Feed Section

Search

Recent Readers

Powered by Blogger.

Wednesday, 10 September 2014

OKA YOGI ATMA KATHA - BY YOGANANDA GARU

Read Online OKA YOGI ATMA KATHA BOOK BY PARAMAHAMSA YAOGANANADA GARU in Telugu.




OKA YOGI ATMA KATHA PART 1

OKA YOGI ATMA KATHA PART 2

OKA YOGI ATMA KATHA PART 3

17:35 - By Swathi 0

Yandamuri Veerendranath Novels List and Download PDF

AKARI PORATAM

Read Yandamuri Veerendranath's Akari Poratam Novel Online and Download it.

ABHILASHA

Read Yandamuri Veerendranath's Abhilasha Novel Online and Download it.

ANKITHAM

Read Yandamuri Veerendranath's Ankitham Novel Online and Download it.

ASTAVAKRA

Read Yandamuri Veerendranath's Astavakra Novel Online and Download it.

ATHADEAMESAINYAM

Read Yandamuri Veerendranath's Athadeamesainyam Novel Online and Download it.

CASANOVA

Read Yandamuri Veerendranath's Casanova Novel Online and Download it.

CHHEKATLO SURYUDU

Read Yandamuri Veerendranath's Chhekatlo Suryudu Novel Online and Download it.


Read Yandamuri Veerendranath's Dabbu to the power of dabbu Novel Online and Download it.

DYEYAM

Read Yandamuri Veerendranath's Dyeyam Novel Online and Download it.

IDLI VADA AKASAM

Read Yandamuri Veerendranath's Idli Vada Novel Online and Download it.

LADIES HOSTEL

Read Yandamuri Veerendranath's Ladies Hostel Novel Online and Download it.

MARO HIROSHIMA

Read Yandamuri Veerendranath's Maro Hiroshima Novel Online and Download it.

Meeru Manchi Ammai Kadhu

Read Yandamuri Veerendranath's Meeru Manchi Ammai Kadhu Novel Online and Download it.

Mind Power

Read Yandamuri Veerendranath's Mind Power Novel Online and Download it.

Nallanchu Tella Cheera

Read Yandamuri Veerendranath's Nallanchu Tella Cheera Novel Online and Download it.

Nisabdam  Neeku - Naku Madhya

Read Yandamuri Veerendranath's Nisabdam Neeku Naku Madhya Novel Online and Download it.


Okaradha Iddaru Krishnulu

Read Yandamuri Veerendranath's Nisabdam Neeku Naku Madhya Novel Online and Download it.


Parnasala

Read Yandamuri Veerendranath's Parnasala Novel Online and Download it.



























02:36 - By Swathi 0

Tuesday, 9 September 2014

Asthalakshmi Stothram Download

18:46 - By Swathi 0

Tuesday, 2 September 2014

Wonders of Ayurvedam

ఆయుర్వేదం... అద్భుత విషయాలు!


వైద్యుడిగా పరిణతి సాధించాలని అనుకునేవాడు ఏదో ఒక విభాగానికి మాత్రమే పరిమితం కాకూడదు. అప్పుడతడు పాక్షిక వైద్యుడవుతాడు. పాక్షిక వైద్యుడు చికిత్స చేయడానికి  పనికిరాడు. అందుకే నిష్పాక్షికంగా అతడు అన్ని విభాగాల్లోనూ నైపుణ్యం సాధించి పరిపూర్ణజ్ఞానాన్ని పొందాలంటుంది ఆయుర్వేదం. ఇదీ నాడీ ప్రవీణ,  డెరైక్టర్ ఆఫ్ మహర్షి ఆయుర్వేద, డాక్టర్ జె.ఆర్. రాజు ఉద్బోధించే విషయాలు. ఈరోజుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్లడం కంటే... ఆ తర్వాత వ్యాధి నిర్ధారణ కోసం వారు సూచించే పరీక్షలే రోగిని ఎక్కువగా భయపెడుతుంటాయి. కానీ వైద్యాచార్య డాక్టర్ రాజు ఇలాంటి రక్తపరీక్షలూ, మూత్రపరీక్షలూ, ఈసీజీ, సీటీ స్కాన్, ఎమ్మారై వంటి పరీక్షలను చేయించరు. కేవలం నాడిని చూడటం ద్వారానే వ్యాధినిర్ధారణ చేస్తారు. తద్వారా రోగుల ఖర్చులు ఆదా అవుతాయి. ఇక ఆయన ఎన్నెన్నో దేశాల్లో అల్లోపతి వైద్యులకూ ఆయుర్వేదం గొప్పదనాన్ని వివరించి, ఆ విధానంలో నయంకాని (క్యూర్ లేదనే) వ్యాధులకు ఆయుర్వేద విధానంలో నయం చేసే విధానాలను బోధిస్తుంటారు. ఆయుర్వేదాన్ని ఆచరిస్తూ వస్తున్న ఆయన మన రోజువారీ దినచర్యల్లో అత్యంత సులభంగానూ, సూక్ష్మంగానూ, పైసా ఖర్చులేకుండా ఆరోగ్యాన్ని పొందే అనేక విషయాలను విపులంగా వివరిస్తున్నారు.
దైనందిన జీవనశైలిలోనే ఆయుర్వేదం...

ఆయుర్వేద జ్ఞానం చాలా విస్తృతం. దానిని ఔపోసన పట్టడం కంటే అభ్యాసం చేయడం మేలని ఎంచారు మన పూర్వికులు. అందుకే ఆయుర్వేదాన్ని మన నిత్యజీవన శైలిగా మార్చారు. స్నానం, పానం, ఆహారం, విహారం... ఇలా ప్రతి అంశంలోనూ మనకు తెలియకుండానే మనం ఆయుర్వేదాన్ని ఆచరిస్తుంటాం. ఇంగ్లిష్ మందులు, ఇతర ఔషధాలకు కొన్ని దుష్ర్పభావాలు ఉంటాయి. వాటినే సైడ్ ఎఫెక్ట్స్ అని అందరూ వ్యవహరిస్తుంటారు. కానీ ఆయుర్వేదంలో ఉపయోగించే పదార్థాలన్నీ స్వాభావికాలు. ప్రకృతి సహజాలు. ఉదాహరణకు మన వంటగదిలో ఉపయోగించే వాము, జీలకర్ర, దాల్చినచెక్క వంటివన్నీ ఆయుర్వేదంలో ఔషధాలే. అలాక్కాకుండా వంటింటి దినుసులుగా ఉపయోగిస్తే అప్పుడవి రోజువారీగా ఉపయోగించే పదార్థాలే. అందుకే ఆయుర్వేదం వల్ల సైడ్‌ఎఫెక్ట్స్ ఉండవు. అన్నీ సైడ్ బెనిఫిట్సే. కాబట్టే ఆయుర్వేదం మన నిత్యజీవితంలో భాగం అయ్యేలా చూశారు మన పూర్వికులు, ఆచార్యులు. అందుకే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం పైసా ఖర్చులేకుండా పొందగలిగే  ఆరోగ్యాన్ని స్నానం నుంచి ప్రారంభిద్దాం.

రోజులో తొలి కార్యక్రమం...వ్యాయామం

వ్యాయామం అతిగా చేయకూడదు. నుదుట చెమట రావడం మొదలు కాగానే లేదా అధికశ్రమతో శ్వాస తీసుకోవడం మొదలుకాగానే వ్యాయామాన్ని ఆపేయాలి. ఇలా చేయడాన్నే శరీర అర్ధబలమంటారు.
   
 బాగా శరీర పరిశ్రమ (కఠిన వ్యాయామం) లేదా రన్నింగ్ లేదా వాకింగ్ చేసి వచ్చాక... వెంటనే నీరు తాగకూడదు. శరీరం, శ్వాస నెమ్మదించాక మాత్రమే నీరు తాగాలి.

వ్యాయామ, విహారాలకు అనువైనది ప్రాతఃకాలమే. ఆహారం తీసుకున్న తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యాయామం చేయకూడదు.

స్నానం...ప్రాధాన్యం..!

స్నానానంతరం మనకు కలిగే ఆహ్లాదం అంతా ఇంతా కాదు. స్నానం కేవలం శరీరాన్ని శుభ్రపరచడం మాత్రమే చేయదు. అనేక సమస్యలనుంచి సాంత్వన కలిగిస్తుందీ స్నానం. అయితే స్నానం ఆరోగ్యకరం కావాలంటే కొన్ని సూచనలు గుర్తుపెట్టుకోండి. అవి...
   
తలపై మరీ ఎక్కువ వేన్నీళ్లతో స్నానం వద్దు. స్టీమ్ బాత్, సౌనా బాత్ వంటివి ఆరోగ్యకరం కాదు. స్టీమ్‌బాత్, సౌనాబాత్‌లో తలకు ఆవిరి పెడతారు. అది చాలా ప్రమాదకరం.
   
 ఏదైనా తిన్నవెంటనే స్నానం చేయకూడదు. స్నానం తర్వాతే ఆహారం తీసుకోవాలి.
   
 కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు. రెండు, మూడు గంటల తర్వాతే స్నానం చేయండి.
   
