దగ్గు ఆయాసం, అలర్జీ - అస్తమాకు హోమియోలో తగిన చికిత్స
గాలిలో దుమ్ము, పుప్పొడి వంటివి ఉన్నప్పుడు అలర్జీతో బాధపడేవారికి ఇక అదే పనిగా వరుసబెట్టి తుమ్ములు వస్తాయి. ఆ తర్వాత ముక్కు ఎరుపెక్కి, జలుబు చేసి, పల్చని నీరులా స్రవిస్తుంది. దానితో పాటు కళ్ళు ఎరుపెక్కి కళ్ళ నుండి నీరు కారుతుంది. దీనిని అశ్రద్ధ చేసినట్లయితే ముక్కు దిబ్బడ, గాలి సరిగ్గా ఆడకపోవడం, గొంతులోనికి కళ్ళె వస్తూ ఉండడం, ముఖం లోపలిభాగంలో నొప్పి, తలనొప్పి మొదలైతే ‘‘అలర్జిక్ సైనసైటిస్’’ అని, గాలి గొట్టాలలోనికి, ఊపిరితిత్తులకు సోకి పొడి దగ్గు, కళ్లెతో కూడి దగ్గు మొదలైతే ‘‘అలర్జిక్ బ్రాంకైటిస్’’ అని ఆయాసం, ఎగపోయడం, పిల్లికూతలు వంటి లక్షణాలు కన్పిస్తే ‘‘అలర్జిక్ ఆస్థ్మా’’ అని అంటారు.
*****************
శ్లేష్మంతో కూడిన దగ్గు ముక్కు నుంచి గొంతులోకి పోయి, అక్కడి నుంచి సైనస్ లేదా ఊపిరితిత్తులలోకి ప్రవేశించడం జరుగుతుంది. శ్లేష్మంతో కూడిన దగ్గుకి చాలా త్వరితంగా చికిత్స చేయలేకపోతే అది ఆస్త్మా కిందకు మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కారణాలు:
వైరల్ ఇన్‌ఫెక్షన్స్ వలన
దీర్ఘకాలికంగా ఊపిరితిత్తులకు వ్యాధులుసోకిన
గ్యాస్ట్రో ఈసోఫెజియల్ రిఫ్లక్స్ డిసీజ్‌తో
ముక్కునుంచి వచ్చే స్రావం గొంతులోకి వెళ్ళటం
పొగతాగటం
దుమ్ము, ధూళిలో తిరగడం వలన
*****************
ఇలా అలర్జీలలో అనేక రకాలు ఉన్నప్పటికి ఎక్కువ మందిలో కనబడేవి శ్వాసకోశ సంబంధిత అలర్జీలు. అనగా రైనైటిస్, సైనసైటిస్, బ్రాంకైటిస్, బ్రాంక్రియల్ ఆస్త్మా. శ్వాసకోశ సంబంధిత అలర్జీలను కలిగించే వాటిలో ప్రధానమైనవి-పుప్పొడి, దుమ్ములో ఉండే క్రిములు, మోల్డ్, బొద్దింకలు, పశువుల పేడ మొదలైనవి. కొంతమందికి పూలవాసన, పర్‌ఫ్యూమ్స్, కూరపోపు లాంటివి కూడా పడవు.
**************
పాజిటివ్ హోమియోపతిలో ఈ దగ్గు, ఆయాసం, అలర్జీ, ఆస్త్మాలకు పూర్తిస్థాయిలో పరిష్కారం ఉంటుంది. వ్యాధి త్వరితంగా ఉన్నా లేదా దీర్ఘకాలికంగా ఉన్నా, దాని మూలకారణం నుంచి వ్యాధిని తీసేయాలి.ముఖ్యంగా తత్వం ప్రకారం చికిత్సను మొదలు పెట్టి, ఏదైనా మానసిక ఒత్తిడి, ఆందోళనలు ఉంటే, ఆ మానసిక స్థాయి నుంచి చికిత్సను ఇవ్వడం ఉత్తమం. వాతావరణంలో ఉండే మార్పులను బట్టి మనిషి తత్వాన్ని ఎనాలసిస్ చేసి, చికిత్సను ఇస్తే పూర్తి స్థాయిలో పరిష్కారం ఉంటుంది.
డా॥టి. కిరణ్‌కుమార్
పాజిటివ్ హోమియోపతి
అపాయింట్‌మెంట్ కొరకు 9246199922
హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ,
వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై
www.positivehomeopathy.com
http://www.sakshi.com/news/family/homeopathic-remedies-for-cough-fatigue-allergy-asthma-73763?pfrom=home-todays-family
Facebook
Twitter
Google+
Rss Feed

0 comments: