Feed Section

Search

Recent Readers

Powered by Blogger.
Showing posts with label Health. Show all posts
Showing posts with label Health. Show all posts

Friday, 25 October 2013

EAR-NOSE -TOUNGE PROBLEMS

చెవి, ముక్కు, గొంతు సమస్యలు-హోమియో చికిత్స


హైదరాబాద్ :  చెవి, ముక్కు, గొంతు సమస్యలు కూడా ఒక దానికొకటి సంబంధం ఉంటుంది. ఈ సమస్యలు అన్ని కూడా రోగ నిరోధక వ్యవస్థ శక్తి క్షీణించటం వలన, మానసిక ఒత్తిడి, ఆందోళనల వలన సమస్య తీవ్రత పెరిగి తరచుగా ఇన్ఫెక్షన్స్ రావటం జరుగుతుంది.

 3)తల తిరగటం: ఇది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమయంలో గమనిస్తూనే ఉంటాము. ముఖ్యంగా పడుకున్నప్పుడు గాని, పడుకుని చాలా తొందరగా లేచినప్పుడు, సడెన్‌గా పైకి చూసినప్పుడు వస్తుంది. ఒక్కొక్కసారి చెవిలో ఒక భాగమైన వెస్టిబ్యూల్ నరాలు ప్రేరేపితం అవటం వలన కూడా ఇది వస్తుంది.

 4) మీనియర్స్ వ్యాధి: ఇది ముఖ్యంగా చెవి లోపలి పొరకు వస్తుంది. దీనిలో ముఖ్యంగా తల తిరగటం, సరిగ్గా వినిపించక పోవటం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి.

 5) ఎకోస్టిక్ న్యూరోమా: ఇది చెవిలోపల ఒక కణితి ఏర్పడి, వినికిడి లోపం, చెవిలో హోరుమని శబ్దాలు, నడిచేటప్పుడు కూడా సరిగ్గా బ్యాలెన్స్ లేకపోవటం, మొహం అంతా తిమ్మిరి రావటం వంటి లక్షణాలు వస్తాయి. కఖఐ పరీక్ష చేయించుకుంటే కణితి సైజ్ ఎలా ఉన్నది తెలుస్తుంది.

 6) ల్యాబరింథైటిస్, వెస్టిబ్యులార్ మ్యారైటిస్: చెవిలోపలి పొరకు వచ్చే వాపు వలన ఈ సమస్య వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా వైరస్, బ్యాక్టీరియా వలన వస్తుంది. చెవి మధ్యపొర నుంచి వచ్చే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఈ సమస్య వస్తుంది. దీనిలో కూడా ముఖ్యంగా తల తిరగటం, వికారం, వినికిడిలోపం వంటివి ఉంటాయి.

 7) ఓటో స్ల్కీరోసి్‌స్, టినిటస్ లాంటి సమస్యలు:  ఇవి చెవిలోపల సర్వ సాధారణంగా గమనిస్తుంటాము. ఇదేవిధంగా ముక్కు లోపల కూడా తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన రోగ నిరోధక వ్యవస్థ శక్తి క్షీణించి, ఎలర్జీ వంటి సమస్యలు వస్తూంటాయి. అవి...
 ఎలర్జిక్ సైనసైటిస్
 ఎపిస్టాక్సిస్
 సైనసైటిస్.

 ఈ పైన చెప్పిన సమస్యలు అన్నీ కూడా ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థ యొక్క శక్తి క్షీణించటం వలన, సాధారణమైన జలుబు, తుమ్ములు, ముక్కు నుంచి విపరీతంగా నీరు కారటంతో మొదలయి, సరైన రీతిలో చికిత్స తీసుకోక, విపరీతమైన కఫం లేదా శ్లేష్మం గాలి రంధ్రాలలో పేరుకుపోయి, వాటికి వాపు వస్తుంది. ఈ సమస్యను సైనసైటిస్ అంటారు. దీనిలో తలబరువు, వికారం, వాంతులు, వాసన తెలియకపోవటం, నీరసం, అలసట, ఎవరి పనులు వారు చేసుకోలేక పోవటం వంటి సమస్యలు వస్తాయి.

 చెవి, ముక్కుకు వచ్చే సమస్యలు గొంతు సమస్యలకు కూడా దారి తీస్తుంటాయి. వీటిలో తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన రోగ నిరోధక వ్యవస్థ శక్తి రోజురోజుకి తగ్గి మొత్తం చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఏర్పడుతుంటాయి.

 సాధారణంగా వచ్చే గొంతు సమస్యలు:
 స్వరపేటికలో వచ్చే సమస్యలు: ఇవి ముఖ్యంగా, గొంతు ఎక్కువగా వాడటం వలన అంటే ఎక్కువగా మాట్లాడే వారిలో, పాటలు పాడే వాళ్ళలో, హైపోథైరాయిడిజమ్, సైనసైటిస్‌తో ఎక్కువ కాలంగా బాధపడుతున్న, విపరీతమైన దగ్గు ఉండే వాళ్ళల్లో వస్తుంది.

 అరుగుదల సమస్య ఉండే వాళ్ళల్లో కూడా గొంతు దగ్గర మంట, నొప్పి, తీసుకున్న ఆహారం మింగలేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్’కు దారి తీస్తాయి.

 చెవిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. ఇవి 1) చెవి వెలుపలి పొర 2) మధ్య భాగంలో ఉండే పొర 3) లోపలి పొర. సాధారణంగా ఈ 3 పొరలకు ఇన్‌ఫెక్షన్స్ గాని, వేరే ఇతర వ్యాధులు గాని రావటం జరుగుతుంది.

 సాధారణంగా చెవికి వచ్చే వ్యాధులు
 1) చెవి వెలుపలి పొరకు వచ్చే ఇన్ఫెక్షన్స్: దీనివలన దురద, నొప్పి, వాపుతో కూడి చెవి నుంచి స్రావం వస్తుంది. ఆ స్రావం ఒక్కొక్కసారి నీరు లేదా చీముతో కూడిన స్రావం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వాతావరణంలో వచ్చిన మార్పుల వలన, దూది లేదా పిన్నులు చెవిలో పెట్టుకోవటం వలన, ఒక్కొక్కసారి త్వరితంగా లేదా దీర్ఘకాలికంగా కూడా చెవి ఇన్ఫెక్షన్స్ వస్తూంటాయి. త్వరితంగా వచ్చేవి అంటే

 ఎక్యూట్ పర్‌స్పరేటివ్ ఒటైటిస్ మీడియా దీర్ఘకాలికంగా అంటే

 క్రానిక్ పర్‌స్పరేటివ్ ఒటైటిస్ మీడియా అని అంటారు. ఇన్ఫెక్షన్స్ తీవ్రతను బట్టి అది ఎక్యూట్ లేదా క్రానిక్ అని గుర్తించి, చికిత్స చేయాల్సి ఉంటుంది.