 బలహీనంగా ఉన్నవాళ్లు, వృద్ధులు మరీ ఎక్కువ చన్నీళ్ల స్నానం కాని, మరీ ఎక్కువ వేణ్ణీళ్లతో స్నానంగాని వద్దు.

చన్నీళ్ల స్నానం ఆరోగ్యకరమనే అపోహ వద్దు. గోరువెచ్చని నీళ్లే మంచివి.
   
తప్పనిసరి పరిస్థితుల్లో చన్నీళ్లతో స్నానం చేస్తే... దానికి ముందర చన్నీళ్లు తాగవద్దు.
   
 చన్నీళ్ల స్నానంలో నీరు ఎంత చల్లటివైతే... స్నానం వ్యవధిని అంతగా తగ్గించడం మంచిది.
   
 గోరువెచ్చని నీళ్లతో స్నానం ముందర కాస్తంత వ్యాయామం మంచిది.
   
 ఏ నీళ్లతో (చన్నీళ్లు లేదా వేణ్ణీళ్లు) అయినా స్నానం తర్వాత తలనొప్పి, జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే అది మీ ఆరోగ్యానికి అంతగా సరిపడదని గుర్తుంచుకోండి.

నీరూ... ఆరోగ్యప్రదాయనే!

నీటిని మనం ఆహారంతో పాటు స్వీకరిస్తుంటాం.  నీరూ ఒక ఓషధే. సరైన పాళ్లలో సరైన విధంగా తీసుకుంటే  దాంతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. ఉదాహరణకు... స్థూలకాయం ఉన్నవారు తమ బరువు తగ్గించుకోడానికి ఆచరించదగిన నీటి చికిత్స (వాటర్ థెరపీ) ఏమిటంటే... ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో మూడో వంతు ఆవిరయ్యేలా చేసి, మిగతా నాల్గో వంతు భాగాన్ని చల్లార్చి తాగితే ఊబకాయం తగ్గుతుంది. అలాగే లావెక్కాలని భావించే అతిసన్నటి శరీరం ఉన్నవారు... ఒక పాత్రలో నీటిని తీసుకుని కేవలం నాలుగోవంతు మాత్రమే ఆవిరయ్యేలా చేసి, మిగతా నీటిని చల్లార్చి తాగితే క్రమంగా ఒళ్లు చేస్తారు. ఇలా ఒకే నీరు... దాన్ని ఉపయోగించే అతి సాధారణ, అతి సులభ పద్ధతుల్లో రెండు రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది.
   
ప్రతి అరగంటకొకసారి వేడి నీళ్లను టీ తాగినట్లుగా రోజూ సిప్ చేస్తూ తాగుతుంటే దీర్ఘకాలంలో చాలా వ్యాధులు నయమవుతాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి... కాచిన పాలనూ, కాచిన నీళ్లను మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు.
   
అన్నపానాదులను సంస్కరించాకే ఉపయోగించాలి. ఇలాంటి సంస్కరణకు ప్రధానంగా ఉపయోగపడేది నీరే. నీళ్లు లేకుండా ఘన పదార్థాల సంస్కారం వీలు కాదు.
   
చాలా రోగాలకు ముఖ్యకారణం కూడా నీరే. తమ ఆవాసంగా నీటిలో ఉండే జంతుజాలం ప్రసవించే సమయంలో వెలువడే విషపదార్థాలు నీళ్లలో కరిగి రోగకారకాలు కావచ్చు. అందుకే నీటి స్వచ్ఛపరిచాకే ఉపయోగించాలి. నీటిని స్వచ్ఛపరచడం అంటే... తొలుత మంచి పరిశుభ్రమైన నిర్మల వస్త్రంతో వడగట్టడం, ఆ తర్వాత నీటిని బాగా కాచి చల్లార్చి తాగడం. ఇలా నీటిని స్వచ్ఛపరిచాకే తాగాలి.
   
భోజనానికి ముందు నీరు తాగితే అది మందాగ్ని రూపంలో శరీరాన్ని కృశింపజేస్తుంది. మధ్యమధ్యన నీరు తాగకుండా భోజనం తర్వాతే నీరు తాగితే అది శరీర స్థౌల్యం (ఊబకాయం) కలిగిస్తుంది. ఛాతీ, కంఠం, శిరస్సుల్లో కఫాన్ని వృద్ధి చేస్తుంది. అందుకే భోజనం మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉంటే మధ్యమ స్థితి (అంటే కృశ - స్థౌల్య... ఈ రెంటినీ కలిగించేదిగా) సంభవిస్తుంది. ఇలా మధ్య మధ్యన నీరుతాగడం రస, రక్తాధి ధాతువులను సమస్థితిలో ఉంచుతుంది. ఇలా తాగిన నీరు సులభంగా, సుఖంగా జీర్ణమవుతుంది.
   
చల్లని నీళ్లు జీర్ణం కవడానికి 45 నిమిషాలు, వేడి నీరు జీర్ణం కావడానికి 20 నిమిషాల సమయం పడుతుంది.

దురలవాట్లనుదూరం చేసుకోండిలా...

భోజనం గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. భోజనం ‘ఆత్మ’కు ఇంపుగా ఉండాలి. మంచి కవిత్వం రాయడం ఎప్పుడు సాధ్యమన్న విషయాన్ని అల్లసాని పెద్దన సరదాగా చెప్పినా ఆ మాటల్లోని వాస్తవం గమనించారా? ‘ఆత్మకింపైన భోజనం...’ తినాలంటారాయన. అలాగే అన్నం తిన్న తర్వాత కలిగే తృప్తిని వర్ణించడానికి చెప్పే మాట... ‘ఆత్మారాముడు శాంతించాడు’ అనే. అంటే ఇక్కడ తాను అనే అర్థంలో ఆత్మ అనే మాటను వాడినా... విస్తృతార్థంలోనూ ఆత్మకింపైన, ఆత్మకు మేలు చేకూర్చే భోజనమే తీసుకోవాలన్నది వాస్తవం. ఇందులో భాగంగా శరీరానికీ, నాలుకకూ రుచిగా ఉన్నప్పటికీ అది ఆరోగ్యానికి అంతగా మేలు చేసేది కానప్పుడు దాన్ని వర్జించాలి. ఇలా వర్జించే సమయంలోనూ దాన్ని అకస్మాత్తుగా వర్జించకూడదు. దురలవాటునూ, దుర్వ్యసనాన్ని దూరం చేసుకోనే సమయంలో దాని పరిమాణాన్ని రోజూ శోడశ పాద భాగాన్ని విడవాలి. అంటే ప్రతిరోజూ ఒకటిలో పదహారోవంతును తగ్గించుకుంటూ... ఇలా క్రమంగా మేలు చేయని ఆహారాన్ని వర్జించాలన్నమాట.
   
భోజనం తర్వాత మొక్కజొన్న కండె, మొక్కజొన్న అటుకులు తినకూడదు.

వండటానికి పనికొచ్చే కూరలను వండే తినండి...

ఇటీవల చాలా మంది పచ్చి కూరలు తినడం వల్లనే ఆరోగ్యం ఇనుమడిస్తుందంటూ చెబుతుంటారు. ఇది కేవలం పాక్షిక సత్యం మాత్రమే. వండి తినడం (పచనం చేయడం) నాగరక పరిణామక్రమంలో వచ్చిన అభివృద్ధి. అందువల్ల దాన్ని అభివృద్ధి సూచకంగానే పరిగణించాలి. క్యారెట్, బీట్‌రూట్, ఉల్లి, కీర,  చిన్నపాటి అల్లం తురుము, ధనియాలు, పుదీన లాంటి వాటిని పచ్చిగా తిన్నా పర్వాలేదు. ఎందుకంటే అవి అందుకు ఉపయుక్తంగా ఉంటాయి కాబట్టి. కానీ సొర, బీర, కాకర వంటి కూరగాయలను వండి మాత్రమే తినండి. వండటానికి మాత్రమే వాటిని ఉపయుక్తంగా తయారు చేసింది ప్రకృతి. ఉదాహరణకు కూరగాయలుగా మనం వాడేవాటిలో కాకరనే తీసుకుందాం. దానికి చికిత్సాపరమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్నది వాస్తవం. దాన్ని తింటే ఆరోగ్యానికి మంచిది, డయాబెటిస్ లాంటి దీర్ఘవ్యాధులను తగ్గిస్తుందన్నది కూడా పరమ సత్యం. అయితే అలాగని దాన్ని పచ్చిగా తినడం చాలా హానికరం. అందులో ఔషధగుణాలతో పాటు కొన్ని ఆల్కలాయిడ్స్ కూడా ఉంటాయి. అవి మోతాదుకు మించినప్పుడు శరీరానికి హాని చేస్తాయి. కాబట్టి దాన్ని పచ్చిగా తినడమో లేదా అదేపనిగా రోజూ కాకర రసం తీసుకుని తాగడమో చేస్తే దీర్ఘకాలంలో దాని దుష్పరిణామాలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే కూరగాయలను, ఆకుకూరలను వండే తినండి. సలాడ్స్‌గా తీసుకోదగ్గ  క్యారెట్, బీట్‌రూట్, ఉల్లి, కీర,  చిన్నపాటి అల్లం వంటివాటికి మిగతా కూరలను జత చేయకండి.

