Feed Section

Search

Recent Readers

Powered by Blogger.
Showing posts with label Life. Show all posts
Showing posts with label Life. Show all posts

Sunday, 10 November 2013

Victory Venkatesh Interview With Sakshi

నేను అనే భావన పెరిగేలోపే ఆ బాటలో వెళ్లాలి!

VENKATESH, He is the super star in Tollywood. He loves cricket, He has friends in indian cricket team. He Follows Indian Cricket. He always supports Indian Team. He is One of the Great Personality In Indian Cinema. This week I am sharing with you, His Interview On sakshi Paper.He has been in the telugu Industry. He works with a lot of People in his career, In this  detailed Interview, We can know many things from his Life experience, I hope you will enjoy it.

 బయట ఉన్నంత ‘రిచ్’గా లోపలా ఉండగలమా?
 లోపల అంటే... మన ఆలోచనల్లో, ఆచరణల్లో.
 రిచ్‌గా అంటే... భౌతిక విలువలకు అతీతంగా, ఆధ్యాత్మికంగా.
 ‘ఉండగలం’ అంటారు విక్టరీ వెంకటేష్.
 ఎలా?
 మానవుడికన్నా మరికాస్త గొప్పగా ఆలోచించాలట!
 అంటే?!
 నంబర్ వన్: నేను, నాది, నా వల్ల... అనుకోకూడదు.
 నంబర్ టు: దేన్నీ  శాశ్వతమని భావించకూడదు. 
 నంబర్ త్రీ: రేపటి గురించి ఆలోచిస్తూ ఇవాళ్టిని వృథా చేయకూడదు.
 బానే ఉంది కానీ..
 మానవుడు మానవుడిలా కాకుండా ఇంకెలా ఆలోచిస్తాడు?
 ఒక సాధువులా, ఒక సద్గురువులా, ఇంకా... హీరో వెంకీలా!
 వెంకీలో అంతుందా! అంత కాదు, ఎంతో ఉంది.
 వెంకీతో ఎంటర్‌టైన్ అవాలనుకునేవారు ఆయన సినిమాలను ఎన్నిసార్లైనా చూడొచ్చు.
 వెంకీతో ఎన్‌లెటైన్ అవాలంటే మాత్రం ఒక్కసారైనా ఈ ‘తారాంతరంగం’ చదవాలి.

  ‘ఐ విల్ కట్ హారిజాంటల్లీ...’ అంటూ వచ్చీ రాని ఇంగ్లిష్‌లో ‘మసాలా’ సినిమాలో డైలాగ్ చెప్పారు. ఒకప్పుడు మీ తెలుగు కూడా అలానే ఉండేది కదా?
 వెంకటేష్: అవును. తెలుగు మాట్లాడటం చాలా కష్టమయ్యేది. నా స్కూలింగ్ అంతా చెన్నయ్‌లోనే. ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లిష్, సెకండ్ లాంగ్వేజ్ హిందీ. పైగా పై చదువుల కోసం విదేశాలు వెళ్లిపోవడం వల్ల తెలుగు మాట్లాడే అవకాశం చాలా చాలా తక్కువ ఉండేది. హీరో అయిన కొత్తలో నా పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి చాలా ఇబ్బందిపడేవాణ్ణి. అప్పట్లో నా తెలుగులో బాగా ఇంగ్లిష్ ఉండేదనేవాళ్లు.

 ఓసారి మీ ఫ్లాష్‌బ్యాక్‌కి వెళదాం... సురేష్ ప్రొడక్షన్స్ బేనర్ ఎంబ్లమ్‌లో ‘ఎస్’ అక్షరంపై మీరు, ‘పి’ అక్షరంపై మీ అన్నయ్య సురేష్‌బాబు ఉంటారు. అక్షరాలకు తగ్గట్టు మీరు స్టార్, మీ అన్నయ్య ప్రొడ్యూసర్ అయ్యారు. ఇలా జరుగుతుందని ఎప్పుడైనా అనుకున్నారా?
 వెంకటేష్: అస్సలు అనుకోలేదు. నేను సినిమాల్లోకి వస్తాననే అనుకోలేదు. బేనర్ లోగో తయారు చేయించినప్పుడు అన్నయ్యను, నన్ను నిలబెట్టి నాలుగైదు రకాల స్టయిల్స్‌లో నాన్నగారు లోగో తయారు చేయించారు. మేమిద్దరం బాక్సింగ్ చేస్తున్నట్లు, షేక్‌హ్యాండ్ ఇచ్చుకుంటున్నట్లు.. ఇలా షూట్ చేశారు.

 అప్పట్లో మీరేం అవ్వాలనుకునేవారు?

 వెంకటేష్: స్పైసెస్ (సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు) బిజినెస్ చేద్దామనుకున్నా. ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్‌కి సంబంధించిన బిజినెస్ కదా. ఆ వ్యాపారం అయితే ఎక్కువగా ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం.  కానీ, మనం అనుకున్నదేదీ జరగదు కదా! కృష్ణగారు బిజీగా ఉండటంవల్ల నాన్నగారు నన్ను ‘కలియుగ పాండవులు’లో హీరోగా చేయమన్నారు. అప్పుడు అబ్రాడ్‌లో చదువుతున్నాను. నాన్నగారు ఫోన్ చేయగానే, ఇక్కడికొచ్చేశాను. అనుకోకుండా హీరో అవ్వడం... ఇదిగో ఇక్కడిదాకా రావడం.. అందరికీ తెలిసిందే.

 గోల్డెన్ స్పూన్‌తో పుట్టారు... మీ లైఫ్ అంతా అద్భుతమే కదూ?

 వెంకటేష్: అసలు గోల్డెన్ స్పూన్ అంటే ఏంటి? ‘మెటీరియల్ వరల్డ్’కి నేను గోల్డెన్ స్పూన్‌తో పుట్టినట్లుగానే ఉంటుంది. దేశంలో ఎంత పెద్ద అయినా, లోపల ‘పూర్’గా ఉంటే జీవితం వృథా అని నా అభిప్రాయం.

 లోపల బీదగా ఉండటం అంటే..?
 వెంకటేష్: బయటికి నేను బాగా రిచ్‌గా ఉండొచ్చు. కానీ, లోపల ఎంత ఆనందంగా ఉన్నారో మీకెలా తెలుస్తుంది? ఆధ్యాత్మిక అవగాహన ఉంటేనే నా దృష్టిలో ‘రిచ్’ కింద లెక్క.

 మరి... మీరు ధనవంతులేనా?
 వెంకటేష్: యస్..!

 ఆధ్యాత్మిక అవగాహన ఉంటేనే ‘రిచ్’ అని ఎలా అంటారు?
 వెంకటేష్: ఓకె.. కొంచెం విపులంగా మాట్లాడుకుందాం. నా కెరీర్‌ని తీసుకుందాం. రెండు సినిమాలు సూపర్ హిట్. బ్రహ్మరథం పడతారు. ఆ తర్వాత రెండు ఫట్లు... ఎవరూ దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడరు. సో.. సక్సెస్ అనేది అశాశ్వతమే కదా. అలాగే, స్నేహితులతోనూ బంధువులతోనూ అనుబంధాన్ని తీసుకుందాం. ఎక్కడైనా చిన్న మాటలో తేడా వస్తే.. ఆ అనుబంధం ఏమవుతుంది? కాబట్టి అనుబంధాలూ అశాశ్వతమే. వేసుకునే బట్టలు, వాడే వస్తువులు.. ఏదీ జీవితాంతం మనతోపాటు ఉండిపోవుగా. మరి.. శాశ్వతం కాని వాటి గురించి పాకులాడటం దేనికి? సో.. ఏది శాశ్వతం.. ‘ఇన్నర్ స్ట్రెంగ్తే కదా...’. ఆ బలం ఎప్పుడు వస్తుంది? ఆధ్యాత్మిక బాటలో వెళుతూ.. ‘జీవిత సత్యం ఏంటో? శాశ్వతం ఏదో’ తెలుసుకున్నప్పుడు. ఇన్నర్‌గా మనం ఎప్పుడైతే బలంగా ఉంటామో అప్పుడు దేనికీ భయపడం. మనలో ఓ ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది!

 దేనికీ భయపడం అంటే... చివరికి మరణానికి కూడానా?
 వెంకటేష్: ఎగ్జాక్ట్‌లీ... మరణానికి కూడా భయపడం. అసలు చావంటే ఏంటో తెలుసుకోకుండా భయపడిపోతుంటాం. అయితే, మరణం అనేది శరీరానికి మాత్రమే అనుకున్నప్పుడు భయం ఉండదు. మన శరీరం చనిపోగానే, అందులో ఉన్న ఆత్మ వేరే తల్లి కడుపులో పడుతుందనే సత్యం తెలుసుకుంటే మరణం గురించి భయపడం!

 డబ్బు, నగలు, వస్తువులు.. ఇష్టపడేవారికి వాటి ద్వారా ఆనందం లభిస్తుంది. మరి.. మీకు ఎందులో ఆనందం లభిస్తుంది?
 వెంకటేష్: నేను మానవుణ్ణి కాదు.. ఇంకా ఏదో అనుకున్నప్పుడు శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. ఒక మానవుడికన్నా ఇంకా గొప్పగా ఆలోచించగలిగినప్పుడు ఆనందంగా ఉంటుంది.

 మీరంటే చిన్నప్పట్నుంచీ అన్ని సౌకర్యాలూ అనుభవించారు కాబట్టి, ‘మెటీరియల్స్’ మీద వ్యామోహం పోయి ఉంటుంది. దాంతో... ‘ఆధ్యాత్మికం’ అంటున్నారు. కానీ, ఏమీ అనుభవించనివాళ్లు  మీరు అంటున్న అశాశ్వత ఆనందాన్నే కోరుకుంటారేమో?

 వెంకటేష్: మితిమీరిన ఆశ ఉంటే.. ఎవరికీ ఎప్పుడూ దేనిలోనూ ఆనందం లభించదు. ఉదాహరణకు.. చిన్న కారు కొనుక్కోవాలనుకున్నారు. అది కొన్న తర్వాత ఇంకా లగ్జరీ కారుని కోరుకుంటారు. చిన్న ఇల్లుతో మొదలుపెట్టి.. ఆ తర్వాత పెద్ద ఇంటి వరకు ఆశ పెరిగిపోతుంది. అలాంటివాళ్లకి ఎప్పుడూ ఆనందం దొరకదు. ఇక.. మీరన్నది కరెక్టే. ఏ సౌకర్యాలూ అనుభవించకుండా ఈ బాటలో వెళ్లలేం. నేను అన్ని సౌకర్యాలు అనుభవించాను కాబట్టే, చాలా త్వరగా ‘ఆధ్యాత్మిక బాట’కు ఆకర్షితుణ్ణయ్యాను. అసలేమీ అనుభవించకుండా ఈ భావన  అంత సులువుగా రాదు.

 మీ మాటలు దాదాపు ఎడ్యుకేట్ చేసే విధంగానే ఉన్నాయి. కానీ, కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. చిన్నప్పుడు మీరెలా ఉండేవారో తెలుసుకోవాలని ఉంది...
 వెంకటేష్: చాలా జోష్‌గా ఉండేవాణ్ణి. అల్లరి పిల్లాణ్ణే.  నాకో చిన్న గ్యాంగ్ ఉండేది. స్కూల్లో అందరితో బాగుండటం, ఎంజాయ్ చేయడం అలా ఉండేవాణ్ణి. నా క్లాస్‌తో పాటు ఇతర క్లాసుల పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండేవాణ్ణి. చదువుపరంగా చెప్పాలంటే యావరేజ్. స్పోర్ట్స్‌లో బాగా పార్టిసిపేట్ చేసేవాణ్ణి. స్కూల్లో ‘సిస్టమ్’కి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే భరించేవాణ్ణి కాదు. ఉన్నవాళ్ల పిల్లలను ఓ రకంగా, లేనివాళ్లను ఓ రకంగా ట్రీట్ చేస్తే ఊరుకునేవాణ్ణి కాదు. పిల్లలందరికీ ఫ్రెండ్... టీచర్స్‌కి మాత్రం విలన్‌నే.

 అయితే.. కాలేజ్‌లో ఇంకా రెబల్‌గా ఉండేవారేమో?
 వెంకటేష్: అవును. పక్క కాలేజీవాళ్లకీ మా కాలేజీవాళ్లతో మాటా మాటా వచ్చినప్పుడు గొడవపడటానికి ముందుండేవాణ్ణి.

 రామానాయుడి కొడుకు కాబట్టి.. స్కూల్, కాలేజ్‌లో మీరేం చేసినా చెల్లుబాటు అయ్యుంటుందేమో?
 వెంకటేష్: స్కూల్లో నన్నెప్పుడూ ప్రత్యేకంగా చూడలేదు. అల్లరి చేసినప్పుడు ‘గో అవుట్’ అంటూ టీచర్స్ నన్ను బయట నిలబెట్టిన రోజులు చాలానే ఉన్నాయి. నేను ‘రామానాయుడు కొడుకు’ అని ఎవరి దగ్గరా చెప్పుకునేవాణ్ణి కాదు. ‘నేను మామూలు వ్యక్తిని’ అనుకున్నప్పుడే లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేయగలుగుతాం అని నేను చిన్నప్పట్నుంచీ నమ్మేవాణ్ణి.

 కాలేజ్ డేస్‌లో బైక్ మీద ఫ్రెండ్స్‌తో బాగానే హల్‌చల్ చేసేవారా?
 వెంకటేష్: బీకామ్ ఫస్ట్ ఇయర్‌లో యమహా కొనుక్కున్నాను. ఫస్ట్ బైక్ థ్రిల్లే వేరు. ఆ బైక్‌ని మాడిఫై చేయించుకోవడం, గారేజ్‌కి తీసుకెళ్లి, పెయింటింగ్‌లు వేయించుకోవడం అంతా బాగుండేది. కొన్నాళ్లు హాయిగానే సాగింది. కానీ ఓసారి యాక్సిడెంట్ జరగడంతో ఇంట్లోవాళ్లు ఇక బైక్ వద్దన్నారు. ఆ విధంగా నా బైక్ రైడ్‌కి బ్రేక్ పడింది.

 అది సరే... ‘ప్రేమనగర్’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశారు కదా.. ఆ తర్వాత ఎందుకు కంటిన్యూ అవ్వలేదు?
 వెంకటేష్: అది అనుకోకుండా జరిగింది. ఓ రోజు నేనేదో ఆడుకుంటుంటే, మా మేనేజర్ అనుకుంటా.. నా దగ్గరికొచ్చి ‘నాన్నగారు రమ్మంటున్నారు.. యాక్ట్ చేయాలట. చేస్తే మీ బ్యాంక్‌లో డబ్బులు వేస్తారట’ అన్నాడు.  సరే.. వెళ్లాను. చేశాను. అంతేకానీ నాకు ప్రత్యేకంగా ఇంట్రస్ట్ ఏమీ లేదు.

 కనీసం చిన్నప్పుడు అద్దం ముందు నిలబడి, యాక్ట్ చేసి చూసుకోవడం కూడా చేసేవారు కాదా?
 వెంకటేష్: సినిమా వాతావరణంలో పెరిగినందువల్లో ఏమో.. మా ఆఫీస్ పైన ఉన్న కాస్ట్యూమ్ రూమ్‌లోకెళ్లి.. మా జానపద సినిమాలకు సంబంధించిన డ్రెస్‌లేసుకుని, అద్దం ముందు నిలబడి, ఏవో పిచ్చి పిచ్చి సైగలు చేయడం ఇంకా గుర్తుంది. అలాగే, మావాళ్లు అప్పుడప్పుడు, నన్ను డాన్స్ చేయమనేవాళ్లట. కొంతమంది స్టార్స్‌ని ఇమిటేట్ చేసేవాణ్ణట. ఇలాంటివన్నీ అన్నయ్య చెయ్యలేదు. నేనే చేశానంటే.. ఏదో మూల నాలో యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ ఉండేదేమో...!
  అన్నయ్య, మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారు?
 వెంకటేష్: మా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ లేదు కాబట్టి చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. ఇప్పుడూ అలానే ఉంటాం. అన్నయ్య మంచి స్పోర్ట్స్‌మేన్. క్రికెట్ బాగా ఆడేవాడు. ఫాస్ట్ బౌలర్. స్కూల్లో స్పోర్ట్స్ అంటే... అన్నయ్య పార్టిసిపేషన్ కంపల్సరీ.

 సౌత్‌లో నిర్మాతల కొడుకుల్లో మీ అంతగా సక్సెస్ అయినవాళ్లు లేరు. భవిష్యత్తుని ప్లాన్ చేయనన్నారు కాబట్టి... ఈ ఊహించని సక్సెస్ ఎలా అనిపిస్తోంది?
 వెంకటేష్: నా మొదటి సినిమా తర్వాత వరుసగా నాలుగైదు ఫ్లాప్‌లు వచ్చాయి. దాంతో, చాలా కామెంట్స్ వచ్చాయి. ‘నిర్మాతల కొడుకులు కష్టం’ అని కొందరు, ‘ఈ అబ్బాయికి యాక్టింగ్‌కి కుదరదు’ అని మరికొందరు వ్యాఖ్యలు చేశారు. అప్పటికే చిరంజీవిగారు, బాలకృష్ణగారు, నాగార్జునగారు సినిమాలు చేస్తున్నారు. ఆ సమయంలో ఓ నిర్మాత కొడుకుగా నేను ఎంటరయ్యాను. అయినా ఎవరి విమర్శలనీ పట్టించుకోలేదు. హిట్, ఫ్లాప్ గురించీ ఆలోచించలేదు. ఫస్ట్ సినిమాలో నన్ను నేను చూసుకుని ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, నేనెలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు. అబ్రాడ్ నుంచి రావడం రావడమే యాక్టింగ్ మొదలుపెట్టాను. డెరైక్టర్, ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్ ఏం చెబితే అది చేశాను. కొన్ని ఫ్లాపుల తర్వాత స్వర్ణకమలం, ప్రేమ, శ్రీనివాస కల్యాణం లాంటి డిఫరెంట్ మూవీస్‌కి అవకాశం వచ్చింది. దాంతో మంచి పేరొచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు డిఫరెంట్ మూవీస్ చేయడం, ఆడియన్స్ నన్ను అంగీకరించడం... అంతా కూల్‌గా జరిగిపోయింది. సో.. ముందుగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రేక్షకులకే.

 మీ కామెడీ టైమింగ్ బాగుంటుంది.. బేసిక్‌గా మీలో సెన్సాఫ్ హ్యుమర్ ఉందా?
 వెంకటేష్: ఇన్నర్‌గా హ్యుమర్ ఉంటే.. కామెడీ టైమింగ్ బాగా కుదురుతుంది.

 చిన్న వయసులో మాస్ సినిమాలు చేసి, ఆ తర్వాత ప్రేమకథా చిత్రాల్లో నటించారెందుకని?
 వెంకటేష్: రక్తతిలకం, బ్రహ్మపుత్రుడు, కూలీ నెం. 1 ఇలా వరుసగా మాస్, ఆ తర్వాత లవ్‌స్టోరీస్ చేశాను. మాస్ సినిమాలు చేసినప్పుడు ‘మెడ’కు గాయం తగిలింది. అది చాలా సివియర్‌గా ఉండేది. దాంతో మాస్ సినిమాలకన్నా కొంచెం సాఫ్ట్‌గా ఉండేవి చేస్తే బాగుంటుందనుకున్నా. అప్పుడు లవ్‌స్టోరీస్ చేశాను. అవి బాగా ఆడాయి. కాబట్టి.. ఆ గాయం తగలడం కూడా మేలే అయ్యిందని, ఏది జరిగినా అది మన మంచికే అనిపించింది. నాకున్న అనుభవంతో చెబుతున్నా. రిజల్ట్ అనేది 50 శాతం మనం హార్డ్‌వర్క్ చేసినందుకు వస్తుంది. మిగతా 50 శాతం రిజల్ట్ మిస్టీరియస్‌గా వచ్చేస్తుంది. అవతలి హీరోలు బిజీగా ఉన్నప్పుడు, వాళ్లు చేయాల్సిన మంచి సినిమా నాకు వచ్చి ఉండొచ్చు. లేకపోతే మనం ఖాళీగా ఉన్నాం కదా అని మనల్ని ఆ సినిమా కోసం అడిగి ఉండొచ్చు. అందుకే ఏ సక్సెస్ అయినా ‘నాది’ అనుకోను. అది అందరిదీ... ఆ టైమ్‌దీ అనుకుంటాను. ‘నా వల్ల, నేను’ అనే ఆలోచన మైండ్‌కి వస్తే.. మనం అయిపోయినట్లే. అది చాలా డేంజరస్ ఇగో.

 మీకు చిన్నప్పట్నుంచీ ‘ఇగో’ లేదా?
 వెంకటేష్: నిరాడంబరంగా ఉండటం అనేది మా అమ్మానాన్నల జీన్స్ నుంచి సంక్రమించినది. తనో పెద్ద నిర్మాత అని నాన్నగారు ఎప్పుడూ ఫీలవ్వలేదు. అమ్మ చాలా నిరాడంబరంగా ఉంటుంది. నా బ్రదర్, సిస్టర్ కూడా చాలా సింపుల్ పీపుల్. నాది, నేను.. అనే ఆలోచన నాకు రాకపోవడం నా అదృష్టం. ఇంకో విషయం ఏంటంటే.. ఇగో ఉన్నవాళ్లని కూడా నేను నిందించను. ఎవరైనా ఎప్పుడైనా అగ్రెసివ్‌గా బిహేవ్ చేశారనుకోండి.. నేను వాళ్లని కామెంట్ చేయను. అప్పటి తన పరిస్థితి వల్ల, టైమ్ వల్ల, తను నేర్చుకున్న విషయాల ద్వారా అతను అలా చేశాడని అనుకుంటాను. అందుకే నేనెవరి మీద జడ్జ్‌మెంట్ పాస్ చేయను. అలాగే, ఎవరైనా తప్పు చేస్తే.. వెంటనే కాకుండా ఆ తర్వాత రియాక్ట్ అవ్వాలనేది నా సిద్ధాంతం.

 సో.. ఎవరి గురించీ తప్పుగా ఆలోచించరన్నమాట.. అయితే మీరు తప్పులు కూడా చేయరా?

 వెంకటేష్: సాధ్యమైనంతవరకు నేనవెరి గురించీ తప్పుగా ఆలోచించను. ఒకవేళ ఎవరైనా తప్పులు చేసినా.. ఏమో వాళ్లు ఏ పరిస్థితిలో ఉన్నారో అనుకుంటా. ఇక, తప్పులు చేయరా? అనడిగారు. గొప్ప గొప్పవాళ్లూ తప్పులు చేస్తారు. కానీ, ఒక్కోసారి సాదాసీదా వ్యక్తులు కూడా గొప్పగా ఆలోచిస్తారు. అదే జీవితం. కానీ తప్పులు చేయని మానవులు ఉండరు.

