేదు. డెరైక్టర్ భాగ్యరాజాగారి ఇల్లు మా ఇంటి పక్కనే. నేను చిన్నప్పట్నుంచీ ఆయనకు తెలుసు. ‘‘పెద్దయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు?’’ అని ఆయన అడిగితే.. ‘సినిమా యాక్టర్’ అవుతా అనేదాన్ని. సినిమాల్లోకి రాకముందు భాగ్యరాజాగారు డ్రామాలు వేసేవారు. సినిమా డెరైక్టర్ అయిన తర్వాత, మా నాన్నగారికి ఆరోగ్యం బాగా లేకపోతే భాగ్యరాజాగారు చూడ్డానికి వచ్చారు. నన్ను చూసి, ‘‘ఏం చేస్తున్నావ్’’ అనడిగితే, ై‘టెప్‌రైటింగ్’ చేస్తున్నా అని చెప్పాను. ‘‘నేను ‘ముందానై ముడిచ్చు’ అనే సినిమా చేస్తున్నా. గోపిచెట్టిపాల్యంలో షూటింగ్ జరుగుతోంది. అక్కడికొస్తే, నీకు మంచి కేరక్టర్ ఇస్తాను’’ అన్నారాయన. చెప్పింది భాగ్యరాజాగారు.. పైగా సినిమాల మీద నా పిచ్చి బాగా ముదిరిందని గ్రహించి, పెద్దగా బతిమాలించుకోకుండానే అమ్మానాన్న పర్మిషన్ ఇచ్చారు. దాంతో హుషారుగా కోయంబత్తూర్ టు గోపిచెట్టిపాల్యం బస్సెక్కేశా.

 ఫస్ట్ టైమ్ షూటింగ్ ఎలా అనిపించింది?
 సరళ: అప్పటివరకు నాది చాలా చిన్నప్రపంచం. లొకేషన్లో చాలామందిని చూసి, ఆశ్చర్యం అనిపించింది. కానీ భయపడలేదు. యాక్టింగ్ అంటే ఇంట్రస్ట్ కాబట్టి, తడబడకుండా చేసేశాను. ‘ముందానై ముడిచ్చు’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

 వెంటనే బోల్డన్ని అవకాశాలు వచ్చి ఉంటాయేమో?
 సరళ: ఫలానా కేరక్టర్ చేసింది ఎవరు? అంటూ కొంతమంది దర్శక, నిర్మాతలు ఆరా తీశారు. అయితే నేను ‘ముందానై ముడిచ్చు’ సినిమా చేసి, కోయంబత్తూర్‌లోనే ఉండిపోయాను. అందుకని, నన్ను కాంటాక్ట్ చేయలేకపోయారు. ఆరు నెలలు గడిచిన తర్వాత ఇలా అయితే లాభం లేదనుకుని మద్రాసు వెళ్లాలని నిర్ణయించుకున్నా.

 ఊరు కాని ఊరికి పంపించడానికి ఇంట్లోవాళ్లు భయపడలేదా?
 సరళ: నాతో పాటు నాన్నగారు కూడా వచ్చారు. మద్రాస్‌లోని తేనాంపేటలో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాం. ఇక, నేను మద్రాసు వచ్చానని తెలుసుకుని, చాలామంది అప్రోచ్ అయ్యారు. ‘కళ్యాణరామన్’, ‘ఉయిరే ఉనక్కాగ’... ఇలా నేను చేసిన సినిమాలన్నీ వంద రోజులాడటం, నా కామెడీ నచ్చడంతో పాపులర్ అయ్యాను.

 అసలు సినిమాల మీద మీకు ఇష్టం ఏర్పడటానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
 సరళ: నేను ఎమ్జీఆర్‌కి వీరాభిమానిని. ఇంట్లో సినిమాలు చూడనిచ్చేవాళ్లు కాదని చెప్పాను కదా. అప్పుడప్పుడు గొడవపడో, బతిమాలుకునో ఎమ్జీఆర్ సినిమాకెళ్లేదాన్ని. తెరపై ఆయన కనిపించగానే అభిమానులు విజిల్స్ వేయడం, ఆరాధనగా చూడటం భలే అనిపించేది. మనం కూడా సినిమా ఆర్టిస్ట్ అయితే అలానే చూస్తారుగా అనుకునేదాన్ని. సో.. నేను ఆర్టిస్ట్ అవాలనుకోవడానికి ఓ కారణం ఎమ్జీఆర్ అనే చెప్పాలి.

 అది సరే... ఎవరైనా హీరోయిన్ అవ్వాలనుకుంటారు... మీరు కామెడీనే ఎందుకు టార్గెట్ చేశారు?
 సరళ: నా టార్గెట్ హీరోయినా, కమెడియనా, కేరక్టర్ ఆర్టిస్టా? అని కాదు. స్క్రీన్ మీద నా మొహం కనిపిస్తే చాలనుకున్నాను. పబ్లిక్‌లో కనిపించినప్పుడు ‘అదిగో కోవై సరళ...’ అని నన్ను గుర్తుపడితే ఈ జన్మ సార్ధకమైనట్లు అనుకునేదాన్ని. ఒకవేళ నేను హీరోయిన్‌కి టార్గెట్ చేసి, పరిస్థితుల ప్రభావం వల్ల కామెడీతో సరిపెట్టుకోవాల్సి వస్తే... చాలా అప్‌సెట్ అయ్యుండేదాన్ని.

 మీరు రంగప్రవేశం చేసే నాటికి కమెడియన్‌గా, కేరక్టర్ ఆర్టిస్ట్‌గా మనోరమ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. మరి... మీకేమైనా అభద్రతాభావం, భయం ఉండేవా?
 సరళ: నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ. సీన్ ఇలా చెప్పగానే అలా చేసేదాన్ని. చెట్లెక్కమంటే ఎక్కేసేదాన్ని, పై నుంచి దూకమంటే అమాంతంగా దూకేసేదాన్ని. దాంతో కోవై సరళ ఏం చెప్పినా, చిటెకెలో చేసేస్తుందని ప్రచారం జరిగింది. అలాగే నేను చేసే కామెడీ కూడా ప్రేక్షకులకు నచ్చడంతో అవకాశాలకు కొదవ ఉండేది కాదు. అందుకే, మనం పెట్టే బేడా సర్దుకుని కోయంబత్తూర్ వెళ్లాల్సి వస్తుందేమోననే భయం ఉండేది కాదు.

 మనోరమ.. ఆ తర్వాత మీరు... మీ తర్వాత పెద్దగా హాస్యనటీమణులు రాణించకపోవడానికి కారణం ఏంటి... మగవాళ్లల్లో చాలామంది కమెడియన్లు ఉన్నారు కదా?
 సరళ: తమిళ పరిశ్రమకు సంబంధించినంతవరకు మగవాళ్ల డామినేషన్ ఉంటుంది. లేడీస్‌కి తక్కువ ప్రోత్సాహం ఉంటుంది. అందుకే, మా తర్వాత లేడీ కమెడియన్స్ షైన్ అవలేదు. ఒకరిద్దరు వచ్చినా, పూర్తిగా ఇన్‌వాల్వ్ అవ్వలేకపోయారు. ఒకవేళ ఇన్‌వాల్వ్ అయినా ఎంకరేజ్‌మెంట్ లభించలేదు.

 నిజం చెప్పండి... ఇక్కడ మీకేమైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయా?
 సరళ: నన్ను పైకి రానివ్వకుండా చేయాలని కొంతమంది ట్రై చేశారు. ‘ఆ అమ్మాయి ఉంటే మేం సినిమా చెయ్యం’ అని నిర్దాక్షిణ్యంగా చెప్పేవాళ్లు. దాంతో నాకు కొన్ని అవకాశాలు పోయేవి.

 అలా చేసినవాళ్లెవరు?... ఆ డామినేషన్‌ని తట్టుకోవడానికి మీరేం చేసేవారు?
 సరళ: పేర్లు చెప్పను. నేను కామెడీ ఆర్టిస్ట్‌ని కాబట్టి, నా అవకాశాల విషయంలో హీరోల జోక్యం ఉండదు కదా. కొంతమంది కమెడియన్లే నాతో యాక్ట్ చేయకూడదనుకునేవాళ్లు. అయినా నా పని నేను చేసుకునేదాన్ని. ఓ పది సినిమాలు చేతిలో ఉన్నప్పుడు ఒకటీ రెండు సినిమాలు పోతే ఏమవుతుంది?

 అడ్వాన్స్ తీసుకున్న తర్వాత కూడా వెనక్కి వెళ్లిన అవకాశాలు ఉన్నాయా?
 సరళ: చాలా ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం వెయ్యి రూపాయలంటే పెద్ద విషయం. అప్పట్లో నేనో సినిమా కమిట్ అయ్యానంటే, వెయ్యిరూపాయలు అడ్వాన్స్ ఇచ్చేవారు. అయితే కొంతమంది కమెడియన్లు నేనుంటే.. యాక్ట్ చెయ్యనని చెప్పేయడంతో ఇచ్చిన అడ్వాన్స్‌ని వెనక్కివ్వమని అడిగేవాళ్లు. ఒక సినిమాకి అవకాశం వస్తే.. సంతోషంతో నాకా రోజంతా నిద్రపట్టేది కాదు. కానీ, ఉదయమే అడ్వాన్స్ వెనక్కివ్వమని ఫోన్ రావడమో, డెరైక్ట్‌గా మనిషి రావడమో జరిగేది. అప్పుడు బాగా ఏడ్చేదాన్ని. ఆ సమయంలో మా నాన్నగారు ఇచ్చిన ధైర్యాన్ని నేనెప్పటికీ మర్చిపోలేదు. ‘మనకేది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. నీకు టాలెంట్ ఉంది’ అంటూ ఊరడించేవారు. నాన్న ముందు కన్విన్స్ అయ్యేదాన్ని కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చేదాన్ని.

 ఆ బాధలో బ్యాక్ టు కోయంబత్తూర్ అనే నిర్ణయం ఎప్పుడైనా తీసుకున్నారా?
 సరళ: అంత పిరికిగా ఆలోచించలేదు. బాధపడుతూ ఇంట్లో కూర్చునేంత ఖాళీ ఉండేది కాదు. పైగా నేను చేసేది కామెడీ కాబట్టి.. షూటింగ్‌కి వెళ్లగానే బాధ తగ్గేది. అలాగే, ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. హాస్యనటుల కెరీర్ మహా అయితే 10, 15 ఏళ్లు ఉంటుంది. వాళ్లతో పోల్చితే నటీమణుల కెరీర్‌కి ఎక్కువ స్పాన్ ఉంటుంది. అందుకు ఉదాహరణ నా 30 ఏళ్ల కెరీరే. నా కళ్లముందే ఎంతోమంది మగ కమెడియన్లు వచ్చారు.. వెళ్లారు. కానీ, నేను మాత్రం అలానే ఉన్నాను. ఎంతమంది కమెడియన్లు వచ్చినా.. వాళ్లకి దీటుగా నిలబడగలననే విషయం నాకు చాలా త్వరగానే అర్థమైంది. దాంతో నా వెనక గోతులు తవ్వినా పట్టించుకునేదాన్ని కాదు. మహా అయితే నాలుగైదేళ్లు ఇతను ఉంటాడేమో.. కానీ మనకు లాంగెవిటీ ఉంటుందనే ఆత్మవిశ్వాసంతో ఉండేదాన్ని. అదే నిజమైంది.

 హాస్యనటుల కెరీర్ పదేళ్లే అని ఎలా అంటున్నారు... కోట, బ్రహ్మానందం, బాబుమోహన్, అలీ.. ఇలా చాలామంది ఏళ్ల తరబడి ఏలుతున్నారు కదా?
 సరళ: నేను చెప్పింది తమిళ పరిశ్రమ గురించి. నాకు తెలిసి తెలుగులో డెరైక్టర్, ప్రొడ్యూసర్, రైటర్స్ సెలక్ట్ చేసిన కమెడియన్లనే ఎన్నుకుంటున్నారనిపిస్తోంది. తమిళంలోలా ‘నేను కోవై సరళతో యాక్ట్ చేయను’ అని చెప్పే కమెడియన్లు ఇక్కడ లేరు. అందుకే, నాకిక్కడ అవకాశాలొస్తున్నాయి.

 ఇలాంటి పరిస్థితిలో ‘సతీలీలావతి’లో మిమ్మల్ని కమల్‌హాసన్ హీరోయిన్‌గా ఎంపిక చేసినప్పుడు ఎలా అనిపించింది?
 సరళ: ఆయన సినిమాలో నేను కామెడీ కేరక్టర్స్ చేశాను.ఆ విధంగా కమల్‌తో  నాకు మంచి అనుబంధం ఉంది. నా మేనేజర్ వచ్చి ‘కమల్‌సార్ సరసన మీరు హీరోయిన్‌గా నటించాలి’ అన్నాడు. జోక్‌లేసి నవ్వించే నాకే జోక్ చెబుతున్నావా? అనడిగాను. ‘కాదు మేడమ్.. సీరియస్‌గానే చెబుతున్నా’ అనడంతో నమ్మకం కుదిరింది. ఆ సినిమా ఓ మర్చిపోలేని మంచి అనుభవం.

 మీకు బాగా పేరొచ్చాక కూడా, మిమ్మల్ని తొక్కాలని ఎవరైనా ప్రయత్నించారా?
 సరళ: ప్రయత్నించారు. అయితే నాకు పేరొచ్చేసింది కాబట్టి... మొహం మీద చెప్పేవాళ్లు కాదు. లేడీ కమెడియన్‌గా ఎవరు చేస్తున్నారు? అని అడిగి, ‘ఆవిడా.. అయితే మా డేట్స్ ఖాళీగా లేవు’ అని చెబుతుంటారు. ఆ విధంగా ఎవరెవరు చెబుతున్నారో నాకర్థమయ్యింది. అందుకని, నిర్మాతలను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక, ‘ముందు ఆ ఆర్టిస్ట్ దగ్గర డేట్స్ ఓకే చేయించుకోండి. ఒకవేళ ఆయన ఇస్తే.. నాకేం అభ్యంతరం లేదు’ అని చెబుతుంటాను. కానీ, ఆ నిర్మాతలు ఆ తర్వాత నాతో టచ్‌లోకి రారు. అది నేనూహించిందే కాబట్టి, నవ్వేసి ఊరుకుంటాను.

 ఎందుకని మీరంటే ఆ ‘కొంతమంది ఆర్టిస్ట్’లకు పడదు?
 సరళ: ఒకవేళ యాక్టింగ్‌లో డామినేట్ చేస్తాననో లేక వాళ్లకి ఈక్వల్‌గా యాక్ట్ చేస్తున్నాననే ఫీలింగ్ వల్లో... లేకపోతే ఇంకా ఏమైనా కారణాలున్నాయేమో నాకు తెలియదు.

 జనరల్‌గా సినిమా నిడివి ఎక్కువైతే.. కత్తెర పడేది దాదాపు కమెడియన్ల పాత్రలకే. మీ విషయంలో అలా జరిగిన సందర్భలున్నాయా?
 సరళ: లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. ఈ పాత్ర మనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఓ నమ్మకంతో చేసి, ఆ సినిమా విడుదల కోసం బాగా ఎదురు చూసేదాన్ని. కానీ, సినిమా నిడివి పెరిగినందున నా పాత్ర నిడివి ఆటోమేటిక్‌గా తగ్గిపోయేది. దాంతో రావాల్సినంత పేరు వచ్చేది కాదు. అప్పుడు చాలా నిరుత్సాహపడేదాన్ని. కొన్ని ఎదురు దెబ్బలు మనకు మంచి పాఠాలవుతాయి. ఆ పాఠాలు మన దిశను నిర్దేశిస్తాయి. ఆ విధంగా సినిమాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే నేను ఎంచుకున్న దిశ ‘ఆధ్యాత్మికం’.

 ఏ వయసులో ఈ దారిని ఎంచుకున్నారు?
 సరళ: అది కరెక్ట్‌గా చెప్పలేను. చిన్నప్పట్నుంచే నా ఆలోచనలు ఆధ్యాత్మికంగా ఉండేవి. అయితే ఆ వయసులో దాని పేరు ఆధ్యాత్మికం అని తెలిసే అవకాశం లేదు కదా. పెద్దయిన తర్వాత వివేకానంద, ఓషో పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. ఆధ్యాత్మికతకు సంబంధించిన క్లాస్‌లకు వెళ్లేదాన్ని. ‘జీవితం నిరంతరం కాదు. ఎప్పటికైనా మట్టిలో కలవాల్సిందే. ఈ రోజు ఉన్నాం. రేపు ఉంటామో లేదో తెలియదు. అందుకని ఈరోజు నవ్వుతూ, హాయిగా ఉందాం. చుట్టుపక్కలవాళ్లని సంతోషపెడదాం’ అనేంత మానసిక పరిపక్వత నాలో రావడానికి కారణం ఆ పుస్తకాలే.

 ఓషో ద్వారా ఇంకా ఎలాంటివి తెలుసుకున్నారు?
 సరళ: ఉదాహరణకు చెయ్యి మీద పెద్ద దెబ్బ తగిలిందనుకుందాం. ‘రక్తం కారుతోంది’ అని మాత్రం అనుకుంటే, నొప్పి తెలియదు. బాగా నొప్పిగా ఉంది అనుకుంటే, నొప్పి తెలుస్తుంది. అసలు నొప్పే లేదనుకుంటే, నిజంగానే నొప్పి తెలియదు. నేనిది టెస్ట్ చేసి చూసుకున్నా. ఓషో బుక్స్ వల్ల దేన్నయినా తేలికగా తీసుకునే పరిపక్వత వచ్చేసింది.

 తెలుగులో మీ పాత్రలకు ఎంచక్కా డబ్బింగ్ చెప్పేస్తున్నారు. అసలు తెలుగు ఎలా నేర్చుకున్నారు?
 సరళ: నా డైలాగులన్నీ తమిళంలో రాసుకుని, బట్టీపట్టి లొకేషన్లో చెప్పేస్తుంటాను. తెలుగులో నేను డబ్బింగ్ చెప్పడానికి మొదటి కారణం కోడి రామకృష్ణగారు. ‘పెళ్లాం చెబితే వినాలి’ అప్పుడు ఆయన డబ్బింగ్ చెప్పమన్నారు.. ఆ సినిమాకి కో-డెరైక్టర్‌గా చేసిన రాధాకృష్ణ దగ్గరుండి మరీ నాతో డబ్బింగ్ చెప్పించారు. నాకు బాగానే పేరొచ్చింది.. కానీ నాతో డబ్బింగ్ చెప్పించి, ఆయనకు చుక్కలు కనిపించాయి (నవ్వుతూ). తెలుగు మాట్లాడటానికి నేను ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. తమిళ్ ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడేస్తాను. ఆ శ్లాంగ్ అందరికీ నచ్చడం నా లక్.