 2) మధ్యపొరకు వచ్చే ఇన్ఫెక్షన్స్: 
ఇది ముఖ్యంగా ముక్కు లేదా గొంతులో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. అంతే గాకుండా ఎలర్జీ సమస్యలు ఏవైనా ఉన్నా కూడా తరచుగా ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ వస్తూంటాయి.

 దీనిలో ఉండే ముఖ్య లక్షణాలు:
 చెవినొప్పి
 సరిగ్గా వినబడకపోవటం
 చెవి అంతా పట్టేసినట్లు ఉండడం
 జ్వరం
 తలంతా బరువుగా ఉండి ఏ పనిచెయ్యాలని అనిపించకపోవటం
 తల తిరగటం.

 పాజిటివ్ హోమియోపతిలో పేషెంట్ తత్త్వాన్ని బట్టి మందులు ఇచ్చి, వ్యాధి యొక్క మూలకారణాన్ని ఎనాలసిస్ చేసుకుని ‘జెనిటిక్ కానిస్టిట్యూషనల్ సిమిలిమమ్’ అనే పద్ధతి ద్వారా చికిత్స ఇవ్వడం జరుగుతుంది. దీనివలన రోగ నిరోధక వ్యవస్థ శక్తి పెరిగి, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్‌ను ఆపడమే కాకుండా, పూర్తిస్థాయిలో చికిత్స ఇవ్వడం జరుగుతుంది.

 డా॥టి. కిరణ్‌కుమార్
 పాజిటివ్ హోమియోపతి


www.sakshi.com/news/family/ear-nose-and-throat-problems-homoeo-treatment-75578?pfrom=home-todays-family
07:10 - By Swathi 0

is scanning harmful during pregnancy...?

స్కానింగ్ వల్ల గర్భవతులకు, కడుపులోని బిడ్డకు ప్రమాదమా?


స్కానింగ్ వల్ల గర్భవతులకు, కడుపులోని బిడ్డకు ప్రమాదమా?
హైదరాబాద్ :  నేను ఇప్పుడు ఏడో నెల గర్భవతిని. డాక్టర్లు స్కాన్ చేయించమని చెప్పారు. అయితే ఇంతకు ముపును కూడా ఐదోనెలలో ఒకసారి స్కానింగ్ అయ్యింది. ఇలా తరచూ అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించడం  బేబీకి మంచిదేనా? తెలియజేయండి.
 - సురేఖ, హైదరాబాద్

 గర్భవతులకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. సాధారణంగా గర్భధారణ మొత్తం వ్యవధిని... మొదటి మూడు నెలలను మొదటి ట్రైమిస్టర్‌గా, రెండో మూడు నెలల కాలాన్ని రెండో ట్రైమిస్టర్‌గా, ఆఖరి మూడు నెలల కాలాన్ని మూడో ట్రైమిస్టర్‌గా విభజిస్తారు. ఒక్కో ట్రైమిస్టర్ ఒక్కోసారి చొప్పున కనీసం మూడు స్కానింగ్‌లైనా తీయించి చూడటం తల్లికీ, బిడ్డకూ మేలు చేసేందుకే.
 మొదటి ట్రైమిస్టర్‌లో అంటే 14 వారాల లోపు చేసే స్కానింగ్‌లో గర్భాన్ని నిర్ధారణ చేయడంతో పాటు లోపల ఎంతమంది బిడ్డలు ఉన్నారు (అంటే కవలలా లేక ఒకే బిడ్డా) అన్న విషయాలు తెలుస్తాయి. దాంతో పాటు బిడ్డ సైజ్, దాన్ని బట్టి ప్రవసం అయ్యే తేదీని కూడా ఉజ్జాయింపుగా చెప్పవచ్చు. ఈ దశలో చేసే స్కానింగ్ ద్వారా బిడ్డకు అంగవైకల్యం వచ్చే అవకాశాలను దాదాపు 50 శాతం నుంచి 60 శాతం వరకు అంచనా వేసేందుకు అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల కొంతవరకు డౌన్ సిండ్రోమ్ వంటి రుగ్మతలనూ అంచనా వేసే అవకాశమూ ఉంది.


 ఇక రెండో ట్రైమిస్టర్‌లో అంటే... 20 వారాల సమయంలో చేసే స్కాన్‌ను ‘టిఫా’ స్కాన్ లేదా ఫీటల్ టార్గెట్ స్కాన్ అంటరు. అంటే ప్రత్యేకంగా బిడ్డలోని ప్రతి అవయవం నిర్దిష్టంగా ఎలా ఉందో టార్గెట్ చేసి చూస్తారు కాబట్టి దీన్ని ఫీటల్ టార్గెట్ స్కాన్ అంటారు. ఈ స్కాన్ ద్వారా బిడ్డకు అంగవైకల్యం కలిగే అవకాశాలను 80 శాతం వరకు కచ్చితంగా చెప్పడానికి ఆస్కారం ఉంది. అందుకే మొదటి ట్రైమిస్టర్‌లో స్కాన్ చేయించకపోయినా... 18 నుంచి 20 వారాల సమయంలో తప్పకుండా స్కానింగ్ చేయించాలి.


 ఇక మూడో ట్రైమిస్టర్‌లో అంటే 34వ వారంలో పొట్టలో బేబీ పొజిషన్‌ను చూస్తారు. ఆ సమయంలో తీసే స్కాన్‌లో బిడ్డ తలకిందులుగా ఉంటే సాధారణ ప్రవసం అవుతుందన్నమాట. ఒకవేళ ఎదురుకాళ్లతో కనిపిస్తే అప్పుడు శస్త్రచికిత్స ద్వారా బిడ్డను బయటకు తీసేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

 సాధారణంగా భారతీయ ప్రమాణాలలో పుట్టినప్పుడు బిడ్డ బరువు 2.5 కిలోల నుంచి 2.8 కిలోల వరకు ఉంటుంది. బిడ్డ పెద్దదిగా ఉందా లేక చిన్నదిగా ఉందా అన్న విషయంతో పాటు ఉమ్మనీరు ఎలా ఉంది అన్న విషయం కూడా స్కాన్‌లో తెలుస్తుంది. దీన్ని బట్టి ఒకవేళ ఉమ్మనీరు తగ్గితే దానికి కారణాలు కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటు మాయ (ప్లాసెంటా) తీరుతెన్నులు కూడా తెలుస్తాయి. ఉదాహరణకు గర్భాశయముఖద్వారానికి (సెర్విక్స్‌కు) దగ్గరగా మాయ ఉండటాన్ని ప్లాసెంటా ప్రివియా అంటారు. నిజానికి ప్రసవంలో బిడ్డ బయటకు వచ్చిన తర్వాత మాయ బయటకు రావాలి. కానీ ఒకవేళ ముందే మాయ బయటకు వస్తే అప్పుడు తల్లికి తీవ్రమైన రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. ఇది బిడ్డకూ, తల్లికీ ప్రమాదకరమైన పరిస్థితే. అందుకే స్కానింగ్ ద్వారా ప్రసవం అయ్యే తీరును అంచనా వేసి, దానికి తగినట్లుగా ఏర్పాటు చేసుకోవాలి.

