Feed Section

Search

Recent Readers

Powered by Blogger.

Wednesday 10 September 2014

OKA YOGI ATMA KATHA - BY YOGANANDA GARU

Read Online OKA YOGI ATMA KATHA BOOK BY PARAMAHAMSA YAOGANANADA GARU in Telugu.




OKA YOGI ATMA KATHA PART 1

OKA YOGI ATMA KATHA PART 2

OKA YOGI ATMA KATHA PART 3

17:35 - By Swathi 0

0 comments:

Yandamuri Veerendranath Novels List and Download PDF

AKARI PORATAM

Read Yandamuri Veerendranath's Akari Poratam Novel Online and Download it.

ABHILASHA

Read Yandamuri Veerendranath's Abhilasha Novel Online and Download it.

ANKITHAM

Read Yandamuri Veerendranath's Ankitham Novel Online and Download it.

ASTAVAKRA

Read Yandamuri Veerendranath's Astavakra Novel Online and Download it.

ATHADEAMESAINYAM

Read Yandamuri Veerendranath's Athadeamesainyam Novel Online and Download it.

CASANOVA

Read Yandamuri Veerendranath's Casanova Novel Online and Download it.

CHHEKATLO SURYUDU

Read Yandamuri Veerendranath's Chhekatlo Suryudu Novel Online and Download it.


Read Yandamuri Veerendranath's Dabbu to the power of dabbu Novel Online and Download it.

DYEYAM

Read Yandamuri Veerendranath's Dyeyam Novel Online and Download it.

IDLI VADA AKASAM

Read Yandamuri Veerendranath's Idli Vada Novel Online and Download it.

LADIES HOSTEL

Read Yandamuri Veerendranath's Ladies Hostel Novel Online and Download it.

MARO HIROSHIMA

Read Yandamuri Veerendranath's Maro Hiroshima Novel Online and Download it.

Meeru Manchi Ammai Kadhu

Read Yandamuri Veerendranath's Meeru Manchi Ammai Kadhu Novel Online and Download it.

Mind Power

Read Yandamuri Veerendranath's Mind Power Novel Online and Download it.

Nallanchu Tella Cheera

Read Yandamuri Veerendranath's Nallanchu Tella Cheera Novel Online and Download it.

Nisabdam  Neeku - Naku Madhya

Read Yandamuri Veerendranath's Nisabdam Neeku Naku Madhya Novel Online and Download it.


Okaradha Iddaru Krishnulu

Read Yandamuri Veerendranath's Nisabdam Neeku Naku Madhya Novel Online and Download it.


Parnasala

Read Yandamuri Veerendranath's Parnasala Novel Online and Download it.



























02:36 - By Swathi 0

0 comments:

Tuesday 9 September 2014

Asthalakshmi Stothram Download

18:46 - By Swathi 0

0 comments:

Tuesday 2 September 2014

Wonders of Ayurvedam

ఆయుర్వేదం... అద్భుత విషయాలు!


వైద్యుడిగా పరిణతి సాధించాలని అనుకునేవాడు ఏదో ఒక విభాగానికి మాత్రమే పరిమితం కాకూడదు. అప్పుడతడు పాక్షిక వైద్యుడవుతాడు. పాక్షిక వైద్యుడు చికిత్స చేయడానికి  పనికిరాడు. అందుకే నిష్పాక్షికంగా అతడు అన్ని విభాగాల్లోనూ నైపుణ్యం సాధించి పరిపూర్ణజ్ఞానాన్ని పొందాలంటుంది ఆయుర్వేదం. ఇదీ నాడీ ప్రవీణ,  డెరైక్టర్ ఆఫ్ మహర్షి ఆయుర్వేద, డాక్టర్ జె.ఆర్. రాజు ఉద్బోధించే విషయాలు. ఈరోజుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్లడం కంటే... ఆ తర్వాత వ్యాధి నిర్ధారణ కోసం వారు సూచించే పరీక్షలే రోగిని ఎక్కువగా భయపెడుతుంటాయి. కానీ వైద్యాచార్య డాక్టర్ రాజు ఇలాంటి రక్తపరీక్షలూ, మూత్రపరీక్షలూ, ఈసీజీ, సీటీ స్కాన్, ఎమ్మారై వంటి పరీక్షలను చేయించరు. కేవలం నాడిని చూడటం ద్వారానే వ్యాధినిర్ధారణ చేస్తారు. తద్వారా రోగుల ఖర్చులు ఆదా అవుతాయి. ఇక ఆయన ఎన్నెన్నో దేశాల్లో అల్లోపతి వైద్యులకూ ఆయుర్వేదం గొప్పదనాన్ని వివరించి, ఆ విధానంలో నయంకాని (క్యూర్ లేదనే) వ్యాధులకు ఆయుర్వేద విధానంలో నయం చేసే విధానాలను బోధిస్తుంటారు. ఆయుర్వేదాన్ని ఆచరిస్తూ వస్తున్న ఆయన మన రోజువారీ దినచర్యల్లో అత్యంత సులభంగానూ, సూక్ష్మంగానూ, పైసా ఖర్చులేకుండా ఆరోగ్యాన్ని పొందే అనేక విషయాలను విపులంగా వివరిస్తున్నారు.
దైనందిన జీవనశైలిలోనే ఆయుర్వేదం...

ఆయుర్వేద జ్ఞానం చాలా విస్తృతం. దానిని ఔపోసన పట్టడం కంటే అభ్యాసం చేయడం మేలని ఎంచారు మన పూర్వికులు. అందుకే ఆయుర్వేదాన్ని మన నిత్యజీవన శైలిగా మార్చారు. స్నానం, పానం, ఆహారం, విహారం... ఇలా ప్రతి అంశంలోనూ మనకు తెలియకుండానే మనం ఆయుర్వేదాన్ని ఆచరిస్తుంటాం. ఇంగ్లిష్ మందులు, ఇతర ఔషధాలకు కొన్ని దుష్ర్పభావాలు ఉంటాయి. వాటినే సైడ్ ఎఫెక్ట్స్ అని అందరూ వ్యవహరిస్తుంటారు. కానీ ఆయుర్వేదంలో ఉపయోగించే పదార్థాలన్నీ స్వాభావికాలు. ప్రకృతి సహజాలు. ఉదాహరణకు మన వంటగదిలో ఉపయోగించే వాము, జీలకర్ర, దాల్చినచెక్క వంటివన్నీ ఆయుర్వేదంలో ఔషధాలే. అలాక్కాకుండా వంటింటి దినుసులుగా ఉపయోగిస్తే అప్పుడవి రోజువారీగా ఉపయోగించే పదార్థాలే. అందుకే ఆయుర్వేదం వల్ల సైడ్‌ఎఫెక్ట్స్ ఉండవు. అన్నీ సైడ్ బెనిఫిట్సే. కాబట్టే ఆయుర్వేదం మన నిత్యజీవితంలో భాగం అయ్యేలా చూశారు మన పూర్వికులు, ఆచార్యులు. అందుకే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం పైసా ఖర్చులేకుండా పొందగలిగే  ఆరోగ్యాన్ని స్నానం నుంచి ప్రారంభిద్దాం.

రోజులో తొలి కార్యక్రమం...వ్యాయామం

వ్యాయామం అతిగా చేయకూడదు. నుదుట చెమట రావడం మొదలు కాగానే లేదా అధికశ్రమతో శ్వాస తీసుకోవడం మొదలుకాగానే వ్యాయామాన్ని ఆపేయాలి. ఇలా చేయడాన్నే శరీర అర్ధబలమంటారు.
   