 మీ సినిమాల్లో కమెడియన్స్‌ని ఫుట్‌బాల్ ఆడేస్తుంటారు. అసలు ఈ కొట్టడం అనేది ఎవరితో మొదలైంది?
 సరళ: వడివేలుతో మొదలుపెట్టా. అది బాగా పండటంతో అప్పట్నుంచి నాతో కొట్టించడం ఆనవాయితీ అయ్యింది.

 ఈ కొట్టే ప్రక్రియ ఓవర్‌గా ఉంటుందనే విమర్శ ఉంది...?
 సరళ: ఏ కొద్దిమందో అంటున్నారేమో. కానీ, మొగుడూ పెళ్లాలూ కొట్టుకోవడం నేను రోడ్డు మీద చాలా చూశాను. మందు కొడితే చాలు.. మృగంలా మారిపోయి, భార్యలను రోడ్డు మీద కొట్టే మగవాళ్లను స్వయంగా చూశాను. అది తట్టుకోలేక తిరగబడ్డ ఆడవాళ్లనూ చూశాను. నేను కొట్టడం ఓవర్ అని మీరంటున్నారు. కానీ, చాలామంది ఆడవాళ్లు.. ‘‘మేడమ్... మీరే మాకు ఇన్‌స్పిరేషన్. మా మగవాళ్లు అడ్డదిడ్డంగా బిహేవ్ చేసినప్పుడు ‘కోవై సరళలా మారతాం... జాగ్రత్త అని బ్లాక్‌మెయిల్ చేస్తుంటాం’’ అంటుంటారు. మగవాళ్లకు నా మీద కోపం ఉంటుందేమో. కానీ, ఆడవాళ్లు తమను తాము రక్షించుకోవడం కోసం నా పేరు వాడుకోవడం నాకు బాగానే అనిపిస్తోంది.

 కొంచెం ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే... సినిమా పరిశ్రమలో ఆడవాళ్లు చాలా విషయాల్లో రాజీపడాలంటారు. హీరోయిన్ నుంచి కామెడీ ఆర్టిస్ట్‌ల వరకూ ఇది వర్తిస్తుందా?
 సరళ: హీరోయిన్ల నుంచీ కామెడీ ఆర్టిస్ట్‌ల వరకు కాదు.. జూనియర్ ఆర్టిస్టులకూ ఇది వర్తిస్తుంది. అయితే ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. మన దగ్గర బిర్యానీ తినడానికి డబ్బులు లేకపోతే పచ్చడి మెతుకులతో సరిపెట్టుకోవాలనుకుంటే.. ఏ విషయంలోనూ రాజీపడాల్సిన అవసరంరాదు. కానీ, బిర్యానీయే తినాలనుకుంటే మాత్రం రాజీ పడాలి.

 రాజీపడకపోతే.. అవకాశాలు రావంటారు?
 సరళ: ఒకట్రెండు సినిమాలు పోతాయేమో. దానికే కంగారుపడిపోతే రాజీపడాలనే ధోరణి మొదలవుతుంది. కానీ, మనకు రావాలని రాసి పెట్టి ఉంటే, వచ్చే అవకాశాలను ఎవరూ ఆపలేరు. నాకు చాలా సినిమాలు మిస్ అయ్యాయి. అయినా డోంట్ కేర్ అన్నట్లుగానే వ్యవహరించాను. ఆడవాళ్లకు సినిమా పరిశ్రమలోనే కాదు.. దేవాలయాల్లాంటి స్కూల్స్, కాలేజ్‌లు, హాస్పిటల్స్‌లో కూడా చేదు అనుభవాలు ఎదురవుతాయి. వాటి నుంచి తప్పించుకునే నేర్పు ఉంటే, సేఫ్‌గా వెళ్లిపోవచ్చు.

 ఇక... మీ తోడబుట్టినవాళ్లతో మీ అనుబంధం గురించి?
 సరళ: నా అక్కయ్యల పిల్లలు నా దగ్గరే పెరిగారు. అందర్నీ చదివించాను. ఒకబ్బాయి దుబాయ్‌లో, ఇద్దరు యూఎస్‌లో, ఒకరు లండన్‌లో... ఇలా అందరూ మంచి జాబ్స్‌లో సెటిలయ్యారు.

 మీ నలుగురు అక్కలు చక్కగా పెళ్లి చేసుకుని, సెటిలయ్యారు.. మీకెప్పుడూ పెళ్లి చేసుకోవాలనిపించలేదా?
 సరళ: పెళ్లి గురించి ఆలోచించలేనంత బిజీగా ఉండేదాన్ని. సినిమాలు తప్ప నా పర్సనల్ లైఫ్ ఇలా ఉండాలని ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. పైగా సమాజంలో ఎన్నో విడాకుల కేసులు చూశాను. ఇక పెళ్లెందుకు అనిపించేసింది.

 అమ్మానాన్న పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయలేదా?
 సరళ: పెళ్లి చేసుకో అన్నారు. ఇష్టం లేదంటే, వదిలేశారు. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ అని చెప్పాను కదా. స్కూల్‌కి వెళ్లేటప్పుడు వంచిన తల ఎత్తకూడదు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ఇలా ఓ స్ట్రిక్ట్ వాతావరణంలో పెరిగినందువల్లో ఏమో నాకు ప్రేమ మీద కూడా దృష్టి మళ్లలేదు. ఒకవేళ అప్పట్లో ఎవరితోనైనా ప్రేమలో పడి ఉంటే, పెళ్లి చేసుకుని ఉండేదాన్నేమో. కానీ, నేను లవ్‌కి ఆపోజిట్. ప్రేమించడం అనేది హత్య చేసినంత మహా పాపం అని నా మనసులో బలంగా ముద్రించుకుపోయింది.

 మరి.. మీకు ఎవరూ ‘ఐ లవ్ యు’ చెప్పలేదా?
 సరళ: నన్ను చూసి ఎవరైనా ‘ఐ లవ్ యు’ చెబుతారా? నేను చేసిన కేరెక్టర్ల ప్రభావం నా జీవితం మీద కూడా పడి ఉంటుందేమో. సినిమాల్లో సహ నటులను ఓ రేంజ్‌లో కొట్టే నేను నిజజీవితంలో కూడా అలానే ఉంటాననుకుని ఉండొచ్చు. అందుకని, ఎవరూ నాకు ప్రపోజ్ చేయలేదు.

 వయసులో ఉన్నంతవరకూ ఓకే. కానీ, వయసు మీద పడిన తర్వాత ఓ తోడు ఉండాలంటారు కదా?
 సరళ: పుట్టినప్పుడు మనం ఒంటరిగానే పుడతాం. ఇది మీ అమ్మ.. ఇది నాన్న... వీళ్లు నీ అక్క, చెల్లెళ్లు అని ఎవరో ఒకరు చెబితేనే మనకు తెలుస్తుంది. దాంతో ‘మనవాళ్లు’ అనే భావన మొదలవుతుంది. పెరిగే కొద్దీ అనుబంధం బలపడుతుంది. కానీ, పెళ్లి చేసుకున్న తర్వాత ‘నా కుటుంబం’ అనే భావన మొదలవుతుంది. అప్పుడు తోబుట్టువుల మీద కొంత ప్రేమ తగ్గుతుంది. అలా మెల్లి మెల్లిగా దూరం పెరిగిపోతుంది. ఒకవేళ పెళ్లి చేసుకున్నామే అనుకోండి. భర్త చనిపోతే ఒంటరిగా బతకాల్సిందేగా. అందుకే నేను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయా. నా దృష్టిలో జీవితంలో ఎవరూ ఎవరి మీదా ఆధారపడకూడదు.

 పెళ్లి చేసుకున్న తర్వాత తోడబుట్టినవాళ్లతో అనుబంధాలు తగ్గుతాయన్నారు. మీవాళ్లు ఆ జాబితాకి చెందినవారేనా?
 సరళ: ఎంతో కొంత ఆ జాబితాకే చెందుతారు. పెళ్లయిన తర్వాత వాళ్లల్లో మార్పొచ్చింది. ‘నా కుటుంబం, నా పిల్లలు, నా సమస్య’... అంటూ నన్ను వేరు చేసి మాట్లాడుతున్నారు. ‘ఓకే.. నాకు మంచి పాఠం నేర్పించారు’ అని డెరైక్ట్‌గా వాళ్లతోనే చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి.

 మీవాళ్లు అలా చేయడం బాధగా లేదా?
 సరళ: నేను కూడా మనిషేనండి. ఓషో, వివేకానంద పుస్తకాలు చదివినంత మాత్రాన ప్రతి విషయాన్ని తేలికగా తీసేసుకుంటానని అనుకోవద్దు. అయితే ఒకే ఒక్క విషయంలో నేను ఆనందపడ్డాను. మంచి వయసులో ఉన్నప్పుడే నాకు అందరి మనస్తత్వాలు అర్థం అయ్యాయి. అదే నేను బాగా ముసలిదాన్ని అయిన తర్వాత తెలిసిందనుకోండి.. ఆ వయసులో తట్టుకునేంత ధైర్యం నాకు ఉండేది కాదు. ఇప్పుడు నాకు బాగా స్టామినా ఉంది. మానసికంగా చాలా ధైర్యం ఉంది. అందుకే, తట్టుకున్నాను.

 అసలు మీ లైఫ్‌స్టయిల్ ఎలా ఉంటుంది?
 సరళ: చాలా నార్మల్‌గా. కొన్ని రోజులు ఉదయం ఐదున్నర గంటలకు వాకింగ్ వెళుతుంటాను. బద్దకం అనిపించినప్పుడు మానేస్తా. చెబితే నమ్మరు కానీ.. పదేళ్ల క్రితం రాత్రి రెండున్నర గంటలకు నిద్రలేచి, మూడుగంటలకల్లా మెరీనా బీచ్‌కి వెళ్లేదాన్ని. ఓ గంట వాక్ చేసి, నాలుగున్నరకి ఇంటికొచ్చేసేదాన్ని. ఆ తర్వాత మేకప్ చేసుకుని ఏడుకల్లా షూటింగ్‌కి వెళ్లేదాన్ని. అలా ఆరు నెలలు చేశాను. ఆ తర్వాత కొన్నాళ్లు వాకింగ్ మానేశాను. ఇంట్లోనే త్రెడ్‌మిల్ మీద వాక్ చేసేదాన్ని. అది వర్కవుట్ కాలేదు. ఈ మధ్య ఉదయం నాలుగున్నరకల్లా నిద్ర లేచి, వాకింగ్, చిన్నపాటి వ్యాయామాలు చేస్తున్నాను. ఆ తర్వాత సింపుల్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. నాన్‌వెజ్ పెద్దగా తినను.

 ఫైనల్‌గా కథానాయికల కెరీర్‌కన్నా మీ కెరీర్‌కి లాంగ్విటీ ఎక్కువ కాబట్టి.. ఎప్పుడైనా హీరోయిన్స్‌కన్నా మనమే బెస్ట్ అనిపించిందా?
 సరళ: హీరోయిన్‌గా చేసి ఉంటే.. ఇప్పుడు ‘సాక్షి’కి ఈ ఇంటర్వ్యూ ఇచ్చి ఉండేదాన్ని కాదేమో. మా కోయంబత్తూర్‌లో పాత రోజులను నెమరువేసుకుంటూ కాలక్షేపం చేసేదాన్నేమో. 1983లో సినిమాల్లోకొచ్చాను. ఒకవేళ హీరోయిన్ అయ్యుంటే ఐదు, పదేళ్లకే వెనక్కి వెళ్లిపోయుండేదాన్ని. కామెడీలో ఉన్నాను కాబట్టే 30 ఏళ్లయినా స్టేల్ అవ్వలేదు. ఇప్పటికీ ‘కోవై సరళ’ కామెడీ బోర్ కొట్టలేదు. అందుకే, ‘కామెడీలో నేనే హీరోయిన్’ అనుకుంటాను. నా భర్త, నా పిల్లలు, నా హాబీ సినిమాలే. చివరి శ్వాస వరకు యాక్ట్ చేయాలన్నదే నా కోరిక.

 - డి.జి. భవాని

 మీరు ఎవరితోనూ ఫోన్‌లో టచ్‌లో ఉండరు... ఎందుకు?
 సరళ: ఫోన్లో మాట్లాడటం నాకు అలర్జీ. ఎవరైనా గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతుంటే, అంతసేపు ఎలా మాట్లాడుతున్నారు? అనుకుంటాను. మీకో విషయం చెప్పనా? ఆరు నెలల క్రితం వెయ్యి రూపాయలతో రీచార్జ్ చేయించు కున్నాను. ఇప్పటికీ నా ఫోన్‌లో బాలెన్స్ ఉంది. దాన్ని బట్టి ఎంత మితంగా ఫోన్ వాడతానో అర్థం చేసుకోవచ్చు.

 ఫంక్షన్స్‌లో కూడా ఎక్కువ కనిపించరు?
 సరళ: ఫంక్షన్స్‌కి వెళ్లడం చాలా తక్కువ. ఫంక్షన్‌కి వెళ్లాలనుకోండి... దానికోసమే ప్రత్యేకంగా తయారవ్వాలి. తయారై, ట్రాఫిక్‌ని కూడా లెక్క చేయకుండా వెళ్లిన తర్వాత అక్కడ జరిగేది ఏంటి? ‘బాగున్నారా..’.. ‘ఆ బాగున్నాను’ అంటూ పలకరింపులు. వెనక్కి తిరగ్గానే ‘ఆ ఏం బాగులే...’ అని వెక్కిరింతలు. పెదాల మీద నవ్వుని మెయిన్‌టైన్ చెయ్యాలి. ఇంటికొచ్చేసరికి ఆ నవ్వు తాలూకు బుగ్గల నొప్పిని భరించాలి. ఇవన్నీ ఎందుకు? అని ఫంక్షన్స్‌ని తగ్గించేశాను.


 ఓ సినిమా సక్సెస్ అయితే హీరో, డెరైక్టర్, హీరోయిన్స్‌కి ఎక్కువ క్రెడిట్ ఇస్తారు. ఆ తర్వాతే కమెడియన్స్ గురించి మాట్లాడుకుంటారు. దీని గురించి మీరేమంటారు?

 సరళ: నాకు సంబంధించినంతవరకు అది కరెక్టే అంటాను. ఎందుకంటే, హీరోలు నిజంగానే కష్టపడాలి. ఫిజిక్ మెయిన్‌టైన్ చెయ్యాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలు కంపల్సరీ. ఆహార విషయాల్లో కూడా చాలా నియమాలుంటాయి. ఇక, ఫైట్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. సినిమా మొత్తం దాదాపు హీరో మీదే నడుస్తుంది కాబట్టి.. ఎక్కువ శాతం క్రెడిట్ వాళ్లకే ఇవ్వాలి. హీరోయిన్స్ కూడా సన్నగా మెరుపు తీగలా ఉండాలి కాబట్టి... నచ్చిన ఆహారం తినలేరు. డ్యూయెట్ సాంగ్స్‌లో డాన్సులు చేయడం చిన్న విషయం కాదు. అందుకని, హీరోయిన్‌కీ క్రెడిట్ ఇవ్వాలి. సినిమా మొత్తాన్ని ఏకతాటిపై నడిపించేది దర్శకుడు, అసలా సినిమా తీయడానికి కారణం ప్రొడ్యూసర్ కాబట్టి.. ముందు వాళ్ల గురించే మాట్లాడాలి. ఇక, ఆ తర్వాతి క్రెడిట్ విలన్, కమెడియన్స్, క్యారక్టర్ ఆర్టిస్ట్‌లకు దక్కుతుంది.
http://www.sakshi.com/news/family/exclusive-interview-with-kovai-sarala-76157?pfrom=home-top-story
22:43 - By Swathi 0

0 comments:

Friday 25 October 2013

Varalakshmi Devi Vratham

ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః


ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః
 varalakshmi devi vrathamమహిళలందరూ ఎంతో ఆనందంగా, భక్తిశ్రద్ధలతో ఇళ్లలోనూ, గుళ్లలోనూ సామూహికంగా జరుపుకునే పండుగ వరలక్ష్మీవ్రతం. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం ఆచరిస్తారు. కుదరని వారు ఆ మాసంలో వచ్చే ఏదో ఒక శుక్రవారంనాడు ఈ వ్రతం జరుపుకోవచ్చు.

 ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసి, గుమ్మాన్ని పసుపు కుంకుమలు, మామిడాకు తోరణాలతో అలంకరించాలి. ఇల్లాలు తలంటి స్నానం చేసి, కలశం స్థాపించి, అందులో లక్ష్మీదేవిని ఉంచాలి. ముందుగా విఘ్న నివారణకై గణపతి పూజ చేయాలి. తర్వాత సంకల్పం చెప్పుకుని ఒక పంచపాత్రను గాని, లోటాను గాని తీసుకుని, అందులో నీరు పోసి అక్షతలు, పువ్వులు, తమలపాకులను ఉంచాలి. దానికి బయట మూడువైపులా పసుపు, కుంకుమ, గంధాలతో అలంకరించి కలశపూజ చేయాలి.

 వరలక్ష్మీ పూజావిధానం... సులభ పద్ధతిలో

 అమ్మవారిని ఇంటికి ఆహ్వానించి, కాళ్లు కడుక్కోవడానికి నీళ్లిచ్చి, నవరత్న ఖచిత సింహాసనంపై కూర్చుండబెట్టి,  తాగడానికి నీళ్లిచ్చి, స్నానం చేయించి, వస్త్రాలు, ఆభరణాలు అలంకరించి, ధూపదీపనైవేద్యాలతో పూజించి, కథ చెప్పుకుని, శక్తికొద్దీ నైవేద్యాలు సమర్పించి, సకల మర్యాదలతో సాగనంపినట్లుగా భావించుకోవాలి. అదే పూజామంత్రాలలోని అంతరార్థం. ఇక పూజలోకి వద్దాం... ధ్యానం: పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధ్యాయామి (అమ్మవారి కలశం ముందు కొన్ని పుష్పాలుంచి నమస్కరించాలి)

 ఆవాహన: సర్వమంగళ మాంగల్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రతా భవ సర్వదా, శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆవాహయామి’ అని చెబుతూ కలశం ముందు అక్షతలు వేయాలి.