పొన్నగంటికూర కళ్లకు చాలా మంచిది.

భోజనం తీసుకోండిలా...

అన్నం పరబ్రహ్మస్వరూపం. అందుకే దాన్ని గౌరవిస్తూ వీలైతే తూర్పునకు ముఖం చేసి తినండి. ఆహారాన్ని దూషిస్తూ, అశాంతితో తినకూడదు.

భోజనంలో మొదట తీపి తీసుకోండి. ఆ తర్వాత భోజనంలో హెవీఫుడ్‌గా మీరు భావించేదాన్ని తినాలి. అలా క్రమంగా భోజనం సాగుతున్న కొద్దీ హెవీ నుంచి లైట్‌కు వస్తూ ఉండాలి.

మొదట హెవీ అనే క్రమంలో నెయ్యిని తీసుకోండి. ఎందుకంటే నేతికి రెండు రకాల గుణాలుంటాయి. అది అగ్నిని ప్రజ్వలిస్తుంది. (అగ్నికి ఆజ్యం తోడైనట్లు అనేది అందుకే). అంటే మొదట అగ్నిగుణాన్ని కలిగించడం వల్ల ఆహారం జీర్ణం అయ్యేందుకు దోహదపడుతుంది. అగ్నిగుణం కలిగిన ఆ నెయ్యే... కారాలతో నాలుక భగభగలాడేప్పుడూ... ఆహారంలో కారం మంట అధికంగా ఉన్నప్పుడూ దాన్ని శాంతింపజేయడానికి తోడ్పడుతుంది. అందుకే అన్నంలో నేతికి తొలి వరస. ఈ క్రమంలో అన్నింటికన్నా తేలికైన మజ్జిగది తుది వరస.
   
అన్నం తినేప్పుడు కొందరు మంచినీళ్లు అస్సలు తాగరు. కానీ మధ్యలో నీళ్లు తాగడమే మంచిది. లేకపోతే మనం తీసుకునే అన్నంలోని ఘనపదార్థాలు మధ్యలో చిక్కుకుపోయి (స్తంభించి), జీర్ణక్రియకు అవరోధం కలిగిస్తాయి. అందుకే గొంతులో/ కడుపులో ఏదైనా అడ్డంపడ్డట్లు ఉన్నప్పుడు నీళ్లు తాగడమే మంచిది.
   
అన్నాన్ని కళ్లతో చూడగానే నోట్లో నీళ్లూరతాయి. జ్ఞానేంద్రియాలలో కలిగే స్పందనల్లో ఇదొకటి. మంచి శ్రేష్ఠమైన ఆహారం రుచులను వినగానే వాటిని రుచిచూడాలనిపిస్తుంది. ఇది మరో జ్ఞానేంద్రియం చేసే పని. ఇక ఎలాగూ నాల్క రుచిచూస్తుంది. అలాగే అన్నాన్ని స్పర్శిస్తూ తినడం వల్ల కూడా కొన్ని స్పందనలు కలుగుతాయి. అందుకే అన్నాన్ని స్పూన్లూ, ఫోర్కులూ, నైఫ్‌ల వంటి ఉపకరణాలతో తినే బదులు చేతి ఐదువేళ్లతో స్పర్శిస్తూ తినండి. ఈ స్పర్శజ్ఞానమూ మెదడులో కొన్ని స్పందనలు కలిగించి అన్నం పట్ల హితవును కలిగిస్తుంది. అయితే ఈ జ్ఞానం కలగడానికి మిగతా జ్ఞానేంద్రియాలతో పోలిస్తే కాస్త ఎక్కువ వ్యవధి పడుతుంది.
   
భోజనం చివరన చల్ల (మజ్జిగ) వాడటం చాలా మంచిది. దీనికి కొద్దిగా శుంఠి, సైంధవ లవణం కలుపుకుని తింటే మరింత శ్రేష్ఠం.
   
ఇక అన్నం తిన్న తర్వాత చేయి కడిగి... ఆ చేయి తుడుచుకున్న తర్వాత ఉండే కాస్తంత తడితో కళ్లుమూసుకుని, కన్రెప్పలను తుడుచుకుంటే కొన్ని దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఇది కళ్లకు చాలా మంచిది.

భోజనం చేయండిలా...

భోజనం చేసే సమయంలో మీ కడుపును నాలుగు భాగాలుగా ఊహించుకోండి. అందులోని రెండు భాగాలను ఘనపదార్థాలకూ, ఒక భాగం ద్రవపదార్థాలకూ, మిగతా మరో భాగాన్ని వాయువుకు విడవండి. ఈ నిష్పత్తిలో భోజనం చేయడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
   
కేవలం పెరుగును మాత్రమే తినకూడదు. పెరుగు తినదలచినవారు అందులో కొద్దిగా తేనెనుగాని లేదా ఉసిరిక లేదా ముద్గయూషం (పెసరకట్టు) కలుపుకుని లేదా చిలికి తినాలి. పెరుగును యథాతథంగా రాత్రిపూట తినడం నిషిద్ధం.
   
పెరుగు తన గురుగుణం వల్ల శోఫ (వాపు)ను, కఫాన్ని పెంచుతుంది. అదే మజ్జిగ ఆ ప్రభావాన్ని తగ్గిస్తుంది.

ఫలాలు...ఫలితాలు

కొన్ని పండ్లు భోజనానికి ముందే తినడం మంచిది. మామిడి, కొబ్బరి, అరటి వంటి పండ్లను భోజనానికి ముందే తినాలి. (అరటి శ్రేష్టమైన పండే అయినప్పటికీ దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇది బరువైన పండు, బరువైన ఆహారాలు ముందే తినాలి కాబట్టి దీన్ని భోజనానికి ముందే తీసుకోవడం మంచిది. లేదా మధ్యాహ్నభోజనం అయ్యాక... చాలాసేపటి తర్వాత ఈవినింగ్ శ్నాక్స్ టైమ్‌లో (ఉజ్జాయింపుగా సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో) తినాలి.
   
బొప్పాయి పండును ఖాళీ కడుపుతోనే తినాలి. అప్పుడది కడుపులోని మలినాలను తీసేస్తుంది. కడుపునిండా భోజనం చేశాక బొప్పాయి తినకూడదు.
   
పండ్లలో లీఛీ పండు అంత మంచిది కాదు.

ఆహారం భాగమైన పండ్ల విషయంలోనూ దేశ, కాలాత్మాది విజ్ఞానం ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని ప్రాంతాల్లో పండేవి అక్కడి వారికి తేలిగ్గా జీర్ణమవుతాయి. అవి వారికి మంచిది. ఇక కొన్ని పండ్లూ, ఆహారాలు కొన్ని ప్రాంతాలవారికి పరాయివి. దేశకాలాలను బట్టి మనకు ఏది అనువైనదో వాటినే తీసుకోవాలి.

రోజులో చివరి కార్యకలాపం నిద్ర గురించి...

నియమానుసారంగా నిద్రపోవాలి. తద్వారా ఆరోగ్యం, పుష్టి, బలం కలుగుతాయి. అకాల నిద్ర లేదా అతినిద్ర లేదా బొత్తిగా నిద్రమానినా అది ఆయువును హరించివేస్తుంది. నిద్ర వేళలు / నిద్ర అలవాట్లు సరిగా లేకపోతే అది రోగాన్ని, కృశింపజేసే తత్వాన్ని, బలహీనతను, అజ్ఞానాన్ని, మరణాన్ని కలగజేస్తుంది.

నిద్రలేమి అనేది రోగాన్ని కలగజేస్తుంది. జ్ఞాపకశక్తిని హరిస్తుంది. సరైన నిద్ర లేకుండటం అన్నది దీర్ఘకాలంలో మనిషిని క్రమంగా కుంగదీస్తుంది.

నిద్ర వేళలన్నవి వారి వారి సౌకర్యాన్ని బట్టి మరీ ఎక్కువగానూ, మరీ తక్కువగానూ ఉండకుండా చూసుకోవాలి. అతినిద్ర, నిద్రలేమి ఈ రెండూ ప్రమాదకరమే అని గ్రహించండి.

అవీ ఇవీ...

సత్తుపిండి (సున్ని ఉండలను) రాత్రి తినకూడదు. సత్తుపిండిని నీళ్లతో కలిపి తినకూడదు.
   
నువ్వుల నూనెకు సత్వరం వ్యాపించే గుణం ఉంది. అందుకే అభ్యంగం (మసాజ్)లో దీన్ని వాడటం వల్ల అనేక రోగాలు తగ్గడానికి దోహదం చేస్తుంది. బక్కచిక్కిన వాళ్లు దీనితో మసాజ్ చేసుకుంటే బరువు పెరుగుతారు. అదే స్థూలకాయులైతే బరువు తగ్గుతారు.
   
 బియ్యం లాంటి ఆహారధాన్యాలు ఒక సంవత్సరం కిందటివి అంటే పాతవి శ్రేష్ఠం. కొత్తపంటలు ప్రమేహానికి (డయాబెటిస్)కు కారకాలు.
   
 ధాన్యాలు, ఘృతం (నెయ్యి), తేనె, బెల్లం, పిప్పలి ఇవి తప్ప... ఇతర ద్రవ్యాలు ఒక ఏడాదిపైబడినవే శ్రేష్ఠం.
   