 ఇక అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లో కేవలం శబ్దతరంగాలను మాత్రమే ఉపయోగిస్తారు. ఎక్స్-రే లేదా సీటీ స్కాన్‌లో లాగా ప్రమాదకరమైన రేడియేషన్ తరంగాలను ఉపయోగించరు. ఈ శబ్దతరంగాలు ఎంత ప్రమాదరహితమైనవంటే... అవసరాన్ని బట్టి ఒక్కోసారి రోజూ డాప్లర్ స్కానింగ్ చేయించాల్సి రావచ్చు. అప్పుడు కూడా ప్రమాదాన్ని కలిగించవని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి నిరభ్యంతరంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవచ్చు. కాకపోతే పుట్టబోయే బిడ్డ... ఆడా, మగా అని మాత్రం అడగవద్దు. అది మాత్రమే అభ్యంతరకరం.

 డాక్టర్ సుశీల వావిలాల
 ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్,
 ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్


Tags: Pregnancy, Scanning, Child Helath, Women


http://www.sakshi.com/news/family/will-scanning-harm-pregnant-and-the-baby-inside-75580?pfrom=home-todays-family
06:12 - By Swathi 0

Sunday, 20 October 2013

Asthma -homeopathic-remedies

దగ్గు ఆయాసం, అలర్జీ - అస్తమాకు హోమియోలో తగిన చికిత్స


హైదరాబాద్ : మానవ శరీరం ఒక అద్భుతం! శరీరంలోని ఎలాంటి పదార్థాలు, క్రిములు వచ్చినా వాటిని ఎదుర్కొని పోరాడేలా దేవుడు దానిని నిర్మించాడు. దీనినే మనం ‘‘ఇమ్మూనిటీ’’ లేదా రోగ నిరోధక వ్యవస్థ అంటారు. దీని వలన మన శరీరంలోనికి గాలి ద్వారా, నీటిద్వారా, ఆహారం ద్వారా ఎలాంటి ప్రతికూల పదార్థములు బాక్టీరియా, వైరస్, ఫారెన్ ప్రొటీన్‌లు వచ్చినా తెల్లరక్తకణాలు వాటితో పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే కొంత మందిలో ఈ వ్యాధినిరోధక వ్యవస్థ ఇతరులకు ఎలాంటి హాని కలిగించని పదార్థాల వలన కూడా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది. దీనినే ‘‘హైపర్ సెన్సిటివీటి’’ లేదా ‘‘అలర్జీ’’ అని అంటారు.

 గాలిలో దుమ్ము, పుప్పొడి వంటివి ఉన్నప్పుడు అలర్జీతో బాధపడేవారికి ఇక అదే పనిగా వరుసబెట్టి తుమ్ములు వస్తాయి. ఆ తర్వాత ముక్కు ఎరుపెక్కి, జలుబు చేసి, పల్చని నీరులా స్రవిస్తుంది. దానితో పాటు కళ్ళు ఎరుపెక్కి కళ్ళ నుండి నీరు కారుతుంది. దీనిని అశ్రద్ధ చేసినట్లయితే ముక్కు దిబ్బడ, గాలి సరిగ్గా ఆడకపోవడం, గొంతులోనికి కళ్ళె వస్తూ ఉండడం, ముఖం లోపలిభాగంలో నొప్పి, తలనొప్పి మొదలైతే ‘‘అలర్జిక్ సైనసైటిస్’’ అని, గాలి గొట్టాలలోనికి, ఊపిరితిత్తులకు సోకి పొడి దగ్గు, కళ్లెతో కూడి దగ్గు మొదలైతే ‘‘అలర్జిక్ బ్రాంకైటిస్’’ అని ఆయాసం, ఎగపోయడం, పిల్లికూతలు వంటి లక్షణాలు కన్పిస్తే ‘‘అలర్జిక్ ఆస్థ్మా’’ అని అంటారు.
                                                                    *****************
 దగ్గు అనేది సాధారణంగా అందరిలో కనిపించే ఒక లక్షణం. ఏదైనా దుమ్ము, ధూళి లేదా అలర్జీలు లోపలికి ప్రవేశించేటప్పుడు, దగ్గు అనే ప్రక్రియ ద్వారా అని బయటకు రావటం జరుగుతుంది. ఒక్కొక్కసారి పొడిదగ్గు లేదా శ్లేష్మంతో కూడిన దగ్గు కూడా వస్తూ ఉంటుంది. సాధారణంగా, దగ్గు చాలా ఎక్కువగా చిన్న పిల్లల వయసు నుంచి గమనిస్తూ ఉంటాము.

 శ్లేష్మంతో కూడిన దగ్గు ముక్కు నుంచి గొంతులోకి పోయి, అక్కడి నుంచి సైనస్ లేదా ఊపిరితిత్తులలోకి ప్రవేశించడం జరుగుతుంది. శ్లేష్మంతో కూడిన దగ్గుకి చాలా త్వరితంగా చికిత్స చేయలేకపోతే అది ఆస్త్మా కిందకు మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