 బాగా శరీర పరిశ్రమ (కఠిన వ్యాయామం) లేదా రన్నింగ్ లేదా వాకింగ్ చేసి వచ్చాక... వెంటనే నీరు తాగకూడదు. శరీరం, శ్వాస నెమ్మదించాక మాత్రమే నీరు తాగాలి.

వ్యాయామ, విహారాలకు అనువైనది ప్రాతఃకాలమే. ఆహారం తీసుకున్న తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యాయామం చేయకూడదు.

స్నానం...ప్రాధాన్యం..!

స్నానానంతరం మనకు కలిగే ఆహ్లాదం అంతా ఇంతా కాదు. స్నానం కేవలం శరీరాన్ని శుభ్రపరచడం మాత్రమే చేయదు. అనేక సమస్యలనుంచి సాంత్వన కలిగిస్తుందీ స్నానం. అయితే స్నానం ఆరోగ్యకరం కావాలంటే కొన్ని సూచనలు గుర్తుపెట్టుకోండి. అవి...
   
తలపై మరీ ఎక్కువ వేన్నీళ్లతో స్నానం వద్దు. స్టీమ్ బాత్, సౌనా బాత్ వంటివి ఆరోగ్యకరం కాదు. స్టీమ్‌బాత్, సౌనాబాత్‌లో తలకు ఆవిరి పెడతారు. అది చాలా ప్రమాదకరం.
   
 ఏదైనా తిన్నవెంటనే స్నానం చేయకూడదు. స్నానం తర్వాతే ఆహారం తీసుకోవాలి.
   
 కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు. రెండు, మూడు గంటల తర్వాతే స్నానం చేయండి.
   
 బలహీనంగా ఉన్నవాళ్లు, వృద్ధులు మరీ ఎక్కువ చన్నీళ్ల స్నానం కాని, మరీ ఎక్కువ వేణ్ణీళ్లతో స్నానంగాని వద్దు.

చన్నీళ్ల స్నానం ఆరోగ్యకరమనే అపోహ వద్దు. గోరువెచ్చని నీళ్లే మంచివి.
   
తప్పనిసరి పరిస్థితుల్లో చన్నీళ్లతో స్నానం చేస్తే... దానికి ముందర చన్నీళ్లు తాగవద్దు.
   
 చన్నీళ్ల స్నానంలో నీరు ఎంత చల్లటివైతే... స్నానం వ్యవధిని అంతగా తగ్గించడం మంచిది.
   
 గోరువెచ్చని నీళ్లతో స్నానం ముందర కాస్తంత వ్యాయామం మంచిది.
   
 ఏ నీళ్లతో (చన్నీళ్లు లేదా వేణ్ణీళ్లు) అయినా స్నానం తర్వాత తలనొప్పి, జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే అది మీ ఆరోగ్యానికి అంతగా సరిపడదని గుర్తుంచుకోండి.

నీరూ... ఆరోగ్యప్రదాయనే!

నీటిని మనం ఆహారంతో పాటు స్వీకరిస్తుంటాం.  నీరూ ఒక ఓషధే. సరైన పాళ్లలో సరైన విధంగా తీసుకుంటే  దాంతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. ఉదాహరణకు... స్థూలకాయం ఉన్నవారు తమ బరువు తగ్గించుకోడానికి ఆచరించదగిన నీటి చికిత్స (వాటర్ థెరపీ) ఏమిటంటే... ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో మూడో వంతు ఆవిరయ్యేలా చేసి, మిగతా నాల్గో వంతు భాగాన్ని చల్లార్చి తాగితే ఊబకాయం తగ్గుతుంది. అలాగే లావెక్కాలని భావించే అతిసన్నటి శరీరం ఉన్నవారు... ఒక పాత్రలో నీటిని తీసుకుని కేవలం నాలుగోవంతు మాత్రమే ఆవిరయ్యేలా చేసి, మిగతా నీటిని చల్లార్చి తాగితే క్రమంగా ఒళ్లు చేస్తారు. ఇలా ఒకే నీరు... దాన్ని ఉపయోగించే అతి సాధారణ, అతి సులభ పద్ధతుల్లో రెండు రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది.
   
ప్రతి అరగంటకొకసారి వేడి నీళ్లను టీ తాగినట్లుగా రోజూ సిప్ చేస్తూ తాగుతుంటే దీర్ఘకాలంలో చాలా వ్యాధులు నయమవుతాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి... కాచిన పాలనూ, కాచిన నీళ్లను మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు.
   
అన్నపానాదులను సంస్కరించాకే ఉపయోగించాలి. ఇలాంటి సంస్కరణకు ప్రధానంగా ఉపయోగపడేది నీరే. నీళ్లు లేకుండా ఘన పదార్థాల సంస్కారం వీలు కాదు.
   
చాలా రోగాలకు ముఖ్యకారణం కూడా నీరే. తమ ఆవాసంగా నీటిలో ఉండే జంతుజాలం ప్రసవించే సమయంలో వెలువడే విషపదార్థాలు నీళ్లలో కరిగి రోగకారకాలు కావచ్చు. అందుకే నీటి స్వచ్ఛపరిచాకే ఉపయోగించాలి. నీటిని స్వచ్ఛపరచడం అంటే... తొలుత మంచి పరిశుభ్రమైన నిర్మల వస్త్రంతో వడగట్టడం, ఆ తర్వాత నీటిని బాగా కాచి చల్లార్చి తాగడం. ఇలా నీటిని స్వచ్ఛపరిచాకే తాగాలి.
   
భోజనానికి ముందు నీరు తాగితే అది మందాగ్ని రూపంలో శరీరాన్ని కృశింపజేస్తుంది. మధ్యమధ్యన నీరు తాగకుండా భోజనం తర్వాతే నీరు తాగితే అది శరీర స్థౌల్యం (ఊబకాయం) కలిగిస్తుంది. ఛాతీ, కంఠం, శిరస్సుల్లో కఫాన్ని వృద్ధి చేస్తుంది. అందుకే భోజనం మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉంటే మధ్యమ స్థితి (అంటే కృశ - స్థౌల్య... ఈ రెంటినీ కలిగించేదిగా) సంభవిస్తుంది. ఇలా మధ్య మధ్యన నీరుతాగడం రస, రక్తాధి ధాతువులను సమస్థితిలో ఉంచుతుంది. ఇలా తాగిన నీరు సులభంగా, సుఖంగా జీర్ణమవుతుంది.
   
చల్లని నీళ్లు జీర్ణం కవడానికి 45 నిమిషాలు, వేడి నీరు జీర్ణం కావడానికి 20 నిమిషాల సమయం పడుతుంది.

దురలవాట్లనుదూరం చేసుకోండిలా...

భోజనం గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. భోజనం ‘ఆత్మ’కు ఇంపుగా ఉండాలి. మంచి కవిత్వం రాయడం ఎప్పుడు సాధ్యమన్న విషయాన్ని అల్లసాని పెద్దన సరదాగా చెప్పినా ఆ మాటల్లోని వాస్తవం గమనించారా? ‘ఆత్మకింపైన భోజనం...’ తినాలంటారాయన. అలాగే అన్నం తిన్న తర్వాత కలిగే తృప్తిని వర్ణించడానికి చెప్పే మాట... ‘ఆత్మారాముడు శాంతించాడు’ అనే. అంటే ఇక్కడ తాను అనే అర్థంలో ఆత్మ అనే మాటను వాడినా... విస్తృతార్థంలోనూ ఆత్మకింపైన, ఆత్మకు మేలు చేకూర్చే భోజనమే తీసుకోవాలన్నది వాస్తవం. ఇందులో భాగంగా శరీరానికీ, నాలుకకూ రుచిగా ఉన్నప్పటికీ అది ఆరోగ్యానికి అంతగా మేలు చేసేది కానప్పుడు దాన్ని వర్జించాలి. ఇలా వర్జించే సమయంలోనూ దాన్ని అకస్మాత్తుగా వర్జించకూడదు. దురలవాటునూ, దుర్వ్యసనాన్ని దూరం చేసుకోనే సమయంలో దాని పరిమాణాన్ని రోజూ శోడశ పాద భాగాన్ని విడవాలి. అంటే ప్రతిరోజూ ఒకటిలో పదహారోవంతును తగ్గించుకుంటూ... ఇలా క్రమంగా మేలు చేయని ఆహారాన్ని వర్జించాలన్నమాట.
   