 పెసలు మంచి ప్రోటీన్. మినుములు మాంసంతో సమానమైన శాకాహారం.
   
 పుట్టగొడుగులు మిగుల దోషకారి. కాలేయంలోని విషాలను పెంచుతాయి.
   
 లేతముల్లంగి శ్రేష్ఠం. ముదురు ముల్లంగి రోగకారకం. లేత వంకాయ శ్రేష్ఠం, ముదురు వంకాయ రోగకారకం. ముదురు బూడిద గుమ్మడికాయ శ్రేష్ఠం. లేత బూడిద గుమ్మడికాయ రోగకారకం.
   
 బియ్యం తేలికైనవి. కానీ వాటితోనే రూపొందే అటుకులు ఆలస్యంగా జీర్ణమవుతాయి.

పైన పేర్కొన్నవన్నీ ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి, రాత్రి నిద్రించే వరకు ఒక క్రమపద్ధతిలో చేయడానికి వీలుగా ఆయుర్వేదం ఈ అలవాట్లన్నింటినీ మనందరి దైనందిన జీవితంలో ప్రవేశపెట్టింది. కొందరు ఏమీ తెలియకుండానే వీటన్నింటినీ ఆచరిస్తుండవచ్చు. మరికొందరు తెలియక కొన్నింటిని ఆచరించక, రుగ్మతలకు లోనయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయుర్వేద సదాచారాలను అర్థం చేసుకుని ఆరోగ్యంగా జీవించండి.

 - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి

 ‘తేనె’లొలికే ఆరోగ్య సూచనలు

ఉదయం వేళ ఆరోగ్యదాయని అంటూ  చాలామంది తేనెను స్వీకరిస్తుంటారు. వేన్నీళ్లలో కాస్తంత తేనెనూ, నిమ్మరసాన్ని వేసి తాగుతారు. ఇలా తీసుకోవడం చాలా ప్రమాదకరం. తేనెను ఆరోగ్యప్రదాయనిగా స్వీకరించదలచినవారు వేన్నీళ్లలో దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వేయకూడదు. చన్నీళ్లతోనే స్వీకరించాలి. మీ శరీరం ఎంత తేనెను స్వీకరించడానికి సిద్ధంగా ఉందో ఆ మోతాదునే ఎప్పుడూ కొనసాగించాలి. అంతేగానీ తేనె మధురంగా ఉంటుందని అతిగా తీసుకోవడం సరికాదు.

 తేనె, నెయ్యి... ఈ రెండింటినీ సమానపాళ్లలో కలిసి తీసుకోకూడదు. ఏదో ఒకదాని  మోతాదు ఎక్కువో, తక్కువో ఉండాలి. ఆ రెండూ సమానంగా ఉంటే అది విషంతో సమానం.

 తేనె ‘యోగవాహి’. అంటే తేనెను దేనితోనైనా కలిపి తీసుకుంటే, అది చేరిన పదార్థం గుణాలను అధికం చేస్తుంది. కానీ తన స్వీయ గుణాల వల్ల ఉద్దేశిత కార్యానికి విరుద్ధంగా పనిచేయదు. ఉదాహరణకు కరక్కాయతో కలిసిన తేనె విరేచనాన్ని కలిగిస్తుంది. కానీ తన స్వభావమైన విరేచన కార్యాన్ని ఆపదు.

పాల విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే...

చాలామంది ఉదయం వేళ పాలు, అరటిపండు తీసుకుంటుంటారు. పాలతోగాని, పెరుగుతోగాని, పాలపొడితోగాని అరటిపండు తీసుకోవడం సరికాదు. అది స్లోపాయిజన్ వంటిది. చాలామంది భోజనం అనంతరం అరటిపండును తీసుకుంటారు. ఇది కూడా సరికాదు. అరటిపండును తినాలనుకునేవారు భోజనానికి ముందే తీసుకోవాలి. లేదా మధ్యాహ్న భోజనం తర్వాత సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో కడుపు కాస్త ఖాళీ అయ్యాక తీసుకోవడం మంచిది. రోజూ పాలు తాగేవారు దానితో తీపి పదార్థాలు తప్ప మరే రుచినీ కలపకూడదు. కాబట్టి టీ, కాఫీలు తాగేవారు కేవలం వాటిని కషాయంగా (పాలు కలపకుండా) తాగడమే ఆరోగ్యానికి మంచిది. ఇక ముఖ్యంగా పాలతో ఉప్పు కలపడం ఆరోగ్యానికి అనర్థం. అందుకే పాలతో కలిపి సాల్ట్ బిస్కెట్లు తీసుకోవడం మంచిదికాదని గుర్తుంచుకోండి.
   
 కొందరు కొన్ని రకాల కూరల్లో పాలు కలిపి వండుతుంటారు. పాలలో ఉప్పు కలిపి వేడిచేయడం ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి... ఇలా చేయడం దీర్ఘకాలంలో హానికరం.  పాలు, పనసపండు కలిపి తినకూడదు.  పాలు, చేపలు కలిపి తినకూడదు. చేపలు తిన్న తర్వాత మజ్జిగ గాని, పెరుగుగాని తింటే దీర్ఘకాలంలో ఆరోగ్యభంగం అయ్యే అవకాశం ఉంది.
   
 పెరుగును ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి చేయకూడదు.
Educational Purpose.
Article on Sakshi.
http://www.sakshi.com/news/family/ayurveda-marvelous-things-162900
02:23 - By Swathi 0

midi midi jananm


02:15 - By Swathi 0

Monday, 1 September 2014

Bapu Gari Interview

రమణగారు లేని జీవితం కష్టంగా ఉందండీ!

బాపుగారి చివరి ఇంటర్వ్యు

 సరిగ్గా 200 రోజుల క్రితం... ఉదయం పదకొండు గంటల వేళప్పుడు -
 చెన్నైలో బాపుగారింట్లో... ఆయన ఇంటర్వ్యూకోసం
 దర్శకుడు వీఎన్ ఆదిత్య, నేను (సినిమా డెస్క్‌హెడ్ పులగం చిన్నారాయణ), ఫొటోగ్రాఫర్ శివ చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
  ఈలోగా ఒక చేదువార్త... బాపు గారికి నీరసంగా ఉందట.
 ఇప్పుడేం మాట్లాడరట.. ముగ్గురం నీరసపడిపోయాం.
 ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి.
 కనీసం ఆయనను కలిసి అయినా వెళదామని
 అలానే కూర్చుండిపోయాం..
 మా అదృష్టం బాగుంది.  బాపు గారు కరిగిపోయారు.
 లోపలకు రమ్మన్నారు. చాలా నీరసంగా కనబడ్డారాయన.
 మాటలు మొదలయ్యాక... చాలా హుషారు ఆయనలో.
 చిన్న పిల్లాడై పోయారు.
 చిత్రాలు... చిత్ర పటాలు... చిత్రాతిచిత్రమైన సంఘటనలు...
 గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌లు... మనసులో తగిలించుకున్న
 జ్ఞాపకాల చిత్తరువులు... పలు రకాల పుస్తకాలు.. బోలెడన్ని గ్రామ్‌ఫోన్
  రికార్డులు... ఆయన బొమ్మలేసే చోటు.. రంగులేసే కుంచె...
 ఆ పక్కనే ఆయనకు కావాల్సిన స్వరాలందించే పాతకాలపు టేప్‌రికార్డర్...
 బాపు గారితో అలా... అలా... లీనమైపోయాం.
 రెండున్నర గంటలు... బాపు గారితో గడపడమంటే,
 మా మనసు ముంగిట్లో ముత్యాలముగ్గు వేసుకున్నంత ఆనందం.
 ఈ ఇంటర్వ్యూ మా జీవితంలో గ్రేటెస్ట్ మెమొరీ. కానీ...
 అదే ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ అవుతుందని అనుకోలేదు. మనసు నిండా విషాద మేఘాలు
 కమ్ముకున్న ఈ వేళ... ఒక్కసారి ఆయన జ్ఞాపకాలలోకి... మాటలలోకి...

 మీకు ఈ చిత్రకళ ఎలా అబ్బింది?
 బాపు: మా నాన్నగారు కూడా బొమ్మలు వేసేవారు. ఆయన అడ్వకేట్ అయినా హాబీగా బొమ్మలు వేసేవారు. అయితే ఇది కూడూ గుడ్డా పెట్టేది కాదని ఆయన అభిప్రాయం. నిజంగానే ఆ రోజుల్లో ఆర్టిస్టుగా బతకడం కష్టం. అందుకే నన్ను ‘లా’ చదివించారు.
   
 లా పూర్తయ్యాక, ఎప్పుడైనా కోర్టులో వాదించారా?
 అస్సల్లేదు. అప్పుడప్పుడు కోర్టుకి వెళ్లా. బీఎల్ డిగ్రీ రావడానికి ఎన్‌రోల్ కావాలి కదా. స్నేహితుల దగ్గర నల్లకోటు అరువు తీసుకుని వెళ్లాను.
   
 ఇంతకూ మీరు వెళ్లింది ఏ కోర్టు?
 నేను పుట్టి పెరిగిందంతా చెన్నై కదా. అక్కడ కోర్టుకే వెళ్లా. మా నాన్నగారు కూడా అక్కడే అడ్వకేట్‌గా పనిచేశారు.
   