 కారణాలు:
 వైరల్ ఇన్‌ఫెక్షన్స్ వలన

 దీర్ఘకాలికంగా ఊపిరితిత్తులకు వ్యాధులుసోకిన

 గ్యాస్ట్రో ఈసోఫెజియల్ రిఫ్లక్స్ డిసీజ్‌తో

 ముక్కునుంచి వచ్చే స్రావం గొంతులోకి వెళ్ళటం

 పొగతాగటం

 దుమ్ము, ధూళిలో తిరగడం వలన

  ఏదైనా పదార్థం గొంతులో అడ్డుపడటం వలన ఇంచు మించు  శ్లేష్మం ఉన్నా, లేకపోయినా, దగ్గు గనుక 2-3 రోజుల నుంచి మొదలై, 7 నుంచి 10 రోజులలో తగ్గిపోతుంది. దానిని ‘అక్యూట్ బ్రాంకైటిస్’ అంటారు. ఈ స్టేజ్‌లో ఉన్న వ్యాధికి సరిగ్గా చికిత్స లేకపోతే అది దీర్ఘకాలికంగా అంటే 2 నుంచి 3 నెలల వరకు పూర్తిగా తగ్గకుండా ఉంటే దానిని ‘క్రానిక్ బ్రాంకైటిస్’ అంటారు. కాని దగ్గు త్వరితంగా లేదా దీర్ఘకాలికంగా ఉన్నా, మొదటగా వ్యాధి నిరోధక వ్యవస్థ శక్తి క్షీణించటం వలన ఇన్ఫెక్షన్ శరీరం మీదకి ముఖ్యంగా వ్యక్తుల తత్తాన్ని బట్టి ఊపిరితిత్తుల మీదకు ప్రభావితం కావటం జరుగుతుంది. ఈ బ్రాంకైటిస్ సమస్యను మూలకారణం నుంచి ఎనాలిసిస్ చేయలేక, వ్యాధిని పూర్తిగా నివారించక పోతే ఇది ‘బ్రాంకియల్ ఆస్త్మా కింద మారుతుంది. దీనిలో ముఖ్యంగా విపరీతమైన దగ్గు, ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవటం, ఛాతీ అంతా పట్టేసినట్లు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
                                                        *****************
 కొంతమందికి వంకాయ, మునక్కాయ, పల్లీలు వంటి ఆహార పదార్థాలు తినగానే శరీరంపైన దద్దుర్ల మాదిరిగా ఎర్రగా, ఉబ్బెత్తుగా, తీవ్రమైన దురద వస్తాయి. ఈ ర్యాష్ 24 గంటల్లో తగ్గుతుంది. కొంతమందిలో లేటెక్స్ సంబంధిత వస్తువులు తగిలిన స్థలాలో చర్మమంతటా పొక్కులు వస్తాయి. దీనిని ‘అలర్జిక్ డెర్మటైటస్’ అని అంటారు.

 ఇలా అలర్జీలలో అనేక రకాలు ఉన్నప్పటికి ఎక్కువ మందిలో కనబడేవి శ్వాసకోశ సంబంధిత అలర్జీలు. అనగా రైనైటిస్, సైనసైటిస్, బ్రాంకైటిస్, బ్రాంక్రియల్ ఆస్త్మా. శ్వాసకోశ సంబంధిత అలర్జీలను కలిగించే వాటిలో ప్రధానమైనవి-పుప్పొడి, దుమ్ములో ఉండే క్రిములు, మోల్డ్, బొద్దింకలు, పశువుల పేడ మొదలైనవి. కొంతమందికి పూలవాసన, పర్‌ఫ్యూమ్స్, కూరపోపు లాంటివి కూడా పడవు.
                                                                    **************
 పాజిటివ్ హోమియోపతిలో ఈ దగ్గు, ఆయాసం, అలర్జీ, ఆస్త్మాలకు పూర్తిస్థాయిలో పరిష్కారం ఉంటుంది. వ్యాధి త్వరితంగా ఉన్నా లేదా దీర్ఘకాలికంగా ఉన్నా, దాని మూలకారణం నుంచి వ్యాధిని తీసేయాలి.ముఖ్యంగా తత్వం ప్రకారం చికిత్సను మొదలు పెట్టి, ఏదైనా మానసిక ఒత్తిడి, ఆందోళనలు ఉంటే, ఆ మానసిక స్థాయి నుంచి చికిత్సను ఇవ్వడం ఉత్తమం. వాతావరణంలో ఉండే మార్పులను బట్టి మనిషి తత్వాన్ని ఎనాలసిస్ చేసి, చికిత్సను ఇస్తే పూర్తి స్థాయిలో పరిష్కారం ఉంటుంది.

 డా॥టి. కిరణ్‌కుమార్
 పాజిటివ్ హోమియోపతి
  అపాయింట్‌మెంట్ కొరకు 9246199922
 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ,
 వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై
 www.positivehomeopathy.com

http://www.sakshi.com/news/family/homeopathic-remedies-for-cough-fatigue-allergy-asthma-73763?pfrom=home-todays-family
11:04 - By Swathi 0

Saturday, 21 September 2013

Ash Gourd

కూరగాథలు : వీరీ...వీరీ... గుమ్మడి



గుమ్మడి పండు దీర్ఘకాలం పాటు నిల్వ ఉంటుంది. అందుకే పుణ్యకార్యాలకూ, పురోహితులకు సంభావనగానూ ఇవ్వడానికి ఇంట్లో గుమ్మడి పళ్ళు నిల్వ చేస్తారు గృహస్థులు. గుమ్మడి కున్న ఔషధ విలువల కారణంగా గుమ్మడి పండుతో చేసిన కూరగాని, పులుసుగాని ఏడాదికొకసారైనా తినాలంటారు పెద్దలు. గతంలో కొన్ని వైపరీత్యాల మూలంగా గుమ్మడికాయలు దొరకని పరిస్థితి ఉండేది. అలాంటప్పుడు గుమ్మడికాయను దొంగిలించినా తప్పులేదనే భావం ప్రజలలో ప్రబలింది. అందరూ సర్వసామాన్యంగా చేసే తప్పు కనుకనే 'గుమ్మడికాయల దొంగ ఎవరంటే తమ భుజాలు తడుముకున్నార'నే సామెత ఏర్పడిందేమో.

'వార్తాకం కోమలం పథ్యం - కూష్మాండం కోమలం విషం' అని ఆర్యోక్తి. దీని అర్థం తినేందుకు లేత వంకాయలు శ్రేష్టమే కాని లేత గుమ్మడికాయలు మాత్రం విషంతో సమానమని. (ముదురు వంగ విత్తనాల్లో మత్తును కలిగించే విషపదార్థాలున్నట్లే లేత గుమ్మడిలోనూ హానికారక విషపదార్థాలుంటాయి.) అందుకే పచ్చి గుమ్మడి తినరాదు. గుమ్మడి పండు మాత్రమే తినదగినది.

గుమ్మడి ఏకవార్షిక తీగ మొక్క. దీని పెద్ద ఆకులకూ, కాండానికీ మెత్తటి నూగు ఉంటుంది. ప్రతి కణుపు వద్ద స్ప్రింగుల వంటి 'ట్రెండిల్స్' వస్తాయి. వీటి సాయంతోనే గుమ్మడి తీగ ఎగబాకుతుంది. దీని పసుపు పచ్చని పెద్ద పూలు ఏకలింగ పుష్పాలు. మగ, ఆడ పూలు ఒంటరిగానే ఉంటాయి. గుజ్జు, అసంఖ్యాకమైన విత్తనాలు కలిగి ఉండే గుమ్మడి పళ్ళు గట్టి పైపొర కారణంగా మనం కోస్తే తప్ప వాటికి అవిగా పగలవు. గుమ్మడి పళ్ళు సాధారణంగా ఏడెనిమిది కేజీలు, అరుదుగా ఇరవై కేజీల బరువు వరకు కూడా ఉంటాయి. విత్తనాలు అండాకారంలో అణగగొట్టినట్లుంటాయి.