భోజనం తర్వాత మొక్కజొన్న కండె, మొక్కజొన్న అటుకులు తినకూడదు.

వండటానికి పనికొచ్చే కూరలను వండే తినండి...

ఇటీవల చాలా మంది పచ్చి కూరలు తినడం వల్లనే ఆరోగ్యం ఇనుమడిస్తుందంటూ చెబుతుంటారు. ఇది కేవలం పాక్షిక సత్యం మాత్రమే. వండి తినడం (పచనం చేయడం) నాగరక పరిణామక్రమంలో వచ్చిన అభివృద్ధి. అందువల్ల దాన్ని అభివృద్ధి సూచకంగానే పరిగణించాలి. క్యారెట్, బీట్‌రూట్, ఉల్లి, కీర,  చిన్నపాటి అల్లం తురుము, ధనియాలు, పుదీన లాంటి వాటిని పచ్చిగా తిన్నా పర్వాలేదు. ఎందుకంటే అవి అందుకు ఉపయుక్తంగా ఉంటాయి కాబట్టి. కానీ సొర, బీర, కాకర వంటి కూరగాయలను వండి మాత్రమే తినండి. వండటానికి మాత్రమే వాటిని ఉపయుక్తంగా తయారు చేసింది ప్రకృతి. ఉదాహరణకు కూరగాయలుగా మనం వాడేవాటిలో కాకరనే తీసుకుందాం. దానికి చికిత్సాపరమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్నది వాస్తవం. దాన్ని తింటే ఆరోగ్యానికి మంచిది, డయాబెటిస్ లాంటి దీర్ఘవ్యాధులను తగ్గిస్తుందన్నది కూడా పరమ సత్యం. అయితే అలాగని దాన్ని పచ్చిగా తినడం చాలా హానికరం. అందులో ఔషధగుణాలతో పాటు కొన్ని ఆల్కలాయిడ్స్ కూడా ఉంటాయి. అవి మోతాదుకు మించినప్పుడు శరీరానికి హాని చేస్తాయి. కాబట్టి దాన్ని పచ్చిగా తినడమో లేదా అదేపనిగా రోజూ కాకర రసం తీసుకుని తాగడమో చేస్తే దీర్ఘకాలంలో దాని దుష్పరిణామాలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే కూరగాయలను, ఆకుకూరలను వండే తినండి. సలాడ్స్‌గా తీసుకోదగ్గ  క్యారెట్, బీట్‌రూట్, ఉల్లి, కీర,  చిన్నపాటి అల్లం వంటివాటికి మిగతా కూరలను జత చేయకండి.

పొన్నగంటికూర కళ్లకు చాలా మంచిది.

భోజనం తీసుకోండిలా...

అన్నం పరబ్రహ్మస్వరూపం. అందుకే దాన్ని గౌరవిస్తూ వీలైతే తూర్పునకు ముఖం చేసి తినండి. ఆహారాన్ని దూషిస్తూ, అశాంతితో తినకూడదు.

భోజనంలో మొదట తీపి తీసుకోండి. ఆ తర్వాత భోజనంలో హెవీఫుడ్‌గా మీరు భావించేదాన్ని తినాలి. అలా క్రమంగా భోజనం సాగుతున్న కొద్దీ హెవీ నుంచి లైట్‌కు వస్తూ ఉండాలి.

మొదట హెవీ అనే క్రమంలో నెయ్యిని తీసుకోండి. ఎందుకంటే నేతికి రెండు రకాల గుణాలుంటాయి. అది అగ్నిని ప్రజ్వలిస్తుంది. (అగ్నికి ఆజ్యం తోడైనట్లు అనేది అందుకే). అంటే మొదట అగ్నిగుణాన్ని కలిగించడం వల్ల ఆహారం జీర్ణం అయ్యేందుకు దోహదపడుతుంది. అగ్నిగుణం కలిగిన ఆ నెయ్యే... కారాలతో నాలుక భగభగలాడేప్పుడూ... ఆహారంలో కారం మంట అధికంగా ఉన్నప్పుడూ దాన్ని శాంతింపజేయడానికి తోడ్పడుతుంది. అందుకే అన్నంలో నేతికి తొలి వరస. ఈ క్రమంలో అన్నింటికన్నా తేలికైన మజ్జిగది తుది వరస.
   
అన్నం తినేప్పుడు కొందరు మంచినీళ్లు అస్సలు తాగరు. కానీ మధ్యలో నీళ్లు తాగడమే మంచిది. లేకపోతే మనం తీసుకునే అన్నంలోని ఘనపదార్థాలు మధ్యలో చిక్కుకుపోయి (స్తంభించి), జీర్ణక్రియకు అవరోధం కలిగిస్తాయి. అందుకే గొంతులో/ కడుపులో ఏదైనా అడ్డంపడ్డట్లు ఉన్నప్పుడు నీళ్లు తాగడమే మంచిది.
   
అన్నాన్ని కళ్లతో చూడగానే నోట్లో నీళ్లూరతాయి. జ్ఞానేంద్రియాలలో కలిగే స్పందనల్లో ఇదొకటి. మంచి శ్రేష్ఠమైన ఆహారం రుచులను వినగానే వాటిని రుచిచూడాలనిపిస్తుంది. ఇది మరో జ్ఞానేంద్రియం చేసే పని. ఇక ఎలాగూ నాల్క రుచిచూస్తుంది. అలాగే అన్నాన్ని స్పర్శిస్తూ తినడం వల్ల కూడా కొన్ని స్పందనలు కలుగుతాయి. అందుకే అన్నాన్ని స్పూన్లూ, ఫోర్కులూ, నైఫ్‌ల వంటి ఉపకరణాలతో తినే బదులు చేతి ఐదువేళ్లతో స్పర్శిస్తూ తినండి. ఈ స్పర్శజ్ఞానమూ మెదడులో కొన్ని స్పందనలు కలిగించి అన్నం పట్ల హితవును కలిగిస్తుంది. అయితే ఈ జ్ఞానం కలగడానికి మిగతా జ్ఞానేంద్రియాలతో పోలిస్తే కాస్త ఎక్కువ వ్యవధి పడుతుంది.
   
భోజనం చివరన చల్ల (మజ్జిగ) వాడటం చాలా మంచిది. దీనికి కొద్దిగా శుంఠి, సైంధవ లవణం కలుపుకుని తింటే మరింత శ్రేష్ఠం.
   
ఇక అన్నం తిన్న తర్వాత చేయి కడిగి... ఆ చేయి తుడుచుకున్న తర్వాత ఉండే కాస్తంత తడితో కళ్లుమూసుకుని, కన్రెప్పలను తుడుచుకుంటే కొన్ని దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఇది కళ్లకు చాలా మంచిది.

భోజనం చేయండిలా...