 తమిళంలో ఓ ఫేమస్ ఆర్టిస్ట్‌కు మీరు ఏకలవ్య శిష్యుడట?
 ఆయన పేరు గోపులుగారు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు నాకు ఇష్టమైన ఆర్టిస్టులు అందరి దగ్గరికీ వెళ్తుండేవాణ్ణి. శని, ఆదివారాలు అదే పని నాకు. గోపులుగారింటికి ఆదివారాలు వెళ్లి, ఆయన బొమ్మలు వేస్తుంటే చూసేవాణ్ణి. నేనంటే చాలా ప్రేమ ఆయనకు. అప్పట్లో ఆయన ‘ఆనంద వికటన్’ మేగజైన్‌లో పనిచేసేవారు.
   
 మీరు బొమ్మలు గీసే పద్ధతి ఎలా ఉంటుంది?
 (వెంటనే ఆయన తన గదిలోకి తీసుకెళ్లి తను కూర్చుని బొమ్మలు గీసే ప్లేస్ చూపించారు). ఇక్కడే నేల మీద బాసింపట్టు వేసుకుని బొమ్మలు వేస్తుంటాను. మొదట్నుంచీ ఇదే అలవాటు. టేబుల్, కుర్చీ వాడను.
   
 ఏ ఆర్ట్‌కైనా మూడ్ ప్రధానం కదా. మరి మీకు ఏ టైమ్‌లో మూడ్ ఉంటుంది.
 నాకు మ్యూజిక్ ఉంటే చాలు. మూడ్‌తో పనిలేదు. ఏ టైమ్ అయినా, అర్ధరాత్రయినా సరే మ్యూజిక్ వింటూ బొమ్మలేసుకునే పని చేసేవాణ్ణి. ఇలా బొమ్మల మధ్యనే పడుకుని నిద్రపోయిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు ఓపిక లేదు. కూర్చుంటే లేవలేను.
   
 మీ రూమ్‌లో హిందీ మ్యూజిక్ డెరైక్టర్ సి. రామచంద్ర ఫొటో పెట్టుకున్నారు..?
 చాలా మంచి మ్యూజిక్ డెరైక్టరాయన. ‘అనార్కలి’ చేయడానికి ఆయన మద్రాసు వచ్చినప్పుడు కలిశాను. నా క్లోజ్‌ఫ్రెండ్ వి.ఎ.కె. రంగారావుగారు ఆయనకు వీరాభిమాని. సి. రామచంద్రగారి పాటల వల్ల నాకు ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. నాకు నలుగురితో కలిసి మాట్లాడటమంటే భయం. జలగండంలా నాకు ‘జన’గండం ఉన్నట్టుంది. రామచంద్ర పాట అంటే ఇష్టమని చెప్పగానే, అయిదు నిమిషాల్లో నాకు ఫ్రెండ్స్ అయిన వాళ్లు చాలామంది ఉన్నారు.
   
 మీరు వినేది గ్రామ్‌ఫోన్ రికార్డులా? ఆడియో క్యాసెట్లా?
 మొదట్లో గ్రామ్‌ఫోన్ రికార్డులే వినేవాణ్ణి. తర్వాత క్యాసెట్లు. ఇప్పుడు సీడీలు.
   
 మీ దగ్గర బ్రహ్మాండమైన మ్యూజిక్ కలెక్షన్ ఉందట?
 మెహదీహాసన్, బడే గులాం అలీఖాన్‌ల మ్యూజిక్ కలెక్షన్ మొత్తం ఉంది. వాళ్ల గజల్స్ అంటే నాకు ప్రాణం. గజల్స్ అనే కన్నా, వాళ్ల వాయిస్సే నాకిష్టం. ఎన్నిసార్లు విన్నా తనివి తీరని వాయిస్సులు వాళ్లవి. నాకు ఉర్దూ పెద్దగా రాదు. అయినా వారి వాయిస్‌ల వల్ల ఆ పాటలు బాగా ఎంజాయ్ చేశాను. 1978లో మెహదీహాసన్‌ని కలిశాను. ఓ బొమ్మవేసి ఇచ్చి సంతకం పెట్టమన్నాను. ‘‘హార్మోనియం పెట్టె... సగం బొమ్మే గీశావ్. మొత్తం గీసి తీసుకురా. అప్పుడు పెడతాను’’ అన్నారు. పెద్దవాళ్లకు వాళ్ల కళంటే అంత అభిమానం. బడే గులాం అలీఖాన్‌ను కలవలేకపోయాను. ఆయన కచ్చేరీలకు నన్ను పీబీ శ్రీనివాస్ తీసుకు వెళ్లేవారు.
   
 సినిమాలు బాగా చూస్తారా?
 రెగ్యులర్‌గా చూస్తా. అయితే అన్నీ వీడియోల్లోనే. నేను సినిమా బఫ్‌ని. రోజుకి పది దాకా వీడియోలు చూడగలను. వీడియోలు లేని రోజుల్లో మద్రాసులో మూడు రిలీజ్‌లుండేవి. మూడు పూట్లా మూడు రిలీజ్‌లు చూసేసేవాణ్ణి. సినిమా సినిమాకీ మధ్య ఒక టీ తాగి, బిస్కెట్లు తినేవాళ్లం.
   
 సినిమాలు తీయడానికి మీకు ఇన్‌స్పిరేషన్..?
 చిన్నప్పట్నుంచీ సినిమాలంటే చాలా ఇష్టం. మద్రాసులో హాలీవుడ్ సినిమాలన్నీ విడుదలయ్యేవి. అన్నిటికీ నేలక్లాసుకి వెళ్లిపోయేవాళ్లం.
   
 మీరు మౌత్ ఆర్గాన్ బాగా వాయించేవారట?
 కాలేజీ రోజుల్లో బాగా వాయించేవాణ్ణి.
   
 ‘మూగమనసులు’ పోస్టర్ మీరే డిజైన్ చేశారు కదా?
 అవును. రమణగారు ఆ సినిమాకి వర్క్ చేశారు కదా. సినిమాలో ఉన్నదాన్నే ఎలివేట్ చేస్తూ పడవ, పంగలి కర్ర, ముద్దబంతి పువ్వు ఆర్ట్‌గా వేశాను.
   
 మీ తొలి సినిమా ‘సాక్షి’కి మీరు పబ్లిసిటీ డిజైన్ చేసుకోకుండా ఈశ్వర్‌తో చేయించారెందుకని?
 ఈశ్వర్ పోస్టర్స్ ఇష్టపడి ‘సాక్షి’కి తనతో వేయించాను.

 ‘బంగారు పిచిక’లో యద్దనపూడి సులోచనారాణిగారిని కథానాయికగా తీసుకోవాలనుకున్నారట..?
 హీరోయిన్‌గా కాదు. ఆ సినిమాలో ఓ చోట హీరోకి గొప్పింటి సంబంధాలు తీసుకు వస్తుంది తల్లి. అక్కడ ఓ పెళ్లికూతురి వేషం యద్దనపూడి గారితో చేయించాలనుకున్నాం. ఆవిడ కూడా ఒప్పుకున్నారు. కానీ చేయించడం కుదర్లేదు.
   
 మీ ప్రతి సినిమాకూ స్టోరీబోర్డ్ వేసుకుంటారు. ఆ ఆలోచన ఎందుకొచ్చింది?
 నాకు బొమ్మలేయడం వచ్చు కాబట్టి, కన్వీనియంట్‌గా ఉంటుందని స్టోరీ బోర్డ్ వేసుకుంటుంటాను. హాలీవుడ్‌లో దాదాపుగా అందరూ స్టోరీబోర్డ్ ఫాలో అవుతుంటారు. హైదరాబాద్‌లో కూడా స్టోరీబోర్డ్ వేసే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. అది ప్యూర్లీ పర్సనల్. బయటివాళ్లకు అర్థం కావు. ఆర్టిస్టులు కూడా చూద్దామని తీసుకుని అర్థంకాక ఇచ్చేసేవారు.
   
 మీ తొలి సినిమా ‘సాక్షి’ నుంచి స్టోరీబోర్డ్ ఫాలో అయ్యారా?
 అవును. నేను హోమ్‌వర్క్ ఎక్కువ చేసేవాణ్ణి.
   
 మీ స్టోరీబోర్డ్ ఫాలో అయితే ఎవరైనా ఫొటోగ్రఫీ చేసేయొచ్చునంటారు. లెన్స్ రేంజ్‌లు కూడా డీటెల్డ్‌గా రాస్తారట?
 అబ్బే అదేం లేదండి. ఎవరి పని వాళ్లదే.
   
 మీ సినిమాలకు గొప్ప గొప్ప బాలీవుడ్ కెమెరామేన్లు పనిచేశారు కదా!
 బాబా ఆజ్మీ, ఇషాన్ ఆర్యలాంటి వాళ్లు పనిచేశారు.
   