గుమ్మడిగుంట, గుమ్మడిదొడ్డి, గుమ్మడిపూండి వగైరా గ్రామనామాలు... గుమ్మడి, గుమ్మడిదల, గుమ్మళ్ళ మొదలైన ఇళ్ళ పేర్లు గుమ్మడితో మన ప్రాచీన అనుబంధానికి తార్కాణాలు. దక్షిణ అమెరికాలోని అతి ప్రాచీన రెడ్ ఇండియన్ సమాధుల్లో లభించిన అవశేషాలను బట్టి వేల ఏండ్ల క్రితం నుంచీ గుమ్మడిని మానవులు ఆహారంగా వాడేవారని శాస్త్రజ్ఞులు నిర్ణయించారు. భారతదేశంలో చరిత్ర పూర్వ యుగాల నుంచీ గుమ్మడిని పండించడం ఉంది. అయినా గుమ్మడి జాతి తొట్టతొలి జన్మస్థలం మాత్రం పదివేల సంవత్సరాలకు పూర్వమే ఉభయ అమెరికా ఖండాల్లో అత్యుష్ణ ప్రాంతాల్లో ఆవిర్భవించిందని వారి అంచనా.

అయితే గుమ్మడి జాతుల్లో కొన్నింటికి ఉన్న సంస్కృత పేర్లు కూడా అతి ప్రాచీన కాలం నాటివని నిర్ధారణ అయింది. ఉభయ అమెరికా ఖండాల నుంచి ఎటువంటి నౌకాయానాలు లేనట్టి అంత ప్రాచీన కాలంలోనే ఈ మొక్క భారతదేశం దాకా ఎలా విస్తరించి ఉంటుందనే దానిపైన కూడా శాస్త్రజ్ఞులు విస్తృతంగా చర్చించారు. చివరికి ఎండిన గుమ్మడిపళ్ళు అతి తేలికైనవైనందున అవి మహాసముద్రాల నీటిపై తేలుతూ, మొలకెత్తే సామర్థ్యం కోల్పోని విత్తనాలతో సహా ఒక ఖండం నుంచి మరో ఖండానికి విస్తరించి, అక్కడ అనుకూల పరిస్థితుల్లో మొలకెత్తి ఉండవచ్చుననే నిర్ధారణకు వచ్చారు. అమెరికన్లు 'రెడ్ పంప్కిన్' అని పిలిచే మంచి గుమ్మడి భారతదేశంలో ప్రవేశించి, 'లాల్ కుమ్రా' అని పిలువబడుతున్నది.

అమెరికాలోనే పుట్టిన కషో అనే మరో జాతి గుమ్మడిని భారతీయ మార్కెట్లలో 'ఆఫ్రికన్ గోర్డ్' అనడాన్ని బట్టి మూలంలో అమెరికాలో జన్మించిన ఆ జాతి అక్కడ నుంచి ముందు ఆఫ్రికా ఖండానికి విస్తరించి, ఆ తరువాత భారతదేశానికి విస్తరించి ఉంటుందని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ప్రస్తుతం ఆఫ్రికన్ గోర్డ్‌గా పిలవబడుతున్నప్పటికీ, ఈ జాతి భారతదేశానికి అతి ప్రాచీన కాలంలోనే వచ్చి చేరింది. విచిత్ర వీణ, తంబూరా వంటి సంగీత వాద్యాలు తయారుచేసేందుకు అతి పెద్దవైన ఈ జాతి గుమ్మడి పండు బుర్రల్నే అత్యం త ప్రాచీన కాలం నుంచి భారతీయులు ఉపయోగించేవారు.


గుమ్మడి పండునే కాదు; వాటి లేత ఆకులు, కాండం, పూలు కూడా కూరకు వాడుకుంటారు. గుమ్మడి గింజల్ని తింటారు. హల్వాలు వంటి స్వీట్లలో బాదం, పిస్తా, చార (సార) పప్పు లాగే ఈ గింజలలోని పప్పును కూడా డ్రెస్సింగ్‌గా వాడతారు. కొందరైతే గుమ్మడి పండుతోనే హల్వా చేసుకుంటారు. గుమ్మడిలో పొటాషియం, ఫాస్ఫరస్, సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఉపయుక్త ఖనిజాలే కాక, విటమిన్ ఎ (అధికంగానూ), కొద్దిగా విటమిన్ సి (కొద్దిగానూ) ఉన్నందున అది ఆహారపరంగా విలువైనదని గుర్తించారు. గుమ్మడి పండుకు ఎన్నో వైద్యపరమైన ప్రయోజనాలున్నాయి. కడుపులోని 'టేప్ వార్మ్స్' నిర్మూలన కోసం గుమ్మడి గింజల్ని పంచదారతో తినిపిస్తారు.

రాత్రి పడుకోబోయే ముందు తినిపించి, తెల్లవారుఝామునే ఆముదం తాగిస్తారు. గనేరియా, మూత్ర వ్యాధులున్న రోగులకు మూత్రం సాఫీగా వెడలేందుకు గుమ్మడి విత్తులు పంచదార లేక తేనెతో తినిపిస్తారు. సెగగడ్డలు, మొండి వ్రణాలకు గుమ్మడి పండు గుజ్జును మలాం పట్టీగా వేస్తారు. తేళ్ళు, కాళ్ళజెర్రులు, మండ్రగబ్బలు మొదలైనవి కుట్టినప్పుడు, గుమ్మడిపండు తొడిమను ఎండబెట్టి పొడి చేసి, దానితో తయారుచేసిన పేస్టును రాస్తే తక్షణ ప్రయోజనం ఉంటుంది. కాలిన గాయాలకు గుమ్మడి పండు గుజ్జుతో పట్టు వేస్తారు. గుమ్మడి విత్తులు మూత్రకారిగానే కాక, నరాల బలహీనత ఉన్నవారికి టానిక్‌లా పనిచేస్తాయి. ఇన్ని ఔషధ గుణాలున్న గుమ్మడిని దొరికినప్పుడల్లా మనం ఆహారంలో ఉపయోగించుకోవడం ఎంతైనా మంచిది కదూ! ఇదండీ గుమ్మడి గాథ.
- ముత్తేవి రవీంద్రనాథ్
http://www.andhrajyothy.com/ContentPage.jsp?story_id=54163&category=sunday_special
21:21 - By Swathi 0