 ఓకే.. ఇప్పుడు మళ్లీ ‘ఆధ్యాత్మికత’ విషయానికొద్దాం.. అసలు మీకీ వైపుగా దృష్టి మళ్లడానికి గల కారణం ఏదైనా ఉందా?
 వెంకటేష్: నా సినిమాలు ఘనవిజయం సాధించినప్పుడు కూడా నేను మామూలుగా ఉండేవాణ్ణి. ఏదీ పెద్దగా ఆనందాన్నిచ్చేది కాదు. ఒకానొక దశలో ‘ఏంటి ఇలా ఉంటున్నాం. అన్నిటికీ సమానంగా స్పందిస్తున్నాం. అసలు మనం ఏంటి? మనం ఎవరు?’ అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ ప్రశ్నలు ఆధ్యాత్మిక బాటలో మళ్లేలా చేశాయి. ‘ప్రేమించుకుందాం రా’ సమయంలో ఈ మార్పు మొదలైంది. ఆ ఆధ్యాత్మిక ప్రయాణం అలా నిరాటంకంగా సాగుతోంది.

 జనరల్‌గా ఫిఫ్టీ ప్లస్‌లో ఆధ్యాత్మిక బాటలోకి వెళుతుంటారని అంటుంటారు. కానీ, మీరు చిన్న వయసులోనే ఇటువైపు ఎట్రాక్ట్ అయ్యారు...
 వెంకటేష్: ఆధ్యాత్మికతకు వయసుతో సంబంధం లేదు. మనం అన్ని విషయాల మీద అవగాహన పెంచుకున్న తర్వాత, ‘మనం అనుకున్నదే కరెక్ట్’ అనే భావనలో పడిపోతాం. అప్పుడు ఏ బాటలోనూ అంత సులువుగా వెళ్లలేం. చిన్నపిల్లలను ఓ ఉదాహరణగా తీసుకుందాం. వాళ్లు ఏదైనా త్వరగా నేర్చేసుకుంటారు. ఎందుకంటే, వాళ్లకి ‘నేను’ అనేది తెలియదు. వాళ్ల గురించి వాళ్లు ఒక ఇమేజ్‌లో పడిపోరు. అందుకే ‘నేను’ అనే భావన పెరిగేలోపే ఈ బాటలో వెళ్లాలి. ఎందుకంటే, ఆ తర్వాత వెళ్లలేం. అంతే తప్ప, అన్నీ అనుభవించేసిన తర్వాత చూద్దాంలే అనుకుంటే కరెక్ట్ కాదు.

 ‘ఆధ్యాత్మికం’ అంటారు కానీ, ఆడంబరాలు మాత్రం వదులుకోలేదని మీపై ఓ విమర్శ ఉంది. ఎందుకంటే, మణికొండ ఏరియాలో వైభవంగా ఇల్లు కట్టించుకున్నారు కదా?
 వెంకటేష్: ఆధ్యాత్మికం అంటే నిరాడంబరంగా ఉండాల్సిన అవసరం లేదు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు రాజ్యాలే ఏలారు. వైభవాలను అనుభవించారు. అదే విధంగా అంతర్గతంగా తామేంటో తెలుసుకున్నారు. శాశ్వతం, అశాశ్వతాలకు వ్యత్యాసాన్ని తెలుసుకున్నారు. దీన్నే ‘రాయల్ మిడిల్ పాత్’ అంటాం. ఆధ్యాత్మికం అంటే.. అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోవడం కాదు. నేనిక్కడ పుట్టాను కాబట్టి.. ఇక్కడ ఉండాల్సిందే. ఒకవేళ నేను అడవిలో ఎవరికో పుట్టి ఉంటే.. ఆ పరిస్థితులకు తగ్గట్టు ఉండి ఉండేవాణ్ణి. ఏది దొరికిందో అది యాక్సెప్ట్ చేస్తూ.. అది చేసుకుంటూ వెళ్లడమే. ఆధ్యాత్మిక బాటలో వెళ్లేవాళ్లు సంపాదించకూడదు, వాళ్లకి కుటుంబం ఉండకూడదు అనుకుంటే తప్పు.. ఇవేవీ లేకుండా ఉండాల్సిన అవసరంలేదు. నేనేం సన్యాసిని కాదు కదా.

 మీరిలా ‘నిజం తెలుసుకోవాలి.. నేనెవర్నో తెలుసుకోవాలి’లాంటివి మాట్లాడినప్పుడు మీ ఇంట్లోవాళ్లు భయపడలేదా?

 వెంకటేష్: మొదట్లో భయపడ్డారనుకుంటా! అయితే, ఆ తర్వాత వాళ్లు నా లైఫ్‌స్టయిల్‌ని గమనించారు. హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నానని, చక్కగా సంపాదించుకుంటున్నానని, కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నానని... అర్థం చేసుకున్నాక రిలాక్స్ అయ్యారు.

 మీ నలుగురు పిల్లల దగ్గర ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతుంటారా?
 వెంకటేష్: కొన్ని బోధిస్తాను. గైడ్ చేస్తాను. కానీ, నా అభిప్రాయాలను వాళ్ల మీద రుద్దను. ఇది ‘మెటీరియలిస్టిక్ వరల్డ్’ కాబట్టి.. ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు?లాంటివి చెబుతుంటాను. అలాగే వాళ్ల అనుభవాల ద్వారా కూడా జీవితం మీద అవగాహన కలిగించుకోవాలనుకుంటాను. చెప్పాల్సిన విషయాలు సరైన టైమ్‌లో చెప్పకపోతే ‘అయ్యయ్యో.. అప్పుడు చెప్పి ఉంటే బాగుండేది కదా’ అనుకోవాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు చెప్పాల్సినది అప్పుడు చెప్పెయ్యాలి.

 చిన్నప్పుడు మీరు యాక్ట్ చేశారు కదా.. మరి.. మీ అబ్బాయి (అర్జున్ రామ్‌నాథ్)ని చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎందుకు చేయించలేదు?

 వెంకటేష్: టైమ్ రావాలి. వాడూ ఏదో ఒకటి చేస్తాడు. చూద్దాం.. ఏం చేస్తాడో? ఇప్పుడు వాడికి పదేళ్లు. నేను నిర్మాత కొడుకుని. వాడు స్టార్ కొడుకు. వాడి ఆలోచనలు ఎలా ఉంటాయో చూడాలి. భవిష్యత్తులో తనేం అవుతాడో తనే డిసైడ్ చేసుకుంటాడు.

 మీ పిల్లలు సింపుల్‌గానే ఉంటారా... స్టార్ కిడ్స్ స్టేటస్‌కి తగ్గట్టుగా ఉంటారా?
 వెంకటేష్: వాళ్లు చాలా ‘సింపుల్ చిల్డ్రన్’. నా పిల్లలే కాదు.. ఎవరైనా సరే సింపుల్‌గానే ఉండాలంటాను. నా పిల్లలు ‘వండర్‌ఫుల్’. వాళ్ల వల్ల నాకు, నా భార్యకూ ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.

 మీ పిల్లలను ఎప్పుడూ చూడలేదు కాబట్టి.. వాళ్లల్లో మీ మేనరిజమ్స్ గురించి చెప్పలేం. కానీ, నాగచైతన్య నడక, కొన్ని మేనరిజమ్స్ మీలానే ఉంటాయి. ఓ మేనమామగా మీ ఫీలింగ్?

 వెంకటేష్: వండర్‌ఫుల్ ఫీలింగ్. నాగచైతన్య ‘నైస్ బోయ్’. నా సిస్టర్ (నాగచైతన్య తల్లి లక్ష్మి)కి నేను చాలా క్లోజ్. అలానే చైతన్య! ‘ఐయామ్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్’. ఆ మాటకొస్తే.. ‘ఐయామ్ ఓపెన్ టు ఎవ్రిబడీ’.

 సినిమాలు కాకుండా మీకు నచ్చేవి?
 వెంకటేష్: చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఎందుకంటే, వాళ్లకి కల్లా కపటం తెలియదు. ఇగోలు, ఇండివిడ్యువాలిటీ ఉండవు. అలాంటివాళ్లతో గడపడం నాకిష్టం. పిల్లలు దైవసమానులని నా ఫీలింగ్.

 27ఏళ్ల కెరీర్ గ్రాఫ్ మీది. ఇన్నేళ్లు నిరాటంకంగా కొనసాగడం ఎలా ఉంది?

 వెంకటేష్: ఇదంతా బోనస్సే. ఎందుకంటే, ఏదైనా ఉద్యోగం లేదా వ్యాపారంతో.. ఎంతో కొంత డబ్బు సంపాదించుకునేవాణ్ణేమో. కానీ, దేవుడు నాకు చాలా ఇచ్చాడు. అందుకే ఎప్పుడో శాటిస్‌ఫేక్షన్ వచ్చేసింది.

 మీరెప్పుడూ దేనికీ బానిస అవ్వలేదా?
 వెంకటేష్: ఆధ్యాత్మికతకు బానిస అయ్యాను. ఇప్పుడు ఫర్వాలేదు కానీ.. ఒకప్పుడు ఎప్పుడు ఎక్కడికెళ్లాలనిపిస్తే.. అక్కడికి వెళ్లిపోయేవాణ్ణి. రిషికేష్, హిమాలయాస్... అప్పటికప్పుడు అనుకోవడం... వెళ్లిపోవడం. అంతే. అక్కడికి వెళితే ఏవో నిజాలు తెలుస్తాయని.. జీవిత సత్యాలు తెలుస్తాయని ఆరాటం. కానీ, ఇప్పుడు అది లేదు. కళ్లు మూసుకుని, హిమాలయాలు ముందున్నట్లుగా ఊహించుకోగలను. దేవుడు నా చుట్టుపక్కలే ఉన్నాడని ఊహించగలను. అంత పరిపక్వత వచ్చేసింది.

 మళ్లీ సినిమాల్లోకి వద్దాం... మీరు చేసిన సినిమాల్లో ‘సక్సెస్ రేట్’ ఎక్కువ. కానీ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలతో పోల్చితే మీకు అభిమానుల సంఖ్య తక్కువ. ఎందుకలా?
 వెంకటేష్: ఈ మాట నాతో చాలామంది అంటారు. 99వ రోజున థియేటర్లోంచి తీసేసిన నా సినిమాలు చాలా ఉన్నాయి. అభిమానులు వచ్చి అడిగితే, ‘అభిమానంతో మీరు ఇన్నాళ్లు చూశారు. నాకది చాలు’ అని చెప్పేస్తుంటాను. అంతకుమించి నేను రికార్డ్స్ గురించి ఆలోచించడం కానీ, అభిమానులను ఎంకరేజ్ చేయడం కానీ చేయలేదు. అఫ్‌కోర్స్.. ఇతర హీరోలు అలా చేశారని చెప్పడంలేదు. నేను నా గురించి చెప్పుకుంటున్నాను. ఏదీ శాశ్వతం కాదని నమ్ముతాను కాబట్టి.. రికార్డ్స్ గురించి పెద్దగా పట్టించుకోను. నాకెంతమంది అభిమానులు ఉండాలని రాసిపెట్టి ఉందో అంతమందే ఉంటారు.

 ఈ 16కి రామానాయుడుగారు నిర్మాతగా 50ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు.. మీరేం బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు?

 వెంకటేష్: బహుమతులు ఇచ్చి, పుచ్చుకోవడం మాకు అలవాటు లేదు. ‘ఈరోజు ప్రత్యేకం’ అని నేనెప్పుడూ అనుకోను. అన్ని రోజులూ అలానే ఉంటే ఏం? అనుకుంటాను. కాకపోతే, ఒక్కోసారి సెలబ్రేషన్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. వాటిని కాదనను.

 ఓ పది, పదిహేనేళ్ల తర్వాత రిటైర్‌మెంట్ గురించి ఆలోచిస్తారా?
 వెంకటేష్: ఆలోచిస్తాను. కానీ, ఏదీ మన చేతుల్లో ఉండదని కూడా తెలుసు. అప్పట్లో ఒకసారి శోభన్‌బాబుగారి దగ్గర ‘నాకు రిటైర్ అవ్వాలనే ఆలోచన వస్తోంది’ అన్నాను. కానీ, ఇప్పుడే కాదు... దానికి ఇంకా చాలా టైముంది అన్నారాయన. ఆ తర్వాత ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. ఎందుకంటే, మనం అనుకున్నదేదీ జరగదని నాకు తెలుసు.

 భవిష్యత్తు గురించి ఊహలు, కలలు వేస్ట్ అంటారా?
 వెంకటేష్: వేస్ట్ అనే అంటాను. రేపు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే, ఇవాళ సగం ఎనర్జీని వేస్ట్ చేసుకున్నట్లే. భవిష్యత్తులో ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది. కానీ అనవసరంగా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించి, ఈరోజు సగం ఎనర్జీని వేస్ట్ చేసేసుకుంటాం. అసలు, మనిషికి మనశ్శాంతి తగ్గేది ఎక్కువగా భవిష్యత్తు గురించి ఆలోచించడంవల్లే. అందుకే, ఈరోజుని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి.

 ఫైనల్‌గా... ఓ వ్యక్తిగా మీ జర్నీ గురించి ఏం చెబుతారు?
 వెంకటేష్: వండర్‌ఫుల్ జర్నీ. నా జీవితం గురించి నాకెలాంటి కంప్లయింట్స్ లేవు. ఇటు సినిమా పరిశ్రమ, అటు ప్రేక్షకుల ద్వారా నాకెలాంటి చేదు జ్ఞాపకాలు లేవు. కెరీర్ చాలా స్మూత్‌గా వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. సో.. నాకంతా బోనస్‌లా ఉంది!

- డి.జి. భవాని
 
 అప్పట్లో నా చెయ్యి మెడ దగ్గరకు వెళితే... యూనిట్ అంతా పరార్!
 సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో నాకు కొంచెం కోపం ఎక్కువగా ఉండేది. అయితే అది అప్పటి పరిస్థితి వల్ల. అప్పట్లో నా మెడకు దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తాలూకు ప్రభావం నా మీద చాలా ఉండేది. ఆ ఇరిటేషన్‌లో కోపంగా ఉండేవాణ్ణి. (నవ్వుతూ) అప్పట్లో నా చెయ్యి మెడ దగ్గరకు వెళితే.. యూనిట్ అంతా పరార్. అందులోనూ ఆ రోజుల్లో నాకు తెలుగు సరిగ్గా వచ్చేది కాదు.. నచ్చని సీన్స్ ఒకవైపు, నొప్పి ఒకవైపు, దాంతో సరిగ్గా పెర్‌ఫార్మ్ చేయలేకపోయేవాణ్ణి.  అయితే ఆ కోపం అంతా నా ఆరోగ్య పరిస్థితి వల్లే. అందుకే, అంటాను.. ఎవరికైనా కోపం వస్తే.. ఆ వ్యక్తికి ఎందుకు కోపం వచ్చింది? అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో అని ఆలోచించాలి. అంతేకానీ, తొందరపడి ఆ వ్యక్తి గురించి ఓ నిర్ణయానికి వచ్చేయకూడదు.

                           *************

 కష్టాల్లో ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు చాలామందికి. కానీ, ఎప్పుడూ ఆ దేవుడి గురించి ఆలోచిస్తే.. ఆపదలో ఉన్నప్పుడు వస్తాడు. కష్టాలొచ్చాయి కదా అని గుడికెళితే, ఎందుకు రెస్పాండ్ అవుతాడు? అందుకే, ఆ దేవుడు మనపక్కనే ఉన్నాడని ఎప్పుడూ అనుకోవాలి. ఎక్కడో లేడు.. మనలోనే ఉన్నాడనుకునేంత పరిపక్వత వస్తే.. ఇన్నర్‌గా చాలా బలంగా ఉంటాం.

 ఒక బుక్‌షాప్‌కి వెళ్లారనుకోండి.. త్వరగా డబ్బు సంపాదించడం ఎలా?, సక్సెస్ అవ్వడం ఎలా? అనే పుస్తకాలను కొంటుంటారు. వాటితో పాటు ఆధ్యాత్మికతకకు సంబంధించిన బుక్స్ కూడా కొనుక్కోవచ్చు కదా. కొంచెం జ్ఞానం సంపాదించుకుంటే ఏం పోతుంది? ఆధ్యాత్మిక సైడ్ వెళ్లిపోతే బద్ధకించేస్తాం. పనీ పాటా చెయ్యం అని కొంతమంది ఊహిస్తారు. అది తప్పు. ఈ బాటలో వెళ్లడంవల్ల ఇంకా షార్ప్ అవుతాం. నన్ను తీసుకోండి.. హాయిగా సినిమాలు చేసుకుంటున్నాగా.. బాగానే సంపాదిస్తున్నాగా.

 మనం అవతలివాడి గురించే ఎక్కువ ఆలోచిస్తాం. వాడికి సలహా ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఈ ప్రపంచంలో వచ్చే సమస్యలన్నీ ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడంవల్లే అని నా అభిప్రాయం.

 మొదట్లో ఏడుపు సీన్స్‌లో చేసేటప్పుడు... చిన్నప్పుడు చనిపోయిన నా ఫ్రెండ్‌ని తల్చుకునేవాణ్ణి. అప్పుడప్పుడు ఎస్వీ రంగారావుగారు, కైకాల సత్యనారాయణగారు, కమల్‌హాసన్‌గారిలాంటివాళ్లు చేసిన ఎమోషనల్ సీన్స్‌ని గుర్తు చేసుకుంటుంటాను.

                                   **************

 ‘చంటి’ చేసేటప్పుడు చాలామంది నవ్వారు. ‘పాపం మీవాడు రిస్క్ తీసుకుంటున్నాడు’ అని నాన్నగారితో అన్నారు. అందరూ ఇలా అంటున్నారేంటి? అని నేను కూడా కొంచెం సందేహపడ్డాను. అద్దం ముందు నిలబడి, సైడ్ పాపిడి తీసి, మొహానికి చిన్న బొట్టు పెట్టుకుని, అమాయకంగా మొహం పెట్టి, చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ ట్రై చేసేవాణ్ణి. ‘బాగానే ఉంది కదా’ అనిపించి, ఆ సినిమా చేయడానికే నిర్ణయించుకున్నాను. ఓ నమ్మకంతో ‘చంటి’ చేశాను. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు.

 కొత్త తరంవారికి నా బొబ్బిలి రాజా, ప్రేమించుకుందారా, రాజా సినిమాలు తెలియదు.  ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటివే తెలుసు. పదేళ్లలోపు పిల్లలు కూడా నన్ను ‘పెద్దోడు’ అంటున్నారు. సో.. న్యూ జనరేషన్‌కి రీచ్ అవుతున్నానని ఆనందంగా ఉంది.
 అసలు తను మనలోనే ఉన్నాడని చాలామంది అర్థం చేసుకోవడంలేదు. దేవుణ్ణి మనం బయటపెట్టుకుంటే తను అక్కడే ఉండిపోతాడు. లోపలికి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. మానవులు ఎప్పుడూ ఏదో కోరుతుంటారని దేవుడు పైకి వెళ్లిపోయాడు. అక్కడున్నా మానవులు వదల్లేదు. ఆ తర్వాత నీళ్ల లోపలకి కూడా వెళ్లిపోయాడు. అక్కడా వదిలిపెట్టలేదు. ఇక లాభం లేదని, ఇంతకంటే సేఫ్ ప్లేస్ లేదని మనలోనే ఉండిపోయాడు. అది తెలుసుకోలేక మనం బయట వెతుకుతున్నాం. అదే మనలోనే ఉన్నాడని గ్రహిస్తే... దేవుడు మనవాడే అనే ఫీలింగ్ కలుగుతుంది. మనం ‘గాడ్ ఫియరింగ్ నుంచి గాడ్ లవింగ్ అవ్వాలి’. అప్పుడు ఇక, మనకేం భయం లేదనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది.

Tags: venkatesh, venkatesh biography, venkatesh movies, venkatesh life history.

Link:
http://www.sakshi.com/news/family/exclusive-interview-with-victory-venkatesh-79507?pfrom=home-top-story
00:46 - By Swathi 0

Saturday, 26 October 2013

Kovai Sarala

భర్త, పిల్లలు, హాబీలు.. అన్నీ సినిమానే..!


హైదరాబాద్ : ఆడవాళ్లకు సినిమా పరిశ్రమలోనే కాదు,
 దేవాలయాల్లాంటి ప్రదేశాలలో కూడా
 చేదు అనుభవాలు ఎదురౌతున్నాయి.
  - కోట్ బై కోవై సరళ
 ‘ప్రేమించడం హత్య చేసినంత మహా పాపం’.
 - కోట్ బై కోవై సరళ
 జీవితంలో ఎవరూ ఎవరి మీదా ఆధారపడకూడదు.
 - కోట్ బై కోవై సరళ
 సినిమాలే నా లైఫు, పర్సనల్ లైఫూ.
 - కోట్ బై కోవై సరళ
  కోట్ బై అని అంతా చెప్పుకునే స్థాయిలో
 చాలా పెద్ద జీవితాన్ని చూశారు కోవై సరళ!
 సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లోనే...
 జీవితం ఆమెను రెండు వైపుల నుంచి నొక్కేసింది!
 ఏం చెప్పినా చిటికెలో చేసేస్తుంది - ఒకవైపు
 ఆ అమ్మాయి ఉంటే మేం చెయ్యం - రెండో వైపు.
 ఇవాళ పిలిచి అడ్వాన్స్ ఇచ్చేవాళ్లు - ఒకవైపు
 మర్నాడు ఫోన్ చేసి ఇచ్చేయ్‌మనేవాళ్లు - రెండో వైపు.
 ఇంకా... ఇలాంటివే చాలా, చాలా, చాలా.
 అన్నిటినీ తట్టుకుని నిలబడ్డారు కోవై సరళ.
 ఈవారం ‘తారాంతరంగం’ చదవండి.
 అవడానికి కమెడియనే అయినా...
 ఆమె ప్రతి అనుభవంలో మీకు హీరోయినే కనిపిస్తుంది!
 ఎస్.
 వడివేలును కుమ్మినట్లు...
 పరిస్థితులతో తలపడి నిలబడిన ప్రతి స్త్రీ... హీరోయినే.

  సరళగారూ... మీ ఇంటి పేరు కోవైనా?
 కోవై సరళ: కాదు. మా తమిళంవాళ్లకి ఇంటి పేర్లుండవు. నాన్నగారి పేరు ఇంటిపేరు అవుతుంది. మా సొంత ఊరు కోయంబత్తూర్. ఆ సిటీని ‘కోవై’ అని పిలుస్తారు. ఆ ఊరినుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి, పత్రికలవాళ్లు కోవై సరళ అని రాయడం మొదలుపెట్టారు. దాంతో  అది పాపులర్ అయిపోయింది.