 వాళ్లతో మీకెలా పరిచయం?
 వాళ్ల సినిమాలు చూశాను. హిందీ సినిమా ‘గరమ్ హవా’కు ఇషాన్ ఆర్య వర్క్ చూసి, ఆయన ఎక్కడుంటారో కనుక్కుని మాట్లాడాను. ‘ముత్యాల ముగ్గు’ ఆయనకు తొలి తెలుగు సినిమా. దానికి ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది. స్నేహం, గోరంత దీపం, తూర్పు వెళ్లే రైలు సినిమాలకు నాతో పనిచేశారు. ఆయన అసిస్టెంటే బాబా ఆజ్మీ. నటి షబనా ఆజ్మీ తమ్ముడాయన. కైఫీ ఆజ్మీగారబ్బాయ్. రాజాధిరాజు, వంశవృక్షం, రాధా కల్యాణం, త్యాగయ్య, పెళ్లీడు పిల్లలు తదితర సినిమాలకు వర్క్ చేశారు. ‘సంపూర్ణ రామాయణం’ సినిమాకి ట్రిక్ వర్క్ అంతా రవికాంత్ నగాయిచ్‌గారు చూసుకున్నారు.
   
 మీరు షాట్ ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేవారా?
  అలా మాట వినకపోతే నాతో పని చేయడం కష్టం.
   
 ఆర్టిస్టులకి మీరు యాక్ట్ చేసి చూపిస్తారా?
 చూపించాలి కదండీ. లేకపోతే వాళ్లకు ఎక్స్‌ప్రెషన్సూ అవీ ఎలా తెలుస్తాయండీ. సినిమా మొత్తం మనకు తెలుస్తుంది. వాళ్లు ఎక్కడనుంచో ఇక్కడకు వస్తారు. మనం చెప్పకపోతే వాళ్లకు ఎలా తెలుస్తుంది?

 మీ సినిమాల్లో ‘సీతమ్మ పెళ్లి’ ప్రత్యేకంగా అనిపిస్తుంది...
 చాలా మంచి కథ అది. మహేంద్రన్‌గారని తమిళంలో నాకిష్టమైన దర్శకుడు చేసిన ‘నిండు కొయిరాన్’ని తెలుగులో నేను చేశాను. తమిళంలో రజనీకాంత్ చేసిన పాత్రని తెలుగులో మోహన్‌బాబుతో చేయించాం.
   
 అందరూ మీ బొమ్మలు వాడుతుంటారు. మీరేమో ‘సీతాకల్యాణం’లో ఓ పాటలో మీ బొమ్మలు కాకుండా వేరే చిత్రకారుని బొమ్మలు వాడినట్టున్నారు?
 పిలకా నరసింహమూర్తిగారని మా గురువుగారు. ఆయనతో దశావతారాలు బొమ్మలు వేయించాను.
   
 మీ సినిమాల్లో ఎక్కడో ఒక చోట పుస్తకాలు కనిపిస్తూ ఉంటాయి ఎందుకని?
 ఐజన్‌బర్గ్ గారని గాడ్‌ఫాదర్ ఉండేవారు. ఫోర్డ్ ఫౌండేషన్‌వాళ్లు పెట్టిన సదరన్ లాంగ్వేజ్ బుక్ ట్రస్ట్‌కి ఆయన హెడ్. ఆయన చెప్పేవారు... సినిమాలో ఎక్కడో ఒకచోట పుస్తకం చూపించమని. వంటగదిలో సీన్ అయినా సరే. ఇల్లాలు పిల్లాడికి పాలు పట్టిస్తున్నా ఓ చేత్తో పుస్తకం ఉన్నట్టు చూపించమనేవారు. అందరూ పుస్తకాలు చదవాలనేది ఆయన అభిలాష.

 ‘సాక్షి’ సినిమాని ఇప్పుడు కూడా రీమేక్ చేయొచ్చునా?
 చాలామంది స్క్రీన్‌ప్లే అది. స్క్రీన్‌ప్లే వైజ్ గొప్పదే కానీ, పర్సనల్‌గా నా వర్క్ నాకు అంత గొప్పగా అనిపించదు.

 తమిళంలో ఏమైనా చేశారా?
 ఓకే ఒక్క సినిమా చేశాను. ‘ఇన్సాఫ్ కే తరాజ్’ని తెలుగులోనూ, తమిళంలోనూ చేశాం.
   
 మీ సినిమాలకు నెగిటివ్ ఎక్స్‌పోజర్ కూడా చాలా తక్కువనుకుంటాను?
 అవునండీ. సినిమా నిడివికి మూడు రెట్లు ఎక్స్‌పోజర్ ఉండేది. ఎందుకంటే రమణగారు స్క్రిప్ట్ రాసి ఇస్తే, నేను స్టోరీబోర్డ్ వేసేసేవాణ్ణి. అక్కడే చాలామట్టుకు ఎడిటింగ్ అయిపోతుంది. ఓ హిందీ సినిమాని ఒకే సెట్‌లో రెండు చోట్ల ఊటీలోనూ, ముంబైలో తీసేశాం. కాల్షీట్లు ఇబ్బంది వల్ల. అదంతా స్టోరీబోర్డ్ వల్ల సాధ్యపడింది.
   
 రమణగారికి ఏయన్నార్ క్లోజ్ అయితే, మీకు ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం ఉండేదా?
 అదేం లేదండి. నాకెవ్వరితోనూ ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది కాదు. ఎన్టీఆర్‌తో రెండు సినిమాలు చేశాను. పిల్లల కోసం ప్రభుత్వం తరఫున ఓ ప్రాజెక్ట్ చేయిస్తే చేశాను. అదంతా రమణగారి చలవవల్లే.
   
 అన్నీ తెలిసి కూడా మౌనంగా ఉండటం చాలా కష్టం. మీది మొదట్నుంచీ అదే పద్ధతి. కానీ ఏమీ లేకపోయినా డాంబికాలు పలికేవారిని చూస్తే ఏమనిపిస్తుంది?
ఇంకొకళ్ల గురించి జడ్జ్ చేయడం కష్టం. తప్పు కదా..?
   
 ఈ గోడ మీద మీ బొమ్మలు కాకుండా పెద్ద పెద్ద పెయింటింగ్స్ ఏంటండీ?
 ఇవన్నీ ఓల్డ్‌మాస్టర్ పెయింటింగ్స్. ‘సీతా కల్యాణం’ టైమ్‌లో లండన్ వెళ్లినపుడు గూటాల కృష్ణమూర్తి గారితో వెళ్లి ఈ పెయింటింగ్స్ కొన్నా. నా ఇంకో ఫ్రెండ్ శ్రీరమణగారు ఇవన్నీ లామినేట్ చేసి పెట్టారు. 1978 నాటి బొమ్మలివి.
   
 చిత్రకళలో వచ్చే మార్పుల్ని గమనించడం కోసం ఇంటర్‌నెట్‌ని ఫాలో అవుతుంటారా?
 నాకస్సలు కంప్యూటర్ ఆపరేట్ చేయడం తెలీదు. ఎప్పటికప్పుడు పుస్తకాలు రిఫర్ చేస్తుంటాను. అప్పట్లో సెంట్రల్ స్టేషన్ దగ్గర్లో మూర్ మార్కెట్ ఉండేది. అక్కడ చిత్రకళకు, సంబంధించి ఫారిన్ బుక్స్ దొరికేవి. ఆల్‌మోస్ట్ ఆల్ అదే నాకు స్కూలులాంటిది. ప్రతివారం ఆ మార్కెట్‌కి వెళ్తుండేవాణ్ణి. లేకపోతే లైబ్రరీకి వెళ్లి బుక్స్ రిఫర్ చేస్తుండేవాణ్ణి. నా చిన్నప్పుడు ‘బాల’ అనే చిల్డ్రన్ మేగజైన్ ఉండేది. ‘రేడియో అన్నయ్య’ న్యాపతి రాఘవరావు గారిది. అందులో బొమ్మలేసేవాణ్ణి. ఆయనే ఎంకరేజ్ చేసేవారు. పుస్తకాల షాపుకి తీసుకెళ్లి ‘నీకు కావాల్సినవి కొనుక్కోవయ్యా’ అనేవారు. షీట్స్, రంగులు అన్నీనూ.
   
 ఇంటర్నేషనల్ లెవెల్‌లో మీ పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ ఏమైనా పెట్టారా?
 చాలా పెట్టారండీ. అమెరికా, లండన్. ‘సీతాకల్యాణం’ టైమ్‌లో నేను కూడా లండన్ వెళ్లాను.
   
 మంచి ఆర్టిస్ట్ కావాలంటే ఏం చేయాలండీ?
 లోపల ఉండాలండీ. నేచురల్‌గా ఇంట్రస్ట్ ఉంటే ప్రాక్టీస్... ప్రాక్టీస్... ప్రాక్టీస్... చేస్తూనే ఉండాలి. అబ్దుల్ కరీం ఖాన్ అని గొప్ప క్లాసికల్ సింగర్ ఉండేవారు. చేతిలో పొన్ను కర్ర. దానికి వెండి పిడి. ఒకాయన ఎవరో మూడు నెలలు సెలవు పెట్టి వస్తాను... సంగీతం నేర్పించమన్నాడట. దానికాయన తన పొన్నుకర్రని చూపించి దీన్ని ఫ్యాక్టరీలో మెషిన్ మీద అయిదు నిమిషాల్లో తయారు చేస్తారు. కానీ నా అరచేయి కింద 30 ఏళ్లుగా ఉంది. అందుకే ఇంత నునుపు తేలింది. సంగీతం మూడు నెలల్లో నేర్చుకుంటే రాదు అన్నారట. అందుకే నిరంతరం అదే పనిలో ఉండాలి.
   