 ఆసనం: శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. (అక్షతలు లేదా పుష్పాలు ఉంచాలి)

 అర్ఘ్యం: శ్రీవరలక్ష్మీ దేవతాయైనమః అర్ఘ్యం సమర్పయామి అంటూ ఉద్ధరిణతో నీటిని అమ్మవారికి చూపించి ముందున్న అర్ఘ్యపాత్రలో వేయాలి.

 పాద్యం: 
పాద్యం గృహాణ దేవత్వం సర్వదేవ నమస్కృతే అంటూ అర్ఘ్యపాత్రలో ఓ ఉద్ధరిణెడు నీటిని వేయాలి.

 ఆచమనం: శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధాచమనీయం సమర్పయామి (అర్ఘ్యపాత్రలో ఉద్ధరిణెడు నీటిని వేయాలి)

 పంచామృతస్నానం: పయోదధిఘృతో పేతం శర్కరా మధుసంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే శ్రీవరలక్ష్మీ
దేవతాయైనమః పంచామృతస్నానం సమర్పయామి (తమలపాకుతో కొన్ని చుక్కల నీటిని కలశం మీద చిలకరించాలి)

 శుద్ధోదకస్నానం:
 శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి (తమలపాకుతో కొన్ని చుక్కల నీటిని కలశం మీద చిలకరించాలి)

 ఆచమనీయం: 
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి (అర్ఘ్యపాత్రలో ఉద్ధరిణెడు నీటిని వేయాలి)

 వస్త్రం: శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి (అక్షతలు లేదా పుష్పాలు ఉంచాలి)

 ఆభరణం: శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ఆభరణాని సమర్పయామి (పుష్పాలు ఉంచాలి)

 ఉపవీతం: శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ఉపవీతం సమర్పయామి (పత్తితో చేసిన సూత్రం చివరలో గంధం రాసి కలశానికి అంటించాలి)

 గంధం: శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః గంధం సమర్పయామి (కలశంపై గంధం చిలకరించాలి)

 అక్షతలు: శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి (అక్షతలు వేయాలి)

 పుష్పం: శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః పుష్పైః పూజయామి (అమ్మవారి కలశం ముందు పుష్పం ఉంచాలి).

 అధాంగ పూజ: పుష్పాలు లేదా అక్షతలతో కలశాన్ని పూజించాలి. అనంతరం అష్టోత్తర శతనామాలతో అర్చిస్తూ, పుష్పాలతో పూజించాలి).

దూపం: శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధూప మాఘ్రాపయామి (అగరు వత్తులు వెలిగించి ఆ ధూపాన్ని అమ్మవారికి చూపాలి) దీపం: శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః దీపం దర్శయామి ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి (దీపం చూపించి ఉద్ధరిణెతో కొంచెం నీటిని అర్ఘ్యపాత్రలో వేయాలి)

 నైవేద్యం:
 నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరి వల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి (ఉద్ధరిణెతో నీటిని అర్ఘ్యపాత్రలో ఉంచాలి)

 పానీయం: ఘనసార సుగంధేన మిశ్రీతం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవీ శీతలం సుమనోహరమ్ శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి (ఉద్ధరిణెతో నీటిని అర్ఘ్యపాత్రలో ఉంచాలి)

 తాంబూలం: పండు, పుష్పం, వక్క, దక్షిణతో కూడిన తాంబూలాన్ని అమ్మవారి వద్ద ఉంచాలి.

 నీరాజనం: శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమర్పయామి (ఘంటానాదం చేస్తూ కర్పూర హారతిని అమ్మవారికి చూపించాలి)

 మంత్రపుష్పం: 
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీతో భవసర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః మంత్రపుష్పం సమర్పయామి (పుష్పాలను అమ్మవారి ఎదుట ఉంచాలి)

 ప్రదక్షిణ: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవా త్రాహిమాం కృపయాదేవి శరణాగత వత్సలే అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగధారిణి శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి (ముమ్మారు ప్రదక్షిణ చేయాలి)

 నమస్కారం: నమస్తే లోక జననీ నమస్తే విష్ణు వల్లభే పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి (అమ్మవారికి అక్షతలు సమర్పించి నమస్కరించాలి)

 తోరపూజ:
 తోరాలను అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో పూజించి, తోరం కట్టుకోవాలి. తర్వాత వరలక్ష్మీ వ్రతకథ చదువుకొని అక్షతలు వేసుకుని, ముత్తయిదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి, పూజచేసిన వారు కూడా తీర్థప్రసాదాలు స్వీకరించాక, అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఆరగించాలి.
                                   
 -కూర్పు: డి.వి.ఆర్.భాస్కర్ ఆన్ సాక్షి.

 వతానికి సమకూర్చుకోవలసిన సంభారాలు
 పసుపు, కుంకుమ, వాయనానికవసరమైన వస్తువులు, అక్షతలు, ఎర్రటి రవికె, గంధం, పూలు, పండ్లు, తమలపాకులు, వక్కలు, తోరాలు చేసుకోవడానికి తగినంత నూలు దారం, 5 కొబ్బరికాయలు, దీపపు కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి, దీపారాధనకు ఆవునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు, అర్ఘ్య పాత్ర (చిన్నగిన్నె) తదితరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. పసుపు గణపతిని తయారు చేసి ఉంచుకోవాలి.
 
22:43 - By Swathi 0

0 comments:

Atlathadde

ఆడపడచుల ఆటపాటల పండుగ... అట్లతద్దె


ఆడపడచుల ఆటపాటల పండుగ... అట్లతద్దె
 Atlathaddi: ఆశ్వయుజ బహుళ తదియ నాడు అట్లతద్దె నోము నోచుకోని తెలుగువారు అరుదు. అందుకే అష్టాదశ వర్ణాలకు అట్లతద్దె అని సామెత. కన్నెపిల్లలు తమకు సలక్షణమైన భర్త రావాలని, వివాహితలు తమ కాపురం కలకాలం సంతోషంగా సాగాలనీ కోరుతూ నోచే నోము అట్లతద్దె. ఈ నోమును మొట్టమొదటిసారిగా గౌరీదేవి నారదముని ప్రోద్బలంతో నోచుకుని సాక్షాత్తూ పరమేశ్వరుని పతిగా పొందిందని పురాణోక్తి.

తూరుపు తెలతెలవారకముందే కన్నెపిల్లలు, కొత్తపెళ్లికూతుళ్ల కాళ్లు పారాణితోనూ, చేతులు గోరింటాకుతోనూ, నోరు తాంబూలంతోనూ, చెంపలు సిగ్గుతోనూ ఎర్రగా పండే పండుగ అట్లతద్దె. కొత్త పరికిణీ, వోణీ, మువ్వల పట్టాలు ధరించి ‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్- ముద్దపప్పోయ్ మూడట్లోయ్... పీటకిందా పిడికెడు బియ్యం పిల్లల్లారా జెల్లల్లారా లేచిరండోయ్.. ’ అంటూ ముచ్చటగొలిపే ఆటపాటలతో ఆడపిల్లలు ఊరంతా సందడి చేస్తారు.

సాయంత్రం సంజెచీకట్లు పడేసరికల్లా అట్లతద్దెనోము చంద్రోదయ వేళకు గౌరమ్మను షోడశోపచారాలతో పూజించి- పసుపు, కుంకుమ, రవికెల గుడ్డ సమర్పించి అట్లు నివేదించి, ముత్తయిదువలకు పండు, తాంబూలం, అట్లు వాయనమిస్తారు. వారు నిండు మనస్సుతో ‘‘మంచి మొగుడొచ్చి పిల్లాపాపలతో నీ కాపురం నిండు నూరేళ్లు చల్లగా సాగాలి’’ అంటూ ఆశీస్సులందిస్తారు.

వ్రతవిధానం: ఆశ్వయుజ బహుళ తదియనాడు కన్నెపిల్లలు, కొత్తగా పెళ్లయిన ఆడపడచులు తెల్లవారు ఝామున లేచి చద్దెన్నం, పొట్లకాయకూర, గోంగూర పచ్చడి, నువ్వులపొడి, ఉల్లిపాయ పులుసు, గడ్డపెరుగుతో భుజించి తాంబూలం వేసుకోవాలి. ఆ తర్వాత తిన్న అన్నం వంటబట్టేదాకా ఆటపాటలతో గడపాలి. హాయిగా ఊయలలూగాలి. అనంతరం స్నానపానాదులు పూర్తి చేసుకుని గౌరీదేవిని పూజించాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్ర ం ఆకాశంలో తారాచంద్రులు తొంగి చూసే సమయానికి శుచిగా తయారై, గౌరీ పూజ చేసి అమ్మవారికి వారి వారి ఆనవాయితీ  ప్రకారం నిర్ణీత సంఖ్యలో అట్లు నివేదించాలి. తర్వాత ఒక ముత్తయిదువను గౌరీదేవి ప్రతిరూపంగా భావించి, ఆమెకు అలంకారం చేసి, అట్లు, పండు తాంబూలం వాయనంగా ఇవ్వాలి.

ఉద్యాపన విధానం: పదిమంది ముత్తయిదువలకు ఒక్కొక్కరికి ఒక నల్లపూసల గొలుసు, లక్కజోళ్లు, రవికెల గుడ్డ, దక్షిణ, తాంబూలంతో పది అట్లు చొప్పున వాయనం ఇవ్వాలి. అనంతరం వారికి భోజనం పెట్టి సంతుష్టి పరచి వారి వద్ద నుండి ఆశీస్సులందుకోవాలి.

శాస్త్రీయ దృక్పథం: మన పెద్దలు ఏర్పరచిన ప్రతి సంప్రదాయం వెనుకా ఎంతో అమూల్యమైన శాస్త్రీయ దృక్పథం ఉంది. అట్లతద్ది నోములో కూడా అంతే విశిష్ఠత ఉంది. నవగ్రహాలలోని కుజునికి అట్లంటే ప్రీతి. కుజునికి అట్లను నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమవడమేగాక సంసారంలో ఎటువంటి అడ్డంకులూ రావు. రజోగుణం కల కుజుడు స్త్రీలకు రుతుసంబంధమైన సమస్యలు, గర్భధారణ సమస్యలకు కారకుడు. కుజునికి అట్లు నివేదించడం వల్ల అటువంటి సమస్యలు తలెత్తవు. అట్లను తయారు చెయ్యడానికి వాడే మినప పిండి, బియ్యప్పిండి మిశ్రమంలో మినుములు రాహువుకూ, బియ్యం చంద్రునికీ సంబంధించినవి. అందువల్ల ఈ రెండూ కలిసిన అట్లను వాయనంగా ఇవ్వడం వల్ల గర్భదోషాలు తొలగి సుఖప్రసవం అవుతుంది.

గౌరీదేవికి ఆటపాటలంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ వ్రతంలో భాగంగా ఆడపిల్లలంతా తెల్లవారుజామున మసక మసక వెలుతురులో ముందురోజే చెట్లకొమ్మకి కట్టి ఉంచిన ఉయ్యాలలు ఊగేందుకు వెళుతూ తమ స్నేహితురాళ్లందరికీ వినిపించేలా చప్పట్లు చరుస్తూ పాటలు పాడతారు. ఆ చప్పట్లకీ ఆటపాటలకీ, కోలాహలానికీ గలగల నవ్వుల సవ్వడికీ సాటి ఆడపిల్లలు, వారికి తోడుగా ఈడైన కుర్రకారు అక్కడికొచ్చి సందడి చేస్తారు. మొత్తం మీద అట్లతద్దె అంటే సంప్రదాయకంగా నోచే నోము మాత్రమే కాదు, ఆటపాటలతో గడిపే సంబరం కూడా.

22:41 - By Swathi 0

0 comments:

మహాబారతం పర్వాలు

మహాభారతం ఏ పర్వంలో ఏముంది?


మహాభారతం ఏ పర్వంలో ఏముంది?
హైదరాబాద్ : మహాభారతంలో ఉన్నదంతా లోకంలో ఉన్నది. మహాభారతంలో లేనిదేదీ ఈ లోకంలో లేదు అని లోకోక్తి. మహాభారతంలో పద్దెనిమిది పర్వాలున్నాయని మాత్రమే తెలుసు కాని, ఆ పర్వాలేమిటో, ఏ పర్వంలో ఏముంటుందో తెలిసిన వారు తక్కువనే చెప్పవచ్చు. అటువంటివారికి అవగాహన కోసం...

 1. ఆదిపర్వం: రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు, ఆయన కుమార్తె దేవయాని, చంద్రవంశ మహారాజు యయాతిల చరిత్రతోపాటు శకుంతల, దుష్యంతులకు సంబంధించిన అనేక పురాతన కథలను ఇది వివరిస్తుంది. ఈ పర్వంలో అధికభాగం కురువంశ  మూలపురుషులైన శంతనుడు, భీష్ముడు, విచిత్రవీర్యుడు, ధృతరాష్ట్రుడు తదితరుల పరిచయం ఉంటుంది. పాండురాజు కథ, పాండవ కౌరవుల జననం, విద్యాభ్యాసం, వారి మధ్య బాల్యం నుంచే పొడసూపే స్పర్థలు, పాంచాల రాకుమారి ద్రౌపదితో పాండవుల వివాహం, అర్జునుడి తీర్థయాత్ర, శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్రతో పరిణయం తదితర విషయాలను కూడా ఆదిపర్వం వివరిస్తుంది.

 2. సభాపర్వం: పాండవ ప్రథముడైన యుధిష్ఠిరుడు (ధర్మరాజు) రాజసూయయాగం చేయడం, కౌరవ ప్రథముడైన దుర్యోధనుడు శకుని సాయంతో జూదం గెలవటం, పర్యవసానంగా తలెత్తిన పరిణామాలు ప్రధానాంశాలు.

 3. అరణ్యపర్వం: దీనినే వనపర్వం అని కూడా అంటారు. కామ్యక వనంలో పాండవుల వనవాస వర్ణన ఇందులో ఉంటుంది. దీనితోపాటు నలదమయంతుల కథ, సావిత్రిసత్యవంతుల గాథ, ఋష్యశృంగుడు, అగస్త్యుడు, మార్కండేయుడు తదితర మహామునులతోపాటు భగీరథుడు, శిబి వంటి చక్రవర్తుల వృత్తాంతాలు కూడా ఉంటాయి.

 4. విరాటపర్వం: విరాటుని కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేయడం, దుష్టుడైన కీచకుని వధ, పాండవులను అజ్ఞాతవాసం నుంచి బయటకు రప్పించి దానిని భగ్నం చేయడానికి, విరాటరాజుకి చెందిన గోవులను పట్టుకున్న కౌరవులతో యుద్ధం, దక్షిణ గోగ్రహణం, ఉత్తర - అభిమన్యుల పరిణయం ఉంటుంది.

 5. ఉద్యోగపర్వం: ఒకవైపు శాంతియత్నాలు, మరోవైపు యుద్ధసన్నాహాలు సమాంతరంగా సాగిపోవటం ఈ పర్వం ప్రత్యేకత. కర్ణుడు తన కొడుకే అని తెలిసిన కుంతీదేవి పరితాపం, శాంతియత్నాలు చేస్తూనే పాండవులను యుద్ధసన్నద్ధులను గావించే శ్రీ కృష్ణుని రాజనీతి... ఈ పర్వంలోని ముఖ్యాంశాలు.

 6. కర్ణపర్వం: కౌరవ సోదరులలో రెండవవాడైన దుశ్శాసనుడు భీముని చేతిలో నేలకూలటం, మహావీరుడైన కర్ణుడు అర్జునుని చేతిలో వీరమరణం పొందటం... ఇందులోని ప్రధానాంశాలు.

 7. భీష్మపర్వం: మహాభారతంలో ఆరవది భీష్మపర్వం. ఇది అతి ముఖ్యమైనది. ప్రపంచ సారస్వతానికే తలమానికమైన భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించింది ఈ పర్వంలోనే. పదిరోజుల యుద్ధ వర్ణన, భీష్మపితామహుడి మానవాతీత సాహసాల గురించిన అత్యద్భుత వర్ణన కనిపిస్తుంది. స్వచ్ఛంద మరణమనే వరం ఉండటం వల్ల భీష్ముడు ఉత్తరాయణం ప్రారంభం అయ్యేవరకు తన మరణాన్ని వాయిదా వేసుకుని అంపశయ్య మీదనే విశ్రమించడం ఉంటాయి.

 8. ద్రోణపర్వం: ద్రోణాచార్యుల సాహసకృత్యాలు, విధిలేని విపత్కర పరిస్థితిలో ధర్మరాజు పలికిన ‘అశ్వత్థామ హతః’ అనే మాట ఫలితంగా ఆయన అస్త్రసన్యాసం చేసి వీరమరణం పొందటం ఇందులోని ముఖ్యాంశం. ఆ తర్వాత యుద్ధరంగంలో అభిమన్యుడి పోరాట పటిమ, ఆ యువకుడి వీరమరణం ఇతర ముఖ్యాంశాలు.

 9. శల్యపర్వం: మహాభారత యుద్ధంలోని చివరి ఘట్టాలను వర్ణించేది శల్యపర్వం. భీమదుర్యోధనుల యుద్ధం, దుర్యోధనుడు తీవ్రంగా గాయపడి మరణించటం ముఖ్యాంశాలు.

 10. సౌప్తికపర్వం: ద్రోణుడి కుమారుడైన అశ్వత్థామ ప్రతీకార కార్యకలాపాలు, రాత్రి సమయంలో నిద్రలో ఉన్న ఉపపాండవులను, పాండవుల సైన్యాన్ని, మిత్రపక్షాలను అశ్వత్థామ ఊచకోత కోయటం ఈ పర్వంలో ప్రధానాంశాలు.