భోజనం చేసే సమయంలో మీ కడుపును నాలుగు భాగాలుగా ఊహించుకోండి. అందులోని రెండు భాగాలను ఘనపదార్థాలకూ, ఒక భాగం ద్రవపదార్థాలకూ, మిగతా మరో భాగాన్ని వాయువుకు విడవండి. ఈ నిష్పత్తిలో భోజనం చేయడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
   
కేవలం పెరుగును మాత్రమే తినకూడదు. పెరుగు తినదలచినవారు అందులో కొద్దిగా తేనెనుగాని లేదా ఉసిరిక లేదా ముద్గయూషం (పెసరకట్టు) కలుపుకుని లేదా చిలికి తినాలి. పెరుగును యథాతథంగా రాత్రిపూట తినడం నిషిద్ధం.
   
పెరుగు తన గురుగుణం వల్ల శోఫ (వాపు)ను, కఫాన్ని పెంచుతుంది. అదే మజ్జిగ ఆ ప్రభావాన్ని తగ్గిస్తుంది.

ఫలాలు...ఫలితాలు

కొన్ని పండ్లు భోజనానికి ముందే తినడం మంచిది. మామిడి, కొబ్బరి, అరటి వంటి పండ్లను భోజనానికి ముందే తినాలి. (అరటి శ్రేష్టమైన పండే అయినప్పటికీ దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇది బరువైన పండు, బరువైన ఆహారాలు ముందే తినాలి కాబట్టి దీన్ని భోజనానికి ముందే తీసుకోవడం మంచిది. లేదా మధ్యాహ్నభోజనం అయ్యాక... చాలాసేపటి తర్వాత ఈవినింగ్ శ్నాక్స్ టైమ్‌లో (ఉజ్జాయింపుగా సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో) తినాలి.
   
బొప్పాయి పండును ఖాళీ కడుపుతోనే తినాలి. అప్పుడది కడుపులోని మలినాలను తీసేస్తుంది. కడుపునిండా భోజనం చేశాక బొప్పాయి తినకూడదు.
   
పండ్లలో లీఛీ పండు అంత మంచిది కాదు.

ఆహారం భాగమైన పండ్ల విషయంలోనూ దేశ, కాలాత్మాది విజ్ఞానం ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని ప్రాంతాల్లో పండేవి అక్కడి వారికి తేలిగ్గా జీర్ణమవుతాయి. అవి వారికి మంచిది. ఇక కొన్ని పండ్లూ, ఆహారాలు కొన్ని ప్రాంతాలవారికి పరాయివి. దేశకాలాలను బట్టి మనకు ఏది అనువైనదో వాటినే తీసుకోవాలి.

రోజులో చివరి కార్యకలాపం నిద్ర గురించి...

నియమానుసారంగా నిద్రపోవాలి. తద్వారా ఆరోగ్యం, పుష్టి, బలం కలుగుతాయి. అకాల నిద్ర లేదా అతినిద్ర లేదా బొత్తిగా నిద్రమానినా అది ఆయువును హరించివేస్తుంది. నిద్ర వేళలు / నిద్ర అలవాట్లు సరిగా లేకపోతే అది రోగాన్ని, కృశింపజేసే తత్వాన్ని, బలహీనతను, అజ్ఞానాన్ని, మరణాన్ని కలగజేస్తుంది.

నిద్రలేమి అనేది రోగాన్ని కలగజేస్తుంది. జ్ఞాపకశక్తిని హరిస్తుంది. సరైన నిద్ర లేకుండటం అన్నది దీర్ఘకాలంలో మనిషిని క్రమంగా కుంగదీస్తుంది.

నిద్ర వేళలన్నవి వారి వారి సౌకర్యాన్ని బట్టి మరీ ఎక్కువగానూ, మరీ తక్కువగానూ ఉండకుండా చూసుకోవాలి. అతినిద్ర, నిద్రలేమి ఈ రెండూ ప్రమాదకరమే అని గ్రహించండి.

అవీ ఇవీ...

సత్తుపిండి (సున్ని ఉండలను) రాత్రి తినకూడదు. సత్తుపిండిని నీళ్లతో కలిపి తినకూడదు.
   
నువ్వుల నూనెకు సత్వరం వ్యాపించే గుణం ఉంది. అందుకే అభ్యంగం (మసాజ్)లో దీన్ని వాడటం వల్ల అనేక రోగాలు తగ్గడానికి దోహదం చేస్తుంది. బక్కచిక్కిన వాళ్లు దీనితో మసాజ్ చేసుకుంటే బరువు పెరుగుతారు. అదే స్థూలకాయులైతే బరువు తగ్గుతారు.
   
 బియ్యం లాంటి ఆహారధాన్యాలు ఒక సంవత్సరం కిందటివి అంటే పాతవి శ్రేష్ఠం. కొత్తపంటలు ప్రమేహానికి (డయాబెటిస్)కు కారకాలు.
   
 ధాన్యాలు, ఘృతం (నెయ్యి), తేనె, బెల్లం, పిప్పలి ఇవి తప్ప... ఇతర ద్రవ్యాలు ఒక ఏడాదిపైబడినవే శ్రేష్ఠం.
   
 పెసలు మంచి ప్రోటీన్. మినుములు మాంసంతో సమానమైన శాకాహారం.
   
 పుట్టగొడుగులు మిగుల దోషకారి. కాలేయంలోని విషాలను పెంచుతాయి.
   
 లేతముల్లంగి శ్రేష్ఠం. ముదురు ముల్లంగి రోగకారకం. లేత వంకాయ శ్రేష్ఠం, ముదురు వంకాయ రోగకారకం. ముదురు బూడిద గుమ్మడికాయ శ్రేష్ఠం. లేత బూడిద గుమ్మడికాయ రోగకారకం.
   
 బియ్యం తేలికైనవి. కానీ వాటితోనే రూపొందే అటుకులు ఆలస్యంగా జీర్ణమవుతాయి.

పైన పేర్కొన్నవన్నీ ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి, రాత్రి నిద్రించే వరకు ఒక క్రమపద్ధతిలో చేయడానికి వీలుగా ఆయుర్వేదం ఈ అలవాట్లన్నింటినీ మనందరి దైనందిన జీవితంలో ప్రవేశపెట్టింది. కొందరు ఏమీ తెలియకుండానే వీటన్నింటినీ ఆచరిస్తుండవచ్చు. మరికొందరు తెలియక కొన్నింటిని ఆచరించక, రుగ్మతలకు లోనయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయుర్వేద సదాచారాలను అర్థం చేసుకుని ఆరోగ్యంగా జీవించండి.

 - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి

 ‘తేనె’లొలికే ఆరోగ్య సూచనలు

ఉదయం వేళ ఆరోగ్యదాయని అంటూ  చాలామంది తేనెను స్వీకరిస్తుంటారు. వేన్నీళ్లలో కాస్తంత తేనెనూ, నిమ్మరసాన్ని వేసి తాగుతారు. ఇలా తీసుకోవడం చాలా ప్రమాదకరం. తేనెను ఆరోగ్యప్రదాయనిగా స్వీకరించదలచినవారు వేన్నీళ్లలో దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వేయకూడదు. చన్నీళ్లతోనే స్వీకరించాలి. మీ శరీరం ఎంత తేనెను స్వీకరించడానికి సిద్ధంగా ఉందో ఆ మోతాదునే ఎప్పుడూ కొనసాగించాలి. అంతేగానీ తేనె మధురంగా ఉంటుందని అతిగా తీసుకోవడం సరికాదు.

 తేనె, నెయ్యి... ఈ రెండింటినీ సమానపాళ్లలో కలిసి తీసుకోకూడదు. ఏదో ఒకదాని  మోతాదు ఎక్కువో, తక్కువో ఉండాలి. ఆ రెండూ సమానంగా ఉంటే అది విషంతో సమానం.