 అయితే  పుట్టి పెరిగిందంతా కోయంబత్తూర్‌లోనేనా?
 కోవై సరళ: అవును. నా బాల్యం, చదువూ అంతా అక్కడే. ప్లస్ టూ వరకూ చదివా. ఇంగ్లిష్, తమిళ్‌లో టైప్‌రైటింగ్ హయ్యర్ పాసయ్యాను. అప్పట్లో నేను టైప్ చేస్తుంటే.. అందరూ ఆశ్చర్యంగా చూసేవాళ్లు. అంత స్పీడ్ అన్నమాట. నాకు చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ఇష్టం. ప్లస్ టు తర్వాత సినిమాల్లోకి వెళదామనుకున్నాను కానీ ఇంట్లో ఒప్పుకోలేదు.

 మీ నాన్నగారు ఏం చేసేవారు?
 సరళ: లారీలు, బస్సులు ఉండేవి. ఆ బిజినెస్‌లో నష్టం వచ్చిన తర్వాత ఆయన ఓ ప్రైవేట్ ఉద్యోగంలో చేరారు. మా నాన్న మిలిటరీలో కూడా చేశారు. దాంతో స్ట్రిక్ట్‌గా ఉండేవారు. చిన్న పనైనా ఓ పద్ధతి ప్రకారం చేయాలనేవారు. సినిమాలకు వెళ్లనిచ్చేవారు కాదు. స్కూల్, ఇల్లు, టైప్‌రైటింగ్ క్లాస్ తప్ప వేరే ప్రపంచం తెలియదు.

 మీకు బ్రదర్స్, సిస్టర్స్ ఉన్నారా?
 సరళ: నలుగురు అక్కయ్యలు, ఓ అన్నయ్య. నాన్నగారు స్ట్రిక్ట్ అయినప్పటికీ నాకేదైనా కావాలంటే మారాం చేసి, మంకు పట్టు పట్టి మరీ సాధించుకునేదాన్ని. డ్రామాల్లో అయినా యాక్ట్ చేయనివ్వాలంటూ స్ట్రైక్ చేశాను. అయినా నాన్న మనసు కరగలేదు. దాంతో ఓ రోజంతా ఉపవాసం ఉన్నాను. ఇక, లాభం లేదనుకుని అనుమతించారు. ఒక డ్రామాలో యాక్ట్ చేశా. భలే అనిపించింది. అమ్మానాన్నను బతిమాలుకుని ఎలాగోలా 20 డ్రామాల్లో యాక్ట్ చేసేశాను. డ్రామాల ద్వారా సంపాదించిన అనుభవంతో సినిమాల్లో యాక్ట్ చేయొచ్చన్నది నా అభిప్రాయం.

 మరి... సినిమాల్లోకి రావడానికి ఎంత పెద్ద స్ట్రయిక్ చేశారేంటి?
 సరళ: లక్కీగా అలా చేయాల్సిన అవసరంలేదు. డెరైక్టర్ భాగ్యరాజాగారి ఇల్లు మా ఇంటి పక్కనే. నేను చిన్నప్పట్నుంచీ ఆయనకు తెలుసు. ‘‘పెద్దయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు?’’ అని ఆయన అడిగితే.. ‘సినిమా యాక్టర్’ అవుతా అనేదాన్ని. సినిమాల్లోకి రాకముందు భాగ్యరాజాగారు డ్రామాలు వేసేవారు. సినిమా డెరైక్టర్ అయిన తర్వాత, మా నాన్నగారికి ఆరోగ్యం బాగా లేకపోతే భాగ్యరాజాగారు చూడ్డానికి వచ్చారు. నన్ను చూసి, ‘‘ఏం చేస్తున్నావ్’’ అనడిగితే, ై‘టెప్‌రైటింగ్’ చేస్తున్నా అని చెప్పాను. ‘‘నేను ‘ముందానై ముడిచ్చు’ అనే సినిమా చేస్తున్నా. గోపిచెట్టిపాల్యంలో షూటింగ్ జరుగుతోంది. అక్కడికొస్తే, నీకు మంచి కేరక్టర్ ఇస్తాను’’ అన్నారాయన. చెప్పింది భాగ్యరాజాగారు.. పైగా సినిమాల మీద నా పిచ్చి బాగా ముదిరిందని గ్రహించి, పెద్దగా బతిమాలించుకోకుండానే అమ్మానాన్న పర్మిషన్ ఇచ్చారు. దాంతో హుషారుగా కోయంబత్తూర్ టు గోపిచెట్టిపాల్యం బస్సెక్కేశా.

 ఫస్ట్ టైమ్ షూటింగ్ ఎలా అనిపించింది?
 సరళ: అప్పటివరకు నాది చాలా చిన్నప్రపంచం. లొకేషన్లో చాలామందిని చూసి, ఆశ్చర్యం అనిపించింది. కానీ భయపడలేదు. యాక్టింగ్ అంటే ఇంట్రస్ట్ కాబట్టి, తడబడకుండా చేసేశాను. ‘ముందానై ముడిచ్చు’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

 వెంటనే బోల్డన్ని అవకాశాలు వచ్చి ఉంటాయేమో?
 సరళ: ఫలానా కేరక్టర్ చేసింది ఎవరు? అంటూ కొంతమంది దర్శక, నిర్మాతలు ఆరా తీశారు. అయితే నేను ‘ముందానై ముడిచ్చు’ సినిమా చేసి, కోయంబత్తూర్‌లోనే ఉండిపోయాను. అందుకని, నన్ను కాంటాక్ట్ చేయలేకపోయారు. ఆరు నెలలు గడిచిన తర్వాత ఇలా అయితే లాభం లేదనుకుని మద్రాసు వెళ్లాలని నిర్ణయించుకున్నా.

 ఊరు కాని ఊరికి పంపించడానికి ఇంట్లోవాళ్లు భయపడలేదా?
 సరళ: నాతో పాటు నాన్నగారు కూడా వచ్చారు. మద్రాస్‌లోని తేనాంపేటలో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాం. ఇక, నేను మద్రాసు వచ్చానని తెలుసుకుని, చాలామంది అప్రోచ్ అయ్యారు. ‘కళ్యాణరామన్’, ‘ఉయిరే ఉనక్కాగ’... ఇలా నేను చేసిన సినిమాలన్నీ వంద రోజులాడటం, నా కామెడీ నచ్చడంతో పాపులర్ అయ్యాను.

 అసలు సినిమాల మీద మీకు ఇష్టం ఏర్పడటానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
 సరళ: నేను ఎమ్జీఆర్‌కి వీరాభిమానిని. ఇంట్లో సినిమాలు చూడనిచ్చేవాళ్లు కాదని చెప్పాను కదా. అప్పుడప్పుడు గొడవపడో, బతిమాలుకునో ఎమ్జీఆర్ సినిమాకెళ్లేదాన్ని. తెరపై ఆయన కనిపించగానే అభిమానులు విజిల్స్ వేయడం, ఆరాధనగా చూడటం భలే అనిపించేది. మనం కూడా సినిమా ఆర్టిస్ట్ అయితే అలానే చూస్తారుగా అనుకునేదాన్ని. సో.. నేను ఆర్టిస్ట్ అవాలనుకోవడానికి ఓ కారణం ఎమ్జీఆర్ అనే చెప్పాలి.

 అది సరే... ఎవరైనా హీరోయిన్ అవ్వాలనుకుంటారు... మీరు కామెడీనే ఎందుకు టార్గెట్ చేశారు?
 సరళ: నా టార్గెట్ హీరోయినా, కమెడియనా, కేరక్టర్ ఆర్టిస్టా? అని కాదు. స్క్రీన్ మీద నా మొహం కనిపిస్తే చాలనుకున్నాను. పబ్లిక్‌లో కనిపించినప్పుడు ‘అదిగో కోవై సరళ...’ అని నన్ను గుర్తుపడితే ఈ జన్మ సార్ధకమైనట్లు అనుకునేదాన్ని. ఒకవేళ నేను హీరోయిన్‌కి టార్గెట్ చేసి, పరిస్థితుల ప్రభావం వల్ల కామెడీతో సరిపెట్టుకోవాల్సి వస్తే... చాలా అప్‌సెట్ అయ్యుండేదాన్ని.

 మీరు రంగప్రవేశం చేసే నాటికి కమెడియన్‌గా, కేరక్టర్ ఆర్టిస్ట్‌గా మనోరమ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. మరి... మీకేమైనా అభద్రతాభావం, భయం ఉండేవా?
 సరళ: నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ. సీన్ ఇలా చెప్పగానే అలా చేసేదాన్ని. చెట్లెక్కమంటే ఎక్కేసేదాన్ని, పై నుంచి దూకమంటే అమాంతంగా దూకేసేదాన్ని. దాంతో కోవై సరళ ఏం చెప్పినా, చిటెకెలో చేసేస్తుందని ప్రచారం జరిగింది. అలాగే నేను చేసే కామెడీ కూడా ప్రేక్షకులకు నచ్చడంతో అవకాశాలకు కొదవ ఉండేది కాదు. అందుకే, మనం పెట్టే బేడా సర్దుకుని కోయంబత్తూర్ వెళ్లాల్సి వస్తుందేమోననే భయం ఉండేది కాదు.

 మనోరమ.. ఆ తర్వాత మీరు... మీ తర్వాత పెద్దగా హాస్యనటీమణులు రాణించకపోవడానికి కారణం ఏంటి... మగవాళ్లల్లో చాలామంది కమెడియన్లు ఉన్నారు కదా?
 సరళ: తమిళ పరిశ్రమకు సంబంధించినంతవరకు మగవాళ్ల డామినేషన్ ఉంటుంది. లేడీస్‌కి తక్కువ ప్రోత్సాహం ఉంటుంది. అందుకే, మా తర్వాత లేడీ కమెడియన్స్ షైన్ అవలేదు. ఒకరిద్దరు వచ్చినా, పూర్తిగా ఇన్‌వాల్వ్ అవ్వలేకపోయారు. ఒకవేళ ఇన్‌వాల్వ్ అయినా ఎంకరేజ్‌మెంట్ లభించలేదు.

 నిజం చెప్పండి... ఇక్కడ మీకేమైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయా?
 సరళ: నన్ను పైకి రానివ్వకుండా చేయాలని కొంతమంది ట్రై చేశారు. ‘ఆ అమ్మాయి ఉంటే మేం సినిమా చెయ్యం’ అని నిర్దాక్షిణ్యంగా చెప్పేవాళ్లు. దాంతో నాకు కొన్ని అవకాశాలు పోయేవి.

 అలా చేసినవాళ్లెవరు?... ఆ డామినేషన్‌ని తట్టుకోవడానికి మీరేం చేసేవారు?
 సరళ: పేర్లు చెప్పను. నేను కామెడీ ఆర్టిస్ట్‌ని కాబట్టి, నా అవకాశాల విషయంలో హీరోల జోక్యం ఉండదు కదా. కొంతమంది కమెడియన్లే నాతో యాక్ట్ చేయకూడదనుకునేవాళ్లు. అయినా నా పని నేను చేసుకునేదాన్ని. ఓ పది సినిమాలు చేతిలో ఉన్నప్పుడు ఒకటీ రెండు సినిమాలు పోతే ఏమవుతుంది?

 అడ్వాన్స్ తీసుకున్న తర్వాత కూడా వెనక్కి వెళ్లిన అవకాశాలు ఉన్నాయా?
 సరళ: చాలా ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం వెయ్యి రూపాయలంటే పెద్ద విషయం. అప్పట్లో నేనో సినిమా కమిట్ అయ్యానంటే, వెయ్యిరూపాయలు అడ్వాన్స్ ఇచ్చేవారు. అయితే కొంతమంది కమెడియన్లు నేనుంటే.. యాక్ట్ చెయ్యనని చెప్పేయడంతో ఇచ్చిన అడ్వాన్స్‌ని వెనక్కివ్వమని అడిగేవాళ్లు. ఒక సినిమాకి అవకాశం వస్తే.. సంతోషంతో నాకా రోజంతా నిద్రపట్టేది కాదు. కానీ, ఉదయమే అడ్వాన్స్ వెనక్కివ్వమని ఫోన్ రావడమో, డెరైక్ట్‌గా మనిషి రావడమో జరిగేది. అప్పుడు బాగా ఏడ్చేదాన్ని. ఆ సమయంలో మా నాన్నగారు ఇచ్చిన ధైర్యాన్ని నేనెప్పటికీ మర్చిపోలేదు. ‘మనకేది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. నీకు టాలెంట్ ఉంది’ అంటూ ఊరడించేవారు. నాన్న ముందు కన్విన్స్ అయ్యేదాన్ని కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చేదాన్ని.

 ఆ బాధలో బ్యాక్ టు కోయంబత్తూర్ అనే నిర్ణయం ఎప్పుడైనా తీసుకున్నారా?
 సరళ: అంత పిరికిగా ఆలోచించలేదు. బాధపడుతూ ఇంట్లో కూర్చునేంత ఖాళీ ఉండేది కాదు. పైగా నేను చేసేది కామెడీ కాబట్టి.. షూటింగ్‌కి వెళ్లగానే బాధ తగ్గేది. అలాగే, ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. హాస్యనటుల కెరీర్ మహా అయితే 10, 15 ఏళ్లు ఉంటుంది. వాళ్లతో పోల్చితే నటీమణుల కెరీర్‌కి ఎక్కువ స్పాన్ ఉంటుంది. అందుకు ఉదాహరణ నా 30 ఏళ్ల కెరీరే. నా కళ్లముందే ఎంతోమంది మగ కమెడియన్లు వచ్చారు.. వెళ్లారు. కానీ, నేను మాత్రం అలానే ఉన్నాను. ఎంతమంది కమెడియన్లు వచ్చినా.. వాళ్లకి దీటుగా నిలబడగలననే విషయం నాకు చాలా త్వరగానే అర్థమైంది. దాంతో నా వెనక గోతులు తవ్వినా పట్టించుకునేదాన్ని కాదు. మహా అయితే నాలుగైదేళ్లు ఇతను ఉంటాడేమో.. కానీ మనకు లాంగెవిటీ ఉంటుందనే ఆత్మవిశ్వాసంతో ఉండేదాన్ని. అదే నిజమైంది.

 హాస్యనటుల కెరీర్ పదేళ్లే అని ఎలా అంటున్నారు... కోట, బ్రహ్మానందం, బాబుమోహన్, అలీ.. ఇలా చాలామంది ఏళ్ల తరబడి ఏలుతున్నారు కదా?
 సరళ: నేను చెప్పింది తమిళ పరిశ్రమ గురించి. నాకు తెలిసి తెలుగులో డెరైక్టర్, ప్రొడ్యూసర్, రైటర్స్ సెలక్ట్ చేసిన కమెడియన్లనే ఎన్నుకుంటున్నారనిపిస్తోంది. తమిళంలోలా ‘నేను కోవై సరళతో యాక్ట్ చేయను’ అని చెప్పే కమెడియన్లు ఇక్కడ లేరు. అందుకే, నాకిక్కడ అవకాశాలొస్తున్నాయి.

 ఇలాంటి పరిస్థితిలో ‘సతీలీలావతి’లో మిమ్మల్ని కమల్‌హాసన్ హీరోయిన్‌గా ఎంపిక చేసినప్పుడు ఎలా అనిపించింది?
 సరళ: ఆయన సినిమాలో నేను కామెడీ కేరక్టర్స్ చేశాను.ఆ విధంగా కమల్‌తో  నాకు మంచి అనుబంధం ఉంది. నా మేనేజర్ వచ్చి ‘కమల్‌సార్ సరసన మీరు హీరోయిన్‌గా నటించాలి’ అన్నాడు. జోక్‌లేసి నవ్వించే నాకే జోక్ చెబుతున్నావా? అనడిగాను. ‘కాదు మేడమ్.. సీరియస్‌గానే చెబుతున్నా’ అనడంతో నమ్మకం కుదిరింది. ఆ సినిమా ఓ మర్చిపోలేని మంచి అనుభవం.

 మీకు బాగా పేరొచ్చాక కూడా, మిమ్మల్ని తొక్కాలని ఎవరైనా ప్రయత్నించారా?
 సరళ: ప్రయత్నించారు. అయితే నాకు పేరొచ్చేసింది కాబట్టి... మొహం మీద చెప్పేవాళ్లు కాదు. లేడీ కమెడియన్‌గా ఎవరు చేస్తున్నారు? అని అడిగి, ‘ఆవిడా.. అయితే మా డేట్స్ ఖాళీగా లేవు’ అని చెబుతుంటారు. ఆ విధంగా ఎవరెవరు చెబుతున్నారో నాకర్థమయ్యింది. అందుకని, నిర్మాతలను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక, ‘ముందు ఆ ఆర్టిస్ట్ దగ్గర డేట్స్ ఓకే చేయించుకోండి. ఒకవేళ ఆయన ఇస్తే.. నాకేం అభ్యంతరం లేదు’ అని చెబుతుంటాను. కానీ, ఆ నిర్మాతలు ఆ తర్వాత నాతో టచ్‌లోకి రారు. అది నేనూహించిందే కాబట్టి, నవ్వేసి ఊరుకుంటాను.

 ఎందుకని మీరంటే ఆ ‘కొంతమంది ఆర్టిస్ట్’లకు పడదు?
 సరళ: ఒకవేళ యాక్టింగ్‌లో డామినేట్ చేస్తాననో లేక వాళ్లకి ఈక్వల్‌గా యాక్ట్ చేస్తున్నాననే ఫీలింగ్ వల్లో... లేకపోతే ఇంకా ఏమైనా కారణాలున్నాయేమో నాకు తెలియదు.

 జనరల్‌గా సినిమా నిడివి ఎక్కువైతే.. కత్తెర పడేది దాదాపు కమెడియన్ల పాత్రలకే. మీ విషయంలో అలా జరిగిన సందర్భలున్నాయా?
 సరళ: లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. ఈ పాత్ర మనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఓ నమ్మకంతో చేసి, ఆ సినిమా విడుదల కోసం బాగా ఎదురు చూసేదాన్ని. కానీ, సినిమా నిడివి పెరిగినందున నా పాత్ర నిడివి ఆటోమేటిక్‌గా తగ్గిపోయేది. దాంతో రావాల్సినంత పేరు వచ్చేది కాదు. అప్పుడు చాలా నిరుత్సాహపడేదాన్ని. కొన్ని ఎదురు దెబ్బలు మనకు మంచి పాఠాలవుతాయి. ఆ పాఠాలు మన దిశను నిర్దేశిస్తాయి. ఆ విధంగా సినిమాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే నేను ఎంచుకున్న దిశ ‘ఆధ్యాత్మికం’.

 ఏ వయసులో ఈ దారిని ఎంచుకున్నారు?
 సరళ: అది కరెక్ట్‌గా చెప్పలేను. చిన్నప్పట్నుంచే నా ఆలోచనలు ఆధ్యాత్మికంగా ఉండేవి. అయితే ఆ వయసులో దాని పేరు ఆధ్యాత్మికం అని తెలిసే అవకాశం లేదు కదా. పెద్దయిన తర్వాత వివేకానంద, ఓషో పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. ఆధ్యాత్మికతకు సంబంధించిన క్లాస్‌లకు వెళ్లేదాన్ని. ‘జీవితం నిరంతరం కాదు. ఎప్పటికైనా మట్టిలో కలవాల్సిందే. ఈ రోజు ఉన్నాం. రేపు ఉంటామో లేదో తెలియదు. అందుకని ఈరోజు నవ్వుతూ, హాయిగా ఉందాం. చుట్టుపక్కలవాళ్లని సంతోషపెడదాం’ అనేంత మానసిక పరిపక్వత నాలో రావడానికి కారణం ఆ పుస్తకాలే.

 ఓషో ద్వారా ఇంకా ఎలాంటివి తెలుసుకున్నారు?
 సరళ: ఉదాహరణకు చెయ్యి మీద పెద్ద దెబ్బ తగిలిందనుకుందాం. ‘రక్తం కారుతోంది’ అని మాత్రం అనుకుంటే, నొప్పి తెలియదు. బాగా నొప్పిగా ఉంది అనుకుంటే, నొప్పి తెలుస్తుంది. అసలు నొప్పే లేదనుకుంటే, నిజంగానే నొప్పి తెలియదు. నేనిది టెస్ట్ చేసి చూసుకున్నా. ఓషో బుక్స్ వల్ల దేన్నయినా తేలికగా తీసుకునే పరిపక్వత వచ్చేసింది.

 తెలుగులో మీ పాత్రలకు ఎంచక్కా డబ్బింగ్ చెప్పేస్తున్నారు. అసలు తెలుగు ఎలా నేర్చుకున్నారు?
 సరళ: నా డైలాగులన్నీ తమిళంలో రాసుకుని, బట్టీపట్టి లొకేషన్లో చెప్పేస్తుంటాను. తెలుగులో నేను డబ్బింగ్ చెప్పడానికి మొదటి కారణం కోడి రామకృష్ణగారు. ‘పెళ్లాం చెబితే వినాలి’ అప్పుడు ఆయన డబ్బింగ్ చెప్పమన్నారు.. ఆ సినిమాకి కో-డెరైక్టర్‌గా చేసిన రాధాకృష్ణ దగ్గరుండి మరీ నాతో డబ్బింగ్ చెప్పించారు. నాకు బాగానే పేరొచ్చింది.. కానీ నాతో డబ్బింగ్ చెప్పించి, ఆయనకు చుక్కలు కనిపించాయి (నవ్వుతూ). తెలుగు మాట్లాడటానికి నేను ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. తమిళ్ ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడేస్తాను. ఆ శ్లాంగ్ అందరికీ నచ్చడం నా లక్.

 మీ సినిమాల్లో కమెడియన్స్‌ని ఫుట్‌బాల్ ఆడేస్తుంటారు. అసలు ఈ కొట్టడం అనేది ఎవరితో మొదలైంది?
 సరళ: వడివేలుతో మొదలుపెట్టా. అది బాగా పండటంతో అప్పట్నుంచి నాతో కొట్టించడం ఆనవాయితీ అయ్యింది.

 ఈ కొట్టే ప్రక్రియ ఓవర్‌గా ఉంటుందనే విమర్శ ఉంది...?
 సరళ: ఏ కొద్దిమందో అంటున్నారేమో. కానీ, మొగుడూ పెళ్లాలూ కొట్టుకోవడం నేను రోడ్డు మీద చాలా చూశాను. మందు కొడితే చాలు.. మృగంలా మారిపోయి, భార్యలను రోడ్డు మీద కొట్టే మగవాళ్లను స్వయంగా చూశాను. అది తట్టుకోలేక తిరగబడ్డ ఆడవాళ్లనూ చూశాను. నేను కొట్టడం ఓవర్ అని మీరంటున్నారు. కానీ, చాలామంది ఆడవాళ్లు.. ‘‘మేడమ్... మీరే మాకు ఇన్‌స్పిరేషన్. మా మగవాళ్లు అడ్డదిడ్డంగా బిహేవ్ చేసినప్పుడు ‘కోవై సరళలా మారతాం... జాగ్రత్త అని బ్లాక్‌మెయిల్ చేస్తుంటాం’’ అంటుంటారు. మగవాళ్లకు నా మీద కోపం ఉంటుందేమో. కానీ, ఆడవాళ్లు తమను తాము రక్షించుకోవడం కోసం నా పేరు వాడుకోవడం నాకు బాగానే అనిపిస్తోంది.