 11. స్త్రీపర్వం: వీరమరణం పొందిన కురుపాండవ యోధులకు సంబంధించిన భార్యల రోదనలు, విషాద సన్నివేశాలు ఇందులో ఉంటాయి. యుద్ధం ఎప్పుడు జరిగినా చివరకు మిగిలే విషాదం ఇందులో కళ్లకు కడుతుంది.

 12, 13. శాంతి, అనుశాసనిక పర్వాలు: ధర్మరాజు అభ్యర్థన మేరకు, వంశకర్త అయిన భీష్ముడు ధర్మానికి సంబంధించిన అద్భుతమైన విషయాలను బోధించటం, అత్యంత ప్రాచుర్యం పొందిన విష్ణు సహస్రనామాలు, శివసహస్రనామాలు, భీష్ముని మరణం, ధర్మరాజుకి పట్టాభిషేకం ఇందులో కనిపిస్తాయి.

 14. అశ్వమేధిక పర్వం: శ్రీకృష్ణుడు ద్వారకకు మరలిపోవటం, ధర్మరాజు చేసిన అశ్వమేథయాగ వర్ణన ఉంటాయి. ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం చేసిన అత్యున్నత త్యాగాన్ని గుర్తు చేస్తూ ఒక ముంగిస ధర్మరాజును పరాభవించటం ఇందులోని కొసమెరుపు.

 15. ఆశ్రమవాసిక పర్వం: కుంతి, గాంధారి సమేతుడై ధృతరాష్ట్రుడు అరణ్యాలకు పయనమవ్వటం, అక్కడ ప్రమాదవశాత్తూ అరణ్యంలో దావాగ్నిలో అసువులు బాయటం ఇందులో చూడవచ్చు.

 16. మౌసలపర్వం: యాదవ వీరులు తమ పతనాన్ని తామే కొని తెచ్చుకోవటం, ఒక వేటగాడి చేతిలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించటం వంటి ఘట్టాలు ఇందులో ఉంటాయి.

 17. మహాప్రస్థానిక పర్వం: పాండవుల అంతిమయాత్ర గురించిన వర్ణన ఇందులో ఉంటుంది.

 18. స్వర్గారోహణ పర్వం: భీమార్జున, నకులసహదేవుల మరణం, ధర్మరాజు ఒక్కడే స్వర్గానికి చేరటం ఇందులోని ప్రధానాంశం.

 - కూర్పు: డి.వి.ఆర్
సాక్షి పేపర్ లో..
22:19 - By Swathi 1

1 comments:

హిందూ జగత్ గురువులు

జగత్ గురువులు... జగతికి వెలుగులు


హైదరాబాద్ : జగత్తులో అనేక రకాల ఆధ్యాత్మిక సాధనాలున్నాయి. ఇందులో ఏది ఎవరికి తగినదనే దాన్ని సాధకుని యోగ్యత, అవగాహన స్థాయిని బట్టి నిర్ణయించి, అది వారికి ఉపదేశించేది గురువే. గురువు అంటే అజ్ఞానాన్ని దూరం చేసేవాడని అర్థం. ‘గు’ అంటే చీకటి. ‘రు’ అంటే ప్రకాశం. గురువు అంటే చీకటిని తొలగించి వెలుగుతో ప్రకాశింపచేసేవాడు అని అర్థం. జ్ఞాన మార్గ దర్శకుడైన గురువు స్థానం పరమ పవిత్రమైనది. జ్ఞానాన్ని ఆర్జించడం కన్నా సద్గురువు చరణారవిందాలను సేవించడం, అనుగ్రహాన్ని పొందడం ఉత్తమమైనది.

 దేవుడు ఉన్నాడని నమ్మేవారు ఆస్తికులు, లేడని చెప్పేవారు నాస్తికులు అయితే జగత్తు, దేవుడు, జీవుడు అనే పరంపర నుంచి మూడు వాదాలు ఉద్భవించాయి. అవే మూడు ప్రధాన మతసిద్ధాంతాలుగా ఆవిర్భవించి, విస్తృతంగా వ్యాప్తిచెందాయి. ఆ సిద్ధాంతాలే అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం అయితే... హైందవ ధర్మానికి మూలస్తంభాలుగా పేర్కొనదగ్గ ముగ్గురు ఆచార్యులు ఈ మూడు మత పరంపరలకు ఆద్యులు. వారే జగద్గురు ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, వల్లభాచార్యులు లేదా మధ్వాచార్యులు. ఈ మూడు మతాలు మతత్రయంగా, ఈ ముగ్గురూ ఆచార్యత్రయంగా ప్రసిద్ధి.

 అద్వైతమతం... ఆదిశంకరాచార్యులు: అద్వైతం అంటే రెండు కానిది. అంటే జీవుడికి, దేవుడికి భేదం లేదని చెప్పే మతమన్నమాట. ఈ సిద్ధాంతానికి రూపకర్త జగద్గురు శ్రీ ఆదిశంకరులు. కేరళలోని కాలడి అనే గ్రామంలో జన్మించిన ఆదిశంకరులు ప్రపంచమంతా జగద్గురువుగా గౌరవించే అత్యున్నతమైన ఆధ్యాత్మికవేత్త, మహాజ్ఞాని, మహాపండితులు. సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి, ప్రస్థాన త్రయభాష్యంతోబాటు ఈనాడు మనం స్తుతించుకునే అనేక స్తోత్రగంథాలు, ప్రకరణ గ్రంథాలు, కనకధారాస్తోత్రం, భజగోవింద శ్లోకాలు ఆయన రచించినవే. రవాణా సదుపాయాలు లేని రోజుల్లోనే ప్రపంచమంతా కాలినడకన పర్యటించి అన్ని మతాలను, విశ్వాసాలను ఒక తాటిపైకి తెచ్చిన ఈ జగద్గురువు భారతదేశంలో నాలుగు పీఠాలను స్థాపించారు.

బదరీనాథ్, పూరి, శృంగేరి, ద్వారకలలో వీరు స్థాపించిన ఈ పీఠాలకు బాధ్యతలు చేపట్టిన వారు కూడా వీరి నామంతోనే జగద్గురువులుగా ప్రఖ్యాతి చెందుతుండటం విశేషం. వీరి లెక్క ప్రకారం దేహమే దేవాలయం. దేహంలో ఉండే జీవుడే దేవుడు. భౌతికమైన దేహం నశించినా, ఆ దేహంలో ఉండే జీవుడు మాత్రం స్థిరంగా ఉంటాడని అద్వైతుల నమ్మకం. నిశ్చలమైన బుద్ధితో ‘అహం బ్రహ్మాస్మి’ అంటే నే నే బ్రహ్మను అని తెలుసుకునేవాడు  జీవన్ముక్తుడు అవుతాడని అద్వైతులంటారు.

విశిష్టాద్వైతం...  రామానుజాచార్యులు: బ్రహ్మానికి, ప్రకృతికి భేదం లేదని బోధించే విశిష్టాద్వైత మత స్థాపకులు రామానుజాచార్యులు. ఈ మతాన్ని అనుసరించేవారు విశిష్టాద్వైతులుగా ప్రసిద్ధి. జగత్తు సత్యం, జీవుడు సత్యం, దేవుడు సత్యం అన్నది వీరి విశ్వాసం. దేహంలోని భాగాల వలె జీవుడు కూడా దేవునితో చేరి ఉంటారని, దేహం నశించిన తరువాత జీవుడు మరో దేహంలో ప్రవేశిస్తాడు లేదా ప్రకృతిలో లీనమైపోతారని వీరి నమ్మకం. విశిష్టాద్వైతమతాచార్యులైన భగవద్రామానుజులు నేటి చెన్నైకు చేరువలోని శ్రీపెరంబుదూరులో జన్మించారు. కాంచీపురం లోని తిరుక్కచినంబికి శిష్యులైన రామానుజులు శ్రీరంగంలో గొప్ప పండితుడు, వైష్ణవ మత ప్రవక్త అయిన యామునాచార్యులవారి వారసుడిగా నిలిచారు.

బ్రహ్మసూత్రభాష్యానికి విశిష్టాద్వైత దృష్టితో శ్రీ భాష్యం వ్యాఖ్యను రచించారు. మొట్టమొదటి మత సంస్కర్తగా నిలిచిన రామానుజులవారు వేదాంత సంగ్రహం, గద్యత్రయం వంటి విశిష్టమైన గ్రంథాలను రచించారు. ఉత్తరభారతమంతా విస్తృతంగా పర్యటించిన ఆయన దేశం నలుమూలలా నాలుగు శ్రీైవైష్ణవ మఠాలను నెలకొల్పారు. జాతి, మత భేదాలను పాటించకుండా భక్తి భావంతో భగవంతుని సందర్శించాలనుకున్న ప్రతి ఒక్కరికి ఆలయ ప్రవేశం కల్పించేలా చేశారు. తిరుమలతో సహా అనేక దేవాలయాలలో నిర్దిష్టమైన పూజావిధానాలను, సంప్రదాయాలను ఏర్పరిచారు.

ద్వైతమతం... మధ్వాచార్యులు: జీవుడు, దేవుడు వేర్వేరు. జీవాత్మ, పరమాత్మ  రెండుగా ఉంటాయని చెప్పే ద్వైతమతాన్ని మధ్వాచార్యులు నెలకొల్పారు. వీరికే వల్లభాచార్యులని పేరు. ఈయన జన్మనామం వాసుదేవులు. ఈయనను వాయుదేవుడి అంశగా భావిస్తారు. జీవాత్మ, పరమాత్మలకు భేదం ఉందని ద్వైతమతవాదులు విశ్వసిస్తారు. వీరికి కూడా వేదాలే ప్రమాణాలు అయినప్పటికీ, అన్నింటిలోకి భాగవత గ్రంథాన్ని అత్యంత ప్రామాణికంగా భావిస్తారు.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఉడిపి సమీపంలోని కంచనపూర్ అనే గ్రామంలో జన్మించిన మధ్వాచార్యులవారు రామానుజాచార్యులవారు ప్రచారం చేసిన శ్రీవైష్ణవానికి బదులు సద్‌వైష్ణవం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మహాభారతంపై తమదైన వ్యాఖ్యానం, శ్రీకృష్ణస్తుతి, ద్వాదశా స్తోత్రం, నఖస్తుతి, యమకభారతం, కృష్ణామృత మహార్ణవం, తంత్రసార, ఉపాధి ఖండన మొదలైన గ్రంథాలను అందించారు.

జీవులందరూ విష్ణువు అధీనంలో ఉంటారని, ఆయన అనుగ్రహం పొందగలిగినవారికి ముక్తి లభిస్తుందని బోధించే మధ్వాచార్యులు ఉడిపిలో శ్రీకృష్ణుని దేవాలయాన్ని నిర్మించారు. శ్రీవైష్ణవులకు శ్రీరంగంలోని రంగనాథ దేవాలయం ఎంత పవిత్రమైనదో, ద్వైతులకు ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయం అంతటి పవిత్రమైనది. వీరి సిద్ధాంతాలలోని సరళత్వం సామాన్యప్రజలను అనేకమందిని ఆకట్టుకుని, వీరి మతంవైపు మొగ్గుచూపేలా చేసింది.


Article By 
- డి.వి.ఆర్ In sakshi Paper on 26/10/2013.
21:11 - By Swathi 0

0 comments:

EAR-NOSE -TOUNGE PROBLEMS

చెవి, ముక్కు, గొంతు సమస్యలు-హోమియో చికిత్స


హైదరాబాద్ :  చెవి, ముక్కు, గొంతు సమస్యలు కూడా ఒక దానికొకటి సంబంధం ఉంటుంది. ఈ సమస్యలు అన్ని కూడా రోగ నిరోధక వ్యవస్థ శక్తి క్షీణించటం వలన, మానసిక ఒత్తిడి, ఆందోళనల వలన సమస్య తీవ్రత పెరిగి తరచుగా ఇన్ఫెక్షన్స్ రావటం జరుగుతుంది.

 3)తల తిరగటం: ఇది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమయంలో గమనిస్తూనే ఉంటాము. ముఖ్యంగా పడుకున్నప్పుడు గాని, పడుకుని చాలా తొందరగా లేచినప్పుడు, సడెన్‌గా పైకి చూసినప్పుడు వస్తుంది. ఒక్కొక్కసారి చెవిలో ఒక భాగమైన వెస్టిబ్యూల్ నరాలు ప్రేరేపితం అవటం వలన కూడా ఇది వస్తుంది.

 4) మీనియర్స్ వ్యాధి: ఇది ముఖ్యంగా చెవి లోపలి పొరకు వస్తుంది. దీనిలో ముఖ్యంగా తల తిరగటం, సరిగ్గా వినిపించక పోవటం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి.

 5) ఎకోస్టిక్ న్యూరోమా: ఇది చెవిలోపల ఒక కణితి ఏర్పడి, వినికిడి లోపం, చెవిలో హోరుమని శబ్దాలు, నడిచేటప్పుడు కూడా సరిగ్గా బ్యాలెన్స్ లేకపోవటం, మొహం అంతా తిమ్మిరి రావటం వంటి లక్షణాలు వస్తాయి. కఖఐ పరీక్ష చేయించుకుంటే కణితి సైజ్ ఎలా ఉన్నది తెలుస్తుంది.

 6) ల్యాబరింథైటిస్, వెస్టిబ్యులార్ మ్యారైటిస్: చెవిలోపలి పొరకు వచ్చే వాపు వలన ఈ సమస్య వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా వైరస్, బ్యాక్టీరియా వలన వస్తుంది. చెవి మధ్యపొర నుంచి వచ్చే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఈ సమస్య వస్తుంది. దీనిలో కూడా ముఖ్యంగా తల తిరగటం, వికారం, వినికిడిలోపం వంటివి ఉంటాయి.

 7) ఓటో స్ల్కీరోసి్‌స్, టినిటస్ లాంటి సమస్యలు:  ఇవి చెవిలోపల సర్వ సాధారణంగా గమనిస్తుంటాము. ఇదేవిధంగా ముక్కు లోపల కూడా తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన రోగ నిరోధక వ్యవస్థ శక్తి క్షీణించి, ఎలర్జీ వంటి సమస్యలు వస్తూంటాయి. అవి...
 ఎలర్జిక్ సైనసైటిస్
 ఎపిస్టాక్సిస్
 సైనసైటిస్.

 ఈ పైన చెప్పిన సమస్యలు అన్నీ కూడా ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థ యొక్క శక్తి క్షీణించటం వలన, సాధారణమైన జలుబు, తుమ్ములు, ముక్కు నుంచి విపరీతంగా నీరు కారటంతో మొదలయి, సరైన రీతిలో చికిత్స తీసుకోక, విపరీతమైన కఫం లేదా శ్లేష్మం గాలి రంధ్రాలలో పేరుకుపోయి, వాటికి వాపు వస్తుంది. ఈ సమస్యను సైనసైటిస్ అంటారు. దీనిలో తలబరువు, వికారం, వాంతులు, వాసన తెలియకపోవటం, నీరసం, అలసట, ఎవరి పనులు వారు చేసుకోలేక పోవటం వంటి సమస్యలు వస్తాయి.

 చెవి, ముక్కుకు వచ్చే సమస్యలు గొంతు సమస్యలకు కూడా దారి తీస్తుంటాయి. వీటిలో తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన రోగ నిరోధక వ్యవస్థ శక్తి రోజురోజుకి తగ్గి మొత్తం చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఏర్పడుతుంటాయి.

 సాధారణంగా వచ్చే గొంతు సమస్యలు:
 స్వరపేటికలో వచ్చే సమస్యలు: ఇవి ముఖ్యంగా, గొంతు ఎక్కువగా వాడటం వలన అంటే ఎక్కువగా మాట్లాడే వారిలో, పాటలు పాడే వాళ్ళలో, హైపోథైరాయిడిజమ్, సైనసైటిస్‌తో ఎక్కువ కాలంగా బాధపడుతున్న, విపరీతమైన దగ్గు ఉండే వాళ్ళల్లో వస్తుంది.

 అరుగుదల సమస్య ఉండే వాళ్ళల్లో కూడా గొంతు దగ్గర మంట, నొప్పి, తీసుకున్న ఆహారం మింగలేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్’కు దారి తీస్తాయి.

 చెవిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. ఇవి 1) చెవి వెలుపలి పొర 2) మధ్య భాగంలో ఉండే పొర 3) లోపలి పొర. సాధారణంగా ఈ 3 పొరలకు ఇన్‌ఫెక్షన్స్ గాని, వేరే ఇతర వ్యాధులు గాని రావటం జరుగుతుంది.

 సాధారణంగా చెవికి వచ్చే వ్యాధులు
 1) చెవి వెలుపలి పొరకు వచ్చే ఇన్ఫెక్షన్స్: దీనివలన దురద, నొప్పి, వాపుతో కూడి చెవి నుంచి స్రావం వస్తుంది. ఆ స్రావం ఒక్కొక్కసారి నీరు లేదా చీముతో కూడిన స్రావం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వాతావరణంలో వచ్చిన మార్పుల వలన, దూది లేదా పిన్నులు చెవిలో పెట్టుకోవటం వలన, ఒక్కొక్కసారి త్వరితంగా లేదా దీర్ఘకాలికంగా కూడా చెవి ఇన్ఫెక్షన్స్ వస్తూంటాయి. త్వరితంగా వచ్చేవి అంటే

 ఎక్యూట్ పర్‌స్పరేటివ్ ఒటైటిస్ మీడియా దీర్ఘకాలికంగా అంటే

 క్రానిక్ పర్‌స్పరేటివ్ ఒటైటిస్ మీడియా అని అంటారు. ఇన్ఫెక్షన్స్ తీవ్రతను బట్టి అది ఎక్యూట్ లేదా క్రానిక్ అని గుర్తించి, చికిత్స చేయాల్సి ఉంటుంది.

 2) మధ్యపొరకు వచ్చే ఇన్ఫెక్షన్స్: 
ఇది ముఖ్యంగా ముక్కు లేదా గొంతులో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. అంతే గాకుండా ఎలర్జీ సమస్యలు ఏవైనా ఉన్నా కూడా తరచుగా ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ వస్తూంటాయి.

 దీనిలో ఉండే ముఖ్య లక్షణాలు:
 చెవినొప్పి
 సరిగ్గా వినబడకపోవటం
 చెవి అంతా పట్టేసినట్లు ఉండడం
 జ్వరం
 తలంతా బరువుగా ఉండి ఏ పనిచెయ్యాలని అనిపించకపోవటం
 తల తిరగటం.