THYROID

హోమియోకేర్ చెంత థైరాయిడ్ నుంచి నిశ్చింత

హోమియోకేర్ చెంత థైరాయిడ్ నుంచి నిశ్చింత
హైదరాబాద్ : ఆధునిక జీవితంలో ప్రతి 20 మందిలో ఒక వ్యక్తికి థైరాయిడ్ సమస్య రాగలదు. థైరాయిడ్ గ్రంథి నుండి విడుదలైన హార్మోనులు రక్త ప్రవాహంలో కలిసి శారీరక పెరుగుదలకు, జీవక్రియలు జరగడానికి తోడ్పడతాయి. థైరాయిడ్ గ్రంథిలో వచ్చే మార్పుల వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్, అందువల్ల జీవక్రియలన్నీ నెమ్మదిస్తాయి. ప్రస్తుత జీవన పరిస్థితులలో మానసిక ఒత్తిళ్ళ వల్ల, ఆహార సమతుల్యం/ శారీరక శ్రమ లోపించడం వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశం ఎక్కువ.

 అప్పుడే పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు ఏ వయసువారికైనా ఈ సమస్య రావచ్చు. అయితే వయసును అనుసరించి కారణాలు మారవచ్చు. శిశువులలో... థైరాయిడ్‌గ్రంథి నిర్మాణంలో ఏదైనా లోపం ఉన్నపుడు సాధారణంగా ఈ సమస్య కనిపిస్తుంది. దీన్ని కంజెనిటల్ హైపోథైరాయిడిజం అంటారు. పెద్దవారిలో హషిమోటో థైరాయిడిటైటిస్, ఈ హైపోథైరాయిడిజం సమస్య రావడానికి ఒక సాధారణ కారణం.

 రకాల: థైరాయిడ్ సమస్యలు 2 రకాలు
 1.హైపోథైరాయిడిజం: జీవక్రియలు సజావుగా జరగడానికి సరిపడా థైరాక్సిన్ హార్మోన్‌ను థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేయకపోవడాన్ని హైపో థైరాయిడిజం అంటారు. ఫలితంగా అలసట, చర్మం పొడిబారడం, అధిక బరువు, స్త్రీలలో నెలసరి సమస్యలు, మగత, మలబద్దకం చలికి తట్టుకోలేకపోవడం, జుట్టు రాలడం, కీళ్ల నొప్పులు, చిరాకు, మతిమరుపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

 2.హైపర్ థైరాయిడిజం:
 థైరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేయడం వలన ఈ సమస్య వస్తుంది. గుండెదడ, చేతులు, కాళ్ళు వణకడం, నిద్రలేమి, ఆందోళన, బరువు తగ్గిపోవడం, వేడిని తట్టుకోలేకపోవడం, ఆకలి పెరగడం, నెలసరి సమస్యలు, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.

 థైరాయిడ్ హార్మోన్‌లు అధికంగా స్రవించడం వల్ల థైరోటాక్సికోసిస్ వస్తుంది. ఈ వ్యాధి చాలా నెమ్మదిగా ప్రారంభమవుతుంది.

 కంటి కండరాలు వాచి, కంటి గుడ్లు ముందుకు వచ్చినట్లు కనిపిస్తే దీన్ని Grave's disease అంటారు.

 కొంతమందికి థైరాయిడ్‌గ్రంథి పెద్దదై మెడభాగంలో వాపు వస్తుంది. దీన్ని గాయిటర్ అంటారు.

 పరీక్షలు: థైరాయిడ్ సమస్య ఉందా లేదా అని తెలుసుకోవడానికి టి3, టి4, టిఎస్‌హెచ్ హార్మోన్ల లెవల్స్‌ను రక్త పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పై లెవల్స్‌లో ఉండే హెచ్చుతగ్గులను బట్టి వ్యాధిని నిర్థారిస్తారు. రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందేమో నిర్థారించడానికి థైరాయిడ్ యాంటీ టాడిస్ (యాంటీ టిపిఓ బాడిస్) పరీక్షలు అవసరమవుతాయి.

 మెడ లోపలి భాగంలో సీతాకోక చిలుక ఆకృతిలో ఉండే థైరాయిడ్‌గ్రంథి అత్యంత కీలకమైన విధులను నిర్వహిస్తుంటుంది.

 థైరాయిడ్ వ్యాధిగ్రస్తుల్లో కొందరికి కనుగుడ్లు బయటకు పొడుచుకు వచ్చినట్లుగా ఉంటాయి. మరికొందరిలో గాయిటర్ సమస్య వస్తుంది.

 హోమియో వైద్యం
 హోమియో కేర్ వైద్యవిధానంలో రోగి శారీరక, మానసిక పరిస్థితి ఆకలి, నిద్ర, ఆందోళనలు తదితర అంశాలలో పాటు వంశపారంపర్యత, ఆరోగ్యచరిత్ర వంటివి పరిగణనలోకి తీసుకొని మళ్ళీ వచ్చే అవకాశం లేకుండా థైరాయిడ్ సమస్యకు వైద్య చికిత్స ఇవ్వబడుతుంది. ప్రపంచంలో మొదటిది కాన్‌స్టిట్యూషనల్ హోమియోపతి ద్వారా హోమియోకేర్ థైరాయిడ్ సమస్యలకు అత్యధిక శాతం రోగులకు పూర్తిగా తగ్గించడం జరుగుతుంది.

Article on Sakshi Link
http://www.sakshi.com/news/family/thyroid-solution-from-homeocare-66929
21:07 - By Swathi 0

bolli disease

బొల్లి ఇప్పుడు తగ్గుతుంది!


బొల్లి ఇప్పుడు తగ్గుతుంది!
హైదరాబాద్ :  ఒంటిపై తెల్లటి మచ్చలతో కనిపించే బొల్లి వల్ల ఎలాంటి హానీ ఉండదు. కానీ దీనివల్ల వివక్షకు లోనయ్యే అవకాశాలు ఎక్కువ కాబట్టి బొల్లి మానసికంగా కుంగదీస్తుంది. మన జనాభాలో 0.5 శాతం మందిలో అది కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు బొల్లికి మంచి మంచి కొత్త చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. వాటితో గతంలో పోలిస్తే చాలావరకు దీన్ని నయం చేసే ఆస్కారమూ ఇప్పుడుంది. బొల్లి ఎందుకు వస్తుంది, దానికి అందుబాటులో ఉన్న చికిత్సలేమిటి అన్న అంశంపై అవగాహన కోసమే ఈ కథనం.