 కొంచెం ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే... సినిమా పరిశ్రమలో ఆడవాళ్లు చాలా విషయాల్లో రాజీపడాలంటారు. హీరోయిన్ నుంచి కామెడీ ఆర్టిస్ట్‌ల వరకూ ఇది వర్తిస్తుందా?
 సరళ: హీరోయిన్ల నుంచీ కామెడీ ఆర్టిస్ట్‌ల వరకు కాదు.. జూనియర్ ఆర్టిస్టులకూ ఇది వర్తిస్తుంది. అయితే ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. మన దగ్గర బిర్యానీ తినడానికి డబ్బులు లేకపోతే పచ్చడి మెతుకులతో సరిపెట్టుకోవాలనుకుంటే.. ఏ విషయంలోనూ రాజీపడాల్సిన అవసరంరాదు. కానీ, బిర్యానీయే తినాలనుకుంటే మాత్రం రాజీ పడాలి.

 రాజీపడకపోతే.. అవకాశాలు రావంటారు?
 సరళ: ఒకట్రెండు సినిమాలు పోతాయేమో. దానికే కంగారుపడిపోతే రాజీపడాలనే ధోరణి మొదలవుతుంది. కానీ, మనకు రావాలని రాసి పెట్టి ఉంటే, వచ్చే అవకాశాలను ఎవరూ ఆపలేరు. నాకు చాలా సినిమాలు మిస్ అయ్యాయి. అయినా డోంట్ కేర్ అన్నట్లుగానే వ్యవహరించాను. ఆడవాళ్లకు సినిమా పరిశ్రమలోనే కాదు.. దేవాలయాల్లాంటి స్కూల్స్, కాలేజ్‌లు, హాస్పిటల్స్‌లో కూడా చేదు అనుభవాలు ఎదురవుతాయి. వాటి నుంచి తప్పించుకునే నేర్పు ఉంటే, సేఫ్‌గా వెళ్లిపోవచ్చు.

 ఇక... మీ తోడబుట్టినవాళ్లతో మీ అనుబంధం గురించి?
 సరళ: నా అక్కయ్యల పిల్లలు నా దగ్గరే పెరిగారు. అందర్నీ చదివించాను. ఒకబ్బాయి దుబాయ్‌లో, ఇద్దరు యూఎస్‌లో, ఒకరు లండన్‌లో... ఇలా అందరూ మంచి జాబ్స్‌లో సెటిలయ్యారు.

 మీ నలుగురు అక్కలు చక్కగా పెళ్లి చేసుకుని, సెటిలయ్యారు.. మీకెప్పుడూ పెళ్లి చేసుకోవాలనిపించలేదా?
 సరళ: పెళ్లి గురించి ఆలోచించలేనంత బిజీగా ఉండేదాన్ని. సినిమాలు తప్ప నా పర్సనల్ లైఫ్ ఇలా ఉండాలని ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. పైగా సమాజంలో ఎన్నో విడాకుల కేసులు చూశాను. ఇక పెళ్లెందుకు అనిపించేసింది.

 అమ్మానాన్న పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయలేదా?
 సరళ: పెళ్లి చేసుకో అన్నారు. ఇష్టం లేదంటే, వదిలేశారు. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ అని చెప్పాను కదా. స్కూల్‌కి వెళ్లేటప్పుడు వంచిన తల ఎత్తకూడదు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ఇలా ఓ స్ట్రిక్ట్ వాతావరణంలో పెరిగినందువల్లో ఏమో నాకు ప్రేమ మీద కూడా దృష్టి మళ్లలేదు. ఒకవేళ అప్పట్లో ఎవరితోనైనా ప్రేమలో పడి ఉంటే, పెళ్లి చేసుకుని ఉండేదాన్నేమో. కానీ, నేను లవ్‌కి ఆపోజిట్. ప్రేమించడం అనేది హత్య చేసినంత మహా పాపం అని నా మనసులో బలంగా ముద్రించుకుపోయింది.

 మరి.. మీకు ఎవరూ ‘ఐ లవ్ యు’ చెప్పలేదా?
 సరళ: నన్ను చూసి ఎవరైనా ‘ఐ లవ్ యు’ చెబుతారా? నేను చేసిన కేరెక్టర్ల ప్రభావం నా జీవితం మీద కూడా పడి ఉంటుందేమో. సినిమాల్లో సహ నటులను ఓ రేంజ్‌లో కొట్టే నేను నిజజీవితంలో కూడా అలానే ఉంటాననుకుని ఉండొచ్చు. అందుకని, ఎవరూ నాకు ప్రపోజ్ చేయలేదు.

 వయసులో ఉన్నంతవరకూ ఓకే. కానీ, వయసు మీద పడిన తర్వాత ఓ తోడు ఉండాలంటారు కదా?
 సరళ: పుట్టినప్పుడు మనం ఒంటరిగానే పుడతాం. ఇది మీ అమ్మ.. ఇది నాన్న... వీళ్లు నీ అక్క, చెల్లెళ్లు అని ఎవరో ఒకరు చెబితేనే మనకు తెలుస్తుంది. దాంతో ‘మనవాళ్లు’ అనే భావన మొదలవుతుంది. పెరిగే కొద్దీ అనుబంధం బలపడుతుంది. కానీ, పెళ్లి చేసుకున్న తర్వాత ‘నా కుటుంబం’ అనే భావన మొదలవుతుంది. అప్పుడు తోబుట్టువుల మీద కొంత ప్రేమ తగ్గుతుంది. అలా మెల్లి మెల్లిగా దూరం పెరిగిపోతుంది. ఒకవేళ పెళ్లి చేసుకున్నామే అనుకోండి. భర్త చనిపోతే ఒంటరిగా బతకాల్సిందేగా. అందుకే నేను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయా. నా దృష్టిలో జీవితంలో ఎవరూ ఎవరి మీదా ఆధారపడకూడదు.

 పెళ్లి చేసుకున్న తర్వాత తోడబుట్టినవాళ్లతో అనుబంధాలు తగ్గుతాయన్నారు. మీవాళ్లు ఆ జాబితాకి చెందినవారేనా?
 సరళ: ఎంతో కొంత ఆ జాబితాకే చెందుతారు. పెళ్లయిన తర్వాత వాళ్లల్లో మార్పొచ్చింది. ‘నా కుటుంబం, నా పిల్లలు, నా సమస్య’... అంటూ నన్ను వేరు చేసి మాట్లాడుతున్నారు. ‘ఓకే.. నాకు మంచి పాఠం నేర్పించారు’ అని డెరైక్ట్‌గా వాళ్లతోనే చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి.

 మీవాళ్లు అలా చేయడం బాధగా లేదా?
 సరళ: నేను కూడా మనిషేనండి. ఓషో, వివేకానంద పుస్తకాలు చదివినంత మాత్రాన ప్రతి విషయాన్ని తేలికగా తీసేసుకుంటానని అనుకోవద్దు. అయితే ఒకే ఒక్క విషయంలో నేను ఆనందపడ్డాను. మంచి వయసులో ఉన్నప్పుడే నాకు అందరి మనస్తత్వాలు అర్థం అయ్యాయి. అదే నేను బాగా ముసలిదాన్ని అయిన తర్వాత తెలిసిందనుకోండి.. ఆ వయసులో తట్టుకునేంత ధైర్యం నాకు ఉండేది కాదు. ఇప్పుడు నాకు బాగా స్టామినా ఉంది. మానసికంగా చాలా ధైర్యం ఉంది. అందుకే, తట్టుకున్నాను.

 అసలు మీ లైఫ్‌స్టయిల్ ఎలా ఉంటుంది?
 సరళ: చాలా నార్మల్‌గా. కొన్ని రోజులు ఉదయం ఐదున్నర గంటలకు వాకింగ్ వెళుతుంటాను. బద్దకం అనిపించినప్పుడు మానేస్తా. చెబితే నమ్మరు కానీ.. పదేళ్ల క్రితం రాత్రి రెండున్నర గంటలకు నిద్రలేచి, మూడుగంటలకల్లా మెరీనా బీచ్‌కి వెళ్లేదాన్ని. ఓ గంట వాక్ చేసి, నాలుగున్నరకి ఇంటికొచ్చేసేదాన్ని. ఆ తర్వాత మేకప్ చేసుకుని ఏడుకల్లా షూటింగ్‌కి వెళ్లేదాన్ని. అలా ఆరు నెలలు చేశాను. ఆ తర్వాత కొన్నాళ్లు వాకింగ్ మానేశాను. ఇంట్లోనే త్రెడ్‌మిల్ మీద వాక్ చేసేదాన్ని. అది వర్కవుట్ కాలేదు. ఈ మధ్య ఉదయం నాలుగున్నరకల్లా నిద్ర లేచి, వాకింగ్, చిన్నపాటి వ్యాయామాలు చేస్తున్నాను. ఆ తర్వాత సింపుల్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. నాన్‌వెజ్ పెద్దగా తినను.

 ఫైనల్‌గా కథానాయికల కెరీర్‌కన్నా మీ కెరీర్‌కి లాంగ్విటీ ఎక్కువ కాబట్టి.. ఎప్పుడైనా హీరోయిన్స్‌కన్నా మనమే బెస్ట్ అనిపించిందా?
 సరళ: హీరోయిన్‌గా చేసి ఉంటే.. ఇప్పుడు ‘సాక్షి’కి ఈ ఇంటర్వ్యూ ఇచ్చి ఉండేదాన్ని కాదేమో. మా కోయంబత్తూర్‌లో పాత రోజులను నెమరువేసుకుంటూ కాలక్షేపం చేసేదాన్నేమో. 1983లో సినిమాల్లోకొచ్చాను. ఒకవేళ హీరోయిన్ అయ్యుంటే ఐదు, పదేళ్లకే వెనక్కి వెళ్లిపోయుండేదాన్ని. కామెడీలో ఉన్నాను కాబట్టే 30 ఏళ్లయినా స్టేల్ అవ్వలేదు. ఇప్పటికీ ‘కోవై సరళ’ కామెడీ బోర్ కొట్టలేదు. అందుకే, ‘కామెడీలో నేనే హీరోయిన్’ అనుకుంటాను. నా భర్త, నా పిల్లలు, నా హాబీ సినిమాలే. చివరి శ్వాస వరకు యాక్ట్ చేయాలన్నదే నా కోరిక.

 - డి.జి. భవాని

 మీరు ఎవరితోనూ ఫోన్‌లో టచ్‌లో ఉండరు... ఎందుకు?
 సరళ: ఫోన్లో మాట్లాడటం నాకు అలర్జీ. ఎవరైనా గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతుంటే, అంతసేపు ఎలా మాట్లాడుతున్నారు? అనుకుంటాను. మీకో విషయం చెప్పనా? ఆరు నెలల క్రితం వెయ్యి రూపాయలతో రీచార్జ్ చేయించు కున్నాను. ఇప్పటికీ నా ఫోన్‌లో బాలెన్స్ ఉంది. దాన్ని బట్టి ఎంత మితంగా ఫోన్ వాడతానో అర్థం చేసుకోవచ్చు.

 ఫంక్షన్స్‌లో కూడా ఎక్కువ కనిపించరు?
 సరళ: ఫంక్షన్స్‌కి వెళ్లడం చాలా తక్కువ. ఫంక్షన్‌కి వెళ్లాలనుకోండి... దానికోసమే ప్రత్యేకంగా తయారవ్వాలి. తయారై, ట్రాఫిక్‌ని కూడా లెక్క చేయకుండా వెళ్లిన తర్వాత అక్కడ జరిగేది ఏంటి? ‘బాగున్నారా..’.. ‘ఆ బాగున్నాను’ అంటూ పలకరింపులు. వెనక్కి తిరగ్గానే ‘ఆ ఏం బాగులే...’ అని వెక్కిరింతలు. పెదాల మీద నవ్వుని మెయిన్‌టైన్ చెయ్యాలి. ఇంటికొచ్చేసరికి ఆ నవ్వు తాలూకు బుగ్గల నొప్పిని భరించాలి. ఇవన్నీ ఎందుకు? అని ఫంక్షన్స్‌ని తగ్గించేశాను.


 ఓ సినిమా సక్సెస్ అయితే హీరో, డెరైక్టర్, హీరోయిన్స్‌కి ఎక్కువ క్రెడిట్ ఇస్తారు. ఆ తర్వాతే కమెడియన్స్ గురించి మాట్లాడుకుంటారు. దీని గురించి మీరేమంటారు?

 సరళ: నాకు సంబంధించినంతవరకు అది కరెక్టే అంటాను. ఎందుకంటే, హీరోలు నిజంగానే కష్టపడాలి. ఫిజిక్ మెయిన్‌టైన్ చెయ్యాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలు కంపల్సరీ. ఆహార విషయాల్లో కూడా చాలా నియమాలుంటాయి. ఇక, ఫైట్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. సినిమా మొత్తం దాదాపు హీరో మీదే నడుస్తుంది కాబట్టి.. ఎక్కువ శాతం క్రెడిట్ వాళ్లకే ఇవ్వాలి. హీరోయిన్స్ కూడా సన్నగా మెరుపు తీగలా ఉండాలి కాబట్టి... నచ్చిన ఆహారం తినలేరు. డ్యూయెట్ సాంగ్స్‌లో డాన్సులు చేయడం చిన్న విషయం కాదు. అందుకని, హీరోయిన్‌కీ క్రెడిట్ ఇవ్వాలి. సినిమా మొత్తాన్ని ఏకతాటిపై నడిపించేది దర్శకుడు, అసలా సినిమా తీయడానికి కారణం ప్రొడ్యూసర్ కాబట్టి.. ముందు వాళ్ల గురించే మాట్లాడాలి. ఇక, ఆ తర్వాతి క్రెడిట్ విలన్, కమెడియన్స్, క్యారక్టర్ ఆర్టిస్ట్‌లకు దక్కుతుంది.
http://www.sakshi.com/news/family/exclusive-interview-with-kovai-sarala-76157?pfrom=home-top-story
22:43 - By Swathi 0

Sunday, 20 October 2013

JAYAPRAKASH REDDY

నాటకాలు వేయకపోతే నాన్నగారు తిట్టేవారు!


నాటకాలు వేయకపోతే నాన్నగారు తిట్టేవారు!
విలనీ, కామెడీ... ఏదైనా జయప్రకాశ్‌రెడ్డికి సునాయాసమే. పైకి విలన్‌గా కనిపిస్తారు కానీ, చేసే పనులూ సేవాకార్యక్రమాలూ చూస్తే ఎవరైనా సరే జేపీని ఓ హీరోగా చూస్తారు. పాతికమంది పిల్లలకు విద్యాదానం చేస్తున్నారాయన. నటుడిగా తనకు ఓ దారి చూపించిన రంగస్థల వైభవాన్ని పునరుద్ధరించడానికి కంకణం కట్టుకున్నారు. ఈ కమర్షియల్ యుగంలో కూడా నిజాయితీ, ఆత్మసంతృప్తి అని మాట్లాడే జేపీతో జరిపిన ప్రత్యేక భేటీ.
 
 మీ ఆహార్యం విలన్ పాత్రలకు యాప్ట్ అయినా కామెడీ కూడా చేస్తున్నారు. ఈ రెంటిలో మీకేది ఇష్టం?
 మొదట్నుంచీ హాస్యం అంటేనే ఇష్టం. అయితే సినిమాల్లో సీరియస్ కేరక్టర్స్‌కే బాగా పేరొచ్చింది. వరుసగా అలాంటి అవకాశాలే వచ్చాయి. తర్వాత తర్వాత నాలో కామెడీ టింజ్ చూసి, దర్శకులు ఆ తరహా పాత్రలు చేయిస్తున్నారు. అంతకు ముందు ఆడవాళ్లు, చిన్నపిల్లలు నా దగ్గరకు రావడానికి భయపడేవాళ్లు. కానీ, ఇప్పుడందరూ వచ్చి మాట్లాడుతున్నారు.
 
 మీ డ్రీమ్ కేరెక్టర్?
 అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంటుంది. నా నటనలో ఎప్పుడూ మూస కనపడదు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, గోదావరి, నెల్లూరు... ఇలా ఏ శ్లాంగ్‌లోనైనా మాట్లాడగలనని నిరూపించుకున్నాను. నేను డెరైక్టర్స్ ఆర్టిస్ట్‌ని. దర్శకులు ఎలా కావాలంటే అలా చేస్తాను. ఇక, నా డ్రీమ్ రోల్ విషయానికొస్తే...  ప్రేక్షకులతో కంట తడిపెట్టించి,  హృదయానికి హత్తుకునే పాత్ర ఎప్పటికైనా చేయాలని ఉంది.
 
 అసలు ఏ ఆశయంతో నటుడయ్యారు.. దాన్ని నెరవేర్చుకోగలిగారా?
 ఆశయం అంటూ ఏదీ లేదు. మా నాన్నగారు మంచి రంగస్థల నటుడు.  కానీ, పోలీస్ ఉద్యోగం వల్ల నటించలేకపోయారు. అందుకే నాన్నగారు నన్ను రంగస్థల నటుణ్ణి చేయాలనుకున్నారు. నాకూ అదే ఇష్టం. అందుకని కళాకారుడినయ్యాను. అట్నుంచి సినిమాల్లోకొచ్చా.
 
 నటుడిగా బిజీ అయ్యాక కూడా నాటకాలు ప్రదర్శిస్తున్నారు కదా?
 ఆంధ్రదేశంలో ప్రతి ముఖ్య పట్టణంలో ప్రతి ఆదివారం ఒక నాటక ప్రదర్శన జరగాలనేది నా కల. ఎందుకంటే మంచి నటీనటులు ఉన్నారు. నాటకాలను ఆదరించే అభిరుచి గల ప్రేక్షకులు ఉన్నారు. దాతలు కూడా ఉన్నారు. కానీ, వీటిని కో-ఆర్డినేట్ చేసేవాళ్లు లేరు. నా వంతు ప్రయత్నంగా నేను గుంటూరులో ‘జేపీ నెల నెలా నాటక సంఘం’ పేరుతో ఓ సంస్థ ప్రారంభించాను. ప్రతినెలా రెండో ఆదివారం ఓ చక్కని నాటకం చూపించాలన్నది నా ఆశయం.
 
 సినిమాల వల్ల ఆర్థికంగా మీకు లాభం ఉంటుంది.. మరి నాటకాల సంగతేంటి?
 సినిమాలు చేస్తే నా జేబులోకి డబ్బులొస్తాయి. కానీ నాటకాలు చేస్తే జేబులోంచి డబ్బులు పోతాయి. అయితే, నాటకాలనేది  డబ్బు కోసం కాదు. సంతృప్తి కోసం. డబ్బులు కోసం చేసే సినిమాల ద్వారా కూడా నాకు ఆత్మసంతృప్తి లభిస్తుంది. ఓ పది, పదిహేనేళ్లు సినిమా రంగంలో నానా కష్టాలు పడిన తర్వాత ‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో నాకో సీటు లభించింది. ‘సమరసింహారెడ్డి’తో బెర్త్ కూడా కన్‌ఫార్మ్ అయ్యింది. అక్కణ్నుంచీ చాలా అవకాశాలు వస్తున్నాయి. ఓ నటుడిగా అవకాశాలు రావడమే గొప్ప. అందుకే, సినిమాలు వదులుకోను.
 
 టీచర్ వృత్తి నుంచి సినిమాలకు వచ్చారు. ఆ ప్రయాణం గురించి?
 మా నాన్నగారు సాంబిరెడ్డి నిజాయితీ గల పోలీసాఫీసర్. ఆయన ఆల్ ఇండియా కబడ్డీ చాంపియన్. స్పోర్ట్స్ కోటాలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా జాబ్ వచ్చింది. సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా చేశారు. డీఎస్‌పీగా, ఆ తర్వాత అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యారు. లంచం తీసుకోని వ్యక్తి. మా నాన్నగారితో పాటు చేసినవాళ్లందరూ బాగా సంపాదించుకున్నారు. కానీ, మా తాతగారు సంపాదించినది 90 శాతం అమ్మేశారు నాన్నగారు. అంతటి సిన్సియర్ పోలీసాఫీసర్. మామూలుగా చాలామంది ఇళ్లల్లో నాటకాల్లో నటిస్తే తిడతారు. కానీ, మేం ఎప్పుడైనా పదిరోజులు నాటకాలు వేయకపోతే నాన్నగారు తిట్టేవారు. నేను, నా ఇద్దరు తమ్ముళ్లు, నా చెల్లెలు.. లంచం తీసుకునే ఉద్యోగాలు చేయకూడదన్నది నాన్నగారి నిర్ణయం.
 
 నేను డిగ్రీ పాసవ్వగానే..  కమర్షియల్ టాక్స్, ఇన్‌కమ్ టాక్స్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, రైల్వేశాఖల్లో నాకు జాబ్ వచ్చింది. కానీ, నాన్నగారు వద్దన్నారు. ఉపాధ్యాయుడిగా చేయమన్నారు. ఆయన కోరిక ప్రకారమే మున్సిపల్ హై స్కూల్‌లో టీచర్‌గా చేరాను. చాలా మనస్ఫూర్తిగా పని చేశాను. ఆ తర్వాత హెడ్‌మాస్టర్ అయ్యాను. సినిమాల్లోకి వచ్చిన తర్వాత వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నాను. మా నాన్నగారు ఎప్పుడూ ‘ఆల్ హ్యాపీస్.. నో వర్రీస్’ అని ఓ స్లోగన్  చెబుతుండేవారు. నేనలానే ఉంటాను. అందుకే ఇప్పటివరకు నాకు బీపీ లేదు. మా నాన్నగారు మాకు ఇచ్చిన ఆస్తి ఆత్మసంతృప్తి. అందుకే ఆయన్ను నిత్యం స్మరించుకుంటుంటాను.

http://www.sakshi.com/news/movies/my-father-will-scold-if-i-didnt-act-in-drama-74298?pfrom=home-movies
10:49 - By Swathi 0

Swathi

పెళ్లి చేసుకుందాం అని కాదు...పెళ్లంటే ఏంటా? అని ఆలోచిస్తున్నాను...