 పాజిటివ్ హోమియోపతిలో పేషెంట్ తత్త్వాన్ని బట్టి మందులు ఇచ్చి, వ్యాధి యొక్క మూలకారణాన్ని ఎనాలసిస్ చేసుకుని ‘జెనిటిక్ కానిస్టిట్యూషనల్ సిమిలిమమ్’ అనే పద్ధతి ద్వారా చికిత్స ఇవ్వడం జరుగుతుంది. దీనివలన రోగ నిరోధక వ్యవస్థ శక్తి పెరిగి, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్‌ను ఆపడమే కాకుండా, పూర్తిస్థాయిలో చికిత్స ఇవ్వడం జరుగుతుంది.

 డా॥టి. కిరణ్‌కుమార్
 పాజిటివ్ హోమియోపతి


www.sakshi.com/news/family/ear-nose-and-throat-problems-homoeo-treatment-75578?pfrom=home-todays-family
07:10 - By Swathi 0

0 comments:

is scanning harmful during pregnancy...?

స్కానింగ్ వల్ల గర్భవతులకు, కడుపులోని బిడ్డకు ప్రమాదమా?


స్కానింగ్ వల్ల గర్భవతులకు, కడుపులోని బిడ్డకు ప్రమాదమా?
హైదరాబాద్ :  నేను ఇప్పుడు ఏడో నెల గర్భవతిని. డాక్టర్లు స్కాన్ చేయించమని చెప్పారు. అయితే ఇంతకు ముపును కూడా ఐదోనెలలో ఒకసారి స్కానింగ్ అయ్యింది. ఇలా తరచూ అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించడం  బేబీకి మంచిదేనా? తెలియజేయండి.
 - సురేఖ, హైదరాబాద్

 గర్భవతులకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. సాధారణంగా గర్భధారణ మొత్తం వ్యవధిని... మొదటి మూడు నెలలను మొదటి ట్రైమిస్టర్‌గా, రెండో మూడు నెలల కాలాన్ని రెండో ట్రైమిస్టర్‌గా, ఆఖరి మూడు నెలల కాలాన్ని మూడో ట్రైమిస్టర్‌గా విభజిస్తారు. ఒక్కో ట్రైమిస్టర్ ఒక్కోసారి చొప్పున కనీసం మూడు స్కానింగ్‌లైనా తీయించి చూడటం తల్లికీ, బిడ్డకూ మేలు చేసేందుకే.
 మొదటి ట్రైమిస్టర్‌లో అంటే 14 వారాల లోపు చేసే స్కానింగ్‌లో గర్భాన్ని నిర్ధారణ చేయడంతో పాటు లోపల ఎంతమంది బిడ్డలు ఉన్నారు (అంటే కవలలా లేక ఒకే బిడ్డా) అన్న విషయాలు తెలుస్తాయి. దాంతో పాటు బిడ్డ సైజ్, దాన్ని బట్టి ప్రవసం అయ్యే తేదీని కూడా ఉజ్జాయింపుగా చెప్పవచ్చు. ఈ దశలో చేసే స్కానింగ్ ద్వారా బిడ్డకు అంగవైకల్యం వచ్చే అవకాశాలను దాదాపు 50 శాతం నుంచి 60 శాతం వరకు అంచనా వేసేందుకు అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల కొంతవరకు డౌన్ సిండ్రోమ్ వంటి రుగ్మతలనూ అంచనా వేసే అవకాశమూ ఉంది.


 ఇక రెండో ట్రైమిస్టర్‌లో అంటే... 20 వారాల సమయంలో చేసే స్కాన్‌ను ‘టిఫా’ స్కాన్ లేదా ఫీటల్ టార్గెట్ స్కాన్ అంటరు. అంటే ప్రత్యేకంగా బిడ్డలోని ప్రతి అవయవం నిర్దిష్టంగా ఎలా ఉందో టార్గెట్ చేసి చూస్తారు కాబట్టి దీన్ని ఫీటల్ టార్గెట్ స్కాన్ అంటారు. ఈ స్కాన్ ద్వారా బిడ్డకు అంగవైకల్యం కలిగే అవకాశాలను 80 శాతం వరకు కచ్చితంగా చెప్పడానికి ఆస్కారం ఉంది. అందుకే మొదటి ట్రైమిస్టర్‌లో స్కాన్ చేయించకపోయినా... 18 నుంచి 20 వారాల సమయంలో తప్పకుండా స్కానింగ్ చేయించాలి.


 ఇక మూడో ట్రైమిస్టర్‌లో అంటే 34వ వారంలో పొట్టలో బేబీ పొజిషన్‌ను చూస్తారు. ఆ సమయంలో తీసే స్కాన్‌లో బిడ్డ తలకిందులుగా ఉంటే సాధారణ ప్రవసం అవుతుందన్నమాట. ఒకవేళ ఎదురుకాళ్లతో కనిపిస్తే అప్పుడు శస్త్రచికిత్స ద్వారా బిడ్డను బయటకు తీసేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

 సాధారణంగా భారతీయ ప్రమాణాలలో పుట్టినప్పుడు బిడ్డ బరువు 2.5 కిలోల నుంచి 2.8 కిలోల వరకు ఉంటుంది. బిడ్డ పెద్దదిగా ఉందా లేక చిన్నదిగా ఉందా అన్న విషయంతో పాటు ఉమ్మనీరు ఎలా ఉంది అన్న విషయం కూడా స్కాన్‌లో తెలుస్తుంది. దీన్ని బట్టి ఒకవేళ ఉమ్మనీరు తగ్గితే దానికి కారణాలు కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటు మాయ (ప్లాసెంటా) తీరుతెన్నులు కూడా తెలుస్తాయి. ఉదాహరణకు గర్భాశయముఖద్వారానికి (సెర్విక్స్‌కు) దగ్గరగా మాయ ఉండటాన్ని ప్లాసెంటా ప్రివియా అంటారు. నిజానికి ప్రసవంలో బిడ్డ బయటకు వచ్చిన తర్వాత మాయ బయటకు రావాలి. కానీ ఒకవేళ ముందే మాయ బయటకు వస్తే అప్పుడు తల్లికి తీవ్రమైన రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. ఇది బిడ్డకూ, తల్లికీ ప్రమాదకరమైన పరిస్థితే. అందుకే స్కానింగ్ ద్వారా ప్రసవం అయ్యే తీరును అంచనా వేసి, దానికి తగినట్లుగా ఏర్పాటు చేసుకోవాలి.

 ఇక అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లో కేవలం శబ్దతరంగాలను మాత్రమే ఉపయోగిస్తారు. ఎక్స్-రే లేదా సీటీ స్కాన్‌లో లాగా ప్రమాదకరమైన రేడియేషన్ తరంగాలను ఉపయోగించరు. ఈ శబ్దతరంగాలు ఎంత ప్రమాదరహితమైనవంటే... అవసరాన్ని బట్టి ఒక్కోసారి రోజూ డాప్లర్ స్కానింగ్ చేయించాల్సి రావచ్చు. అప్పుడు కూడా ప్రమాదాన్ని కలిగించవని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి నిరభ్యంతరంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవచ్చు. కాకపోతే పుట్టబోయే బిడ్డ... ఆడా, మగా అని మాత్రం అడగవద్దు. అది మాత్రమే అభ్యంతరకరం.

 డాక్టర్ సుశీల వావిలాల
 ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్,
 ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్


Tags: Pregnancy, Scanning, Child Helath, Women


http://www.sakshi.com/news/family/will-scanning-harm-pregnant-and-the-baby-inside-75580?pfrom=home-todays-family
06:12 - By Swathi 0

0 comments:

Sunday 20 October 2013

Asthma -homeopathic-remedies

దగ్గు ఆయాసం, అలర్జీ - అస్తమాకు హోమియోలో తగిన చికిత్స


హైదరాబాద్ : మానవ శరీరం ఒక అద్భుతం! శరీరంలోని ఎలాంటి పదార్థాలు, క్రిములు వచ్చినా వాటిని ఎదుర్కొని పోరాడేలా దేవుడు దానిని నిర్మించాడు. దీనినే మనం ‘‘ఇమ్మూనిటీ’’ లేదా రోగ నిరోధక వ్యవస్థ అంటారు. దీని వలన మన శరీరంలోనికి గాలి ద్వారా, నీటిద్వారా, ఆహారం ద్వారా ఎలాంటి ప్రతికూల పదార్థములు బాక్టీరియా, వైరస్, ఫారెన్ ప్రొటీన్‌లు వచ్చినా తెల్లరక్తకణాలు వాటితో పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే కొంత మందిలో ఈ వ్యాధినిరోధక వ్యవస్థ ఇతరులకు ఎలాంటి హాని కలిగించని పదార్థాల వలన కూడా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది. దీనినే ‘‘హైపర్ సెన్సిటివీటి’’ లేదా ‘‘అలర్జీ’’ అని అంటారు.

 గాలిలో దుమ్ము, పుప్పొడి వంటివి ఉన్నప్పుడు అలర్జీతో బాధపడేవారికి ఇక అదే పనిగా వరుసబెట్టి తుమ్ములు వస్తాయి. ఆ తర్వాత ముక్కు ఎరుపెక్కి, జలుబు చేసి, పల్చని నీరులా స్రవిస్తుంది. దానితో పాటు కళ్ళు ఎరుపెక్కి కళ్ళ నుండి నీరు కారుతుంది. దీనిని అశ్రద్ధ చేసినట్లయితే ముక్కు దిబ్బడ, గాలి సరిగ్గా ఆడకపోవడం, గొంతులోనికి కళ్ళె వస్తూ ఉండడం, ముఖం లోపలిభాగంలో నొప్పి, తలనొప్పి మొదలైతే ‘‘అలర్జిక్ సైనసైటిస్’’ అని, గాలి గొట్టాలలోనికి, ఊపిరితిత్తులకు సోకి పొడి దగ్గు, కళ్లెతో కూడి దగ్గు మొదలైతే ‘‘అలర్జిక్ బ్రాంకైటిస్’’ అని ఆయాసం, ఎగపోయడం, పిల్లికూతలు వంటి లక్షణాలు కన్పిస్తే ‘‘అలర్జిక్ ఆస్థ్మా’’ అని అంటారు.
                                                                    *****************
 దగ్గు అనేది సాధారణంగా అందరిలో కనిపించే ఒక లక్షణం. ఏదైనా దుమ్ము, ధూళి లేదా అలర్జీలు లోపలికి ప్రవేశించేటప్పుడు, దగ్గు అనే ప్రక్రియ ద్వారా అని బయటకు రావటం జరుగుతుంది. ఒక్కొక్కసారి పొడిదగ్గు లేదా శ్లేష్మంతో కూడిన దగ్గు కూడా వస్తూ ఉంటుంది. సాధారణంగా, దగ్గు చాలా ఎక్కువగా చిన్న పిల్లల వయసు నుంచి గమనిస్తూ ఉంటాము.

 శ్లేష్మంతో కూడిన దగ్గు ముక్కు నుంచి గొంతులోకి పోయి, అక్కడి నుంచి సైనస్ లేదా ఊపిరితిత్తులలోకి ప్రవేశించడం జరుగుతుంది. శ్లేష్మంతో కూడిన దగ్గుకి చాలా త్వరితంగా చికిత్స చేయలేకపోతే అది ఆస్త్మా కిందకు మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

 కారణాలు:
 వైరల్ ఇన్‌ఫెక్షన్స్ వలన

 దీర్ఘకాలికంగా ఊపిరితిత్తులకు వ్యాధులుసోకిన

 గ్యాస్ట్రో ఈసోఫెజియల్ రిఫ్లక్స్ డిసీజ్‌తో

 ముక్కునుంచి వచ్చే స్రావం గొంతులోకి వెళ్ళటం

 పొగతాగటం

 దుమ్ము, ధూళిలో తిరగడం వలన

  ఏదైనా పదార్థం గొంతులో అడ్డుపడటం వలన ఇంచు మించు  శ్లేష్మం ఉన్నా, లేకపోయినా, దగ్గు గనుక 2-3 రోజుల నుంచి మొదలై, 7 నుంచి 10 రోజులలో తగ్గిపోతుంది. దానిని ‘అక్యూట్ బ్రాంకైటిస్’ అంటారు. ఈ స్టేజ్‌లో ఉన్న వ్యాధికి సరిగ్గా చికిత్స లేకపోతే అది దీర్ఘకాలికంగా అంటే 2 నుంచి 3 నెలల వరకు పూర్తిగా తగ్గకుండా ఉంటే దానిని ‘క్రానిక్ బ్రాంకైటిస్’ అంటారు. కాని దగ్గు త్వరితంగా లేదా దీర్ఘకాలికంగా ఉన్నా, మొదటగా వ్యాధి నిరోధక వ్యవస్థ శక్తి క్షీణించటం వలన ఇన్ఫెక్షన్ శరీరం మీదకి ముఖ్యంగా వ్యక్తుల తత్తాన్ని బట్టి ఊపిరితిత్తుల మీదకు ప్రభావితం కావటం జరుగుతుంది. ఈ బ్రాంకైటిస్ సమస్యను మూలకారణం నుంచి ఎనాలిసిస్ చేయలేక, వ్యాధిని పూర్తిగా నివారించక పోతే ఇది ‘బ్రాంకియల్ ఆస్త్మా కింద మారుతుంది. దీనిలో ముఖ్యంగా విపరీతమైన దగ్గు, ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవటం, ఛాతీ అంతా పట్టేసినట్లు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
                                                        *****************
 కొంతమందికి వంకాయ, మునక్కాయ, పల్లీలు వంటి ఆహార పదార్థాలు తినగానే శరీరంపైన దద్దుర్ల మాదిరిగా ఎర్రగా, ఉబ్బెత్తుగా, తీవ్రమైన దురద వస్తాయి. ఈ ర్యాష్ 24 గంటల్లో తగ్గుతుంది. కొంతమందిలో లేటెక్స్ సంబంధిత వస్తువులు తగిలిన స్థలాలో చర్మమంతటా పొక్కులు వస్తాయి. దీనిని ‘అలర్జిక్ డెర్మటైటస్’ అని అంటారు.

 ఇలా అలర్జీలలో అనేక రకాలు ఉన్నప్పటికి ఎక్కువ మందిలో కనబడేవి శ్వాసకోశ సంబంధిత అలర్జీలు. అనగా రైనైటిస్, సైనసైటిస్, బ్రాంకైటిస్, బ్రాంక్రియల్ ఆస్త్మా. శ్వాసకోశ సంబంధిత అలర్జీలను కలిగించే వాటిలో ప్రధానమైనవి-పుప్పొడి, దుమ్ములో ఉండే క్రిములు, మోల్డ్, బొద్దింకలు, పశువుల పేడ మొదలైనవి. కొంతమందికి పూలవాసన, పర్‌ఫ్యూమ్స్, కూరపోపు లాంటివి కూడా పడవు.
                                                                    **************
 పాజిటివ్ హోమియోపతిలో ఈ దగ్గు, ఆయాసం, అలర్జీ, ఆస్త్మాలకు పూర్తిస్థాయిలో పరిష్కారం ఉంటుంది. వ్యాధి త్వరితంగా ఉన్నా లేదా దీర్ఘకాలికంగా ఉన్నా, దాని మూలకారణం నుంచి వ్యాధిని తీసేయాలి.ముఖ్యంగా తత్వం ప్రకారం చికిత్సను మొదలు పెట్టి, ఏదైనా మానసిక ఒత్తిడి, ఆందోళనలు ఉంటే, ఆ మానసిక స్థాయి నుంచి చికిత్సను ఇవ్వడం ఉత్తమం. వాతావరణంలో ఉండే మార్పులను బట్టి మనిషి తత్వాన్ని ఎనాలసిస్ చేసి, చికిత్సను ఇస్తే పూర్తి స్థాయిలో పరిష్కారం ఉంటుంది.

 డా॥టి. కిరణ్‌కుమార్
 పాజిటివ్ హోమియోపతి
  అపాయింట్‌మెంట్ కొరకు 9246199922
 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ,
 వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై
 www.positivehomeopathy.com

http://www.sakshi.com/news/family/homeopathic-remedies-for-cough-fatigue-allergy-asthma-73763?pfrom=home-todays-family
11:04 - By Swathi 0

0 comments:

JAYAPRAKASH REDDY

నాటకాలు వేయకపోతే నాన్నగారు తిట్టేవారు!


నాటకాలు వేయకపోతే నాన్నగారు తిట్టేవారు!
విలనీ, కామెడీ... ఏదైనా జయప్రకాశ్‌రెడ్డికి సునాయాసమే. పైకి విలన్‌గా కనిపిస్తారు కానీ, చేసే పనులూ సేవాకార్యక్రమాలూ చూస్తే ఎవరైనా సరే జేపీని ఓ హీరోగా చూస్తారు. పాతికమంది పిల్లలకు విద్యాదానం చేస్తున్నారాయన. నటుడిగా తనకు ఓ దారి చూపించిన రంగస్థల వైభవాన్ని పునరుద్ధరించడానికి కంకణం కట్టుకున్నారు. ఈ కమర్షియల్ యుగంలో కూడా నిజాయితీ, ఆత్మసంతృప్తి అని మాట్లాడే జేపీతో జరిపిన ప్రత్యేక భేటీ.
 
 మీ ఆహార్యం విలన్ పాత్రలకు యాప్ట్ అయినా కామెడీ కూడా చేస్తున్నారు. ఈ రెంటిలో మీకేది ఇష్టం?
 మొదట్నుంచీ హాస్యం అంటేనే ఇష్టం. అయితే సినిమాల్లో సీరియస్ కేరక్టర్స్‌కే బాగా పేరొచ్చింది. వరుసగా అలాంటి అవకాశాలే వచ్చాయి. తర్వాత తర్వాత నాలో కామెడీ టింజ్ చూసి, దర్శకులు ఆ తరహా పాత్రలు చేయిస్తున్నారు. అంతకు ముందు ఆడవాళ్లు, చిన్నపిల్లలు నా దగ్గరకు రావడానికి భయపడేవాళ్లు. కానీ, ఇప్పుడందరూ వచ్చి మాట్లాడుతున్నారు.
 
 మీ డ్రీమ్ కేరెక్టర్?
 అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంటుంది. నా నటనలో ఎప్పుడూ మూస కనపడదు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, గోదావరి, నెల్లూరు... ఇలా ఏ శ్లాంగ్‌లోనైనా మాట్లాడగలనని నిరూపించుకున్నాను. నేను డెరైక్టర్స్ ఆర్టిస్ట్‌ని. దర్శకులు ఎలా కావాలంటే అలా చేస్తాను. ఇక, నా డ్రీమ్ రోల్ విషయానికొస్తే...  ప్రేక్షకులతో కంట తడిపెట్టించి,  హృదయానికి హత్తుకునే పాత్ర ఎప్పటికైనా చేయాలని ఉంది.
 
 అసలు ఏ ఆశయంతో నటుడయ్యారు.. దాన్ని నెరవేర్చుకోగలిగారా?
 ఆశయం అంటూ ఏదీ లేదు. మా నాన్నగారు మంచి రంగస్థల నటుడు.  కానీ, పోలీస్ ఉద్యోగం వల్ల నటించలేకపోయారు. అందుకే నాన్నగారు నన్ను రంగస్థల నటుణ్ణి చేయాలనుకున్నారు. నాకూ అదే ఇష్టం. అందుకని కళాకారుడినయ్యాను. అట్నుంచి సినిమాల్లోకొచ్చా.
 
 నటుడిగా బిజీ అయ్యాక కూడా నాటకాలు ప్రదర్శిస్తున్నారు కదా?
 ఆంధ్రదేశంలో ప్రతి ముఖ్య పట్టణంలో ప్రతి ఆదివారం ఒక నాటక ప్రదర్శన జరగాలనేది నా కల. ఎందుకంటే మంచి నటీనటులు ఉన్నారు. నాటకాలను ఆదరించే అభిరుచి గల ప్రేక్షకులు ఉన్నారు. దాతలు కూడా ఉన్నారు. కానీ, వీటిని కో-ఆర్డినేట్ చేసేవాళ్లు లేరు. నా వంతు ప్రయత్నంగా నేను గుంటూరులో ‘జేపీ నెల నెలా నాటక సంఘం’ పేరుతో ఓ సంస్థ ప్రారంభించాను. ప్రతినెలా రెండో ఆదివారం ఓ చక్కని నాటకం చూపించాలన్నది నా ఆశయం.
 
 సినిమాల వల్ల ఆర్థికంగా మీకు లాభం ఉంటుంది.. మరి నాటకాల సంగతేంటి?
 సినిమాలు చేస్తే నా జేబులోకి డబ్బులొస్తాయి. కానీ నాటకాలు చేస్తే జేబులోంచి డబ్బులు పోతాయి. అయితే, నాటకాలనేది  డబ్బు కోసం కాదు. సంతృప్తి కోసం. డబ్బులు కోసం చేసే సినిమాల ద్వారా కూడా నాకు ఆత్మసంతృప్తి లభిస్తుంది. ఓ పది, పదిహేనేళ్లు సినిమా రంగంలో నానా కష్టాలు పడిన తర్వాత ‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో నాకో సీటు లభించింది. ‘సమరసింహారెడ్డి’తో బెర్త్ కూడా కన్‌ఫార్మ్ అయ్యింది. అక్కణ్నుంచీ చాలా అవకాశాలు వస్తున్నాయి. ఓ నటుడిగా అవకాశాలు రావడమే గొప్ప. అందుకే, సినిమాలు వదులుకోను.
 
 టీచర్ వృత్తి నుంచి సినిమాలకు వచ్చారు. ఆ ప్రయాణం గురించి?
 మా నాన్నగారు సాంబిరెడ్డి నిజాయితీ గల పోలీసాఫీసర్. ఆయన ఆల్ ఇండియా కబడ్డీ చాంపియన్. స్పోర్ట్స్ కోటాలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా జాబ్ వచ్చింది. సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా చేశారు. డీఎస్‌పీగా, ఆ తర్వాత అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యారు. లంచం తీసుకోని వ్యక్తి. మా నాన్నగారితో పాటు చేసినవాళ్లందరూ బాగా సంపాదించుకున్నారు. కానీ, మా తాతగారు సంపాదించినది 90 శాతం అమ్మేశారు నాన్నగారు. అంతటి సిన్సియర్ పోలీసాఫీసర్. మామూలుగా చాలామంది ఇళ్లల్లో నాటకాల్లో నటిస్తే తిడతారు. కానీ, మేం ఎప్పుడైనా పదిరోజులు నాటకాలు వేయకపోతే నాన్నగారు తిట్టేవారు. నేను, నా ఇద్దరు తమ్ముళ్లు, నా చెల్లెలు.. లంచం తీసుకునే ఉద్యోగాలు చేయకూడదన్నది నాన్నగారి నిర్ణయం.
 
 నేను డిగ్రీ పాసవ్వగానే..  కమర్షియల్ టాక్స్, ఇన్‌కమ్ టాక్స్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, రైల్వేశాఖల్లో నాకు జాబ్ వచ్చింది. కానీ, నాన్నగారు వద్దన్నారు. ఉపాధ్యాయుడిగా చేయమన్నారు. ఆయన కోరిక ప్రకారమే మున్సిపల్ హై స్కూల్‌లో టీచర్‌గా చేరాను. చాలా మనస్ఫూర్తిగా పని చేశాను. ఆ తర్వాత హెడ్‌మాస్టర్ అయ్యాను. సినిమాల్లోకి వచ్చిన తర్వాత వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నాను. మా నాన్నగారు ఎప్పుడూ ‘ఆల్ హ్యాపీస్.. నో వర్రీస్’ అని ఓ స్లోగన్  చెబుతుండేవారు. నేనలానే ఉంటాను. అందుకే ఇప్పటివరకు నాకు బీపీ లేదు. మా నాన్నగారు మాకు ఇచ్చిన ఆస్తి ఆత్మసంతృప్తి. అందుకే ఆయన్ను నిత్యం స్మరించుకుంటుంటాను.

http://www.sakshi.com/news/movies/my-father-will-scold-if-i-didnt-act-in-drama-74298?pfrom=home-movies
10:49 - By Swathi 0

0 comments:

Swathi

పెళ్లి చేసుకుందాం అని కాదు...పెళ్లంటే ఏంటా? అని ఆలోచిస్తున్నాను...

హైదరాబాద్ : తనకెంతో పేరు తెచ్చిపెట్టిన ‘కలర్స్’ ప్రోగ్రామ్‌ను తన పేరుకు జత చేసి పిలిస్తే స్వాతికి ఎందుకిష్టం ఉండదు?
 డాక్టర్ కావాలని బలంగా అనుకున్న స్వాతి యాక్టర్‌గా మిగలడం వెనుక ఉన్న ‘సైకో’ ఎవరు?
 తనను విక్రమ్‌తో, నిఖిల్‌తో జతకడుతూ వస్తున్న రూమర్లపై స్వాతి ఏమంటుంది?
 పార్టీలకు గాని మరెక్కడికిగాని వెళ్లడానికైనా ఏ టైమ్‌లోనైనా ఎటువంటి జంకూ గొంకూ లేకుండా స్వాతి ‘ఎస్’ చెప్పే ఆ సిక్స్‌ప్యాక్ హీరో ఎవరు?
 ఎంతో నాజూకుగా, చిన్నపిల్లలా కనిపించే స్వాతి ఏకంగా ‘స్కార్పియన్’ని తినాలని ఎందుకనుకుంది?
 ఈ ప్రశ్నలకు సమాధానం... రంగుల ప్రపంచంలోకి వెళ్లడానికి ముందే రంగుల్ని తన ఇంటిపేరుగా మార్చుకున్న రష్యన్ అమ్మాయి  స్వెత్లానా అలియాస్ స్వాతిరెడ్డి అలియాస్ కలర్స్ స్వాతి.
 సినిమారంగంలో పదేళ్ల వయసున్న స్వాతి ‘తారాంతరంగం’ ఈ వారం.

రష్యాలో పుట్టారు కదా...
 స్వాతి: అవును. వ్లాదివోస్టాక్ అనే పోర్ట్‌ప్లేస్‌లో పుట్టాను. నాన్న నేవీలో చేసేవారు. ఆయన ఉద్యోగరీత్యానే ముంబయికి వచ్చాం. ఆ తర్వాత వైజాగ్, తర్వాత హైదరాబాద్!

 మరి స్వెత్లానా ఎలా స్వాతి అయ్యారు?

 స్వాతి: రష్యన్ పేరెందుకు... మన భాష పేరు పెట్టుకోవాలని ముంబయి వచ్చాక అమ్మ నా పేరు మార్చింది.  నాకన్నా ఆరేళ్లు పెద్దయిన అన్నయ్య పేరు సిద్ధార్థ. ఇద్దరి పేర్లూ ‘ఎస్’ తో మొదలైతే బాగుంటుందని నాకు స్వాతి అని పెట్టారు.

 మీరు పుట్టిన రష్యాకు మళ్లీ ఎప్పుడైనా వెళ్లారా?
 స్వాతి: సరిగ్గా నెలన్నర క్రితమే వెళ్లాను. పసిఫిక్ మెరిడియన్ అని ఫిలింఫెస్టివల్ 11వ వార్షికోత్సవం చేశారు. నేను పుట్టిన వ్లాదివోస్టాక్‌లో ఈ అంతర్జాతీయ చిత్రోత్సవం జరిగింది. భారతీయ సినిమాకు 100ఏళ్లు అయిన సందర్భంగా మన సినిమావాళ్లని కూడా ఆహ్వానించారు.  ముఖ్యంగా వ్లాదివోస్టాక్‌లో  పుట్టి, ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగంలో రాణిస్తున్నవారిని గుర్తించి ఆహ్వానించారు. అలా నాకు కూడా ఆహ్వానం అందింది. వెళ్లాను.. చాలా హ్యాపీగా అనిపించింది. నేను పుట్టిన ఆసుపత్రి వార్డు, నా ఫస్ట్ హౌస్ చూశాను.  ఫొటోలు దిగాను. చాలా మెమరబుల్!

 మీ అన్నయ్య గురించి...

 స్వాతి: మా అన్నయ్య, నేను చాలా క్లోజ్‌గా ఉంటాం. ‘కలర్స్’ ప్రోగ్రాం టైమ్‌లో ‘బాబోయ్... ఇంట్లో కూడా దీని గోల, టివిలో కూడా దీని గోలే’ అనేవాడు. ‘చానెల్ అయితే మార్చేసుకోవచ్చు కానీ ఇంట్లో అలా కుదరదుగా’ అంటే ‘అదే ఛస్తున్నానురా బాబూ’ అనేవాడు.

 డాక్టర్ అవబోయి యాక్టర్ అయినవారిలో మీరూ...
 స్వాతి: నిజంగా అవుదామనుకున్నానండీ. ఇప్పటికీ అప్పుడప్పుడు బాధేస్తుంది. అయితే ఈ మధ్య కొందరు డాక్టర్లను చూసి ‘థాంక్ గాడ్ నేను డాక్టరవ్వలేదు’ అనిపిస్తుంది! ఇట్స్ ఎ వెరీ రెస్సాన్సిబుల్ జాబ్! నాకు చదువంటే ఇష్టం. నేను బాగా చదివేదాన్ని. మెడిసిన్‌లో ఫ్రీ సీట్ సాధించాను. కాని, అప్పటికే ‘కలర్స్’ బాగా పాపు లర్ కావడంతో నన్ను మామూలుగా కాకుండా  ఒక రేంజ్‌లో ర్యాగింగ్ చేశారు. ఓ 30 మంది నన్ను రోజంతా హాస్టల్ రూమ్‌లో  పెట్టి తాళం వేసేశారు. రాత్రంతా డ్యాన్స్ చేయమన్నారు. మా రూమ్ ఎలక్ట్రిసిటీ స్విచ్ బయట ఉండేది. అది ఆఫ్ చేసేసేవారు. అలాగే జూనియర్స్ కూడా నాతో ఉంటే ర్యాగ్ అవుతారని నాతో ఉండేవారు కాదు. సో నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ‘కలర్స్ స్వాతి’ ఈ కాలేజ్‌లో చదువుతోంది అని తెలిసిన తర్వాత చుట్టుపక్కల ఇంజినీరింగ్ కాలేజ్ వాళ్లు కూడా వచ్చి రాగ్ చేయడం... ఆ ఇంజినీరింగ్ బాయ్స్, మెడికల్ బాయ్స్ అంతా కలిసి రాగ్ చేయడం...స్టేషనరీ ఏదైనా కొందామని వెళ్లినా షాప్‌కు వచ్చి మరీ రాగ్ చేయడం ఎక్కువయ్యాయి. ఎవరు సస్పెండ్ అయినా నన్ను బ్లేమ్ చేసేవారు. అలా నాకు ఏదో ఒక దశలో ఆ వృత్తి మీద ఇంట్రస్ట్ పోయింది. ‘ఇలాంటి వాళ్లు మెడికోస్...  వీరేం డాక్టర్లు అవుతారు? సైకోల్లా ఉన్నారు’ అనిపించింది. ఏదైతేనేం అక్కడ మానేశాను. తర్వాత హైదరాబాద్ యూసఫ్‌గూడలోని సెయింట్ మేరీస్‌లో బయోటెక్నాలజీలో చేరాను. ఆ కాలేజ్ ప్రిన్సిపాల్, స్టాఫ్, స్టూడెంట్స్ నన్ను మెడికల్ కాలేజ్ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ నుంచి తేరుకునేలా చేశారు. అక్కడి కెమిస్ట్రీ లెక్చరర్ ఇప్పటికీ నాతో టచ్‌లో ఉన్నారు.

 ‘కలర్స్’ స్వాతి అని పిలిస్తే ఎందుకు ఇష్టం ఉండదు? అది మీ హీరోయిన్ స్టేటస్‌కు తక్కువనా?
 స్వాతి: ఛీఛీ...నాకు అప్పుడే ఇష్టం ఉండేది కాదు. చక్కగా స్వాతి అనే పేరు ఉంది కదా అని. అంతెందుకు... ఆ ప్రోగ్రామ్‌లోనే అనేదాన్ని ‘థాంక్‌గాడ్... నా ప్రోగ్రాం పేరు కలర్స్! ఏ ‘ఇంటింటి మహాలక్ష్మి’నో లేదా ‘పట్టుకుంటే పట్టుచీర’నో అయ్యుంటే! బాబోయ్ అలాంటివి పెట్టలేదు!

 కాని, చాలామంది అలా పిలిస్తే క్రెడిట్‌గా ఫీలవుతారు...

 స్వాతి: నేనలా కాదండీ. డిటాచ్డ్ పర్సన్. ‘సుబ్రహ్మణ్యపురం స్వాతి’, ‘డేంజర్ స్వాతి’ అంటే నాకు ఏదోలా ఉంటుంది!

 ఇంటి నుంచి పారిపోయైనా సరే సర్కస్‌లో చేరాలి అనుకున్నారట...
 స్వాతి: (గట్టిగా నవ్వేస్తూ) అవును. అది ఎక్కడ విన్నారు మీరు? నిజంగానే నాకు సర్కస్ అంటే బాగా ఇష్టం. ఆ ఇష్టంతోనే 8వ తరగతిలో ఉన్నప్పుడు అందులో చేరడానికి ట్రయల్ కూడా చేశాను! కానీ ఛాన్స్ దొరకలేదు. అలాగే నేవీలో ఉన్నప్పుడు యూనిఫాం నచ్చి అందులో చేరిపోదాం అనుకున్నాను. తర్వాత డాక్టర్...  అవన్నీ దేవుడు పై నుంచి చూసి ఈ అమ్మాయికి చాలా కోరికలున్నాయి కాబట్టి... ఈ అమ్మాయిని యాక్టర్ చేసేద్దాం... అన్నీ అయిపోతుంది (క్యారెక్టర్‌ల పరంగా) అనుకునుంటాడు (నవ్వులు)!

 అంత హిట్టయిన ‘కలర్స్’ ప్రోగ్రామ్‌ను ఆపేయడం మొదలుకుని, మెడిసన్‌ను వదులుకోవడం...ఇలా మీ నిర్ణయాల్లో చాలా స్థిరచిత్తం కనిపిస్తుంటుంది... పెద్దగా లైఫ్‌లో స్ట్రగుల్ లేకపోయినా ఇంత స్ట్రాంగ్ ఎలా అయ్యారు?

 స్వాతి: నా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, నేను పెరిగిన వాతావరణం వల్ల! దట్ వే ఐయామ్ బ్లెస్డ్. అయినా స్ట్రగుల్ అస్సలు లేకుండా ఏమీ లేదు. స్ట్రగుల్ అంటే ఇటుకలు మోసేయడం లాంటివి కాకపోయినా, సాధారణ మధ్యతరగతి జీవనశైలి నుంచి వచ్చాను.  నేవీ ఫీల్డ్ బయట గ్లామరస్‌గా ఉంటుంది కానీ తొంగి చూస్తే చాలా సాధారణంగా ఉంటుంది. అందరి ఇళ్లూ ఒకేలా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎకామిడేషన్ తెల్సిందే కదా. నార్మల్ క్వార్టర్స్. కానీ ఇంటలెక్చువల్లీ, కల్చరల్లీ చాలా రిచ్ ఎన్విరాన్మెంట్! పక్కింటోడు ఒక బెంగాలీ ఉంటాడు, పైనో పంజాబీ ఉంటాడు. హోలీ ఆడాం. క్రిస్మస్  చేశాం. వినాయకచవితికి నాటకాలు. దాండియా ఆడాం. సో... క్వార్టర్స్‌లో ఉన్నామేమో కాని, మా కల్చరల్ అప్‌బ్రింగింగ్ వెరీ వెరీ రిచ్!

 మూవీస్‌లోకి వెళ్తాననగానే ఇంట్లోవాళ్లు ఏమన్నారు?
 స్వాతి: నేను మూవీస్ చేయడం అన్నకు అస్సలు నచ్చలేదు. ‘డేంజర్’ టైంలో చాలా రోజులు నాతో మాట్లాడలేదు కూడా! చాలా బాధపడ్డాను. సినిమాల్లో చేసే అమ్మాయిల గురించి ఆ వయసు అబ్బాయిలు, ఫ్రెండ్స్ ఏం అనుకుంటారో తెల్సిందే కదా. అందుకే కొంచెం భయపడ్డాడు. అయితే సినిమా చూశాక గర్వంగా ఫీలయ్యాడు. పేరెంట్స్ మాత్రం దీన్నంతా ఒక ప్రాసెస్‌గా భావించారంతే! అలాగని నా విషయంలో ప్రతీదీ వారికి తెలియాలని కోరుకోరు. అదే టైమ్‌లో నాకేం జరుగుతుందో వారికి తెలుసు. నేనే పడతాను. నేనే లేస్తాను. అయితే అన్నీ చెబుతూనే ఉంటాను. సడెన్‌గా ఏమైనా అయినప్పుడు  వాళ్లు షాక్ తినరు!