 వర్తమానంలో చిత్రకళ గురించి మీ అభిప్రాయం?
 అద్భుతంగా ఉంది. ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది. పాతవే మంచివి అనుకోవడం పొరపాటు.
   
 ప్రస్తుతం మీకు నచ్చిన చిత్రకారుడెవరు?
 (నవ్వుతూ) నాకు జుట్టు లేదు కానీ, ఇంతమంది చిత్రకారులున్నారు. నిజంగా వేలల్లో ఉన్నారు.
   
 మనవళ్లూ మనవరాళ్లలో ఎవ్వరికైనా మీ ఆర్ట్ అబ్బిందా?
 నా రెండో అబ్బాయి కూతురు బొమ్మలు వేస్తుంది. దానికి 8 ఏళ్లు. మా అమ్మాయి కూడా బొమ్మలు వేస్తుంది. తను ఏదో గ్రాఫిక్స్ కంపెనీలో పనిచేస్తోంది.
   
 బొమ్మలు వేయడం నేర్పమని పిల్లలు అడగరా?
 (నవ్వేస్తూ) నాకు వస్తే కదా... వాళ్లకు నేర్పేది. నేను నిరంతర విద్యార్థిని. నేర్చుకుంటూనే ఉంటాను.
   
 ఇప్పుడు మీకు కాలక్షేపం ఏంటి?
 ఓపిక ఉంటే బొమ్మలు వేయడం. లేకపోతే పుస్తకాలు చదవడం. మొదట్నుంచీ పుస్తకాలు ఎక్కువ చదివేవాణ్ణి.
   
 రమణగారి స్క్రిప్టు లేకుండా మీరు రెండు సినిమాలు చేసినట్టున్నారు?
 లేదండీ. ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ నాటకం ఆధారంగా తీసిన సినిమా కదా. పద్యాలు ఉంటాయని గబ్బిట వెంకట్రావ్‌గారితో స్క్రిప్ట్ చేయించాం. రమణగారి ఇది లేనిదే నేను ఏ సినిమా తీయలేదు. ‘రామాంజనేయ యుద్ధం’కు రమణగారి కంట్రిబ్యూషన్ ఇన్‌డెరైక్ట్‌గా ఉంది.
   
 రమణగారు రాసిపెట్టుకున్న సినిమా స్క్రిప్టులు ఇంకేమైనా ఉన్నాయాండీ?
 లేవండీ. కొన్ని కొన్ని స్టోరీ ఐడియాలుండేవి. చేద్దామని ఫుల్‌ఫ్లెడ్జ్‌డ్‌గా ఏ స్క్రిప్టూ పెట్టుకోలేదు. ఐడియా నచ్చితే అప్పటికప్పుడు స్క్రిప్టు తయారు చేసుకునేవాళ్లం.
   
 డబ్బు ఎంత గొప్ప స్నేహితులనైనా విడదీస్తుందంటారు. మీరిద్దరూ తీసిన సినిమా ఫ్లాప్ అయితే ఏం ఇబ్బంది ఎదురు కాలేదా?
 అంతా రమణగారే చూసుకునేవారు. ఈ ఇల్లు ఆయన కట్టించిందే. ఎన్టీఆర్‌గారి స్కూలు పాఠాల ప్రాజెక్ట్ తర్వాత ఇది, పక్కన మా అమ్మాయి ఇల్లు, వెనుక రమణగారిల్లు కట్టుకున్నాం. రమణగారు ఇల్లు అమ్మేశాక, ఈ ఇంట్లోనే పైన ఉండేవారు. వెనుక ఇంట్లో ఏడాదో, రెండేళ్లో ఉన్నారంతే. ‘‘ఎప్పుడూ కలిసుండేవాళ్లం ఇలా వెనక్కు వెళ్లాను. అందుకే అమ్మేశాను’’ అని జోక్ చేసేవారు రమణ. చిన్నప్పట్నుంచీ తను మా ఇంట్లోనే ఉండేవాడు. మా అమ్మగారు తనను పెద్దబ్బాయ్ అని పిలిచేది.
   
 రమణగారు ఉండి ఉంటే... ఇంకో సినిమా చేసేవారా?
 చేసేవాణ్ణి.
   
 ‘శ్రీరామరాజ్యం’ తర్వాత ఏమైనా అనుకున్నారా?
 ‘శ్రీరామరాజ్యం’ జరుగుతుంటేనే పోయారాయన. స్క్రిప్ట్ ముందే రాసేస్తారు కనుక ఇబ్బంది అనిపించలేదు.
   
 రమణగారితో మీ లాస్ట్ వర్డ్?
 రాత్రి రెండింటికి వాళ్లావిడ పిలిచింది. నన్ను పైకి రమ్మంటున్నారని. జస్ట్ టూ మినిట్స్. అనాయాస మరణం. ఊపిరి అందలేదు.
   
 రమణగారు లేని లైఫ్ ఎలా ఉందండీ?
 చాలా కష్టంగా ఉందండీ (అంటుండగానే ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి). అప్పటి నుంచీ నాకు ఓపిక పోయింది.

 - సంభాషణ: వి.ఎన్. ఆదిత్య,  పులగం చిన్నారాయణ

Original Interview has published on sakshi. This is the last interview of bapu garu with sakshi paper.

http://www.sakshi.com/news/family/director-bapu-exclusive-interview-162686
04:29 - By Swathi 0

Sunday, 4 May 2014

Anantha Giri

Anantha Giri Tourst Place



11:19 - By Swathi 0

Saturday, 3 May 2014

మౌనము బోధనే



01:06 - By Swathi 0

Saturday, 26 April 2014

buddha stories



08:35 - By Swathi 0

Horsley Hills


08:29 - By Swathi 0

Friday, 25 April 2014

Caves and Devotional Places





telugu books

05:35 - By Swathi 0

జ్ఞానం, గుణం , గురువు





05:28 - By Swathi 0

Monday, 14 April 2014

Short Stories

Stories for Children













11:39 - By Swathi 0

Saturday, 29 March 2014

Hero Nani Interview


telugu pdf
Add caption



Nani Interview with Sakshi Paper
22:18 - By Swathi 0

Monday, 10 March 2014

Women Health

Here I am giving some useful notes , that would be useful for telugu women, This article on women's health, I grab it from sakshi paper and feel it is useful for telugu women. 
00:06 - By Swathi 0

Monday, 16 December 2013

Telangana Bill Pdf Download

04:47 - By Swathi 0

TELANGANA BILL

04:41 - By Swathi 0

Sunday, 10 November 2013

Victory Venkatesh Interview With Sakshi

నేను అనే భావన పెరిగేలోపే ఆ బాటలో వెళ్లాలి!

VENKATESH, He is the super star in Tollywood. He loves cricket, He has friends in indian cricket team. He Follows Indian Cricket. He always supports Indian Team. He is One of the Great Personality In Indian Cinema. This week I am sharing with you, His Interview On sakshi Paper.He has been in the telugu Industry. He works with a lot of People in his career, In this  detailed Interview, We can know many things from his Life experience, I hope you will enjoy it.

 బయట ఉన్నంత ‘రిచ్’గా లోపలా ఉండగలమా?
 లోపల అంటే... మన ఆలోచనల్లో, ఆచరణల్లో.
 రిచ్‌గా అంటే... భౌతిక విలువలకు అతీతంగా, ఆధ్యాత్మికంగా.
 ‘ఉండగలం’ అంటారు విక్టరీ వెంకటేష్.
 ఎలా?
 మానవుడికన్నా మరికాస్త గొప్పగా ఆలోచించాలట!
 అంటే?!
 నంబర్ వన్: నేను, నాది, నా వల్ల... అనుకోకూడదు.
 నంబర్ టు: దేన్నీ  శాశ్వతమని భావించకూడదు. 
 నంబర్ త్రీ: రేపటి గురించి ఆలోచిస్తూ ఇవాళ్టిని వృథా చేయకూడదు.
 బానే ఉంది కానీ..
 మానవుడు మానవుడిలా కాకుండా ఇంకెలా ఆలోచిస్తాడు?
 ఒక సాధువులా, ఒక సద్గురువులా, ఇంకా... హీరో వెంకీలా!
 వెంకీలో అంతుందా! అంత కాదు, ఎంతో ఉంది.
 వెంకీతో ఎంటర్‌టైన్ అవాలనుకునేవారు ఆయన సినిమాలను ఎన్నిసార్లైనా చూడొచ్చు.
 వెంకీతో ఎన్‌లెటైన్ అవాలంటే మాత్రం ఒక్కసారైనా ఈ ‘తారాంతరంగం’ చదవాలి.