 మన శరీరంలోని పిగ్మెంట్ అనే రంగునిచ్చే పదార్థం వల్ల మేనిచాయ వస్తుంది. ఇది వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటుంది. కొంతమందిలో ఈ పిగ్మెంట్ ఒకేచోట కుప్పపోసినట్లుగా ఉంటే అక్కడ పుట్టుమచ్చ వస్తుంది. ఒకవేళ కొన్నిచోట్ల అది లోపిస్తే...? అప్పుడు అక్కడ చర్మం రంగును కోల్పోయి తెల్లగా మెరుపును కోల్పోయినట్లుగా ఉంటుంది. ఇలా చర్మపు రంగు లోపించడానికి... రంగును ఇచ్చే పదార్థమైన పిగ్మెంట్‌లోని కణాలు తమను తామే దెబ్బతీసుకోవడం (ఆటోఇమ్యూన్ అంశం) కూడా ఒక కారణం. మరికొందరిలో జన్యుపరంగా కూడా ఇది రావచ్చు. మరికొందరిలో ఏ కారణమూ లేకుండానే ఇది కనిపించవచ్చు. కారణం ఏదైనా బొల్లి వచ్చిన వారిలో శరీరంపై తెల్లటి మచ్చలు ప్యాచ్‌లలా కనిపిస్తాయి. వీటివల్ల ఎలాంటి నొప్పీ ఉండదు. ఆరోగ్యానికి హాని కూడా ఉండదు. కానీ చూడటానికి ఇది అంతగా బాగుండదు. కాబట్టి దీన్ని ఎవరూ కోరుకోరు.

 ఇంగ్లిష్‌లో దీన్ని విటిలిగో అంటారు. వైద్య పరిభాషలో ల్యూకోడెర్మా అంటారు. ఈ తెల్లటి మచ్చలు సాధారణంగా చేతులు, పాదాలు, భజాలు, ముఖం, పెదవులు లాంటి చోట్ల ఎక్కువగా ఉంటాయి. కొందరిలో బాహుమూలాలు, పొత్తికడుపు కింది భాగం, నోటి చుట్టూ, కన్ను పరిసర ప్రాంతాలు, మర్మావయవాల ప్రాంతంలో ఉంటాయి. ఈ మచ్చలకు తోడుగా విటిలిగో ఉన్నవారికి ఆ తెల్లప్రదేశంలో ఉండే (అంటే ఉదాహరణకు మాడు, కనురెప్పలు, కనుబొమలు, గడ్డంలోని ప్రాంతాల్లోని) వెంట్రుకలు తెల్లగా మారిపోతాయి. చర్మం నల్లగా ఉండే వారిలో ఈ రంగు కోల్పోయిన గుణం మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది.

 వైద్య చికిత్స ప్రక్రియలు...
 శరీరంపై ఉండే ఆ మచ్చల పరిమాణం, అవి వచ్చిన చోటు, అక్కడ అవి ఎంతమేర విస్తరించాయన్న అనేక అంశాలపై చికిత్స ఆధారపడి ఉంటుంది. చికిత్స కూడా వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటుంది. అలాగే చికిత్స ఫలితంగా కూడా ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో ఫలితం చాలా వేగంగా కనిపిస్తే, మరికొందరిలో ఆలస్యంగా కనిపిస్తుంది. అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియలివే...

 మెలనిన్ కణాలు మరింత నాశనం కాకుండా చూడటం : ఈ ప్రక్రియలో చర్మానికి రంగును ఇచ్చే మెలనిన్ కణాలు మరింతగా నాశనమైపోకుండా చేస్తారు. అంతేకాదు... రంగు కోల్పోయిన శరీర భాగానికి మునుపటి రంగు వచ్చేలా చేస్తారు.

  స్టెరాయిడ్ క్రీములు: పైపూతగా వాడే విధంగా కొన్ని రకాల స్టెరాయిడ్ క్రీములు, టాక్రోలైమస్ క్రీములు రాస్తారు. అవి చర్మం మామూలు రంగును సంతరించుకోడానికి, మచ్చలు మరింత విస్తరించకుండా సహాయపడతాయి.

  ఫొటో థెరపీ: ట్యాబ్లెట్లు, లోషన్ రూపంలోని సోరాలెన్స్ అనేవి ఈ తరహా చికిత్సలో ఉపయోగపడతాయి. అయితే ఈ ట్యాబ్లెట్‌లు లేదా క్రీములను సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్ అవుతూ వాడాల్సి ఉంటుంది. సూర్మరశ్మికి బదులుగా హానికరం కాని మోతాదులో అల్ట్రావయొలెట్ కిరణాలకు కూడా ఎక్స్‌పోజ్ చేయవచ్చు. దీన్ని పూవా థెరపీ అంటారు. ఫొటోథెరపీ ప్రక్రియ నిపుణులైన డెర్మటాలజిస్ట్‌ల ఆధ్వర్యంలో మాత్రమే ప్రత్యేక ఫొటోథెరపీ ఛాంబర్లలో  చేయాల్సి ఉంటుంది.

  ఇతర ప్రక్రియలు:
 జింక్‌గో బైలోబా, లీవామీసోల్... ఇవి ఇమ్యూన్ మాడ్యులేటర్స్. ఇవి మన ఇమ్యూనిటీని పెంచడం ద్వారా విటిలిగోతో పోరాడతాయి. వీటిని ట్యాబ్లెట్ రూపంలో తీసుకోవచ్చు.

 డి-పిగ్మెంటేషన్ ట్రీట్‌మెంట్ : కొంతమందిలో దాదాపు 80 శాతం పైగా శరీరం తెల్లబడి పోతుంది. ఇలాంటివారిలో నల్లగా ఉన్న మిగతా ప్రాంతాన్ని కూడా తెల్లగా చేస్తారు.