 తేనె ‘యోగవాహి’. అంటే తేనెను దేనితోనైనా కలిపి తీసుకుంటే, అది చేరిన పదార్థం గుణాలను అధికం చేస్తుంది. కానీ తన స్వీయ గుణాల వల్ల ఉద్దేశిత కార్యానికి విరుద్ధంగా పనిచేయదు. ఉదాహరణకు కరక్కాయతో కలిసిన తేనె విరేచనాన్ని కలిగిస్తుంది. కానీ తన స్వభావమైన విరేచన కార్యాన్ని ఆపదు.

పాల విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే...

చాలామంది ఉదయం వేళ పాలు, అరటిపండు తీసుకుంటుంటారు. పాలతోగాని, పెరుగుతోగాని, పాలపొడితోగాని అరటిపండు తీసుకోవడం సరికాదు. అది స్లోపాయిజన్ వంటిది. చాలామంది భోజనం అనంతరం అరటిపండును తీసుకుంటారు. ఇది కూడా సరికాదు. అరటిపండును తినాలనుకునేవారు భోజనానికి ముందే తీసుకోవాలి. లేదా మధ్యాహ్న భోజనం తర్వాత సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో కడుపు కాస్త ఖాళీ అయ్యాక తీసుకోవడం మంచిది. రోజూ పాలు తాగేవారు దానితో తీపి పదార్థాలు తప్ప మరే రుచినీ కలపకూడదు. కాబట్టి టీ, కాఫీలు తాగేవారు కేవలం వాటిని కషాయంగా (పాలు కలపకుండా) తాగడమే ఆరోగ్యానికి మంచిది. ఇక ముఖ్యంగా పాలతో ఉప్పు కలపడం ఆరోగ్యానికి అనర్థం. అందుకే పాలతో కలిపి సాల్ట్ బిస్కెట్లు తీసుకోవడం మంచిదికాదని గుర్తుంచుకోండి.
   
 కొందరు కొన్ని రకాల కూరల్లో పాలు కలిపి వండుతుంటారు. పాలలో ఉప్పు కలిపి వేడిచేయడం ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి... ఇలా చేయడం దీర్ఘకాలంలో హానికరం.  పాలు, పనసపండు కలిపి తినకూడదు.  పాలు, చేపలు కలిపి తినకూడదు. చేపలు తిన్న తర్వాత మజ్జిగ గాని, పెరుగుగాని తింటే దీర్ఘకాలంలో ఆరోగ్యభంగం అయ్యే అవకాశం ఉంది.
   
 పెరుగును ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి చేయకూడదు.
Educational Purpose.
Article on Sakshi.
http://www.sakshi.com/news/family/ayurveda-marvelous-things-162900
02:23 - By Swathi 0

0 comments:

midi midi jananm


02:15 - By Swathi 0

0 comments:

Monday 1 September 2014

Bapu Gari Interview

రమణగారు లేని జీవితం కష్టంగా ఉందండీ!

బాపుగారి చివరి ఇంటర్వ్యు

 సరిగ్గా 200 రోజుల క్రితం... ఉదయం పదకొండు గంటల వేళప్పుడు -
 చెన్నైలో బాపుగారింట్లో... ఆయన ఇంటర్వ్యూకోసం
 దర్శకుడు వీఎన్ ఆదిత్య, నేను (సినిమా డెస్క్‌హెడ్ పులగం చిన్నారాయణ), ఫొటోగ్రాఫర్ శివ చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
  ఈలోగా ఒక చేదువార్త... బాపు గారికి నీరసంగా ఉందట.
 ఇప్పుడేం మాట్లాడరట.. ముగ్గురం నీరసపడిపోయాం.
 ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి.
 కనీసం ఆయనను కలిసి అయినా వెళదామని
 అలానే కూర్చుండిపోయాం..
 మా అదృష్టం బాగుంది.  బాపు గారు కరిగిపోయారు.
 లోపలకు రమ్మన్నారు. చాలా నీరసంగా కనబడ్డారాయన.
 మాటలు మొదలయ్యాక... చాలా హుషారు ఆయనలో.
 చిన్న పిల్లాడై పోయారు.
 చిత్రాలు... చిత్ర పటాలు... చిత్రాతిచిత్రమైన సంఘటనలు...
 గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌లు... మనసులో తగిలించుకున్న
 జ్ఞాపకాల చిత్తరువులు... పలు రకాల పుస్తకాలు.. బోలెడన్ని గ్రామ్‌ఫోన్
  రికార్డులు... ఆయన బొమ్మలేసే చోటు.. రంగులేసే కుంచె...
 ఆ పక్కనే ఆయనకు కావాల్సిన స్వరాలందించే పాతకాలపు టేప్‌రికార్డర్...
 బాపు గారితో అలా... అలా... లీనమైపోయాం.
 రెండున్నర గంటలు... బాపు గారితో గడపడమంటే,
 మా మనసు ముంగిట్లో ముత్యాలముగ్గు వేసుకున్నంత ఆనందం.
 ఈ ఇంటర్వ్యూ మా జీవితంలో గ్రేటెస్ట్ మెమొరీ. కానీ...
 అదే ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ అవుతుందని అనుకోలేదు. మనసు నిండా విషాద మేఘాలు
 కమ్ముకున్న ఈ వేళ... ఒక్కసారి ఆయన జ్ఞాపకాలలోకి... మాటలలోకి...

 మీకు ఈ చిత్రకళ ఎలా అబ్బింది?
 బాపు: మా నాన్నగారు కూడా బొమ్మలు వేసేవారు. ఆయన అడ్వకేట్ అయినా హాబీగా బొమ్మలు వేసేవారు. అయితే ఇది కూడూ గుడ్డా పెట్టేది కాదని ఆయన అభిప్రాయం. నిజంగానే ఆ రోజుల్లో ఆర్టిస్టుగా బతకడం కష్టం. అందుకే నన్ను ‘లా’ చదివించారు.
   
 లా పూర్తయ్యాక, ఎప్పుడైనా కోర్టులో వాదించారా?
 అస్సల్లేదు. అప్పుడప్పుడు కోర్టుకి వెళ్లా. బీఎల్ డిగ్రీ రావడానికి ఎన్‌రోల్ కావాలి కదా. స్నేహితుల దగ్గర నల్లకోటు అరువు తీసుకుని వెళ్లాను.
   
 ఇంతకూ మీరు వెళ్లింది ఏ కోర్టు?
 నేను పుట్టి పెరిగిందంతా చెన్నై కదా. అక్కడ కోర్టుకే వెళ్లా. మా నాన్నగారు కూడా అక్కడే అడ్వకేట్‌గా పనిచేశారు.
   
 తమిళంలో ఓ ఫేమస్ ఆర్టిస్ట్‌కు మీరు ఏకలవ్య శిష్యుడట?
 ఆయన పేరు గోపులుగారు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు నాకు ఇష్టమైన ఆర్టిస్టులు అందరి దగ్గరికీ వెళ్తుండేవాణ్ణి. శని, ఆదివారాలు అదే పని నాకు. గోపులుగారింటికి ఆదివారాలు వెళ్లి, ఆయన బొమ్మలు వేస్తుంటే చూసేవాణ్ణి. నేనంటే చాలా ప్రేమ ఆయనకు. అప్పట్లో ఆయన ‘ఆనంద వికటన్’ మేగజైన్‌లో పనిచేసేవారు.
   
 మీరు బొమ్మలు గీసే పద్ధతి ఎలా ఉంటుంది?
 (వెంటనే ఆయన తన గదిలోకి తీసుకెళ్లి తను కూర్చుని బొమ్మలు గీసే ప్లేస్ చూపించారు). ఇక్కడే నేల మీద బాసింపట్టు వేసుకుని బొమ్మలు వేస్తుంటాను. మొదట్నుంచీ ఇదే అలవాటు. టేబుల్, కుర్చీ వాడను.
   