 ‘సినిమాలు మానెయ్’ అని ఎప్పుడూ అనలేదా?

 స్వాతి: మూవీస్ మానేసి ఏం చేస్తా? నేనున్న పరిస్థితుల్లో బ్యాంక్‌లో చేస్తానా? అలా అని నచ్చక చేస్తున్నానని కాదు... ఇష్టం కాబట్టి చేస్తున్నాను. అవసరమైతే ఇంట్లో క్యాండిల్స్ చేసుకుని అమ్ముకుంటూ బతుకుతాను కాని, ఇష్టం లేనిపని చేయను.

 మీ మూవీస్ అబ్జర్వ్ చేస్తే  పెర్ఫార్మెన్స్ బేస్డ్‌గా ఉంటాయి. సెలక్టివ్‌గా వెళుతున్నారనుకోవచ్చా?
 స్వాతి: యాక్చువల్లీ  పెర్ఫార్మెన్స్ బేస్డ్ అంటూ ఏమీ ఉండవండీ. ప్రతి సినిమాలోనూ పెర్ఫార్మెన్స్ ఉండాల్సిందే కదా. ఇక అవి నేను ఎంచుకున్నవి కాదు. ఆ సినిమాలే నన్ను ఎంచుకున్నాయి. నాకు పది ఉంటే అందులో నేను రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాని, అన్నీ ఎప్పుడూ ఎవరికీ ఉండవు. నా దగ్గరకి వచ్చినవి మంచి ఆఫర్లు  అంతే.

 మీరు కనపడినంత చైల్డిష్ కాదు..!
 స్వాతి: అయామ్ జస్ట్ గ్రోయింగ్‌అప్ అండీ! పర్సనల్లీ నేను పేరెంట్స్‌కి చాలా క్లోజ్‌గా ఉంటాను. తల్లిదండ్రులకు సన్నిహితంగా ఉండే పిల్లల లైఫ్ వేరేగా ఉంటుంది. ఎల్లప్పుడూ నేను డిపెండెంట్‌నే. అందులో డౌట్ లేదు. అంటే అది ఫైనాన్షియల్‌గానే కానక్కర్లేదు. ఎమోషనల్‌గా కూడా. నేనంటూ గుడ్డిగా  చేయగలిగేది అమ్మానాన్నని నమ్మడమే.

 దేవుణ్ణి నమ్ముతారా?

 స్వాతి: ఇప్పుడు.. డెఫినెట్లీ. ఒక పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఒక మనిషికి ఒక సిట్యుయేషన్ వల్ల్లో సక్సెస్, ఫెయిల్యూర్ వల్లో టెంపర్‌మెంట్ వల్లో మూడ్స్ వల్లో వేరే థాట్స్ ఉంటాయి. ఓ 5 సంవత్సరాల తర్వాత ఆలోచన మారిపోతుంది. ఇదే ప్రశ్న మీరు నన్ను స్కూల్ టైమ్‌లో అడిగితే వేరే ఆన్సర్ చెప్పేదాన్నేమో. ఇప్పుడు టివి, సినిమాలు, వేరే బాధలు, ఫ్రెండ్స్ పెరగడం, వాళ్ల పెళ్లిళ్లు. ఇవన్నీ చూశాక డెఫినెట్‌లీ దేవుడున్నాడని బాగా నమ్ముతున్నాను.

 ఎందుకంత నమ్మకం?

 స్వాతి: మంచివాళ్లకి మంచి జరిగినప్పుడు దేవుడున్నాడు అనిపిస్తుంది. అది తెలిసినవాళ్లకయినా, పర్సనల్‌గా నాకయినా! మా అన్నయ్యకు ఫేటల్ యాక్సిడెంట్ అయింది కొన్ని నెలల క్రితం. సీరియస్ అయింది. బట్ హీ సర్వైవ్డ్ ఇట్. సో...దేవుడున్నాడు అని. ఇప్పుడు చదివేవాళ్లకి ఇది చాలా సిల్లీగా అనిపించవచ్చు. అయితే నా నమ్మకం నాకుంది. నా ఫ్రెండ్స్ చాలా మంది దేవుణ్ణి నమ్మరు. నాతో ఆర్గ్యుమెంట్ కూడా పెట్టుకుంటారు. దేవుడేంటి... అంతా మన చేతుల్లోనే ఉంది అంటారు. కాని, నేను వారితో పెద్దగా ఆర్గ్యూ చేయను. ఎందుకంటే ఇది పూర్తిగా పర్సనల్ థింగ్!

 మీ ఫ్రెండ్స్ గురించి...
 స్వాతి: క్లోజ్ ఫ్రెండ్స్ తక్కువండి. అంటే... ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అందరితో బాగా మాట్లాడతాను. నాకు స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్ ఎక్కువ. ఇక సినిమా పరిశ్రమలో స్నేహం గానీ, శతృత్వం గానీ ఎక్కువ కాలం ఉండవు. అయినా ఇట్స్ వన్ లైఫ్ అండీ. గొడవలు ఎందుకు చెప్పండి? యూ నో... హేట్ అనే ఎమోషన్ చాలా డ్రెయినీ. లవ్ కన్నా హేట్ చాలా బలమైందీనూ. మనిషిని చాలా డ్రైన్ చేసేస్తుంది. సో అంత శక్తి నాలో  లేదు.

 హీరో సునీల్ మాటకు బాగా విలువిస్తారంటారు...
 స్వాతి: అవును... సునీల్‌తో పొద్దున్న కూడా మాట్లాడాను. ఎక్కడికైనా సరే సునీల్ చెప్తే వెళ్తా. ఒకరోజు సడెన్‌గా పూరీ జగన్‌గారు రాత్రి 9.30కి ఫోన్ చేసి ‘‘స్వాతీ, హరీష్, చార్మి, నేను, ఇంకా రాము... ఇలా అందరం పార్టీకి వెళుతున్నాం వస్తావా?’’ అంటే రానన్నా. అప్పుడు  సునీల్ చేత ఫోన్ చేయించారు. వెళ్లాను. సీ... ఫ్రెండ్షిప్ అంటే అర్థం ఏమిటో నాకు తెలీదండీ. కాని, ఇండస్ట్రీలో నాకు చాలా స్పెషల్ పీపుల్ అయితే ఉన్నారు. ఇందులో సునీల్, శ్రీనివాస్ అవసరాల, ఇంద్రగంటి మోహన్‌కృష్ణ, పార్వతి... అలా... కొందరు ఉన్నారు.

 మీ ఏజ్‌గ్రూప్‌వాళ్లతో తక్కువ అనుకుంటా...
 స్వాతి: హహహ(నవ్వులు) నా ఏజ్ గ్రూపోళ్లు తక్కువున్నారనుకుంటా ఇండస్ట్రీలో. అంటే వాళ్లంతా ఇంకెక్కడో ఉన్నారు. వాళ్ల రేంజ్ వేరే. పెద్ద సినిమాల్లో ఉన్నట్టున్నారు.

 చిన్నాపెద్దా... అని లెక్కేస్తారా...
 స్వాతి: నేనడం కాదండీ. ఇది జనాలు చెప్పే లెక్కలేనండీ. నాకు అలాంటివి ఉండవు. అందుకేగా ‘కలర్స్’ హిట్టయింది. మనిషిని మనిషిగా ట్రీట్ చేసి మాట్లాడేదాన్ని కాబట్టే అది అంత విజయం సాధించింది!
  ఇప్పటి టీవీ విజృంభణ చూస్తుంటే... మీరు ఇప్పటికీ టీవీలోనే ఉండుంటే స్మాల్ స్క్రీన్ సూపర్‌స్టార్ అయ్యేవారేమో... కమర్షియల్‌గా అదే బాగుండేదేమో...
 స్వాతి: ఏమో.. నాకిప్పటికీ అంత  కమర్షియల్ ఐడియాలజీ లేదండీ. ఆ తెలివితేటలు నాకు లేవు.  గెస్ ్టరోల్స్ కానివ్వండీ ఆ పాటలు కానీ అంతా ఫ్రెండ్లీగానే... ‘స్వాతీ నువ్వు చెయ్ అంటే చేశా తప్ప... ‘నాకేంటి’ అని అంతగా ఆలోచించలేను.

 అలా ఆలోచించకపోవడంవల్ల ఏదైనా పోగొట్టుకున్నారా?
 స్వాతి: ఓసారి ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేశాక కొంతమంది నాకు ఫోన్ చేసి ‘‘అదేంటి స్వాతి, నువ్వు గెస్ట్ రోల్ చేయకు... హీరోయిన్‌గా చేశాక గెస్ట్ రోల్ చేస్తే రాంగ్ మెసేజ్ వెళుతుంది. వర్క్‌లేక చేశావంటారు’’ అని  అంటే..  ‘అంత సిల్లీ మేటర్ కూడా అర్థం కావడం లేదా’ అని ఫస్ట్‌షాక్ అయ్యాను. నిజానికి అందరి జర్నీ ఒకలా ఉండదండీ. అందరూ సావిత్రి గారిలా ఉండలేరు. అందరూ శ్రీదేవిలు కాలేరు. మన వ్యత్యాసాలే మన ప్రత్యేకతలు  కదా. ఇది నా జీవితం. సో...వీటి నుంచి నేర్చుకున్నానే తప్ప రిగ్రెట్స్ లేవు.

 ‘కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం అప్పల్రాజు’ సినిమా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ కాదంటారా?
 స్వాతి: దేన్నీ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ కాదనుకునే బలం ఈ మధ్యే  వచ్చింది. అంతకుముందు బాగా ఫీలయ్యేదాన్ని. ఎందుకంటే మనం అవ్వకపోయినా పక్కనోళ్లు చెప్తారు. కొన్ని రోజుల పాటు కాదు నెలలపాటు ఆ ఫీలింగ్‌లోనే ఉండేదాన్ని! అప్పల్రాజు, గోల్కొండ హైస్కూల్ తర్వాత కాన్షియస్‌గా ఒక బ్రేక్ తీసుకున్నాను. ‘అసలు నేనెందుకున్నానీ ప్రొఫెషన్‌లో?  నాకేం కావాలి?’ అని ఆలోచించుకున్నాను. వై యామ్ ఐ అన్‌హ్యాపీ అని ప్రశ్నించుకున్నాను. అప్పుడు రియలైజ్ అయ్యాను. అప్పుడర్థమైంది ఇతరుల అభిప్రాయాల వినడమే నాకు సమస్య అని. ఇతరుల అభిప్రాయాలపై నా శక్తిని ఎక్కువగా ఖర్చు చేస్తున్నానని. ఒక్కొక్కరు వచ్చి ‘‘‘స్వాతి నువ్వు తెలుగమ్మాయివి...నువ్వు చాలా టాలెంటెడ్...  స్వాతి...నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి’’... ఇలా అంటుంటే వాళ్ల మాటలు విని నాక్కూడా కంగారు వచ్చేసేది. అనేశాక వాళ్లు వెళ్లి హాయిగా పడుకుంటారు. అయినా నాకా థాట్ ఉంటుంది కదా. అది గుర్తించాను. అదే సమయంలో మా అమ్మ ఒక మాట అడిగింది ‘‘లాస్ట్ వన్ ఇయర్‌లో రిలీజైన సినిమాల్లో నువ్వు మిస్సయిన ఒక సినిమా  పేరు చెప్పు’’ అని. ఒక్కటి కూడా చెప్పలేకపోయాను. ఎందుకంటే, ఆ సినిమాలు నచ్చాయి కాని, నేను చేస్తే అవి వర్కవుట్ అయ్యేవి కావు. మళ్లీ అమ్మ ఇంకో క్వశ్చన్ వేసింది. ‘‘స్వాతీ నువ్వు సినిమాల్లోకి ఎందుకు వచ్చావ్?’’ అని! ‘‘యాక్ట్ చేయడానికి’’ అన్నా! అయితే యాక్ట్ చెయ్ అంది. అంతే. ఆ తర్వాత స్వామి రారా, మలయాళ సినిమా ఆమెన్, తమిళ సినిమాలు.. ఇలా... చేసుకుంటూ పోతున్నా. రిజల్ట్ గురించో, ఇంకొకరి అభిప్రాయాల గురించో పట్టించుకోకుండా నా వృత్తి మీద నా లవ్వూ, నా కాన్సన్‌ట్రేషన్   చూపిస్తే మిగతాదంతా లైన్‌లో పడుతుందని రియలైజ్ చేశా!

 ఆ తర్వాత...

 స్వాతి: ‘స్వామి రారా’ తర్వాత బాగా ఆఫర్లు వచ్చాయి. అయితే అప్పుడు మళయాళం, తమిళంలో చాలా అర్థవంతమైన సినిమాలు చేస్తున్నాను.

 మీ కెరీర్‌లో ఇదే బెస్ట్ టైమ్ అనుకోవచ్చా..?
 స్వాతి: కాదండీ... ద బెస్ట్ టైమ్ వజ్ ఆఫ్టర్ అప్పల్రాజు. ఏడాదిన్నర సమయంలో ఇంటి దగ్గర కూర్చుని ఎన్నో ఇన్నర్ కన్‌ఫ్యూజన్స్‌ను క్లియర్ చేసుకున్నాను.

 తెలుగులో చేస్తూ చేస్తూ... సడన్‌గా తమిళంలో ఆఫర్ ఎలా వచ్చింది?

 స్వాతి: తమిళియన్స్ చాలా స్మార్ట్. వాళ్లు కన్నేసి ఉంచుతారు... ఎక్కడంటే అక్కడ. ‘ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులే’ చూసి, 3 నెలలు ఆగి ఫోన్ చేశారు. ‘‘బాబూ నాకు తమిళం రాదు’’ అంటే ‘‘వెరీగుడ్ తమిళ హీరోయిన్లకు తమిళ్ రాకపోవడం ఒక అడ్వాంటేజ్’’ అంటూ తీసుకెళ్లారు. అలా ‘సుబ్రమణియపురం’ వచ్చింది.

 మళయాళం  సినిమా ఛాన్స్  ఎలా వచ్చింది?
 స్వాతి: ‘సుబ్రమణియపురం’ చూసి మలయాళం వాళ్లు ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ 3 సినిమాలు చేస్తున్నాను. అయితే రెమ్యునరేషన్ చాలా తక్కువ. షాప్ ఓపెనింగ్ అంత కూడా రాదు (నవ్వులు). చాలా ఖర్చులు నేనే పెట్టుకుంటుంటాను. అమ్మ అంటుంది ‘మనం చేస్తున్నామా? పెడుతున్నామా?’ అని. కాని మలయాళంలో ఎన్విరాన్మెంట్ బాగుంది! బడ్జెట్ చాలా సింపుల్ ఖర్చుతో గ్రౌండ్‌లెవల్‌లో ఉంటుంది.

 పాటలు పాడుతున్నారు. ఈ ‘పాడు’ అలవాటు ఏంటి?

 స్వాతి: అలవాటేం కాదు. మొత్తం ఇప్పటికి 3 సినిమాలకు పాటలు పాడాను. దాంతోపాటే ఒక ఎయిడ్స్ అవగాహనా కార్టూన్ పిక్చర్‌కి వాయిస్ ఇచ్చాను. అదో స్కూల్ ప్రోగ్రామ్! అన్ని గవర్న్‌మెంట్ స్కూల్స్‌కు వెళుతుంది. వ్యక్తిగతంగా మ్యూజిక్ అంటే నా జీవితంలో భాగం. అది నాకు స్ఫూర్తినిస్తుంది. బలాన్నిస్తుంది!

 ఫస్ట్ లవ్‌ప్రపోజల్ ఎప్పుడొచ్చింది?
 స్వాతి: స్కూల్లో! సెవెన్త్‌క్లాస్‌లోనే వచ్చింది. అప్పుడు వైజాగ్ నేవీ స్కూల్‌లో చదువుతున్నాను. పెన్సిల్ చెక్కుకుంటుంటే క్లోజ్‌ఫ్రెండ్ వచ్చి ఐ లవ్ యు అన్నాడు. నాకు వెంటనే అర్థం కాక చెక్కుకోవడం ఆపి ‘క్యా’ అంటూ దీర్ఘం తీశాను. ఐ థింక్ ఐ లవ్ యూ అన్నాడు. అంతే... ఆ అబ్బాయితో మాట్లాడడం మానేశాను. వారం తర్వాత కలిసి ‘‘నువ్వేమైనా మిస్ ఇండియావా! ఏమనుకుంటున్నావ్? ఇష్టం లేకపోతే వదిలెయ్,  నాతో మామూలుగా ఉండు’’ అన్నాడు. ఇప్పటికీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్‌మే! ఇక కాలేజ్‌లో లవ్ ప్రపోజల్స్ ఏమీరాలేదు. మా అన్నయ్య టీషర్ట్, జీన్స్, జుట్టు ముడి వేసుకుని కాస్త పద్ధతిగా వెళ్లేదాన్ని అందుకేనేమో ఎవరూ పట్టించుకోలేదు (విచారంగా మొహం పెట్టి), ఇండస్ట్రీకి వెళ్లాక చాలా వచ్చాయి. ఇండస్ట్రీలో లవ్‌కన్నా మ్యారేజ్ ప్రపోజల్స్ ఎక్కువొచ్చాయ్. బహుశా నా ఫేస్ అలా అనిపిస్తుందేమో (నవ్వులు). అంటే వాళ్లక్కూడా తెలుసేమో ఈ అమ్మాయితో ఇవన్నీ వేస్ట్ అని! ఇండస్ట్రీలో హరీష్ శంకర్, రవితేజ, బీవీఎస్ రవి అందరూ నన్ను తులసి మొక్క అని ఏడిపిస్తుంటారు.