 శస్త్రచికిత్స (సర్జికల్ ట్రీట్‌మెంట్) : ఇందులో పంచ్‌గ్రాఫ్టింగ్, స్ప్లిట్ స్కిన్ గ్రాఫ్టింగ్,  రకరకాల సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. ఆధునిక శస్త్రచికిత్సలో భాగంగా ఇప్పుడు చర్మంపై ఇతరచోట్ల ఉండే రంగునిచ్చే పిగ్మెంట్ కణాలను అవి కోల్పోయిన ప్రాంతంల్లోకి బదిలీ చేసేందుకు అవకాశం ఉంది. అయితే ఇతర సాధారణ చికిత్స ప్రక్రియల వల్ల సాధ్యం కాని సందర్భాల్లో మాత్రమే ఈ శస్త్రచికిత్స పద్ధతిని అవలంబిస్తారు. శరీరంలోని కొన్ని భాగాల్లో ... అంటే... పెదవులు, చేతులు, కాళ్ల చివరన ఉండే భాగాలు) సాధారణ చికిత్స ప్రక్రియలు అంతగా సత్ఫలితాలు ఇవ్వవు. అలాంటి సందర్భాల్లో ఈ శస్త్రచికిత్స ప్రక్రియలు అవసరం కావచ్చు. అయితే విస్తరించని విటిలిగో మచ్చలు ఉన్న పేషెంట్ల  విషయంలోనే ఈ శస్త్రచికిత్స విధానాన్ని ఆలోచిస్తారు. వ్యాప్తి చెందకపోవడం అంటే... ఒక ఏడాది వ్యవధిలో మచ్చ సైజు విస్తరించకపోవడం, కొత్త ప్రాంతాల్లో మచ్చలు రాకపోవడాన్ని మచ్చలు వ్యాప్తిచెందని పేషంట్లుగా పరిగణిస్తారు. ఈ సర్జికల్ ప్రక్రియలో ఇతర చోట్ల నుంచి చర్మాన్ని తీసుకుని గ్రాఫ్ట్ చేస్తారు. ఇప్పుడు అభివృద్ధి చెందిన శాస్త్రవిజ్ఞాన ప్రక్రియల వల్ల మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంది. సర్జరీ తర్వాత మళ్లీ అక్కడ సాధారణ పిగ్మెంట్ వచ్చేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టవచ్చు. అయితే ఒక్కోసారి అనుకున్న ఫలితాలు వచ్చేందుకుగాను... సర్జరీ తర్వాత సాధారణ వైద్యచికిత్స కూడా అవసరం కావచ్చు. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య చికిత్స ప్రక్రియల వల్ల విటిలిగో రోగులు మునుపటిలా ఆత్మన్యూనతకు గురికావాల్సిన అవసరంగాని, బాధపడాల్సిన పరిస్థితిగాని లేదు. అనేక నూతన ప్రక్రియలు అందుబాటులోకి వచ్చినందున వాటి సహాయం తీసుకుని మళ్లీ మేని రంగును  మామూలుగా మార్చుకునేందుకు మంచి అవకాశాలున్నాయి.

 - నిర్వహణ: యాసీన్

 డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
 చీఫ్ డెర్మటాలజిస్ట్,
 త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్.
This is Sakshi Article, Here I am Giving for Public Benefit.
http://www.sakshi.com/news/family/-67184
21:00 - By Swathi 0

Friday, 20 September 2013

Womens's Heath

పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి

Sakshi | Updated: September 20, 2013 00:02 (IST)
పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి
హైదరాబాద్ : నా వయసు 15. రెండేళ్ల క్రితం మెన్సెస్ రావడం మొదలైంది. అప్పట్నుంచి పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి వస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో ఏమైనా ప్రమాదమా? భవిష్యత్తులో నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా? తగిన సలహా ఇవ్వండి.
 - ధరణి, ఏలూరు  


 రుతుక్రమం మొదలయ్యాక పీరియడ్స్ సమయంలో నొప్పి రావడం అన్నది చాలా సాధారణమైన విషయం. చాలామంది యువతుల్లో ఇది కనిపించడం మామూలే.  దీన్ని చాలామంది ఒక జబ్బుగానో, లోపంగానో పరిగణిస్తారు. పిల్లలు పుడతారో లేదోనని అపోహలు పెంచుకుంటారు. అయితే ఇది చాలా సహజమైన అంశం.

 చాలామంది యువతులు పీరియడ్స్ సమయాన్ని అండం  విడుదలైన దశగా (ఓవ్యులేషన్ పీరియడ్‌గా) భావిస్తారు. కానీ... నిజానికి దీనికి 14 రోజుల ముందే అండం విడుదలై ఉంటుంది. అంటే పీరియడ్స్‌కు 14 రోజుల ముందే ఓవ్యులేషన్ పీరియడ్. అది ఫలదీకరణ జరగకపోవడం వల్ల క్షీణించిన అండం రాలిపోవడం అన్నది పీరియడ్స్ సమయంలో జరుగుతుంది. కాబట్టి దీన్ని అన్ ఓవ్యులేటెడ్ పీరియడ్‌గా పరిగణించాలి. ఈ సమయంలో నొప్పి ఉండటం ఎంత ఆరోగ్యకరమైన లక్షణం అంటే... పీరియడ్స్ సమయంలో నొప్పి లేని యువతుల్లో కంటే... పీరియడ్స్ సమయంలో నొప్పి ఉన్న యువతుల్లో పెళ్లి తర్వాత గర్భధారణకు అవకాశాలు చాలా  ఎక్కువ.

 పీరియడ్స్ మొదలైన తొలి 24 గంటల్లో నొప్పి ఎక్కువగా ఉండి ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది. ఈ నొప్పి మరీ భరించలేనంతగా ఉంటే నొప్పి తీవ్రతను బట్టి ప్రతి ఎనిమిది గంటలకు లేదా ప్రతి పన్నెండు గంటలకు ఒకటి చొప్పున రెండు మూడు నొప్పి నివారణ మాత్రలు వాడితే సరిపోతుంది.

 ఇలా రుతుసమయంలో వచ్చే నొప్పి 3, 4 రోజుల పాటు తగ్గకుండా అలాగే వస్తున్నా, లేదా నొప్పి నివారణ మందులు వాడాక కూడా నొప్పి తగ్గనంతటి తీవ్రతతో వస్తున్నా, లేదా పీరియడ్స్‌కూ, పీరియడ్స్‌కూ మధ్యన నొప్పి వస్తున్నా... డాక్టర్‌ను సంప్రదించండి. అంతేతప్ప పైన పేర్కొన్నట్లు సాధారణంగా వచ్చే రుతు సమయపు నొప్పి గురించి ఆందోళన చెందవలసిన అవసరమే లేదు.

 డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్,
 ఫెర్నాండజ్ హాస్పిటల్,  హైదరాబాద్

Tags:

http://www.sakshi.com/news/family/gynic-problems-questions-and-answers-66670
02:50 - By Swathi 0

WIDGET #1

Text Widget

Blogroll

Followers

Discrimination

ఈ బ్లాగులోని విషయాలు , సమాచారం మీకు ఉపయోగపడకలదు అని బావించి ఇంటర్నెట్ మరియు ఇతర వెబ్సైటు ల నుండి సేకరించడం జరిగింది.

Discussion

Powered by Blogger.
back to top