హైదరాబాద్ : తనకెంతో పేరు తెచ్చిపెట్టిన ‘కలర్స్’ ప్రోగ్రామ్‌ను తన పేరుకు జత చేసి పిలిస్తే స్వాతికి ఎందుకిష్టం ఉండదు?
 డాక్టర్ కావాలని బలంగా అనుకున్న స్వాతి యాక్టర్‌గా మిగలడం వెనుక ఉన్న ‘సైకో’ ఎవరు?
 తనను విక్రమ్‌తో, నిఖిల్‌తో జతకడుతూ వస్తున్న రూమర్లపై స్వాతి ఏమంటుంది?
 పార్టీలకు గాని మరెక్కడికిగాని వెళ్లడానికైనా ఏ టైమ్‌లోనైనా ఎటువంటి జంకూ గొంకూ లేకుండా స్వాతి ‘ఎస్’ చెప్పే ఆ సిక్స్‌ప్యాక్ హీరో ఎవరు?
 ఎంతో నాజూకుగా, చిన్నపిల్లలా కనిపించే స్వాతి ఏకంగా ‘స్కార్పియన్’ని తినాలని ఎందుకనుకుంది?
 ఈ ప్రశ్నలకు సమాధానం... రంగుల ప్రపంచంలోకి వెళ్లడానికి ముందే రంగుల్ని తన ఇంటిపేరుగా మార్చుకున్న రష్యన్ అమ్మాయి  స్వెత్లానా అలియాస్ స్వాతిరెడ్డి అలియాస్ కలర్స్ స్వాతి.
 సినిమారంగంలో పదేళ్ల వయసున్న స్వాతి ‘తారాంతరంగం’ ఈ వారం.

రష్యాలో పుట్టారు కదా...
 స్వాతి: అవును. వ్లాదివోస్టాక్ అనే పోర్ట్‌ప్లేస్‌లో పుట్టాను. నాన్న నేవీలో చేసేవారు. ఆయన ఉద్యోగరీత్యానే ముంబయికి వచ్చాం. ఆ తర్వాత వైజాగ్, తర్వాత హైదరాబాద్!

 మరి స్వెత్లానా ఎలా స్వాతి అయ్యారు?

 స్వాతి: రష్యన్ పేరెందుకు... మన భాష పేరు పెట్టుకోవాలని ముంబయి వచ్చాక అమ్మ నా పేరు మార్చింది.  నాకన్నా ఆరేళ్లు పెద్దయిన అన్నయ్య పేరు సిద్ధార్థ. ఇద్దరి పేర్లూ ‘ఎస్’ తో మొదలైతే బాగుంటుందని నాకు స్వాతి అని పెట్టారు.

 మీరు పుట్టిన రష్యాకు మళ్లీ ఎప్పుడైనా వెళ్లారా?
 స్వాతి: సరిగ్గా నెలన్నర క్రితమే వెళ్లాను. పసిఫిక్ మెరిడియన్ అని ఫిలింఫెస్టివల్ 11వ వార్షికోత్సవం చేశారు. నేను పుట్టిన వ్లాదివోస్టాక్‌లో ఈ అంతర్జాతీయ చిత్రోత్సవం జరిగింది. భారతీయ సినిమాకు 100ఏళ్లు అయిన సందర్భంగా మన సినిమావాళ్లని కూడా ఆహ్వానించారు.  ముఖ్యంగా వ్లాదివోస్టాక్‌లో  పుట్టి, ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగంలో రాణిస్తున్నవారిని గుర్తించి ఆహ్వానించారు. అలా నాకు కూడా ఆహ్వానం అందింది. వెళ్లాను.. చాలా హ్యాపీగా అనిపించింది. నేను పుట్టిన ఆసుపత్రి వార్డు, నా ఫస్ట్ హౌస్ చూశాను.  ఫొటోలు దిగాను. చాలా మెమరబుల్!

 మీ అన్నయ్య గురించి...

 స్వాతి: మా అన్నయ్య, నేను చాలా క్లోజ్‌గా ఉంటాం. ‘కలర్స్’ ప్రోగ్రాం టైమ్‌లో ‘బాబోయ్... ఇంట్లో కూడా దీని గోల, టివిలో కూడా దీని గోలే’ అనేవాడు. ‘చానెల్ అయితే మార్చేసుకోవచ్చు కానీ ఇంట్లో అలా కుదరదుగా’ అంటే ‘అదే ఛస్తున్నానురా బాబూ’ అనేవాడు.

 డాక్టర్ అవబోయి యాక్టర్ అయినవారిలో మీరూ...
 స్వాతి: నిజంగా అవుదామనుకున్నానండీ. ఇప్పటికీ అప్పుడప్పుడు బాధేస్తుంది. అయితే ఈ మధ్య కొందరు డాక్టర్లను చూసి ‘థాంక్ గాడ్ నేను డాక్టరవ్వలేదు’ అనిపిస్తుంది! ఇట్స్ ఎ వెరీ రెస్సాన్సిబుల్ జాబ్! నాకు చదువంటే ఇష్టం. నేను బాగా చదివేదాన్ని. మెడిసిన్‌లో ఫ్రీ సీట్ సాధించాను. కాని, అప్పటికే ‘కలర్స్’ బాగా పాపు లర్ కావడంతో నన్ను మామూలుగా కాకుండా  ఒక రేంజ్‌లో ర్యాగింగ్ చేశారు. ఓ 30 మంది నన్ను రోజంతా హాస్టల్ రూమ్‌లో  పెట్టి తాళం వేసేశారు. రాత్రంతా డ్యాన్స్ చేయమన్నారు. మా రూమ్ ఎలక్ట్రిసిటీ స్విచ్ బయట ఉండేది. అది ఆఫ్ చేసేసేవారు. అలాగే జూనియర్స్ కూడా నాతో ఉంటే ర్యాగ్ అవుతారని నాతో ఉండేవారు కాదు. సో నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ‘కలర్స్ స్వాతి’ ఈ కాలేజ్‌లో చదువుతోంది అని తెలిసిన తర్వాత చుట్టుపక్కల ఇంజినీరింగ్ కాలేజ్ వాళ్లు కూడా వచ్చి రాగ్ చేయడం... ఆ ఇంజినీరింగ్ బాయ్స్, మెడికల్ బాయ్స్ అంతా కలిసి రాగ్ చేయడం...స్టేషనరీ ఏదైనా కొందామని వెళ్లినా షాప్‌కు వచ్చి మరీ రాగ్ చేయడం ఎక్కువయ్యాయి. ఎవరు సస్పెండ్ అయినా నన్ను బ్లేమ్ చేసేవారు. అలా నాకు ఏదో ఒక దశలో ఆ వృత్తి మీద ఇంట్రస్ట్ పోయింది. ‘ఇలాంటి వాళ్లు మెడికోస్...  వీరేం డాక్టర్లు అవుతారు? సైకోల్లా ఉన్నారు’ అనిపించింది. ఏదైతేనేం అక్కడ మానేశాను. తర్వాత హైదరాబాద్ యూసఫ్‌గూడలోని సెయింట్ మేరీస్‌లో బయోటెక్నాలజీలో చేరాను. ఆ కాలేజ్ ప్రిన్సిపాల్, స్టాఫ్, స్టూడెంట్స్ నన్ను మెడికల్ కాలేజ్ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ నుంచి తేరుకునేలా చేశారు. అక్కడి కెమిస్ట్రీ లెక్చరర్ ఇప్పటికీ నాతో టచ్‌లో ఉన్నారు.

 ‘కలర్స్’ స్వాతి అని పిలిస్తే ఎందుకు ఇష్టం ఉండదు? అది మీ హీరోయిన్ స్టేటస్‌కు తక్కువనా?
 స్వాతి: ఛీఛీ...నాకు అప్పుడే ఇష్టం ఉండేది కాదు. చక్కగా స్వాతి అనే పేరు ఉంది కదా అని. అంతెందుకు... ఆ ప్రోగ్రామ్‌లోనే అనేదాన్ని ‘థాంక్‌గాడ్... నా ప్రోగ్రాం పేరు కలర్స్! ఏ ‘ఇంటింటి మహాలక్ష్మి’నో లేదా ‘పట్టుకుంటే పట్టుచీర’నో అయ్యుంటే! బాబోయ్ అలాంటివి పెట్టలేదు!

 కాని, చాలామంది అలా పిలిస్తే క్రెడిట్‌గా ఫీలవుతారు...

 స్వాతి: నేనలా కాదండీ. డిటాచ్డ్ పర్సన్. ‘సుబ్రహ్మణ్యపురం స్వాతి’, ‘డేంజర్ స్వాతి’ అంటే నాకు ఏదోలా ఉంటుంది!

 ఇంటి నుంచి పారిపోయైనా సరే సర్కస్‌లో చేరాలి అనుకున్నారట...
 స్వాతి: (గట్టిగా నవ్వేస్తూ) అవును. అది ఎక్కడ విన్నారు మీరు? నిజంగానే నాకు సర్కస్ అంటే బాగా ఇష్టం. ఆ ఇష్టంతోనే 8వ తరగతిలో ఉన్నప్పుడు అందులో చేరడానికి ట్రయల్ కూడా చేశాను! కానీ ఛాన్స్ దొరకలేదు. అలాగే నేవీలో ఉన్నప్పుడు యూనిఫాం నచ్చి అందులో చేరిపోదాం అనుకున్నాను. తర్వాత డాక్టర్...  అవన్నీ దేవుడు పై నుంచి చూసి ఈ అమ్మాయికి చాలా కోరికలున్నాయి కాబట్టి... ఈ అమ్మాయిని యాక్టర్ చేసేద్దాం... అన్నీ అయిపోతుంది (క్యారెక్టర్‌ల పరంగా) అనుకునుంటాడు (నవ్వులు)!

 అంత హిట్టయిన ‘కలర్స్’ ప్రోగ్రామ్‌ను ఆపేయడం మొదలుకుని, మెడిసన్‌ను వదులుకోవడం...ఇలా మీ నిర్ణయాల్లో చాలా స్థిరచిత్తం కనిపిస్తుంటుంది... పెద్దగా లైఫ్‌లో స్ట్రగుల్ లేకపోయినా ఇంత స్ట్రాంగ్ ఎలా అయ్యారు?

 స్వాతి: నా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, నేను పెరిగిన వాతావరణం వల్ల! దట్ వే ఐయామ్ బ్లెస్డ్. అయినా స్ట్రగుల్ అస్సలు లేకుండా ఏమీ లేదు. స్ట్రగుల్ అంటే ఇటుకలు మోసేయడం లాంటివి కాకపోయినా, సాధారణ మధ్యతరగతి జీవనశైలి నుంచి వచ్చాను.  నేవీ ఫీల్డ్ బయట గ్లామరస్‌గా ఉంటుంది కానీ తొంగి చూస్తే చాలా సాధారణంగా ఉంటుంది. అందరి ఇళ్లూ ఒకేలా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎకామిడేషన్ తెల్సిందే కదా. నార్మల్ క్వార్టర్స్. కానీ ఇంటలెక్చువల్లీ, కల్చరల్లీ చాలా రిచ్ ఎన్విరాన్మెంట్! పక్కింటోడు ఒక బెంగాలీ ఉంటాడు, పైనో పంజాబీ ఉంటాడు. హోలీ ఆడాం. క్రిస్మస్  చేశాం. వినాయకచవితికి నాటకాలు. దాండియా ఆడాం. సో... క్వార్టర్స్‌లో ఉన్నామేమో కాని, మా కల్చరల్ అప్‌బ్రింగింగ్ వెరీ వెరీ రిచ్!

 మూవీస్‌లోకి వెళ్తాననగానే ఇంట్లోవాళ్లు ఏమన్నారు?
 స్వాతి: నేను మూవీస్ చేయడం అన్నకు అస్సలు నచ్చలేదు. ‘డేంజర్’ టైంలో చాలా రోజులు నాతో మాట్లాడలేదు కూడా! చాలా బాధపడ్డాను. సినిమాల్లో చేసే అమ్మాయిల గురించి ఆ వయసు అబ్బాయిలు, ఫ్రెండ్స్ ఏం అనుకుంటారో తెల్సిందే కదా. అందుకే కొంచెం భయపడ్డాడు. అయితే సినిమా చూశాక గర్వంగా ఫీలయ్యాడు. పేరెంట్స్ మాత్రం దీన్నంతా ఒక ప్రాసెస్‌గా భావించారంతే! అలాగని నా విషయంలో ప్రతీదీ వారికి తెలియాలని కోరుకోరు. అదే టైమ్‌లో నాకేం జరుగుతుందో వారికి తెలుసు. నేనే పడతాను. నేనే లేస్తాను. అయితే అన్నీ చెబుతూనే ఉంటాను. సడెన్‌గా ఏమైనా అయినప్పుడు  వాళ్లు షాక్ తినరు!

 ‘సినిమాలు మానెయ్’ అని ఎప్పుడూ అనలేదా?

 స్వాతి: మూవీస్ మానేసి ఏం చేస్తా? నేనున్న పరిస్థితుల్లో బ్యాంక్‌లో చేస్తానా? అలా అని నచ్చక చేస్తున్నానని కాదు... ఇష్టం కాబట్టి చేస్తున్నాను. అవసరమైతే ఇంట్లో క్యాండిల్స్ చేసుకుని అమ్ముకుంటూ బతుకుతాను కాని, ఇష్టం లేనిపని చేయను.

 మీ మూవీస్ అబ్జర్వ్ చేస్తే  పెర్ఫార్మెన్స్ బేస్డ్‌గా ఉంటాయి. సెలక్టివ్‌గా వెళుతున్నారనుకోవచ్చా?
 స్వాతి: యాక్చువల్లీ  పెర్ఫార్మెన్స్ బేస్డ్ అంటూ ఏమీ ఉండవండీ. ప్రతి సినిమాలోనూ పెర్ఫార్మెన్స్ ఉండాల్సిందే కదా. ఇక అవి నేను ఎంచుకున్నవి కాదు. ఆ సినిమాలే నన్ను ఎంచుకున్నాయి. నాకు పది ఉంటే అందులో నేను రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాని, అన్నీ ఎప్పుడూ ఎవరికీ ఉండవు. నా దగ్గరకి వచ్చినవి మంచి ఆఫర్లు  అంతే.

 మీరు కనపడినంత చైల్డిష్ కాదు..!
 స్వాతి: అయామ్ జస్ట్ గ్రోయింగ్‌అప్ అండీ! పర్సనల్లీ నేను పేరెంట్స్‌కి చాలా క్లోజ్‌గా ఉంటాను. తల్లిదండ్రులకు సన్నిహితంగా ఉండే పిల్లల లైఫ్ వేరేగా ఉంటుంది. ఎల్లప్పుడూ నేను డిపెండెంట్‌నే. అందులో డౌట్ లేదు. అంటే అది ఫైనాన్షియల్‌గానే కానక్కర్లేదు. ఎమోషనల్‌గా కూడా. నేనంటూ గుడ్డిగా  చేయగలిగేది అమ్మానాన్నని నమ్మడమే.

 దేవుణ్ణి నమ్ముతారా?

 స్వాతి: ఇప్పుడు.. డెఫినెట్లీ. ఒక పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఒక మనిషికి ఒక సిట్యుయేషన్ వల్ల్లో సక్సెస్, ఫెయిల్యూర్ వల్లో టెంపర్‌మెంట్ వల్లో మూడ్స్ వల్లో వేరే థాట్స్ ఉంటాయి. ఓ 5 సంవత్సరాల తర్వాత ఆలోచన మారిపోతుంది. ఇదే ప్రశ్న మీరు నన్ను స్కూల్ టైమ్‌లో అడిగితే వేరే ఆన్సర్ చెప్పేదాన్నేమో. ఇప్పుడు టివి, సినిమాలు, వేరే బాధలు, ఫ్రెండ్స్ పెరగడం, వాళ్ల పెళ్లిళ్లు. ఇవన్నీ చూశాక డెఫినెట్‌లీ దేవుడున్నాడని బాగా నమ్ముతున్నాను.

 ఎందుకంత నమ్మకం?

 స్వాతి: మంచివాళ్లకి మంచి జరిగినప్పుడు దేవుడున్నాడు అనిపిస్తుంది. అది తెలిసినవాళ్లకయినా, పర్సనల్‌గా నాకయినా! మా అన్నయ్యకు ఫేటల్ యాక్సిడెంట్ అయింది కొన్ని నెలల క్రితం. సీరియస్ అయింది. బట్ హీ సర్వైవ్డ్ ఇట్. సో...దేవుడున్నాడు అని. ఇప్పుడు చదివేవాళ్లకి ఇది చాలా సిల్లీగా అనిపించవచ్చు. అయితే నా నమ్మకం నాకుంది. నా ఫ్రెండ్స్ చాలా మంది దేవుణ్ణి నమ్మరు. నాతో ఆర్గ్యుమెంట్ కూడా పెట్టుకుంటారు. దేవుడేంటి... అంతా మన చేతుల్లోనే ఉంది అంటారు. కాని, నేను వారితో పెద్దగా ఆర్గ్యూ చేయను. ఎందుకంటే ఇది పూర్తిగా పర్సనల్ థింగ్!

 మీ ఫ్రెండ్స్ గురించి...
 స్వాతి: క్లోజ్ ఫ్రెండ్స్ తక్కువండి. అంటే... ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అందరితో బాగా మాట్లాడతాను. నాకు స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్ ఎక్కువ. ఇక సినిమా పరిశ్రమలో స్నేహం గానీ, శతృత్వం గానీ ఎక్కువ కాలం ఉండవు. అయినా ఇట్స్ వన్ లైఫ్ అండీ. గొడవలు ఎందుకు చెప్పండి? యూ నో... హేట్ అనే ఎమోషన్ చాలా డ్రెయినీ. లవ్ కన్నా హేట్ చాలా బలమైందీనూ. మనిషిని చాలా డ్రైన్ చేసేస్తుంది. సో అంత శక్తి నాలో  లేదు.

 హీరో సునీల్ మాటకు బాగా విలువిస్తారంటారు...
 స్వాతి: అవును... సునీల్‌తో పొద్దున్న కూడా మాట్లాడాను. ఎక్కడికైనా సరే సునీల్ చెప్తే వెళ్తా. ఒకరోజు సడెన్‌గా పూరీ జగన్‌గారు రాత్రి 9.30కి ఫోన్ చేసి ‘‘స్వాతీ, హరీష్, చార్మి, నేను, ఇంకా రాము... ఇలా అందరం పార్టీకి వెళుతున్నాం వస్తావా?’’ అంటే రానన్నా. అప్పుడు  సునీల్ చేత ఫోన్ చేయించారు. వెళ్లాను. సీ... ఫ్రెండ్షిప్ అంటే అర్థం ఏమిటో నాకు తెలీదండీ. కాని, ఇండస్ట్రీలో నాకు చాలా స్పెషల్ పీపుల్ అయితే ఉన్నారు. ఇందులో సునీల్, శ్రీనివాస్ అవసరాల, ఇంద్రగంటి మోహన్‌కృష్ణ, పార్వతి... అలా... కొందరు ఉన్నారు.

 మీ ఏజ్‌గ్రూప్‌వాళ్లతో తక్కువ అనుకుంటా...
 స్వాతి: హహహ(నవ్వులు) నా ఏజ్ గ్రూపోళ్లు తక్కువున్నారనుకుంటా ఇండస్ట్రీలో. అంటే వాళ్లంతా ఇంకెక్కడో ఉన్నారు. వాళ్ల రేంజ్ వేరే. పెద్ద సినిమాల్లో ఉన్నట్టున్నారు.

 చిన్నాపెద్దా... అని లెక్కేస్తారా...
 స్వాతి: నేనడం కాదండీ. ఇది జనాలు చెప్పే లెక్కలేనండీ. నాకు అలాంటివి ఉండవు. అందుకేగా ‘కలర్స్’ హిట్టయింది. మనిషిని మనిషిగా ట్రీట్ చేసి మాట్లాడేదాన్ని కాబట్టే అది అంత విజయం సాధించింది!
  ఇప్పటి టీవీ విజృంభణ చూస్తుంటే... మీరు ఇప్పటికీ టీవీలోనే ఉండుంటే స్మాల్ స్క్రీన్ సూపర్‌స్టార్ అయ్యేవారేమో... కమర్షియల్‌గా అదే బాగుండేదేమో...
 స్వాతి: ఏమో.. నాకిప్పటికీ అంత  కమర్షియల్ ఐడియాలజీ లేదండీ. ఆ తెలివితేటలు నాకు లేవు.  గెస్ ్టరోల్స్ కానివ్వండీ ఆ పాటలు కానీ అంతా ఫ్రెండ్లీగానే... ‘స్వాతీ నువ్వు చెయ్ అంటే చేశా తప్ప... ‘నాకేంటి’ అని అంతగా ఆలోచించలేను.

 అలా ఆలోచించకపోవడంవల్ల ఏదైనా పోగొట్టుకున్నారా?
 స్వాతి: ఓసారి ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేశాక కొంతమంది నాకు ఫోన్ చేసి ‘‘అదేంటి స్వాతి, నువ్వు గెస్ట్ రోల్ చేయకు... హీరోయిన్‌గా చేశాక గెస్ట్ రోల్ చేస్తే రాంగ్ మెసేజ్ వెళుతుంది. వర్క్‌లేక చేశావంటారు’’ అని  అంటే..  ‘అంత సిల్లీ మేటర్ కూడా అర్థం కావడం లేదా’ అని ఫస్ట్‌షాక్ అయ్యాను. నిజానికి అందరి జర్నీ ఒకలా ఉండదండీ. అందరూ సావిత్రి గారిలా ఉండలేరు. అందరూ శ్రీదేవిలు కాలేరు. మన వ్యత్యాసాలే మన ప్రత్యేకతలు  కదా. ఇది నా జీవితం. సో...వీటి నుంచి నేర్చుకున్నానే తప్ప రిగ్రెట్స్ లేవు.