 మరి అలా ఉంటే డల్‌గా అనిపించదా?
 స్వాతి: ఊహూ... నేనొచ్చిన బ్యాగ్రౌండ్ వల్లేమో అంత అటెన్షన్ హ్యాండిల్ చేయలేను. ఒక బంగళా, కారు, కెమెరాలతో ప్రొటెక్షన్ ఇవన్నీ ఉన్నవాళ్లు హ్యాండిల్ చేయగలరేమో... కాని, నేను చాలా సింపుల్‌గా ఉంటాను!

 మీ ఉద్దేశంలో ప్రేమంటే..?
 స్వాతి: నాకు నిజంగా తెలీదు. ఎవరైనా చెబితే బాగుంటుంది. అలాగని ఎవరైనా నాకు తెలియజెప్పాలని అనుకోవడం లేదు. నా పెళ్లి మాత్రం తప్పకుండా ఎరేంజ్డ్ అయి ఉంటుంది.

 మీ వల్ల ఎవరైనా దేవదాసులయ్యారా?
 స్వాతి: ఎవరవుతారండీ... ఈ కాలంలో దేవదాసులు? మరీ అయితే ఓ 10రోజులకు అవుతారేమో! అయినా ఓ అమ్మాయి కోసం... ఫీలైపోయి, షేవ్ చేసుకోవడం మానేసి, బాగా తాగేసి ఆ ఫీలింగ్‌ను ఎంజాయ్ చేస్తుంటే ఏం బాగుంటుందండీ?

 పార్టీయింగ్‌కు దూరంగా ఉంటారెందుకు?

 స్వాతి: ఏదైనా రీజన్ ఉంటేనే వెళతానండీ! అయితే పార్టీయింగ్ నచ్చదని కాదు. కొన్నిసార్లు వెళ్లానండి. వెళ్లిన తర్వాత నాకేం అనిపించిందంటే... అక్కడికి ఒక్కొక్కరు ఒక్కో రీజన్‌తో వస్తారు. ఒక ఎజెండాతో వస్తారు.  నాకేమో ‘నేనిక్కడ ఏం చేస్తా’ అనిపిస్తుంది. ఆల్‌సో... ఇది చాలా కాంపిటీటివ్ ఇండస్ట్రీ. ఉన్న ఫ్రెండ్షిప్‌లన్నీ వన్ టు వన్ ఉంటాయి. గ్రూప్‌లో ఉన్నప్పుడు ఏమౌతుందంటే... ఓ పది నిమిషాలు బాగుంటారు. ఓ ఇద్దరు అక్కడ నుంచి వెళ్లగానే ఇక వారి గురించి మాట్లాడతారన్నమాట. నే నైనా అక్కడ నుంచి వెళ్లగానే నా మీద కూడా టక్‌టక్‌మని కౌంటర్ పడిపోతుందన్నమాట. అది నాకు తెలుసు. అందుకే దూరంగా ఉంటాను.

 సినిమారంగానికి వచ్చి పదేళ్లవుతున్నా పెద్దగా రూమర్స్ లేవేంటి?
 స్వాతి: నేను చాలా బోరింగ్. కొంచెం ఎగ్జయిటింగ్‌గా ఉండేవాళ్ల మీద వస్తాయేమో రూమర్స్! అయినా అవి కూడా చిన్నా చితకా ఉన్నాయిలెండి. ఒక సినిమా హిట్టయిందనుకోండి. వచ్చేస్తాయిక. ఈ ఫీల్డ్‌లో తప్పదనుకుంటా!

 విక్రమ్ మీకు బాగా క్లోజ్ అని విన్నాం..?

 స్వాతి: అడిగారా... చెబుతాను! నిజానికి విక్రమ్ అందరితో క్లోజ్‌గా ఉంటాడు. నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు ‘కలర్స్’లో విక్రమ్‌ని  ఇంటర్వ్యూ చేశాను. ఓ నేషనల్ అవార్డ్ విన్నర్ అంటే ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చుంటాడు? అయినా ఆయన ‘కలర్స్’తో చాలా ఇంప్రెస్డ్! అప్పటినుంచి నన్ను ‘తన ఫేవరెట్ మూవీ ప్రెజెంటర్’ అనేవాడు. ఎవరైనా అడిగితే ఆయన పబ్లిగ్గా చెప్పేవాడు... ‘స్వాతి అంటే ఇష్టం’ అని! అలా ఒక ఇమేజ్ వచ్చేసింది. ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ సినిమా అప్పుడు సెల్వరాఘవన్‌కు తనేమీ నన్ను సిఫారసు చేయలేదు. నన్ను తీసుకోవాలనుకున్నాక, ఆ విషయం విక్రమ్‌ని అడిగాడు అంతే!

 నిఖిల్‌తో కూడా మీకు ఏదో ఉందని టాక్...
 స్వాతి: అబ్బా! రెండు సినిమాలు కలిసి చేస్తే లింక్ పెట్టేస్తే ఎలా? అలా అయితే జైతో, ‘ఆమెన్’ హీరోతో కూడా రెండో సినిమా చేస్తున్నాను. మొత్తం 3 భాషల్లో ముగ్గురు హీరోలతో రెండో సినిమా చేస్తున్నాను. దానికేమంటారు? అలా చేస్తున్నానంటే దానికి కారణం ఒకటే... నేను నా పని చూసుకుంటాను. వాళ్లు వాళ్ల పని చూసుకుంటారు. అసలు అలాంటి ఎఫైర్‌లు ఉంటే రెండో సినిమా అవ్వదు.  చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి! ఇప్పుడు సినిమా మేకర్స్ చాలా డెరైక్ట్‌గా కూడా చెప్తున్నారు. ‘‘మేం ఎందుకు నటిగా నీకు ప్రాధాన్యమిస్తామంటే  నువ్వు నీ పని చూసుకుంటావ్’’ అని! ఎప్పుడైనా కొంచెం డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తేనే సంవత్సరాల తరబడి ఉంటుంది ఆ రిలేషన్‌షిప్. ఎక్కువ క్లోజ్ అయిపోతే కట్ అయిపోతుంది!

 ఇలాంటి విషయాల్లో ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఫీలవుతారా?
 స్వాతి: లేదండీ. నేనున్న ఫీల్డ్ అలాంటిది కదా. నేను కూడా రణబీర్‌కపూర్ గురించిన వార్తలు అవీ చదువుతాగా. అయితే నన్ను తిక్కగా అడిగితే సమాధానం అంతే తిక్కగా చెబుతాను. పద్ధతిగా అడిగితే బాగానే చెప్తాను!

 ఇంతకీ పెళ్లెప్పుడు...
 స్వాతి: ఇంకో రెండు మూడేళ్లలో ఉండొచ్చు... నాకు తెలీదండీ! చెప్పలేం కదా... ఇలాంటి విషయాల్లో. అయినా ఇప్పుడు నేను ‘పెళ్లి చేసుకుందాం’ అని ఆలోచించడంలేదు. ‘పెళ్లంటే ఏంటా?’ అని ఆలోచిస్తున్నాను. ఆ ఇన్‌స్టిట్యూషన్  నాకింకా అర్థం కాలేదు. అయితే ఆ వ్యవస్థను నేను నమ్ముతున్నానంటే అది కూడా నా పేరెంట్స్‌ని చూసి. లేదా మా ఫ్రెండ్స్ పేరెంట్స్. లేదా మా చిన్నాన్న, పిన్ని. లేకపోతే... నాకంతగా సరైన అభిప్రాయం లేదు. ఏదైనా ప్రతి పెళ్లీ డిఫరెంట్.   కొన్ని పెళ్ళిళ్లు అరేంజ్‌మెంట్స్ వల్లో, డీల్స్, లవ్వూ, సోషల్ ఆబ్లిగేషన్... కారణాలతో జరిగినవి చూశాను. నా ఫ్రెండ్స్‌లో కొంతమంది పెళ్లిళ్లు వెరీ లక్కీ. కొంతమందివి ప్చ్... వాళ్ల లైఫ్ అంతే. ఏదైనా మంచి పార్ట్‌నర్ దొరకడం అనేదానికి మనం అదృష్టవంతులం అయి ఉండాలనేది నా ఫీలింగ్!

 వచ్చేవాడు ఎలా ఉండాలని..?
 స్వాతి: బాబోయ్... అలా అంటే చెప్పలేను. అస్సలు ఐడియా లేదు! సినీ పరిశ్రమలో అన్ని రకాల మనస్తత్వాలున్న మగవాళ్లని చూశాను.

 పెళ్లయ్యాక సినిమాలు చేయడం మానేస్తారా?

 స్వాతి: అది తెలీదు కానీ, కనీసం రెండేళ్లు ఇంటిపట్టునే ఉండిపోతాను. శుభ్రంగా ఇల్లంతా చూసుకుంటూ... వంట చేసుకుంటూ...

 ఈ ఇంటర్వ్యూ చదివితే ఈ ఒక్కదెబ్బకు మ్యారేజ్ ఆఫర్స్ గ్యారంటీ...
 స్వాతి: అహ్హహ్హ. కొన్ని సంవత్సరాలైనా నిజంగా అలా ఉండాలనుంది!

 - ఎస్.సత్యబాబు.
                                                         *****************************  
 పుస్తకాలు చదువుతారా?
 స్వాతి: ఇంట్లో లైబ్రరీ ఉంది. సీరియస్ బుక్స్  ఉన్నాయి. ఇక షిడ్నీషెల్డన్ అవన్నీ జుజుబీస్. నేను ఆలోచించనక్కర్లేదు అన్నప్పుడు నమిలిపడేయాలి అనుకుంటే అవి చదువుతాను.  రకరకాల బుక్స్ చదువుతాను. డిగ్రీ టైమ్‌లో నాకు తెలుగు ఉండేది కాదు. అయితే అష్టాచెమ్మా తర్వాత ఆర్టికల్స్ తెగవచ్చేసేవి. అవి చదవలేక ఫస్ట్రేషన్ వచ్చేసి తెలుగు నేర్చుకున్నా. తెలుగులో బుజ్జిబుజ్జి కధలు చదువుతా. మేకా ఆవు లాంటివి. ఇప్పుడు నా గురించి సాక్షిలో ఏమైనా వస్తే పొద్దున్నే లేచి నిదానంగా చదువుతానన్నమాట!

 రెమ్యునరేషన్‌లో నిర్ణయం ఎవరిది?
 స్వాతి: ఆ డిస్కషన్ ఎప్పుడూ రాలేదు. నా సినిమాలకు రీజనబుల్ ప్రొడ్యూసర్లే ఉన్నారు.  అమ్మది కొంచెం జాలిగుండె. అమ్మ వల్లే సినిమాల్లో ట్రీట్‌మెంట్ బాగుంటుంది. తన వల్లే నన్ను బాగా చూసుకుంటారు.అమ్మ ఏమంటుందంటే... ‘ఎక్కువ అడిగేసి పీడించేస్తే... అంత ఇచ్చాం అనే ఫీలింగ్ వాళ్లకి సినిమా పూర్తయ్యేదాకా ఉంటుంది’ అంటుంది. ‘వాళ్లు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీ’ అంటుంది. ఈ విషయంలో అమ్మకంటే నేనే కొంచెం బెటర్. కానీ దీని గురించి ఎప్పుడూ అమ్మతో వాదించను. (నవ్వుతూ) పొద్దున్నే టైమ్‌కి లేవడం అనే విషయంలోనే ఎప్పుడూ అమ్మతో గొడవ.

 మీరు రాస్తారని... బ్లాగ్ ఉంది కానీ అడ్రస్ చెప్పరని..!
 స్వాతి: ఏదో రాస్తాలెండి. కవితలూ అవీ. కానీ అవి క్లోజ్ ఫ్రెండ్స్ చదువుకోవడానికి మాత్రమే! డిఫరెంట్ ఇష్యూస్ మీద రాస్తూంటాను. అయితే అవేవో మరీ ఢిల్లీరేప్ అలాంటివి కాదు. పూర్తిగా పర్సనల్. నాకు సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా. నా బ్లాగ్ కూడా అంతే. పూర్తిగా పర్సనల్!

 ఎక్సర్‌సైజ్, జిమ్ లాంటివి..?
 స్వాతి: వర్కవుట్ అనేది నాకు డీస్ట్రెస్ ఏజెంట్! అయితే గోల్కొండ, అప్పల్రాజు సమయంలో మరీ ఎక్కువ చేయడం వల్ల బాగా సన్నగా అయిపోయాను. బాగా అనిపించలేదు. అందుకే ఎంత తినాలో అంత తిని, ఎంత ఎక్సర్‌సైజ్ చేయాలో అంత ఇంట్లోనే చేసుకుంటాను అని తీర్మానించుకున్నా. ఇప్పుడు జస్ట్ మోడరేట్‌గా చేస్తున్నాను.
                                                              *****************************   
  ప్రతి ఏడాది ఎగ్జిబిషన్‌కు వెళ్లడం, జెయింట్‌వీల్ ఎక్కడం, ఎర్రరంగులోని చికెన్‌ని తినడం.. ఇవన్నీ పిచ్చ ఇష్టం.  పబ్లిక్ గుర్తుపట్టి విష్ చేస్తుంటారు. అయితే ఫ్యామిలీస్ చాలా చక్కగా మాట్లాడతారు. కొందరేమో ‘ఏ క్కలర్స్’ అని గట్టిగా అనేసి వెళ్లిపోతారు. నాకు ‘కలర్స్ స్వాతి’ అంటే చిరాకు అనిపించడానికి అదీ ఒక కారణమేమో...  నాకు వినిపించేటట్టు కావాలనే అని, నన్ను చూడకుండా వెళ్లిపోయేవాళ్లని చూస్తే నాకు తిక్కరేగిపోతుంటుంది. నాక్కూడా ఒక ఫ్యాంటసీ ఉంది... రేయ్ అంటూ ఫైట్, ఏ ఢిష్‌కే అని చేయాలని! ‘రేయ్ తియ్‌రా బండి’ అంటే టయోటాలన్నీ, సుమోలన్నీ గాల్లోకి ఎగిరి...

 ఐదేళ్ల క్రితం మాకు వేగనార్ కారుండేది. శ్రీనగర్‌కాలనీలో రోడ్‌లో డ్రైవ్ చేస్తుంటే ఎవడో ట్రాలీ లాంటిదేసుకుని వచ్చి థప్‌మని గుద్దాడు. రిపేర్‌కి రూ.20వేలు ఖర్చయింది. అప్పటి నుంచి కార్ డ్రైవ్ చేయడం అంటే భయం! ‘బంగారు కోడిపెట్ట’ కోసం మారుతి డ్రైవ్ చేశాను. 3 కెమెరాలు పెట్టారు. ఎంత భయంగా చేశానో చెప్పలేను. ఇప్పటికీ కారులో కూర్చుంటే ఏదైనా కారు పక్కనుంచి స్పీడ్‌గా వచ్చేస్తుంటే కళ్లు మూసేసుకుంటా. అంత భయం డ్రైవింగ్ అంటే!

 ఫేస్‌బుక్‌లో ఎకౌంట్ నాలుగేళ్ల క్రితం క్లోజ్ చేశాను. ఇప్పుడు లేదు. ఇక ట్విట్టర్ వాడే దాకా బాయ్స్‌లో అంత పైత్యం ఉందనేది నాకు తెలీలేదు. ఇంత ఫస్ట్రేటెడ్‌గా ఉన్నారా మన జనరేషన్ అనుకున్నా. రండి నన్ను ఎటాక్ చేయండి అని చెప్పి వాళ్లకి నేను ఛాన్స్ ఇచ్చినట్టుంటుంది కదా...  అని ట్వీట్స్ మానేశా. అందులో ఎవరైనా ఏమైనా రాయచ్చు కదా. ‘ఎవరో నలుగురైదుగురు అంటే ట్విట్టర్ నుంచి వదిలేయడం ఏమిటీ అని’ కొందరన్నారు.  అయితే ప్రతిరోజూ రాయడానికి ఏం ఉంటుంది నాకు? షారూఖ్‌ఖాన్ అయితే దలైలామాను కలిశా అనో ఇంకోటో  రాసుకోవచ్చు. నేనేం రాయాలి? మాపక్కింటివాళ్లని కలిశా అనా? ప్రతిరోజూ ఇంట్రెస్టింగ్‌గా ఏమిరాయగలను?
                                                              *****************************  
 ఎవరితోనైనా ఒక్కసారి తేడా వస్తే రిలేషన్ కట్ చేసుకునే టైప్ కాదు నేను. ఒక్కటే పట్టుకుని వేలాడకూడదు. వాళ్లకి కూడా మారడానికి, ఎదగడానికి అవకాశం ఇవ్వాలి కదా!

 చారిటీ కోసం నా స్టేటస్ దానికి సరిపోదు. ఎవరికైనా  పనికొచ్చేది చేయడం అంత సులభం కాదు.

 నంది అవార్డ్ వచ్చాక చాలా మంది విచిత్రంగా రియాక్ట్ అయ్యారు. ‘‘నీకు అవార్డ్ వచ్చిందని తెలుసు కాని...’’ అంటూ. అవార్డ్ అనేది వ్యక్తుల మధ్య తప్పకుండా గ్యాప్ పెంచుతుంది. అవార్డ్స్ రావడమనేది నిజంగా ఒక లాటరీ టిక్కెట్. మీరు బాగా చేస్తే అవార్డ్ రాదు. తల రాత అంతే! నాకివన్నీ ఓవర్‌టైమ్ తెలిసింది. నాకు ఫిల్మ్‌ఫేర్ వచ్చిందనేది ఆ అవార్డ్‌నాకు వచ్చినప్పుడు సింక్ అవలేదు. మూడేళ్ల తర్వాత సింక్ అయింది! ఒక పర్టిక్యులర్ యాక్టర్‌కి వస్తుందని అనుకున్నా. అయితే రాలేదు. కాని రాకుండా వేరే ఎవరికో వచ్చింది. అప్పుడర్థమైంది ఇంత కష్టమా అని! దాని విలువ మూడేళ్ల తర్వాత తెలిసిందన్నమాట!

http://www.sakshi.com/news/family/exclusive-interview-with-colors-swathi-74276?pfrom=home-top-story
10:38 - By Swathi 0

0 comments:

WIDGET #1

Text Widget

Blogroll

Followers

Discrimination

ఈ బ్లాగులోని విషయాలు , సమాచారం మీకు ఉపయోగపడకలదు అని బావించి ఇంటర్నెట్ మరియు ఇతర వెబ్సైటు ల నుండి సేకరించడం జరిగింది.

Discussion

Powered by Blogger.
back to top