 ఏ ఆర్ట్‌కైనా మూడ్ ప్రధానం కదా. మరి మీకు ఏ టైమ్‌లో మూడ్ ఉంటుంది.
 నాకు మ్యూజిక్ ఉంటే చాలు. మూడ్‌తో పనిలేదు. ఏ టైమ్ అయినా, అర్ధరాత్రయినా సరే మ్యూజిక్ వింటూ బొమ్మలేసుకునే పని చేసేవాణ్ణి. ఇలా బొమ్మల మధ్యనే పడుకుని నిద్రపోయిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు ఓపిక లేదు. కూర్చుంటే లేవలేను.
   
 మీ రూమ్‌లో హిందీ మ్యూజిక్ డెరైక్టర్ సి. రామచంద్ర ఫొటో పెట్టుకున్నారు..?
 చాలా మంచి మ్యూజిక్ డెరైక్టరాయన. ‘అనార్కలి’ చేయడానికి ఆయన మద్రాసు వచ్చినప్పుడు కలిశాను. నా క్లోజ్‌ఫ్రెండ్ వి.ఎ.కె. రంగారావుగారు ఆయనకు వీరాభిమాని. సి. రామచంద్రగారి పాటల వల్ల నాకు ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. నాకు నలుగురితో కలిసి మాట్లాడటమంటే భయం. జలగండంలా నాకు ‘జన’గండం ఉన్నట్టుంది. రామచంద్ర పాట అంటే ఇష్టమని చెప్పగానే, అయిదు నిమిషాల్లో నాకు ఫ్రెండ్స్ అయిన వాళ్లు చాలామంది ఉన్నారు.
   
 మీరు వినేది గ్రామ్‌ఫోన్ రికార్డులా? ఆడియో క్యాసెట్లా?
 మొదట్లో గ్రామ్‌ఫోన్ రికార్డులే వినేవాణ్ణి. తర్వాత క్యాసెట్లు. ఇప్పుడు సీడీలు.
   
 మీ దగ్గర బ్రహ్మాండమైన మ్యూజిక్ కలెక్షన్ ఉందట?
 మెహదీహాసన్, బడే గులాం అలీఖాన్‌ల మ్యూజిక్ కలెక్షన్ మొత్తం ఉంది. వాళ్ల గజల్స్ అంటే నాకు ప్రాణం. గజల్స్ అనే కన్నా, వాళ్ల వాయిస్సే నాకిష్టం. ఎన్నిసార్లు విన్నా తనివి తీరని వాయిస్సులు వాళ్లవి. నాకు ఉర్దూ పెద్దగా రాదు. అయినా వారి వాయిస్‌ల వల్ల ఆ పాటలు బాగా ఎంజాయ్ చేశాను. 1978లో మెహదీహాసన్‌ని కలిశాను. ఓ బొమ్మవేసి ఇచ్చి సంతకం పెట్టమన్నాను. ‘‘హార్మోనియం పెట్టె... సగం బొమ్మే గీశావ్. మొత్తం గీసి తీసుకురా. అప్పుడు పెడతాను’’ అన్నారు. పెద్దవాళ్లకు వాళ్ల కళంటే అంత అభిమానం. బడే గులాం అలీఖాన్‌ను కలవలేకపోయాను. ఆయన కచ్చేరీలకు నన్ను పీబీ శ్రీనివాస్ తీసుకు వెళ్లేవారు.
   
 సినిమాలు బాగా చూస్తారా?
 రెగ్యులర్‌గా చూస్తా. అయితే అన్నీ వీడియోల్లోనే. నేను సినిమా బఫ్‌ని. రోజుకి పది దాకా వీడియోలు చూడగలను. వీడియోలు లేని రోజుల్లో మద్రాసులో మూడు రిలీజ్‌లుండేవి. మూడు పూట్లా మూడు రిలీజ్‌లు చూసేసేవాణ్ణి. సినిమా సినిమాకీ మధ్య ఒక టీ తాగి, బిస్కెట్లు తినేవాళ్లం.
   
 సినిమాలు తీయడానికి మీకు ఇన్‌స్పిరేషన్..?
 చిన్నప్పట్నుంచీ సినిమాలంటే చాలా ఇష్టం. మద్రాసులో హాలీవుడ్ సినిమాలన్నీ విడుదలయ్యేవి. అన్నిటికీ నేలక్లాసుకి వెళ్లిపోయేవాళ్లం.
   
 మీరు మౌత్ ఆర్గాన్ బాగా వాయించేవారట?
 కాలేజీ రోజుల్లో బాగా వాయించేవాణ్ణి.
   
 ‘మూగమనసులు’ పోస్టర్ మీరే డిజైన్ చేశారు కదా?
 అవును. రమణగారు ఆ సినిమాకి వర్క్ చేశారు కదా. సినిమాలో ఉన్నదాన్నే ఎలివేట్ చేస్తూ పడవ, పంగలి కర్ర, ముద్దబంతి పువ్వు ఆర్ట్‌గా వేశాను.
   
 మీ తొలి సినిమా ‘సాక్షి’కి మీరు పబ్లిసిటీ డిజైన్ చేసుకోకుండా ఈశ్వర్‌తో చేయించారెందుకని?
 ఈశ్వర్ పోస్టర్స్ ఇష్టపడి ‘సాక్షి’కి తనతో వేయించాను.

 ‘బంగారు పిచిక’లో యద్దనపూడి సులోచనారాణిగారిని కథానాయికగా తీసుకోవాలనుకున్నారట..?
 హీరోయిన్‌గా కాదు. ఆ సినిమాలో ఓ చోట హీరోకి గొప్పింటి సంబంధాలు తీసుకు వస్తుంది తల్లి. అక్కడ ఓ పెళ్లికూతురి వేషం యద్దనపూడి గారితో చేయించాలనుకున్నాం. ఆవిడ కూడా ఒప్పుకున్నారు. కానీ చేయించడం కుదర్లేదు.
   
 మీ ప్రతి సినిమాకూ స్టోరీబోర్డ్ వేసుకుంటారు. ఆ ఆలోచన ఎందుకొచ్చింది?
 నాకు బొమ్మలేయడం వచ్చు కాబట్టి, కన్వీనియంట్‌గా ఉంటుందని స్టోరీ బోర్డ్ వేసుకుంటుంటాను. హాలీవుడ్‌లో దాదాపుగా అందరూ స్టోరీబోర్డ్ ఫాలో అవుతుంటారు. హైదరాబాద్‌లో కూడా స్టోరీబోర్డ్ వేసే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. అది ప్యూర్లీ పర్సనల్. బయటివాళ్లకు అర్థం కావు. ఆర్టిస్టులు కూడా చూద్దామని తీసుకుని అర్థంకాక ఇచ్చేసేవారు.
   
 మీ తొలి సినిమా ‘సాక్షి’ నుంచి స్టోరీబోర్డ్ ఫాలో అయ్యారా?
 అవును. నేను హోమ్‌వర్క్ ఎక్కువ చేసేవాణ్ణి.
   
 మీ స్టోరీబోర్డ్ ఫాలో అయితే ఎవరైనా ఫొటోగ్రఫీ చేసేయొచ్చునంటారు. లెన్స్ రేంజ్‌లు కూడా డీటెల్డ్‌గా రాస్తారట?
 అబ్బే అదేం లేదండి. ఎవరి పని వాళ్లదే.
   
 మీ సినిమాలకు గొప్ప గొప్ప బాలీవుడ్ కెమెరామేన్లు పనిచేశారు కదా!
 బాబా ఆజ్మీ, ఇషాన్ ఆర్యలాంటి వాళ్లు పనిచేశారు.
   