 ‘కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం అప్పల్రాజు’ సినిమా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ కాదంటారా?
 స్వాతి: దేన్నీ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ కాదనుకునే బలం ఈ మధ్యే  వచ్చింది. అంతకుముందు బాగా ఫీలయ్యేదాన్ని. ఎందుకంటే మనం అవ్వకపోయినా పక్కనోళ్లు చెప్తారు. కొన్ని రోజుల పాటు కాదు నెలలపాటు ఆ ఫీలింగ్‌లోనే ఉండేదాన్ని! అప్పల్రాజు, గోల్కొండ హైస్కూల్ తర్వాత కాన్షియస్‌గా ఒక బ్రేక్ తీసుకున్నాను. ‘అసలు నేనెందుకున్నానీ ప్రొఫెషన్‌లో?  నాకేం కావాలి?’ అని ఆలోచించుకున్నాను. వై యామ్ ఐ అన్‌హ్యాపీ అని ప్రశ్నించుకున్నాను. అప్పుడు రియలైజ్ అయ్యాను. అప్పుడర్థమైంది ఇతరుల అభిప్రాయాల వినడమే నాకు సమస్య అని. ఇతరుల అభిప్రాయాలపై నా శక్తిని ఎక్కువగా ఖర్చు చేస్తున్నానని. ఒక్కొక్కరు వచ్చి ‘‘‘స్వాతి నువ్వు తెలుగమ్మాయివి...నువ్వు చాలా టాలెంటెడ్...  స్వాతి...నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి’’... ఇలా అంటుంటే వాళ్ల మాటలు విని నాక్కూడా కంగారు వచ్చేసేది. అనేశాక వాళ్లు వెళ్లి హాయిగా పడుకుంటారు. అయినా నాకా థాట్ ఉంటుంది కదా. అది గుర్తించాను. అదే సమయంలో మా అమ్మ ఒక మాట అడిగింది ‘‘లాస్ట్ వన్ ఇయర్‌లో రిలీజైన సినిమాల్లో నువ్వు మిస్సయిన ఒక సినిమా  పేరు చెప్పు’’ అని. ఒక్కటి కూడా చెప్పలేకపోయాను. ఎందుకంటే, ఆ సినిమాలు నచ్చాయి కాని, నేను చేస్తే అవి వర్కవుట్ అయ్యేవి కావు. మళ్లీ అమ్మ ఇంకో క్వశ్చన్ వేసింది. ‘‘స్వాతీ నువ్వు సినిమాల్లోకి ఎందుకు వచ్చావ్?’’ అని! ‘‘యాక్ట్ చేయడానికి’’ అన్నా! అయితే యాక్ట్ చెయ్ అంది. అంతే. ఆ తర్వాత స్వామి రారా, మలయాళ సినిమా ఆమెన్, తమిళ సినిమాలు.. ఇలా... చేసుకుంటూ పోతున్నా. రిజల్ట్ గురించో, ఇంకొకరి అభిప్రాయాల గురించో పట్టించుకోకుండా నా వృత్తి మీద నా లవ్వూ, నా కాన్సన్‌ట్రేషన్   చూపిస్తే మిగతాదంతా లైన్‌లో పడుతుందని రియలైజ్ చేశా!

 ఆ తర్వాత...

 స్వాతి: ‘స్వామి రారా’ తర్వాత బాగా ఆఫర్లు వచ్చాయి. అయితే అప్పుడు మళయాళం, తమిళంలో చాలా అర్థవంతమైన సినిమాలు చేస్తున్నాను.

 మీ కెరీర్‌లో ఇదే బెస్ట్ టైమ్ అనుకోవచ్చా..?
 స్వాతి: కాదండీ... ద బెస్ట్ టైమ్ వజ్ ఆఫ్టర్ అప్పల్రాజు. ఏడాదిన్నర సమయంలో ఇంటి దగ్గర కూర్చుని ఎన్నో ఇన్నర్ కన్‌ఫ్యూజన్స్‌ను క్లియర్ చేసుకున్నాను.

 తెలుగులో చేస్తూ చేస్తూ... సడన్‌గా తమిళంలో ఆఫర్ ఎలా వచ్చింది?

 స్వాతి: తమిళియన్స్ చాలా స్మార్ట్. వాళ్లు కన్నేసి ఉంచుతారు... ఎక్కడంటే అక్కడ. ‘ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులే’ చూసి, 3 నెలలు ఆగి ఫోన్ చేశారు. ‘‘బాబూ నాకు తమిళం రాదు’’ అంటే ‘‘వెరీగుడ్ తమిళ హీరోయిన్లకు తమిళ్ రాకపోవడం ఒక అడ్వాంటేజ్’’ అంటూ తీసుకెళ్లారు. అలా ‘సుబ్రమణియపురం’ వచ్చింది.

 మళయాళం  సినిమా ఛాన్స్  ఎలా వచ్చింది?
 స్వాతి: ‘సుబ్రమణియపురం’ చూసి మలయాళం వాళ్లు ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ 3 సినిమాలు చేస్తున్నాను. అయితే రెమ్యునరేషన్ చాలా తక్కువ. షాప్ ఓపెనింగ్ అంత కూడా రాదు (నవ్వులు). చాలా ఖర్చులు నేనే పెట్టుకుంటుంటాను. అమ్మ అంటుంది ‘మనం చేస్తున్నామా? పెడుతున్నామా?’ అని. కాని మలయాళంలో ఎన్విరాన్మెంట్ బాగుంది! బడ్జెట్ చాలా సింపుల్ ఖర్చుతో గ్రౌండ్‌లెవల్‌లో ఉంటుంది.

 పాటలు పాడుతున్నారు. ఈ ‘పాడు’ అలవాటు ఏంటి?

 స్వాతి: అలవాటేం కాదు. మొత్తం ఇప్పటికి 3 సినిమాలకు పాటలు పాడాను. దాంతోపాటే ఒక ఎయిడ్స్ అవగాహనా కార్టూన్ పిక్చర్‌కి వాయిస్ ఇచ్చాను. అదో స్కూల్ ప్రోగ్రామ్! అన్ని గవర్న్‌మెంట్ స్కూల్స్‌కు వెళుతుంది. వ్యక్తిగతంగా మ్యూజిక్ అంటే నా జీవితంలో భాగం. అది నాకు స్ఫూర్తినిస్తుంది. బలాన్నిస్తుంది!

 ఫస్ట్ లవ్‌ప్రపోజల్ ఎప్పుడొచ్చింది?
 స్వాతి: స్కూల్లో! సెవెన్త్‌క్లాస్‌లోనే వచ్చింది. అప్పుడు వైజాగ్ నేవీ స్కూల్‌లో చదువుతున్నాను. పెన్సిల్ చెక్కుకుంటుంటే క్లోజ్‌ఫ్రెండ్ వచ్చి ఐ లవ్ యు అన్నాడు. నాకు వెంటనే అర్థం కాక చెక్కుకోవడం ఆపి ‘క్యా’ అంటూ దీర్ఘం తీశాను. ఐ థింక్ ఐ లవ్ యూ అన్నాడు. అంతే... ఆ అబ్బాయితో మాట్లాడడం మానేశాను. వారం తర్వాత కలిసి ‘‘నువ్వేమైనా మిస్ ఇండియావా! ఏమనుకుంటున్నావ్? ఇష్టం లేకపోతే వదిలెయ్,  నాతో మామూలుగా ఉండు’’ అన్నాడు. ఇప్పటికీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్‌మే! ఇక కాలేజ్‌లో లవ్ ప్రపోజల్స్ ఏమీరాలేదు. మా అన్నయ్య టీషర్ట్, జీన్స్, జుట్టు ముడి వేసుకుని కాస్త పద్ధతిగా వెళ్లేదాన్ని అందుకేనేమో ఎవరూ పట్టించుకోలేదు (విచారంగా మొహం పెట్టి), ఇండస్ట్రీకి వెళ్లాక చాలా వచ్చాయి. ఇండస్ట్రీలో లవ్‌కన్నా మ్యారేజ్ ప్రపోజల్స్ ఎక్కువొచ్చాయ్. బహుశా నా ఫేస్ అలా అనిపిస్తుందేమో (నవ్వులు). అంటే వాళ్లక్కూడా తెలుసేమో ఈ అమ్మాయితో ఇవన్నీ వేస్ట్ అని! ఇండస్ట్రీలో హరీష్ శంకర్, రవితేజ, బీవీఎస్ రవి అందరూ నన్ను తులసి మొక్క అని ఏడిపిస్తుంటారు.

 మరి అలా ఉంటే డల్‌గా అనిపించదా?
 స్వాతి: ఊహూ... నేనొచ్చిన బ్యాగ్రౌండ్ వల్లేమో అంత అటెన్షన్ హ్యాండిల్ చేయలేను. ఒక బంగళా, కారు, కెమెరాలతో ప్రొటెక్షన్ ఇవన్నీ ఉన్నవాళ్లు హ్యాండిల్ చేయగలరేమో... కాని, నేను చాలా సింపుల్‌గా ఉంటాను!

 మీ ఉద్దేశంలో ప్రేమంటే..?
 స్వాతి: నాకు నిజంగా తెలీదు. ఎవరైనా చెబితే బాగుంటుంది. అలాగని ఎవరైనా నాకు తెలియజెప్పాలని అనుకోవడం లేదు. నా పెళ్లి మాత్రం తప్పకుండా ఎరేంజ్డ్ అయి ఉంటుంది.

 మీ వల్ల ఎవరైనా దేవదాసులయ్యారా?
 స్వాతి: ఎవరవుతారండీ... ఈ కాలంలో దేవదాసులు? మరీ అయితే ఓ 10రోజులకు అవుతారేమో! అయినా ఓ అమ్మాయి కోసం... ఫీలైపోయి, షేవ్ చేసుకోవడం మానేసి, బాగా తాగేసి ఆ ఫీలింగ్‌ను ఎంజాయ్ చేస్తుంటే ఏం బాగుంటుందండీ?

 పార్టీయింగ్‌కు దూరంగా ఉంటారెందుకు?

 స్వాతి: ఏదైనా రీజన్ ఉంటేనే వెళతానండీ! అయితే పార్టీయింగ్ నచ్చదని కాదు. కొన్నిసార్లు వెళ్లానండి. వెళ్లిన తర్వాత నాకేం అనిపించిందంటే... అక్కడికి ఒక్కొక్కరు ఒక్కో రీజన్‌తో వస్తారు. ఒక ఎజెండాతో వస్తారు.  నాకేమో ‘నేనిక్కడ ఏం చేస్తా’ అనిపిస్తుంది. ఆల్‌సో... ఇది చాలా కాంపిటీటివ్ ఇండస్ట్రీ. ఉన్న ఫ్రెండ్షిప్‌లన్నీ వన్ టు వన్ ఉంటాయి. గ్రూప్‌లో ఉన్నప్పుడు ఏమౌతుందంటే... ఓ పది నిమిషాలు బాగుంటారు. ఓ ఇద్దరు అక్కడ నుంచి వెళ్లగానే ఇక వారి గురించి మాట్లాడతారన్నమాట. నే నైనా అక్కడ నుంచి వెళ్లగానే నా మీద కూడా టక్‌టక్‌మని కౌంటర్ పడిపోతుందన్నమాట. అది నాకు తెలుసు. అందుకే దూరంగా ఉంటాను.

 సినిమారంగానికి వచ్చి పదేళ్లవుతున్నా పెద్దగా రూమర్స్ లేవేంటి?
 స్వాతి: నేను చాలా బోరింగ్. కొంచెం ఎగ్జయిటింగ్‌గా ఉండేవాళ్ల మీద వస్తాయేమో రూమర్స్! అయినా అవి కూడా చిన్నా చితకా ఉన్నాయిలెండి. ఒక సినిమా హిట్టయిందనుకోండి. వచ్చేస్తాయిక. ఈ ఫీల్డ్‌లో తప్పదనుకుంటా!

 విక్రమ్ మీకు బాగా క్లోజ్ అని విన్నాం..?

 స్వాతి: అడిగారా... చెబుతాను! నిజానికి విక్రమ్ అందరితో క్లోజ్‌గా ఉంటాడు. నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు ‘కలర్స్’లో విక్రమ్‌ని  ఇంటర్వ్యూ చేశాను. ఓ నేషనల్ అవార్డ్ విన్నర్ అంటే ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చుంటాడు? అయినా ఆయన ‘కలర్స్’తో చాలా ఇంప్రెస్డ్! అప్పటినుంచి నన్ను ‘తన ఫేవరెట్ మూవీ ప్రెజెంటర్’ అనేవాడు. ఎవరైనా అడిగితే ఆయన పబ్లిగ్గా చెప్పేవాడు... ‘స్వాతి అంటే ఇష్టం’ అని! అలా ఒక ఇమేజ్ వచ్చేసింది. ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ సినిమా అప్పుడు సెల్వరాఘవన్‌కు తనేమీ నన్ను సిఫారసు చేయలేదు. నన్ను తీసుకోవాలనుకున్నాక, ఆ విషయం విక్రమ్‌ని అడిగాడు అంతే!

 నిఖిల్‌తో కూడా మీకు ఏదో ఉందని టాక్...
 స్వాతి: అబ్బా! రెండు సినిమాలు కలిసి చేస్తే లింక్ పెట్టేస్తే ఎలా? అలా అయితే జైతో, ‘ఆమెన్’ హీరోతో కూడా రెండో సినిమా చేస్తున్నాను. మొత్తం 3 భాషల్లో ముగ్గురు హీరోలతో రెండో సినిమా చేస్తున్నాను. దానికేమంటారు? అలా చేస్తున్నానంటే దానికి కారణం ఒకటే... నేను నా పని చూసుకుంటాను. వాళ్లు వాళ్ల పని చూసుకుంటారు. అసలు అలాంటి ఎఫైర్‌లు ఉంటే రెండో సినిమా అవ్వదు.  చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి! ఇప్పుడు సినిమా మేకర్స్ చాలా డెరైక్ట్‌గా కూడా చెప్తున్నారు. ‘‘మేం ఎందుకు నటిగా నీకు ప్రాధాన్యమిస్తామంటే  నువ్వు నీ పని చూసుకుంటావ్’’ అని! ఎప్పుడైనా కొంచెం డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తేనే సంవత్సరాల తరబడి ఉంటుంది ఆ రిలేషన్‌షిప్. ఎక్కువ క్లోజ్ అయిపోతే కట్ అయిపోతుంది!

 ఇలాంటి విషయాల్లో ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఫీలవుతారా?
 స్వాతి: లేదండీ. నేనున్న ఫీల్డ్ అలాంటిది కదా. నేను కూడా రణబీర్‌కపూర్ గురించిన వార్తలు అవీ చదువుతాగా. అయితే నన్ను తిక్కగా అడిగితే సమాధానం అంతే తిక్కగా చెబుతాను. పద్ధతిగా అడిగితే బాగానే చెప్తాను!

 ఇంతకీ పెళ్లెప్పుడు...
 స్వాతి: ఇంకో రెండు మూడేళ్లలో ఉండొచ్చు... నాకు తెలీదండీ! చెప్పలేం కదా... ఇలాంటి విషయాల్లో. అయినా ఇప్పుడు నేను ‘పెళ్లి చేసుకుందాం’ అని ఆలోచించడంలేదు. ‘పెళ్లంటే ఏంటా?’ అని ఆలోచిస్తున్నాను. ఆ ఇన్‌స్టిట్యూషన్  నాకింకా అర్థం కాలేదు. అయితే ఆ వ్యవస్థను నేను నమ్ముతున్నానంటే అది కూడా నా పేరెంట్స్‌ని చూసి. లేదా మా ఫ్రెండ్స్ పేరెంట్స్. లేదా మా చిన్నాన్న, పిన్ని. లేకపోతే... నాకంతగా సరైన అభిప్రాయం లేదు. ఏదైనా ప్రతి పెళ్లీ డిఫరెంట్.   కొన్ని పెళ్ళిళ్లు అరేంజ్‌మెంట్స్ వల్లో, డీల్స్, లవ్వూ, సోషల్ ఆబ్లిగేషన్... కారణాలతో జరిగినవి చూశాను. నా ఫ్రెండ్స్‌లో కొంతమంది పెళ్లిళ్లు వెరీ లక్కీ. కొంతమందివి ప్చ్... వాళ్ల లైఫ్ అంతే. ఏదైనా మంచి పార్ట్‌నర్ దొరకడం అనేదానికి మనం అదృష్టవంతులం అయి ఉండాలనేది నా ఫీలింగ్!

 వచ్చేవాడు ఎలా ఉండాలని..?
 స్వాతి: బాబోయ్... అలా అంటే చెప్పలేను. అస్సలు ఐడియా లేదు! సినీ పరిశ్రమలో అన్ని రకాల మనస్తత్వాలున్న మగవాళ్లని చూశాను.

 పెళ్లయ్యాక సినిమాలు చేయడం మానేస్తారా?

 స్వాతి: అది తెలీదు కానీ, కనీసం రెండేళ్లు ఇంటిపట్టునే ఉండిపోతాను. శుభ్రంగా ఇల్లంతా చూసుకుంటూ... వంట చేసుకుంటూ...

 ఈ ఇంటర్వ్యూ చదివితే ఈ ఒక్కదెబ్బకు మ్యారేజ్ ఆఫర్స్ గ్యారంటీ...
 స్వాతి: అహ్హహ్హ. కొన్ని సంవత్సరాలైనా నిజంగా అలా ఉండాలనుంది!

 - ఎస్.సత్యబాబు.
                                                         *****************************  
 పుస్తకాలు చదువుతారా?
 స్వాతి: ఇంట్లో లైబ్రరీ ఉంది. సీరియస్ బుక్స్  ఉన్నాయి. ఇక షిడ్నీషెల్డన్ అవన్నీ జుజుబీస్. నేను ఆలోచించనక్కర్లేదు అన్నప్పుడు నమిలిపడేయాలి అనుకుంటే అవి చదువుతాను.  రకరకాల బుక్స్ చదువుతాను. డిగ్రీ టైమ్‌లో నాకు తెలుగు ఉండేది కాదు. అయితే అష్టాచెమ్మా తర్వాత ఆర్టికల్స్ తెగవచ్చేసేవి. అవి చదవలేక ఫస్ట్రేషన్ వచ్చేసి తెలుగు నేర్చుకున్నా. తెలుగులో బుజ్జిబుజ్జి కధలు చదువుతా. మేకా ఆవు లాంటివి. ఇప్పుడు నా గురించి సాక్షిలో ఏమైనా వస్తే పొద్దున్నే లేచి నిదానంగా చదువుతానన్నమాట!

 రెమ్యునరేషన్‌లో నిర్ణయం ఎవరిది?
 స్వాతి: ఆ డిస్కషన్ ఎప్పుడూ రాలేదు. నా సినిమాలకు రీజనబుల్ ప్రొడ్యూసర్లే ఉన్నారు.  అమ్మది కొంచెం జాలిగుండె. అమ్మ వల్లే సినిమాల్లో ట్రీట్‌మెంట్ బాగుంటుంది. తన వల్లే నన్ను బాగా చూసుకుంటారు.అమ్మ ఏమంటుందంటే... ‘ఎక్కువ అడిగేసి పీడించేస్తే... అంత ఇచ్చాం అనే ఫీలింగ్ వాళ్లకి సినిమా పూర్తయ్యేదాకా ఉంటుంది’ అంటుంది. ‘వాళ్లు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీ’ అంటుంది. ఈ విషయంలో అమ్మకంటే నేనే కొంచెం బెటర్. కానీ దీని గురించి ఎప్పుడూ అమ్మతో వాదించను. (నవ్వుతూ) పొద్దున్నే టైమ్‌కి లేవడం అనే విషయంలోనే ఎప్పుడూ అమ్మతో గొడవ.

 మీరు రాస్తారని... బ్లాగ్ ఉంది కానీ అడ్రస్ చెప్పరని..!
 స్వాతి: ఏదో రాస్తాలెండి. కవితలూ అవీ. కానీ అవి క్లోజ్ ఫ్రెండ్స్ చదువుకోవడానికి మాత్రమే! డిఫరెంట్ ఇష్యూస్ మీద రాస్తూంటాను. అయితే అవేవో మరీ ఢిల్లీరేప్ అలాంటివి కాదు. పూర్తిగా పర్సనల్. నాకు సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా. నా బ్లాగ్ కూడా అంతే. పూర్తిగా పర్సనల్!

 ఎక్సర్‌సైజ్, జిమ్ లాంటివి..?
 స్వాతి: వర్కవుట్ అనేది నాకు డీస్ట్రెస్ ఏజెంట్! అయితే గోల్కొండ, అప్పల్రాజు సమయంలో మరీ ఎక్కువ చేయడం వల్ల బాగా సన్నగా అయిపోయాను. బాగా అనిపించలేదు. అందుకే ఎంత తినాలో అంత తిని, ఎంత ఎక్సర్‌సైజ్ చేయాలో అంత ఇంట్లోనే చేసుకుంటాను అని తీర్మానించుకున్నా. ఇప్పుడు జస్ట్ మోడరేట్‌గా చేస్తున్నాను.
                                                              *****************************   
  ప్రతి ఏడాది ఎగ్జిబిషన్‌కు వెళ్లడం, జెయింట్‌వీల్ ఎక్కడం, ఎర్రరంగులోని చికెన్‌ని తినడం.. ఇవన్నీ పిచ్చ ఇష్టం.  పబ్లిక్ గుర్తుపట్టి విష్ చేస్తుంటారు. అయితే ఫ్యామిలీస్ చాలా చక్కగా మాట్లాడతారు. కొందరేమో ‘ఏ క్కలర్స్’ అని గట్టిగా అనేసి వెళ్లిపోతారు. నాకు ‘కలర్స్ స్వాతి’ అంటే చిరాకు అనిపించడానికి అదీ ఒక కారణమేమో...  నాకు వినిపించేటట్టు కావాలనే అని, నన్ను చూడకుండా వెళ్లిపోయేవాళ్లని చూస్తే నాకు తిక్కరేగిపోతుంటుంది. నాక్కూడా ఒక ఫ్యాంటసీ ఉంది... రేయ్ అంటూ ఫైట్, ఏ ఢిష్‌కే అని చేయాలని! ‘రేయ్ తియ్‌రా బండి’ అంటే టయోటాలన్నీ, సుమోలన్నీ గాల్లోకి ఎగిరి...

 ఐదేళ్ల క్రితం మాకు వేగనార్ కారుండేది. శ్రీనగర్‌కాలనీలో రోడ్‌లో డ్రైవ్ చేస్తుంటే ఎవడో ట్రాలీ లాంటిదేసుకుని వచ్చి థప్‌మని గుద్దాడు. రిపేర్‌కి రూ.20వేలు ఖర్చయింది. అప్పటి నుంచి కార్ డ్రైవ్ చేయడం అంటే భయం! ‘బంగారు కోడిపెట్ట’ కోసం మారుతి డ్రైవ్ చేశాను. 3 కెమెరాలు పెట్టారు. ఎంత భయంగా చేశానో చెప్పలేను. ఇప్పటికీ కారులో కూర్చుంటే ఏదైనా కారు పక్కనుంచి స్పీడ్‌గా వచ్చేస్తుంటే కళ్లు మూసేసుకుంటా. అంత భయం డ్రైవింగ్ అంటే!

 ఫేస్‌బుక్‌లో ఎకౌంట్ నాలుగేళ్ల క్రితం క్లోజ్ చేశాను. ఇప్పుడు లేదు. ఇక ట్విట్టర్ వాడే దాకా బాయ్స్‌లో అంత పైత్యం ఉందనేది నాకు తెలీలేదు. ఇంత ఫస్ట్రేటెడ్‌గా ఉన్నారా మన జనరేషన్ అనుకున్నా. రండి నన్ను ఎటాక్ చేయండి అని చెప్పి వాళ్లకి నేను ఛాన్స్ ఇచ్చినట్టుంటుంది కదా...  అని ట్వీట్స్ మానేశా. అందులో ఎవరైనా ఏమైనా రాయచ్చు కదా. ‘ఎవరో నలుగురైదుగురు అంటే ట్విట్టర్ నుంచి వదిలేయడం ఏమిటీ అని’ కొందరన్నారు.  అయితే ప్రతిరోజూ రాయడానికి ఏం ఉంటుంది నాకు? షారూఖ్‌ఖాన్ అయితే దలైలామాను కలిశా అనో ఇంకోటో  రాసుకోవచ్చు. నేనేం రాయాలి? మాపక్కింటివాళ్లని కలిశా అనా? ప్రతిరోజూ ఇంట్రెస్టింగ్‌గా ఏమిరాయగలను?
                                                              *****************************  
 ఎవరితోనైనా ఒక్కసారి తేడా వస్తే రిలేషన్ కట్ చేసుకునే టైప్ కాదు నేను. ఒక్కటే పట్టుకుని వేలాడకూడదు. వాళ్లకి కూడా మారడానికి, ఎదగడానికి అవకాశం ఇవ్వాలి కదా!

 చారిటీ కోసం నా స్టేటస్ దానికి సరిపోదు. ఎవరికైనా  పనికొచ్చేది చేయడం అంత సులభం కాదు.

 నంది అవార్డ్ వచ్చాక చాలా మంది విచిత్రంగా రియాక్ట్ అయ్యారు. ‘‘నీకు అవార్డ్ వచ్చిందని తెలుసు కాని...’’ అంటూ. అవార్డ్ అనేది వ్యక్తుల మధ్య తప్పకుండా గ్యాప్ పెంచుతుంది. అవార్డ్స్ రావడమనేది నిజంగా ఒక లాటరీ టిక్కెట్. మీరు బాగా చేస్తే అవార్డ్ రాదు. తల రాత అంతే! నాకివన్నీ ఓవర్‌టైమ్ తెలిసింది. నాకు ఫిల్మ్‌ఫేర్ వచ్చిందనేది ఆ అవార్డ్‌నాకు వచ్చినప్పుడు సింక్ అవలేదు. మూడేళ్ల తర్వాత సింక్ అయింది! ఒక పర్టిక్యులర్ యాక్టర్‌కి వస్తుందని అనుకున్నా. అయితే రాలేదు. కాని రాకుండా వేరే ఎవరికో వచ్చింది. అప్పుడర్థమైంది ఇంత కష్టమా అని! దాని విలువ మూడేళ్ల తర్వాత తెలిసిందన్నమాట!

http://www.sakshi.com/news/family/exclusive-interview-with-colors-swathi-74276?pfrom=home-top-story
10:38 - By Swathi 0

Saturday, 12 October 2013

Venu Madhav Interview

నేను మౌలాలి మెగాస్టార్‌ని!


హైదరాబాద్ : ఒక్క ఫ్రెండు... వేణుమాధవ్ లాంటి ఒక్క ఫ్రెండు...
 ఉంటే చాలు.
 ఎంత పెద్ద స్టార్ యాక్టర్‌కైనా పక్కన పెద్ద సపోర్ట్!
 అల్లు రామలింగయ్య, చిరంజీవి, రామ్‌చరణ్  నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య  ఫర్ ఎవ్రీ జనరేషన్... మిత్ర ‘పాత్రుడు’ వేణుమాధవ్!
 ఇక ఆయన రుబాబ్ కామెడి... అదొక కొత్త ఒరవడి!
 చేతులు తలపెకైత్తి, సైడుకి ఒక్క లుక్ ఇచ్చాడంటే...
 ఆడియన్స్ తుకడాల్, తుకడాల్!!
 ప్రదీప్ రావత్, తెలంగాణ శకుంతల... ఎవరైనా... లెక్క చేసేదే లేదు. ‘నల్లబాలు’ లెక్క!
 సినిమా ఛాన్స్ వస్తే... ‘‘వద్దొద్దు, ప్రోగ్రామ్స్ ఇప్పించండి చాలు’’ అని  తప్పుకుని తప్పుకుని తిరిగిన ఈ ‘జూనియర్ నేరెళ్ల’...
 చివరికి ఈ ఫీల్డులో ఎలా సెటిలయ్యారు?
 ఇప్పుడెందుకు మళ్లీ దూరమైనట్లు కనిపిస్తున్నారు?!
 చదవండి... ఈవారం ‘తారాంతరంగం’.

 మీ చిన్ననాటి తీపి గుర్తులు?

 వేణుమాధవ్: నాకేం తీపి గుర్తులు లేవు. నాది ఉగాది పచ్చడిలాంటి జీవితం. మాది నల్గొండజిల్లాలోని కోదాడ. పుట్టింది, పెరిగింది, చదివింది అక్కడే. కాలేజీ చదువు మాత్రం బాలాజీనగర్ తండాలో. ప్రతి రోజూ అప్ అండ్ డౌన్ ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లేవాణ్ణి.

 మీ నాన్నగారు ఏం చేసేవారు?

 వేణుమాధవ్: టెలిఫోన్ డిపార్ట్‌మెంట్‌లో లైన్ ఇన్‌స్పెక్టర్. అమ్మ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్‌గా చేసేవారు. మేం ఐదుగురం. అక్క, ఇద్దరన్నయ్యలు, తర్వాత నేను. నా తర్వాత చెల్లి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.

 చిన్నప్పుడు మీరు బాగా అల్లరి చేసేవారా?
 వేణుమాధవ్: అమ్మానాన్న తట్టుకోలేనేంత చేసేవాణ్ణి. స్కూల్‌కి సరిగ్గా వెళ్లేవాణ్ణి కాదు. సరిగ్గా చదువుకునేవాణ్ణి కాదు. అప్పట్లో ఓ సినిమా విడుదలవుతోందంటే, రిక్షాలో ఎనౌన్స్‌మెంట్ చేసేవాళ్లు. రిక్షా కనబడగానే నేనే ఎక్కి, అనౌన్స్ చేసేసేవాణ్ణి. డప్పులోళ్లు కనిపిస్తే.. వాళ్ల వెంటపడి డప్పులు కొట్టడం, పిల్లలతో గోలీలాడటం.. ఇలా నా అల్లరికి అంతుండేది కాదు. మా పిల్లలందరిలోనూ ఎక్కువగా తన్నులు తిన్నది నేనే. మా కుటుంబంలో నా మీద ఎలాంటి నమ్మకం ఉండేది కాదు. ఎందుకూ పనికి రానివాడని అనుకునేవారు.

 చదువులో వీక్. మరి, పరీక్షల సంగతేంటి?

 వేణుమాధవ్: టెన్త్ క్లాస్ రెండుసార్లు చదివా. అసలీ చదువుని ఎవరు కనిపెట్టారా? అని నానా రకాలుగా తిట్టుకునేవాణ్ణి. చదవకపోతే ఇంట్లో, స్కూల్లో కొడతారు. ఎందుకొచ్చిన గొడవ అనుకునేవాణ్ణి.

 సరే.. ఇంతకూ మిమిక్రీలోకి ఎలా ఎంటరయ్యారు?
 వేణుమాధవ్: నేను చిన్నప్పట్నుంచీ స్కూల్లో టీచర్లనీ స్నేహితుల్నీ, మా అమ్మ దగ్గరకు వైద్యానికి వచ్చే పేషెంట్లనీ అనుకరించేవాణ్ణి. అయితే దాన్ని మిమిక్రీ అంటారన్న సంగతి నాకు తెలియదు. నేను సెవెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల వేణుమాధవ్‌గారు మా కోదాడలో ఓ మ్యారేజ్ ఫంక్షన్‌లో ప్రోగ్రామ్ చేశారు. అప్పుడు నేను చేసేది మిమిక్రీ అనే సంగతి నాకర్థమైంది. అప్పట్నుంచీ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఎక్కువగా మిమిక్రీ చేసేవాణ్ణి.

 మిమిక్రీ మీ జీవితానికి మలుపవుతుందనుకున్నారా?
 వేణుమాధవ్: అస్సలు లేదు. అయితే మిమిక్రీని ఓ ప్రొఫెషన్‌గా తీసుకున్నది మాత్రం ఇంటర్‌లోనే. అప్పుడు ప్రతి ఏడాది హైదరాబాద్‌లో జరిగే గణేష్ ఉత్సవాల్లో మిమిక్రీ చేయడానికి ఇక్కడికి వచ్చేవాణ్ణి. డిగ్రీ అయిన తర్వాత ముంబయ్ వెళ్లి ‘టాకింగ్ డాల్’ తెచ్చుకుని, ప్రోగ్రామ్ చేయడం మొదలుపెట్టాను.

 టాకింగ్ డాల్ తెచ్చుకోవాలని ఎందుకనిపించింది?
 వేణుమాధవ్: శ్రీనివాస్ అనే మిమిక్రీ ఆర్టిస్ట్ దగ్గర చూసి, తెచ్చుకున్నాను. నాకు నేనుగా వెంట్రిలాక్విజమ్ నేర్చుకుని ప్రోగ్రామ్స్ చేయడం మొదలుపెట్టాను.

 టాకింగ్ డాల్ అంటే చాలా ఖరీదు కదా?
 వేణుమాధవ్: నిజమే. అప్పట్లో దాని విలువ ఐదువేల ఎనిమిదివందల రూపాయలు. అది కొనడానికి నేను మామూలు ఇబ్బందులు పడలేదు. ఇంట్లోవాళ్లు, నా ఫ్రెండ్స్ సహాయంతో కొనుక్కున్నాను.

 మిమిక్రీలో జూనియర్ వేణుమాధవ్ అనిపించుకున్నారు.. ఎలా అనిపిస్తోంది?

 వేణుమాధవ్: నేరెళ్ల వేణుమాధవ్‌గారి ఏకలవ్య శిష్యుణ్ణి. కొన్ని వందల సార్లు ఆయన్ను కలిశాను. ‘అరేయ్.. నువ్వు స్ప్రింగులు మింగావురా..’ అని మెచ్చుకునేవారు. ‘నువ్వు కచ్చితంగా సినిమా యాక్టర్ అవుతావు’ అని కూడా అనేవారు. అంతటి మహానుభావుడితో పోల్చి, జూనియర్ వేణుమాధవ్ అనే పేరు తెచ్చుకుంటానని కలలో కూడా ఊహించలేదు.

 ఆ టాకింగ్ డాలే మిమ్మల్ని ఎన్టీఆర్ వరకూ తీసుకెళ్లింది కదూ?

 వేణుమాధవ్: అవును. నేను చదువుకున్న గవర్నమెంట్ స్కూల్‌లో అప్పటి కోదాడ ఎమ్మెల్యే చందర్‌రావుగారు, కలక్టర్‌గారు, ఇంకా పలువురు ప్రముఖుల సమక్షంలో టాకింగ్ డాల్‌ని ఇంట్రడ్యూస్ చేశాను. ఆ ప్రోగ్రామ్ చందర్‌రావుగారికి నచ్చి, భువనగిరిలో తెలుగుదేశం పార్టీ మీటింగ్‌కి తీసుకెళ్లారు. అక్కడ మాధవరెడ్డిగారు, చంద్రబాబునాయుడుగారు నా టాకింగ్ డాల్ ప్రదర్శన చూసి, ‘మహానాడులో నువ్వు ప్రోగ్రామ్ చేయాలి’ అన్నారు. ఎన్టీ రామారావుగారి సమక్షంలో ఆరు లక్షల మంది ముందు పోగ్రామ్ చేశా. నా జీవితంలో ఊహించని మలుపు అది. ఆ రోజు సాయంత్రం ప్రోగ్రామ్ అంటే.. మధ్యాహ్నమే నన్ను స్టేజి మీద కూర్చోబెట్టారు. అందరూ మాట్లాడిన తర్వాత, ఎన్టీఆర్‌గారు మాట్లాడే ముందు, నాతో ప్రోగ్రామ్ చేయించారు. అప్పుడు ఎన్టీఆర్‌గారు  నా భుజం మీద చెయ్యేసి, ‘మీ సేవలు మాకెంతో అవసరం బ్రదర్’ అంటూ హిమాయత్‌నగర్ తెలుగు దేశం పార్టీ ఆఫీసులో చేర్చుకున్నారు. అక్కణ్ణుంచీ అసెంబ్లీలోని టీడీపీ లెజిస్లేటివ్ కార్యాలయంలో చేర్చారు. నాకంతా  అయోమయంగా ఉండేది. సరే.. డబ్బులు బాగానే ఇస్తారనే ఊహతో చేరాను.

 ఆ ఊహ నిజమైందా?
 వేణుమాధవ్: నెలకు ఆరువందలు ఇచ్చేవారు. ఆ తర్వాత ఎనిమిది వందలు. 1994 నుంచి 96 వరకు అక్కడే చేశాను.

 సినిమాల్లోకి ఎలా వచ్చారు?
 వేణుమాధవ్: అప్పుడు నేను, మిమిక్రీ శ్రీనివాస్‌గారు, జనార్ధన్, కోలా... అని మేమందరం ఆకృతి సంస్థ నిర్వహించే ప్రోగ్రామ్స్ చేసేవాళ్లం. నాకు సెకండ్ హ్యాండ్ బజాజ్ 150 ఉండేది. పెట్రోలు ఖర్చులు కలిసొస్తాయని నలుగురూ ఒకే వాహనం మీద వెళ్లేవాళ్లం. ఓసారి రచయిత దివాకర్‌బాబుగారికి రవీంద్రభారతిలో సన్మానం జరిగితే, ఎస్వీ కృష్ణారెడ్డిగారు, అచ్చిరెడ్డిగారు వచ్చారు. మేం చేసిన ప్రోగ్రామ్ చూసి, ఫోన్‌నంబర్ ఇచ్చి, మర్నాడు ఆఫీసుకు వచ్చి కలవమన్నారు. సినిమాలు చూడ్డమే తప్ప నాకు సినిమా మీద కొంచెం కూడా జ్ఞానం లేదు. సినిమాల్లో నటించాలనే ఇంట్రస్ట్ లేదు. సరే.. రమ్మన్నారు కదా అని వెళ్లాలనుకున్నాను.

 ఫిల్మ్‌నగర్‌లో అడుగుపెట్టింది అప్పుడేనా?

 వేణుమాధవ్: అవును. ఆఫీసు వెతుక్కుంటూ వెళ్లి, కలిశాను. ‘నువ్వు స్టేజ్ మీద ఏదైతే చేశావో.. సినిమాలో అదే చెయ్యాలి’ అన్నారు. ‘నాకు సినిమా అంటే తెల్వదు సార్.. మనకు ఎరక లేదు. ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి. ఒక్కో ప్రోగ్రామ్‌కి ఇంత అని తీసుకుంటా’ అని ఇదే స్లాంగ్‌లో చెప్పా. ‘కాదు.. కాదు.. ఆలోచించుకో’ అన్నారు. ఇంటికొచ్చి అమ్మకి చెబితే.. ‘పిచ్చోడా.. సినిమా అంటే చిన్న విషయం కాదు. చేస్తానని చెప్పు’ అని చెప్పింది. ఆ తర్వాత అమ్మ మా ఊరు వెళ్లిపోయింది. దాంతో నేను కృష్ణారెడ్డిగార్ని కలవాలనే ఆలోచనను వదిలేశా. కానీ ఊరెళ్లిన తర్వాత కూడా అమ్మ వదల్లేదు. అప్పట్లో నా రూమ్‌లో ల్యాండ్‌లైన్ కూడా లేదు. పక్కింటికి ఫోన్ చేసి మరీ, ‘వెళ్లకుండా ఉండొద్దు’ అని అమ్మ పదే పదే చెప్పడంతో, బాధ భరించలేక వెళ్లాను. నేను మళ్లీ అదే పాట.. ‘పబ్లిక్ మీటింగ్ అయితే చేస్త కానీ.. ఇట్టాంటివి నడ్వదు సార్. సినిమా అంటే నాకు తెల్వదు’ అన్నాను. జనరల్‌గా వేరే దర్శక, నిర్మాతలెవరైనా వద్దంటారు. కానీ, కృష్ణారెడ్డిగారు, అచ్చిరెడ్డిగారు ‘మేం చూసుకుంటాం..’ అని హామీ ఇచ్చారు. ఎలాగూ బతిమాలుతున్నారు కదా అని, క్యాష్ చేసుకుందామని, అయితే ‘ఆర్ నైతో పార్’.. వస్తే డబ్బులొస్తాయ్ లేకపోతే సినిమా చేయకుండా తప్పించుకోవచ్చని, లెవల్‌గా ‘ఎన్ని రోజులు కావాల’ అనడిగాను. అరవై, డెబ్భైరోజులు కావాలంటే, 70వేలు అడిగాను. ఆ సినిమాకి నిర్మాత అన్నారావుగారు. ఆయనతో మాట్లాడతామని చెప్పారు. ‘వాళ్లతో వీళ్లతో నాకు సంబంధం లేదు.. నాకు పైసల్ కావాల్సిందే’ అంటే, ఓకే అన్నారు. ఆ విధంగా  ‘సంప్రదాయం’ సినిమాకి మొదటిసారి మేకప్ వేసుకున్నా.

 సరే... షూటింగ్ వాతావరణం ఎలా అనిపించింది?
 వేణుమాధవ్: కృష్ణగారు, ఇంకొంతమంది ఆర్టిస్టులు, నా కాంబినేషన్‌లో మొదటిరోజు షూటింగ్ స్టార్ట్ చేశారు. లొకేషన్‌కి వెళ్లగానే, టిఫిన్ తినమన్నారు. కానీ, నేను బయటికెళ్లి, హోటల్‌లో తినొచ్చాను. ఆ తర్వాత ఒంటి గంటకి బ్రేక్ అన్నారు. అంటే ఏంటో తెలియదు. అందరికీ భోజనం పెడుతుంటే, లంచ్ టైమ్ అనుకుని బయటికెళ్లి భోజనం చేసొచ్చాను. నన్నూ తినమన్నారు. అక్కడ భోంచేస్తే, ఇచ్చే డబ్బుల్లో కట్ చేస్తారని భయం. ఇలా రెండు రోజులు గడిచాయి. మూడో రోజు ‘ఏవయ్యా.. ఎటు వెళుతున్నావ్’ అని ప్రొడక్షన్‌వాళ్లు అడిగితే, తినడానికని చెప్పా. ‘ఎందుకు? ఇక్కడ పెడుతున్నాంగా.. ఫ్రీయే’ అన్నాడు. అంతే.. నా ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి, రమ్మన్నాను. నాలుగు రకాల పచ్చళ్లు, కూరలు.. బ్రహ్మాండమైన భోజనం. ఓ పట్టు పట్టేవాళ్లం. లైఫ్ చాలా హాయిగా అనిపించింది.

 పర్టిక్యులర్‌గా 70వేలు పారితోషికం అడగాలని ఎందుకనిపించింది?
 వేణుమాధవ్: లక్ష రూపాయలు సాధించాలన్నది నా జీవితాశయం. అందుకే 70 వేలడిగాను. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. సినిమా మొత్తం పూర్తయ్యాక, డబ్బింగ్ చెప్పాలి రమ్మంటూ ఓ రోజు కారు పంపించారు. డబ్బింగ్ అంటే ఏంటో నాకస్సలు తెలియదు. సరే.. థియేటర్‌కి వెళ్లాను. స్క్రీన్ మీద నా బొమ్మ చూసుకుంటూ.. డబ్బింగ్ చెప్పాలి. ఫస్ట్ టైమ్ స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవడంతో ఎగ్జయిట్ అయిపోయాను. అలా చూస్తూ నిలబడిపోయాను. అలా పదిసార్లు జరిగింది. నోరెళ్లబెట్టి చూడటం తప్ప మాటలు మాట్లాడటంలేదు. రామ్‌గోపాల్‌రెడ్డిగారని ఎడిటర్‌గారు... ఇలా అయితే లాభం లేదని, రేపు డబ్బింగ్ చెబుదువుగాని అన్నారు. మర్నాడు కూడా అదే తంతు. మూడు, నాలుగో రోజు కూడా అంతే. నా బొమ్మ చూసుకోగానే.. భలే ఉన్నామే అనుకోవడం తప్ప డబ్బింగ్ చెప్పడంలేదు. రామ్‌గోపాల్‌గారికి నేను చెప్పనని అర్థమైంది. దాంతో కాదంబరి కిరణ్‌గారితో చెప్పించారు.

 లక్ష రూపాయల జీవితాశయం ఏంటి?
 వేణుమాధవ్: బీకామ్ చేసిన తర్వాత సీఏ చదవాలని విపరీతమైన కోరిక. కోదాడలో సీఏ లేదు. అప్పుడు హైదరాబాద్‌లో కూడా లేదు. సీఏ చేయాలంటే చెన్నయ్ వెళ్లాలి. ఫీజు మాత్రమే లక్ష రూపాయలు కట్టాలి. ఎలాగైనా సీఏ చేయాలన్నది ఆశయం. మా అమ్మానాన్నలకు ఐదుగురు సంతానం. ఐదుగుర్నీ చదివించడం, పెంచడం చిన్న విషయం కాదు. ఇక, లక్ష రూపాయలు ఎక్కడ కడతాం? లక్ష లేకపోవడంతో సీఏ చేయలేకపోయాం కదా.. అందుకే ఎప్పటికైనా లక్ష రూపాయలు సంపాదించాలనుకున్నా.

 అదేంటి.. చదువంటే అసహ్యం అన్నారు.. సీఏ చేయాలనుకోవడం ఆశ్చర్యంగా ఉందే?
 వేణుమాధవ్: టెన్త్ ఎప్పుడైతే రెండుసార్లు రాశానో అప్పుడే నాకే ఏదోలా అనిపించింది. ఇంటర్‌లోకొచ్చాక చదువంటే ఇంట్రస్ట్ ఏర్పడింది. సెకండ్ క్లాస్ తెచ్చుకున్నా. బీకామ్ వచ్చేటప్పటికి ఇంకా ఇంట్రస్ట్ ఏర్పడింది. అప్పుడే సీఏ యాంబిషన్ కలిగింది.

 సరే... మళ్లీ సినిమాల్లోకొద్దాం. ‘సంప్రదాయం’ విడుదలైన తర్వాత వెంటనే అవకాశాలు వచ్చాయా?
 వేణుమాధవ్: ఆ సినిమా జనవరి 14న  విడుదలయ్యింది. 10, 11న చెన్నయ్‌లో ప్రివ్యూ వేశారు. ఆ ప్రివ్యూ చూసిన కొంతమంది నిర్మాతలు అవకాశం ఇచ్చారు. మొదటి సినిమా రిలీజ్ అవకముందే పాపులర్ అయ్యాను. శ్రీకారం, మెరుపు.. ఇలా బోల్డన్ని సినిమాలకు అవకాశం వచ్చింది. ఒక్క సినిమా కూడా విడుదలవ్వక ముందే బిజీ అవడం అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.

 వెంటనే పారితోషికం పెంచేశారా?
 వేణుమాధవ్: ‘శ్రీకారం’ సినిమాలో నాది హాఫ్ డే కేరక్టర్. మనిషి ఆశాజీవి. అది కూడా తెలియనితనం ఉన్న మనిషైతే మితిమీరి ప్రవర్తిసాడు. అప్పట్లో నా తెలియనితనంతో ఒక్క రోజుకి 70వేలు పారితోషికం అడిగా. నిర్మాతగారు సరే... నేను మాట్లాడతాలే అన్నారు. సినిమా పూర్తయ్యింది. ఆ తర్వాత రెండోరోజుకి అనుకుంటా.. ఆఫీసుకి వెళితే, 10వేలు చేతిలో పెట్టారు. అయినా పట్టుబట్టి నేను ఆఫీసు చుట్టూ తిరిగేవాణ్ణి. నిజం చెప్పండి.. సిగ్గుపడాల్సిన విషయం కాదా ఇది.

 మరి.. పాత్రకు తగ్గ పారితోషికం అడగాలని ఎప్పుడు తెలిసింది?
 వేణుమాధవ్: ‘మెరుపు’ సినిమా చేస్తున్నప్పుడు డెరైక్టర్స్, ప్రొడ్యూసర్స్ దగ్గర మిగతా ఆర్టిస్టులు ఎలా నడుచుకుంటున్నారో చూసి, మనం చేస్తున్నది కరెక్ట్ కాదని గ్రహించి, నా బాడీ లాంగ్వేజ్‌ని మార్చుకున్నాను. అంతకు ముందు వరకు నా బాడీ లాంగ్వేజ్ చాలా పొగరుగా ఉండేది. లక్కీగా అప్పుడు ఇంత మీడియా లేదు. ఉండి ఉంటే... నా తీరు స్క్రోలింగ్‌లో వచ్చి ఉండేది. బ్రహ్మానందంగారి లాంటి సీనియర్స్‌ను చూసి, ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నాను. ఎంత పారితోషికం అడగాలో తెలుసుకున్నాను.

 వందల నుంచి వేలకి.. అక్కణ్ణుంచి లక్షలకు మీ పారితోషికం పెరిగింది కాబట్టి ‘మనీ మేనేజ్‌మెంట్’ విషయంలో మీ అన్నయ్యల సహకారం తీసుకునేవారా?
 వేణుమాధవ్: హండ్రెడ్ పర్సంట్ తీసుకునేవాణ్ణి. నేను కూడా బాధ్యతగానే వ్యవహరించేవాణ్ణి. అందుకే హైదరాబాద్‌లో పది ఇళ్లు కొనగలిగాను. పదెకరాల ఆస్తి ఉంది. ఆర్టిస్ట్‌గా నా వైభవాన్ని చూసి మా నాన్నగారు, ఇతర కుటుంబసభ్యులు ఆనందపడ్డారు. నాన్నగారు చనిపోయి ఇప్పటికి పదకొండేళ్లవుతోంది. నేనెందుకూ పనికిరానని అనుకునేవారు కాబట్టి.. నేను మంచి స్థాయికి వచ్చినందుకు బయటికి చెప్పకపోయినా అమ్మ దగ్గర చెప్పి సంతోషపడేవారు.

 కమెడియన్‌గా ఓ రేంజ్‌కొచ్చిన తర్వాత ఇంకాఎత్తు ఉండి ఉంటే, అందంగా ఉండి ఉంటే ఏ హీరోనో అయ్యుండేవాణ్ణి అని ఎప్పుడైనా అనిపించిందా?
 వేణుమాధవ్: మీరడిగినది నాకు బాగా నచ్చింది. హైట్ తక్కువ ఉన్నాను కాబట్టే.. ఇంత సంపాదించగలిగాను. హైటు ఉన్న హీరోలని తీసుకుందాం. వాళ్లు కామెడీ చేస్తే చూస్తారా? హీరోగానే చేయాలి. సంవత్సరానికి మాగ్జిమమ్ మూడు, నాలుగు చిత్రాలు చేస్తారేమో. కానీ, నేను ఏడాదికి 40, 50 సినిమాలు చేసిన రోజులున్నాయి. రోజుకి లెక్కలేనన్ని లొకేషన్స్‌లో వేరే వేరే సినిమాలు చేసేవాణ్ణి. కారులోనే టిఫిను, భోజనం చేసేవాణ్ణి. ఓ పది, పదిహేనేళ్లు అలా చేశాను. కొంచెం అలసట అనిపించేది...కానీ మళ్లీ ఇలాంటిది రాదేమో అని ఎంత కష్టమైనా చేశాను.

 సో... పొట్టివాడు గట్టివాడు అనొచ్చన్నమాట...
 వేణుమాధవ్: అవును. ఒక విషయం చెబితే మీకు గమ్మత్తుగా ఉంటుంది. అల్లు రామలింగయ్యగారి నుంచి మొదలుపెడదాం. ఆయనకు, చిరంజీవిగారికి, రామ్‌చరణ్, చిరంజీవిగారి మేనల్లుడు సాయిధరమ్‌లకు ఫ్రెండ్‌గా చేశాను. ఇక, అక్కినేని నాగేశ్వరరావుగారికి, నాగార్జునగారికి, సుమంత్, నాగచైతన్య రాబోయే అఖిల్‌కీ నేనే ఫ్రెండ్‌ని అవుతా. తరాలు మారుతున్నా ఫ్రెండ్ మారడంలేదు. తాత, కొడుకు, మనవడికి ఫ్రెండ్‌గా చేయడం అంటే చిన్న విషయం కాదు. నా హైట్ వల్ల లాభం ఇదే. ఇంతకన్నా ఏం లాభం కావాలి?

 నిర్మాతగా మారి, ‘ప్రేమాభిషేకం’ తీశారు. బాగా నష్టపోయినట్లున్నారు?
 వేణుమాధవ్: అలా అనే అందరూ అనుకుంటున్నారు. ఆ సినిమాకి మహా అయితే కోటి రూపాయలు అయ్యుంటుంది. శాటిలైట్ రైట్సే 70 లక్షలు వచ్చింది. తక్కువలో తక్కువ అన్ని ఏరియాల్లో కలిపి నా సినిమా 30 లక్షలకు అమ్ముడుపోదా? నష్టం ఎందుకు వస్తుంది? ఒకవేళ కొంతమంది అనుకుంటున్నట్లు నష్టం వచ్చిందే అనుకున్నాం. నేనెక్కణ్ణుంచి వచ్చాను? ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేనేం తీసుకొచ్చాను? మా ఊళ్లో ఉన్న ఎకరాలు ఎకరాలు అమ్మి ఇక్కడకు రాలేదు కదా. నా గురించి కొంతమంది ఎక్కువ ఆలోచించి, ఏదేదో అనుకుంటారు. ఎవరి గురించి వాళ్లు ఆలోచించుకుంటే బెటర్.

 మరి.. ఆ తర్వాత హీరోగా, నిర్మాతగా ఎందుకు సినిమా చెయ్యలేదు?
 వేణుమాధవ్: మళ్లీ బ్రహ్మాండమైన కథ దొరికితే తప్పకుండా చేస్తా. అశ్లీలత లేకుండా నీట్‌గా ఉన్న స్టోరీ అయితే చేయడానికి రెడీ.

 హడావిడిగా కారులోనే భోంచేసి, రకరకాల లొకేషన్స్ తిరిగి షూటింగ్‌లు చేసిన మీకు ఇప్పుడు మూడు, నాలుగు సినిమాలు మినహా లేకపోవడానికి కారణం ఏంటి?
 వేణుమాధవ్: కారణం ఏం లేదు. ప్రస్తుతం రాష్ర్టంలో జరుగుతున్న తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలే.

 కానీ, మీ ఓవర్‌యాక్షన్ వల్లే సినిమాలు తగ్గాయనే టాక్ ఉంది...?
 వేణుమాధవ్: ఎప్పుడైతే ఎదుటివాడు ఎక్కువ సినిమాలు చేసి, ఎక్కువ సంపాదిస్తున్నాడో అప్పుడు కొంతమంది దృష్టి వాడి మీద ఉంటుంది. నాకు తీరిగ్గా తినడానికి ఖాళీ లేక కార్లో భోంచేస్తూ వెళుతున్న సమయంలో, ఎవరైనా పలకరించారనుకోండి.. నేను మామూలుగా స్పందించి ఉండొచ్చు. అలాగే, కంటినిండా నిద్రపోయే టైమ్ దొరక్కపోవడంతో కారులోనే కునికి పాట్లు పడేవాణ్ణి. అప్పుడు ఎవరైనా పలకరిస్తే.. మామూలుగా మాట్లాడి ఉండొచ్చు. అది బలుపు అనుకుంటే నేనేం చేయగలను? అనుకున్నారు కదా అని నేను వాళ్లని ఏమీ అనడంలేదు. నేనేంటో నాకు తెలుసు.

 ‘నీ గురించి ఇలా అనుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండు’ అని చెప్పేంత స్నేహితులెవరూ మీకు ఇండస్ట్రీలో లేరా?
 వేణుమాధవ్: హలో అంటే హలో అనే స్థాయి ఫ్రెండ్స్ ఉన్నారు. నా దుకాణం నాది. పొద్దున్నే వెళ్లడం, షాప్ ఓపెన్ చేసి, బిజినెస్ చేసుకోవడం. అయిపోగానే దుకాణాన్ని కట్టేయడం అంతే! నాకున్నది ముగ్గురే స్నేహితులు. మా ఆవిడ, నా ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుక్కి మా నాన్న పేరే పెట్టాలనుకుని, ‘ప్రభాకర్’ అని పెట్టా. మా అమ్మ పేరు సావిత్రి. అందుకని, రెండోవాడికి ‘సావికర్’ అని పెట్టాను.

 మీ భార్య పట్ల అమానుషంగా ప్రవరిస్తారని, ‘శాడిస్ట్’ అనే టాక్ ప్రచారంలో ఉంది...?
 వేణుమాధవ్: మీ ఎదురుగానే మా ఆవిడ ఉంది కదా.. తననే అడగండి.

 మీకు ఇద్దరు భార్యలనే టాక్ ఉంది..?
 వేణుమాధవ్: ఇద్దరుంటే ఇద్దరూ కనిపించేవారు కదా. నాకున్నది ఒక్క భార్యే.

 మీ పెళ్లయ్యి ఎన్నేళ్లయ్యింది.. లవ్వా.. ఎరేంజ్డ్ మ్యారేజా?
 వేణుమాధవ్: పన్నెండేళ్లు. మా మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నా. ఎరేంజ్డ్ మ్యారేజే.

 పెళ్లయిన తర్వాత కట్నం కోసం వేధించారని టాక్?

 వేణుమాధవ్: అవన్నీ నిజమైన మాటలు కావండీ. ఎదుగుతున్నవాడి మీద బురద జల్లడం అన్నమాట. అలాంటివి ఏవైనా జరిగి ఉంటే.. ఇక్కడ ఉండేవాణ్ణి కాదు కదా.. లోపల ఉండేవాణ్ణి.

 మీకు సినిమాలు తగ్గడానికి కారణం రాష్ర్టంలో జరుగుతున్న ఉద్యమాలని చెప్పారు. అది నిజమైన కారణమేనా?
 వేణుమాధవ్: నిజమైనదే. ‘ఆటోనగర్ సూర్య’ చేశాను. అది విడుదల కావాల్సి ఉంది. వెంకటేష్, రామ్ కాంబినేషన్‌లో చేసిన ‘మసాలా’ విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం ‘రుద్రమదేవి’ చేస్తున్నాను. ఇంకొన్ని ఉన్నాయి.

 మీరు షూటింగ్స్‌కి సరిగ్గా రారనే విమర్శ ఉండటంవల్ల సినిమాలు తగ్గాయని కొంతమంది అంటుంటారు..?
 వేణుమాధవ్: నేను ఉంటున్నది మౌలాలీలో. ఇక్కణ్ణుంచి ఫిల్మ్‌నగర్‌కి రావడానికి కొంత సమయం పడుతుంది. ఒక్కోసారి ట్రాఫిక్‌లో ఇరుక్కున్నప్పుడు పావుగంట, అర్ధగంట లేట్ అయ్యుండొచ్చు. అంతే.. అయినా నా వల్ల ఇబ్బంది కలిగిందని ఒక్క నిర్మాతని అయినా చెప్పమనండి.

 మీరు అంతులేని వ్యాధితో బాధపడుతున్నారని.. అందుకే సినిమాలు తగ్గాయన్నది కూడా కొంతమంది ఊహ...
 వేణుమాధవ్: అది పచ్చి అబద్ధం. మీరు ఏ డాక్టర్‌ని అయినా తీసుకొచ్చి, పరిక్షలు చేయించవచ్చు. నేను రెడీగా ఉన్నాను.

 మరి.. ఎందుకు వీక్ అయ్యారు?
 వేణుమాధవ్: డైటింగ్ చేయడంతో బరువు తగ్గాను. హీరోలు తగ్గితే సిక్స్‌ప్యాక్ అంటారు. నేను తగ్గితే అంతులేని వ్యాధా? ప్రపంచంలో లేని జబ్బులు కూడా అంటగడతారు. ఇదెక్కడి న్యాయం?

 డైటింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది?
 వేణుమాధవ్: చిరంజీవిగారు, పవన్‌కళ్యాణ్‌గారు, నాగబాబుగారితో చేస్తున్నప్పుడు ఒకేలా ఉన్నాను. కానీ, రామ్‌చరణ్‌తో చేసేటప్పుడూ ఒకేలా ఉంటే ఏం బాగుంటుంది? నాగేశ్వరరావుగారు, నాగార్జునగారి పక్కన ఒకేలా కనిపిస్తే ఓకే. కానీ, నాగచైతన్యకీ ఫ్రెండ్ అంటే నమ్మేలా ఉండాలి కదా. తరాలు మారినా ఫ్రెండ్ కేరక్టర్స్ చేయాలంటే మౌల్డ్ అవ్వక తప్పదు. అందుకే ఈ డైటింగ్. ఆరోగ్యం గురించి ఎక్కువ జాగ్రత్త తీసుకోవడంవల్ల ఇదిగో ఇలా బక్కగా అయ్యాను.

 సేవా కార్యక్రమాలు కూడా బాగా చేస్తారట?

 వేణుమాధవ్: మా ఇంట్లో ఎవరి బర్త్‌డేకి కేక్స్ కట్ చేసుకునే అలవాటు లేదు. అనాథశరణాలయాల్లో, వృద్ధాశ్రమాల్లో చేసుకుంటాం. ఎవరైనా ఆపదలో ఉంటే ఆర్థిక సహాయం చేస్తుంటాను. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నాన్నగారి సంస్మరణార్ధం అమ్మ పేరు పెట్టి కళ్యాణ మండపం, కళా వేదిక కట్టించాను. గాంధీగారి విగ్రహాలు పెట్టించాను. వేణుమాధవ్ చారిటబుల్ ట్రస్ట్, వేణుమాధవ్ ఫ్రెండ్స్ సర్కిల్ పేర్లతో సేవాకార్యక్రమాలు చేస్తుంటాం.

 ప్రస్తుతం మీ ఆశయం ఏంటి?
 వేణుమాధవ్: సినిమాలపరంగా ఏ ఆశయం లేదు. వ్యక్తిగతంగా మాత్రం వీలైనంతవరకు చాలా మందికి సహాయపడాలన్నదే నా ఆశయం. నేను లక్ష అడిగితే ఆ భగవంతుడు ఎన్నో లక్షలిచ్చాడు. ఇక ఇంతకు మించి ఏదైనా ఆశిస్తే.. ఆ భగవంతుడు కూడా క్షమించడు. ఇంకా కోరికలు కోరి, ఆ భగవంతుడి ఆగ్రహానికి గురి కాదల్చుకోలేదు. ఆయనకు ప్రియభక్తుడిగానే ఉండిపోతా. నేను తినడానికి నాకు దేవుడు ఎంతో ఇచ్చాడు. నాతో పాటు నలుగురికీ పెట్టగలిగే శక్తి ఇచ్చాడు. జీవితానికి ఇంతకు మించి ఇంకేం కావాలి?

 - డి.జి. భవాని

 సంవత్సరానికి 40, 50 సినిమాలు చేసి, బంజారా హిల్స్, జూబ్లి హిల్స్‌లాంటి రిచ్ ఏరియాల్లో ఉండే స్థాయికి చేరుకున్నారు. కానీ, సిటీగా దూరంగా ఉండే మౌలాలిలో ఉండటానికి కారణం ఏంటి?

 వేణుమాధవ్: నాకున్న పది ఇళ్లూ మౌలాలీ హౌసింగ్‌బోర్డ్‌లోనే ఉన్నాయి. మా  అన్నయ్యలు, అక్క, చెల్లి, నేను... అంతా ఇదే ఏరియాలో ఉంటాం. ఇంకా మా బంధువులు చాలామంది ఉన్నారు. ప్రతిరోజూ మా ఇళ్లల్లోని ఆడవాళ్లు ఫోన్లు చేసుకుని, ‘ఏం కూర చేస్తున్నావ్.. నేను ఫలానాది వండుతున్నా. నువ్వు వేరే చెయ్యి’ అని చెప్పుకుంటారు. ఎవరింట్లో అయినా మహా అయితే రెండు, మూడు కూరలు ఉంటాయేమో.. కానీ మా ఇంట్లో మాత్రం రోజుకి ఎనిమిది రకాల కూరలు ఉంటాయి. నా పిల్లలు బయటికెళితే తప్పిపోతారనే భయం లేదు. ఈ ఏరియాలో ఉన్న మా బంధువులే కాదు.. వేరేవాళ్లు కూడా ‘వేణుమాధవ్ పిల్లలు’ అంటూ.. ఇంటికి తీసుకొచ్చి మరీ వదిలిపెడతారు. ఈ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఇంకో విషయం చెబుతాను. జూబిలీహిల్స్‌లో ఎవరున్నారు? చిరంజీవిగారు. ఆ ఏరియాకు ఆయన మెగాస్టార్. నేను మౌలాలీ మెగాస్టార్‌ని. నేను ఫిల్మ్‌నగర్‌లో ఉంటే.. నా ఇల్లెక్కడో ఎవరికీ తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసినా, వేణుమాధవ్ ఇల్లు అంటారు. కానీ, మౌలాలీలో ‘వేణన్నా..’ అంటూ ఆప్యాయంగా పిలవడానికి బోల్డంత మంది ఉన్నారు. ఈ ఏరియాలోకి ఎంటరవ్వగానే, వేణుమాధవ్ ఇల్లెక్కడ? అని ఎవర్ని అడిగినా.. చెప్పేస్తారు.

                                                                      ***************

 కొన్ని సందర్భాల్లో ఆడియన్స్‌ని నవ్వించడానికి కమెడియన్స్ జోకర్స్‌గా మారాల్సి ఉంటుంది. డబుల్ మీనింగ్ డైలాగులూ చెప్పాల్సి ఉంటుంది. అప్పుడెలా ఫీలయ్యారు?
 వేణుమాధవ్: దేవుడి దయ వల్ల జోకర్‌గా మారే పరిస్థితి రాలేదు. అలాగే స్త్రీలను అవమానరపరిచేలా ఉండే డైలాగులు కూడా చెప్పిన దాఖలాలు ఉండవు. చెప్పాల్సి వచ్చినప్పుడు లొకేషన్ నుంచి బయటికెళ్లిన సందర్భాలున్నాయి. అందుకని వేణుమాధవ్‌కి బలుపు అన్నవాళ్లు ఉన్నారు. నాలోనూ మంచి రచయిత ఉన్నాడు. అవసరమైతే నేనే మంచి డైలాగులు రాసిస్తానని కూడా కొంతమందితో చెప్పా. వాళ్లిచ్చిన డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పడానికి నిరాకరించా. ఒకవేళ నన్ను ఒత్తిడి చేస్తే, ‘ఇది మీ ఫ్యామిలీకి చూపించండి. మీ ఇంట్లో ఆడవాళ్లు ఒప్పుకుంటే చేస్తా’ అని చెబుతుంటా. ఒక్క డైలాగే కదా అని చెప్పేయొచ్చు. కానీ, ఆ తర్వాత టీవీలో ఆ సినిమా వచ్చినప్పుడల్లా మా అమ్మ, నా అక్కచెల్లెళ్లు, నా భార్య, వదినలు.. అందరూ చూస్తారు. ఇబ్బందిపడతారు. అందుకని లేడీస్‌ని అవమానపరిచే సీన్స్ చెయ్యనని చెప్పేస్తాను.

 పెద్ద హీరోల సినిమాల విషయంలోనూ అలా చేసిన సందర్భాలున్నాయా?
 వేణుమాధవ్: కొన్ని ఉన్నాయి.

 అలా చేస్తే అవకాశాలు కోల్పోతానని అనుకోలేదా?
 వేణుమాధవ్: పోతే పోనివ్వండి. పెద్ద హీరో ఏడాదికి ఎన్ని సినిమాలు చేస్తాడు? మహా అయితే నాలుగైదు. అవి పోయినంత మాత్రాన నాకేం ఇబ్బంది లేదు. ఆ రెండు సినిమాలకు కేటాయించే సమయాన్ని నా ఫ్యామిలీకి కేటాయిస్తాను.

 మీ పిల్లలను సినిమాల్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉందా?

 వేణుమాధవ్: అస్సలు లేదు! నేను పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదని. షూటింగ్స్‌తో బిజీగా ఉండటంవల్ల ప్రతి రోజూ రాత్రి ఒంటి గంటకు ఇంటికి రావడం, ఉదయం షూటింగ్‌కి వెళ్లడం.. దాదాపు నా జీవితం ఇలానే సాగింది. నా పిల్లలు అలా కాకుండా టెన్ టూ ఫైవ్ జాబ్ చేసుకుని, హాయిగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే, నేను లేట్‌గా ఇంటికి రావడం, ఉదయమే వెళ్లిపోవడం చూసి, నాన్నగారు చాలా బాధపడేవారు.

                                                                         ****************

 నటుడిగా అవకాశం ఇచ్చింది కృష్ణారెడ్డిగారు, అచ్చిరెడ్డిగారు. ‘హంగామా’ ద్వారా హీరోని చేసిందీ ఆ ఇద్దరే! అందుకే నా ఇంటికి ‘అచ్చి వచ్చిన కృష్ణ నిలయం’ అని పేరు పెట్టుకున్నాను. నా పదిళ్లకూ అదే పేరు. మౌలాలీలో ఈ పేరుతో ఉన్న ఇల్లు ఎవరిది? అని ఎవర్ని అడిగినా, ‘వేణుమాధవ్’ది అని చెబుతారు.  వాళ్లు ఇంకా నాకెలాంటి రోల్స్ ఇస్తానన్నా నేను రెడీ. ఒకవేళ ఇప్పటికప్పుడు పిలిచి ‘సినిమాలు మానేయ్’ అన్నా, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మానేస్తా! వాళ్లంటే నాకంత అభిమానం, గురి!

http://www.sakshi.com/news/family/exclusive-interview-with-venu-madhav-72764?pfrom=home-top-story
21:51 - By Swathi 0

WIDGET #1

Text Widget

Blogroll

Followers

Discrimination

ఈ బ్లాగులోని విషయాలు , సమాచారం మీకు ఉపయోగపడకలదు అని బావించి ఇంటర్నెట్ మరియు ఇతర వెబ్సైటు ల నుండి సేకరించడం జరిగింది.

Discussion

Powered by Blogger.
back to top