 వాళ్లతో మీకెలా పరిచయం?
 వాళ్ల సినిమాలు చూశాను. హిందీ సినిమా ‘గరమ్ హవా’కు ఇషాన్ ఆర్య వర్క్ చూసి, ఆయన ఎక్కడుంటారో కనుక్కుని మాట్లాడాను. ‘ముత్యాల ముగ్గు’ ఆయనకు తొలి తెలుగు సినిమా. దానికి ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది. స్నేహం, గోరంత దీపం, తూర్పు వెళ్లే రైలు సినిమాలకు నాతో పనిచేశారు. ఆయన అసిస్టెంటే బాబా ఆజ్మీ. నటి షబనా ఆజ్మీ తమ్ముడాయన. కైఫీ ఆజ్మీగారబ్బాయ్. రాజాధిరాజు, వంశవృక్షం, రాధా కల్యాణం, త్యాగయ్య, పెళ్లీడు పిల్లలు తదితర సినిమాలకు వర్క్ చేశారు. ‘సంపూర్ణ రామాయణం’ సినిమాకి ట్రిక్ వర్క్ అంతా రవికాంత్ నగాయిచ్‌గారు చూసుకున్నారు.
   
 మీరు షాట్ ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేవారా?
  అలా మాట వినకపోతే నాతో పని చేయడం కష్టం.
   
 ఆర్టిస్టులకి మీరు యాక్ట్ చేసి చూపిస్తారా?
 చూపించాలి కదండీ. లేకపోతే వాళ్లకు ఎక్స్‌ప్రెషన్సూ అవీ ఎలా తెలుస్తాయండీ. సినిమా మొత్తం మనకు తెలుస్తుంది. వాళ్లు ఎక్కడనుంచో ఇక్కడకు వస్తారు. మనం చెప్పకపోతే వాళ్లకు ఎలా తెలుస్తుంది?

 మీ సినిమాల్లో ‘సీతమ్మ పెళ్లి’ ప్రత్యేకంగా అనిపిస్తుంది...
 చాలా మంచి కథ అది. మహేంద్రన్‌గారని తమిళంలో నాకిష్టమైన దర్శకుడు చేసిన ‘నిండు కొయిరాన్’ని తెలుగులో నేను చేశాను. తమిళంలో రజనీకాంత్ చేసిన పాత్రని తెలుగులో మోహన్‌బాబుతో చేయించాం.
   
 అందరూ మీ బొమ్మలు వాడుతుంటారు. మీరేమో ‘సీతాకల్యాణం’లో ఓ పాటలో మీ బొమ్మలు కాకుండా వేరే చిత్రకారుని బొమ్మలు వాడినట్టున్నారు?
 పిలకా నరసింహమూర్తిగారని మా గురువుగారు. ఆయనతో దశావతారాలు బొమ్మలు వేయించాను.
   
 మీ సినిమాల్లో ఎక్కడో ఒక చోట పుస్తకాలు కనిపిస్తూ ఉంటాయి ఎందుకని?
 ఐజన్‌బర్గ్ గారని గాడ్‌ఫాదర్ ఉండేవారు. ఫోర్డ్ ఫౌండేషన్‌వాళ్లు పెట్టిన సదరన్ లాంగ్వేజ్ బుక్ ట్రస్ట్‌కి ఆయన హెడ్. ఆయన చెప్పేవారు... సినిమాలో ఎక్కడో ఒకచోట పుస్తకం చూపించమని. వంటగదిలో సీన్ అయినా సరే. ఇల్లాలు పిల్లాడికి పాలు పట్టిస్తున్నా ఓ చేత్తో పుస్తకం ఉన్నట్టు చూపించమనేవారు. అందరూ పుస్తకాలు చదవాలనేది ఆయన అభిలాష.

 ‘సాక్షి’ సినిమాని ఇప్పుడు కూడా రీమేక్ చేయొచ్చునా?
 చాలామంది స్క్రీన్‌ప్లే అది. స్క్రీన్‌ప్లే వైజ్ గొప్పదే కానీ, పర్సనల్‌గా నా వర్క్ నాకు అంత గొప్పగా అనిపించదు.

 తమిళంలో ఏమైనా చేశారా?
 ఓకే ఒక్క సినిమా చేశాను. ‘ఇన్సాఫ్ కే తరాజ్’ని తెలుగులోనూ, తమిళంలోనూ చేశాం.
   
 మీ సినిమాలకు నెగిటివ్ ఎక్స్‌పోజర్ కూడా చాలా తక్కువనుకుంటాను?
 అవునండీ. సినిమా నిడివికి మూడు రెట్లు ఎక్స్‌పోజర్ ఉండేది. ఎందుకంటే రమణగారు స్క్రిప్ట్ రాసి ఇస్తే, నేను స్టోరీబోర్డ్ వేసేసేవాణ్ణి. అక్కడే చాలామట్టుకు ఎడిటింగ్ అయిపోతుంది. ఓ హిందీ సినిమాని ఒకే సెట్‌లో రెండు చోట్ల ఊటీలోనూ, ముంబైలో తీసేశాం. కాల్షీట్లు ఇబ్బంది వల్ల. అదంతా స్టోరీబోర్డ్ వల్ల సాధ్యపడింది.
   
 రమణగారికి ఏయన్నార్ క్లోజ్ అయితే, మీకు ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం ఉండేదా?
 అదేం లేదండి. నాకెవ్వరితోనూ ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది కాదు. ఎన్టీఆర్‌తో రెండు సినిమాలు చేశాను. పిల్లల కోసం ప్రభుత్వం తరఫున ఓ ప్రాజెక్ట్ చేయిస్తే చేశాను. అదంతా రమణగారి చలవవల్లే.
   
 అన్నీ తెలిసి కూడా మౌనంగా ఉండటం చాలా కష్టం. మీది మొదట్నుంచీ అదే పద్ధతి. కానీ ఏమీ లేకపోయినా డాంబికాలు పలికేవారిని చూస్తే ఏమనిపిస్తుంది?
ఇంకొకళ్ల గురించి జడ్జ్ చేయడం కష్టం. తప్పు కదా..?
   
 ఈ గోడ మీద మీ బొమ్మలు కాకుండా పెద్ద పెద్ద పెయింటింగ్స్ ఏంటండీ?
 ఇవన్నీ ఓల్డ్‌మాస్టర్ పెయింటింగ్స్. ‘సీతా కల్యాణం’ టైమ్‌లో లండన్ వెళ్లినపుడు గూటాల కృష్ణమూర్తి గారితో వెళ్లి ఈ పెయింటింగ్స్ కొన్నా. నా ఇంకో ఫ్రెండ్ శ్రీరమణగారు ఇవన్నీ లామినేట్ చేసి పెట్టారు. 1978 నాటి బొమ్మలివి.
   
 చిత్రకళలో వచ్చే మార్పుల్ని గమనించడం కోసం ఇంటర్‌నెట్‌ని ఫాలో అవుతుంటారా?
 నాకస్సలు కంప్యూటర్ ఆపరేట్ చేయడం తెలీదు. ఎప్పటికప్పుడు పుస్తకాలు రిఫర్ చేస్తుంటాను. అప్పట్లో సెంట్రల్ స్టేషన్ దగ్గర్లో మూర్ మార్కెట్ ఉండేది. అక్కడ చిత్రకళకు, సంబంధించి ఫారిన్ బుక్స్ దొరికేవి. ఆల్‌మోస్ట్ ఆల్ అదే నాకు స్కూలులాంటిది. ప్రతివారం ఆ మార్కెట్‌కి వెళ్తుండేవాణ్ణి. లేకపోతే లైబ్రరీకి వెళ్లి బుక్స్ రిఫర్ చేస్తుండేవాణ్ణి. నా చిన్నప్పుడు ‘బాల’ అనే చిల్డ్రన్ మేగజైన్ ఉండేది. ‘రేడియో అన్నయ్య’ న్యాపతి రాఘవరావు గారిది. అందులో బొమ్మలేసేవాణ్ణి. ఆయనే ఎంకరేజ్ చేసేవారు. పుస్తకాల షాపుకి తీసుకెళ్లి ‘నీకు కావాల్సినవి కొనుక్కోవయ్యా’ అనేవారు. షీట్స్, రంగులు అన్నీనూ.
   
 ఇంటర్నేషనల్ లెవెల్‌లో మీ పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ ఏమైనా పెట్టారా?
 చాలా పెట్టారండీ. అమెరికా, లండన్. ‘సీతాకల్యాణం’ టైమ్‌లో నేను కూడా లండన్ వెళ్లాను.
   
 మంచి ఆర్టిస్ట్ కావాలంటే ఏం చేయాలండీ?
 లోపల ఉండాలండీ. నేచురల్‌గా ఇంట్రస్ట్ ఉంటే ప్రాక్టీస్... ప్రాక్టీస్... ప్రాక్టీస్... చేస్తూనే ఉండాలి. అబ్దుల్ కరీం ఖాన్ అని గొప్ప క్లాసికల్ సింగర్ ఉండేవారు. చేతిలో పొన్ను కర్ర. దానికి వెండి పిడి. ఒకాయన ఎవరో మూడు నెలలు సెలవు పెట్టి వస్తాను... సంగీతం నేర్పించమన్నాడట. దానికాయన తన పొన్నుకర్రని చూపించి దీన్ని ఫ్యాక్టరీలో మెషిన్ మీద అయిదు నిమిషాల్లో తయారు చేస్తారు. కానీ నా అరచేయి కింద 30 ఏళ్లుగా ఉంది. అందుకే ఇంత నునుపు తేలింది. సంగీతం మూడు నెలల్లో నేర్చుకుంటే రాదు అన్నారట. అందుకే నిరంతరం అదే పనిలో ఉండాలి.
   
 వర్తమానంలో చిత్రకళ గురించి మీ అభిప్రాయం?
 అద్భుతంగా ఉంది. ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది. పాతవే మంచివి అనుకోవడం పొరపాటు.
   
 ప్రస్తుతం మీకు నచ్చిన చిత్రకారుడెవరు?
 (నవ్వుతూ) నాకు జుట్టు లేదు కానీ, ఇంతమంది చిత్రకారులున్నారు. నిజంగా వేలల్లో ఉన్నారు.
   
 మనవళ్లూ మనవరాళ్లలో ఎవ్వరికైనా మీ ఆర్ట్ అబ్బిందా?
 నా రెండో అబ్బాయి కూతురు బొమ్మలు వేస్తుంది. దానికి 8 ఏళ్లు. మా అమ్మాయి కూడా బొమ్మలు వేస్తుంది. తను ఏదో గ్రాఫిక్స్ కంపెనీలో పనిచేస్తోంది.
   
 బొమ్మలు వేయడం నేర్పమని పిల్లలు అడగరా?
 (నవ్వేస్తూ) నాకు వస్తే కదా... వాళ్లకు నేర్పేది. నేను నిరంతర విద్యార్థిని. నేర్చుకుంటూనే ఉంటాను.
   
 ఇప్పుడు మీకు కాలక్షేపం ఏంటి?
 ఓపిక ఉంటే బొమ్మలు వేయడం. లేకపోతే పుస్తకాలు చదవడం. మొదట్నుంచీ పుస్తకాలు ఎక్కువ చదివేవాణ్ణి.
   
 రమణగారి స్క్రిప్టు లేకుండా మీరు రెండు సినిమాలు చేసినట్టున్నారు?
 లేదండీ. ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ నాటకం ఆధారంగా తీసిన సినిమా కదా. పద్యాలు ఉంటాయని గబ్బిట వెంకట్రావ్‌గారితో స్క్రిప్ట్ చేయించాం. రమణగారి ఇది లేనిదే నేను ఏ సినిమా తీయలేదు. ‘రామాంజనేయ యుద్ధం’కు రమణగారి కంట్రిబ్యూషన్ ఇన్‌డెరైక్ట్‌గా ఉంది.
   
 రమణగారు రాసిపెట్టుకున్న సినిమా స్క్రిప్టులు ఇంకేమైనా ఉన్నాయాండీ?
 లేవండీ. కొన్ని కొన్ని స్టోరీ ఐడియాలుండేవి. చేద్దామని ఫుల్‌ఫ్లెడ్జ్‌డ్‌గా ఏ స్క్రిప్టూ పెట్టుకోలేదు. ఐడియా నచ్చితే అప్పటికప్పుడు స్క్రిప్టు తయారు చేసుకునేవాళ్లం.
   
 డబ్బు ఎంత గొప్ప స్నేహితులనైనా విడదీస్తుందంటారు. మీరిద్దరూ తీసిన సినిమా ఫ్లాప్ అయితే ఏం ఇబ్బంది ఎదురు కాలేదా?
 అంతా రమణగారే చూసుకునేవారు. ఈ ఇల్లు ఆయన కట్టించిందే. ఎన్టీఆర్‌గారి స్కూలు పాఠాల ప్రాజెక్ట్ తర్వాత ఇది, పక్కన మా అమ్మాయి ఇల్లు, వెనుక రమణగారిల్లు కట్టుకున్నాం. రమణగారు ఇల్లు అమ్మేశాక, ఈ ఇంట్లోనే పైన ఉండేవారు. వెనుక ఇంట్లో ఏడాదో, రెండేళ్లో ఉన్నారంతే. ‘‘ఎప్పుడూ కలిసుండేవాళ్లం ఇలా వెనక్కు వెళ్లాను. అందుకే అమ్మేశాను’’ అని జోక్ చేసేవారు రమణ. చిన్నప్పట్నుంచీ తను మా ఇంట్లోనే ఉండేవాడు. మా అమ్మగారు తనను పెద్దబ్బాయ్ అని పిలిచేది.
   
 రమణగారు ఉండి ఉంటే... ఇంకో సినిమా చేసేవారా?
 చేసేవాణ్ణి.
   
 ‘శ్రీరామరాజ్యం’ తర్వాత ఏమైనా అనుకున్నారా?
 ‘శ్రీరామరాజ్యం’ జరుగుతుంటేనే పోయారాయన. స్క్రిప్ట్ ముందే రాసేస్తారు కనుక ఇబ్బంది అనిపించలేదు.
   
 రమణగారితో మీ లాస్ట్ వర్డ్?
 రాత్రి రెండింటికి వాళ్లావిడ పిలిచింది. నన్ను పైకి రమ్మంటున్నారని. జస్ట్ టూ మినిట్స్. అనాయాస మరణం. ఊపిరి అందలేదు.
   
 రమణగారు లేని లైఫ్ ఎలా ఉందండీ?
 చాలా కష్టంగా ఉందండీ (అంటుండగానే ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి). అప్పటి నుంచీ నాకు ఓపిక పోయింది.

 - సంభాషణ: వి.ఎన్. ఆదిత్య,  పులగం చిన్నారాయణ

Original Interview has published on sakshi. This is the last interview of bapu garu with sakshi paper.

http://www.sakshi.com/news/family/director-bapu-exclusive-interview-162686
04:29 - By Swathi 0

0 comments:

WIDGET #1

Text Widget

Blogroll

Followers

Discrimination

ఈ బ్లాగులోని విషయాలు , సమాచారం మీకు ఉపయోగపడకలదు అని బావించి ఇంటర్నెట్ మరియు ఇతర వెబ్సైటు ల నుండి సేకరించడం జరిగింది.

Discussion

Powered by Blogger.
back to top