  ‘ఐ విల్ కట్ హారిజాంటల్లీ...’ అంటూ వచ్చీ రాని ఇంగ్లిష్‌లో ‘మసాలా’ సినిమాలో డైలాగ్ చెప్పారు. ఒకప్పుడు మీ తెలుగు కూడా అలానే ఉండేది కదా?
 వెంకటేష్: అవును. తెలుగు మాట్లాడటం చాలా కష్టమయ్యేది. నా స్కూలింగ్ అంతా చెన్నయ్‌లోనే. ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లిష్, సెకండ్ లాంగ్వేజ్ హిందీ. పైగా పై చదువుల కోసం విదేశాలు వెళ్లిపోవడం వల్ల తెలుగు మాట్లాడే అవకాశం చాలా చాలా తక్కువ ఉండేది. హీరో అయిన కొత్తలో నా పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి చాలా ఇబ్బందిపడేవాణ్ణి. అప్పట్లో నా తెలుగులో బాగా ఇంగ్లిష్ ఉండేదనేవాళ్లు.

 ఓసారి మీ ఫ్లాష్‌బ్యాక్‌కి వెళదాం... సురేష్ ప్రొడక్షన్స్ బేనర్ ఎంబ్లమ్‌లో ‘ఎస్’ అక్షరంపై మీరు, ‘పి’ అక్షరంపై మీ అన్నయ్య సురేష్‌బాబు ఉంటారు. అక్షరాలకు తగ్గట్టు మీరు స్టార్, మీ అన్నయ్య ప్రొడ్యూసర్ అయ్యారు. ఇలా జరుగుతుందని ఎప్పుడైనా అనుకున్నారా?
 వెంకటేష్: అస్సలు అనుకోలేదు. నేను సినిమాల్లోకి వస్తాననే అనుకోలేదు. బేనర్ లోగో తయారు చేయించినప్పుడు అన్నయ్యను, నన్ను నిలబెట్టి నాలుగైదు రకాల స్టయిల్స్‌లో నాన్నగారు లోగో తయారు చేయించారు. మేమిద్దరం బాక్సింగ్ చేస్తున్నట్లు, షేక్‌హ్యాండ్ ఇచ్చుకుంటున్నట్లు.. ఇలా షూట్ చేశారు.

 అప్పట్లో మీరేం అవ్వాలనుకునేవారు?

 వెంకటేష్: స్పైసెస్ (సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు) బిజినెస్ చేద్దామనుకున్నా. ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్‌కి సంబంధించిన బిజినెస్ కదా. ఆ వ్యాపారం అయితే ఎక్కువగా ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం.  కానీ, మనం అనుకున్నదేదీ జరగదు కదా! కృష్ణగారు బిజీగా ఉండటంవల్ల నాన్నగారు నన్ను ‘కలియుగ పాండవులు’లో హీరోగా చేయమన్నారు. అప్పుడు అబ్రాడ్‌లో చదువుతున్నాను. నాన్నగారు ఫోన్ చేయగానే, ఇక్కడికొచ్చేశాను. అనుకోకుండా హీరో అవ్వడం... ఇదిగో ఇక్కడిదాకా రావడం.. అందరికీ తెలిసిందే.

 గోల్డెన్ స్పూన్‌తో పుట్టారు... మీ లైఫ్ అంతా అద్భుతమే కదూ?

 వెంకటేష్: అసలు గోల్డెన్ స్పూన్ అంటే ఏంటి? ‘మెటీరియల్ వరల్డ్’కి నేను గోల్డెన్ స్పూన్‌తో పుట్టినట్లుగానే ఉంటుంది. దేశంలో ఎంత పెద్ద అయినా, లోపల ‘పూర్’గా ఉంటే జీవితం వృథా అని నా అభిప్రాయం.

 లోపల బీదగా ఉండటం అంటే..?
 వెంకటేష్: బయటికి నేను బాగా రిచ్‌గా ఉండొచ్చు. కానీ, లోపల ఎంత ఆనందంగా ఉన్నారో మీకెలా తెలుస్తుంది? ఆధ్యాత్మిక అవగాహన ఉంటేనే నా దృష్టిలో ‘రిచ్’ కింద లెక్క.

 మరి... మీరు ధనవంతులేనా?
 వెంకటేష్: యస్..!

 ఆధ్యాత్మిక అవగాహన ఉంటేనే ‘రిచ్’ అని ఎలా అంటారు?
 వెంకటేష్: ఓకె.. కొంచెం విపులంగా మాట్లాడుకుందాం. నా కెరీర్‌ని తీసుకుందాం. రెండు సినిమాలు సూపర్ హిట్. బ్రహ్మరథం పడతారు. ఆ తర్వాత రెండు ఫట్లు... ఎవరూ దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడరు. సో.. సక్సెస్ అనేది అశాశ్వతమే కదా. అలాగే, స్నేహితులతోనూ బంధువులతోనూ అనుబంధాన్ని తీసుకుందాం. ఎక్కడైనా చిన్న మాటలో తేడా వస్తే.. ఆ అనుబంధం ఏమవుతుంది? కాబట్టి అనుబంధాలూ అశాశ్వతమే. వేసుకునే బట్టలు, వాడే వస్తువులు.. ఏదీ జీవితాంతం మనతోపాటు ఉండిపోవుగా. మరి.. శాశ్వతం కాని వాటి గురించి పాకులాడటం దేనికి? సో.. ఏది శాశ్వతం.. ‘ఇన్నర్ స్ట్రెంగ్తే కదా...’. ఆ బలం ఎప్పుడు వస్తుంది? ఆధ్యాత్మిక బాటలో వెళుతూ.. ‘జీవిత సత్యం ఏంటో? శాశ్వతం ఏదో’ తెలుసుకున్నప్పుడు. ఇన్నర్‌గా మనం ఎప్పుడైతే బలంగా ఉంటామో అప్పుడు దేనికీ భయపడం. మనలో ఓ ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది!

 దేనికీ భయపడం అంటే... చివరికి మరణానికి కూడానా?
 వెంకటేష్: ఎగ్జాక్ట్‌లీ... మరణానికి కూడా భయపడం. అసలు చావంటే ఏంటో తెలుసుకోకుండా భయపడిపోతుంటాం. అయితే, మరణం అనేది శరీరానికి మాత్రమే అనుకున్నప్పుడు భయం ఉండదు. మన శరీరం చనిపోగానే, అందులో ఉన్న ఆత్మ వేరే తల్లి కడుపులో పడుతుందనే సత్యం తెలుసుకుంటే మరణం గురించి భయపడం!

 డబ్బు, నగలు, వస్తువులు.. ఇష్టపడేవారికి వాటి ద్వారా ఆనందం లభిస్తుంది. మరి.. మీకు ఎందులో ఆనందం లభిస్తుంది?
 వెంకటేష్: నేను మానవుణ్ణి కాదు.. ఇంకా ఏదో అనుకున్నప్పుడు శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. ఒక మానవుడికన్నా ఇంకా గొప్పగా ఆలోచించగలిగినప్పుడు ఆనందంగా ఉంటుంది.

 మీరంటే చిన్నప్పట్నుంచీ అన్ని సౌకర్యాలూ అనుభవించారు కాబట్టి, ‘మెటీరియల్స్’ మీద వ్యామోహం పోయి ఉంటుంది. దాంతో... ‘ఆధ్యాత్మికం’ అంటున్నారు. కానీ, ఏమీ అనుభవించనివాళ్లు  మీరు అంటున్న అశాశ్వత ఆనందాన్నే కోరుకుంటారేమో?

 వెంకటేష్: మితిమీరిన ఆశ ఉంటే.. ఎవరికీ ఎప్పుడూ దేనిలోనూ ఆనందం లభించదు. ఉదాహరణకు.. చిన్న కారు కొనుక్కోవాలనుకున్నారు. అది కొన్న తర్వాత ఇంకా లగ్జరీ కారుని కోరుకుంటారు. చిన్న ఇల్లుతో మొదలుపెట్టి.. ఆ తర్వాత పెద్ద ఇంటి వరకు ఆశ పెరిగిపోతుంది. అలాంటివాళ్లకి ఎప్పుడూ ఆనందం దొరకదు. ఇక.. మీరన్నది కరెక్టే. ఏ సౌకర్యాలూ అనుభవించకుండా ఈ బాటలో వెళ్లలేం. నేను అన్ని సౌకర్యాలు అనుభవించాను కాబట్టే, చాలా త్వరగా ‘ఆధ్యాత్మిక బాట’కు ఆకర్షితుణ్ణయ్యాను. అసలేమీ అనుభవించకుండా ఈ భావన  అంత సులువుగా రాదు.

 మీ మాటలు దాదాపు ఎడ్యుకేట్ చేసే విధంగానే ఉన్నాయి. కానీ, కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. చిన్నప్పుడు మీరెలా ఉండేవారో తెలుసుకోవాలని ఉంది...
 వెంకటేష్: చాలా జోష్‌గా ఉండేవాణ్ణి. అల్లరి పిల్లాణ్ణే.  నాకో చిన్న గ్యాంగ్ ఉండేది. స్కూల్లో అందరితో బాగుండటం, ఎంజాయ్ చేయడం అలా ఉండేవాణ్ణి. నా క్లాస్‌తో పాటు ఇతర క్లాసుల పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండేవాణ్ణి. చదువుపరంగా చెప్పాలంటే యావరేజ్. స్పోర్ట్స్‌లో బాగా పార్టిసిపేట్ చేసేవాణ్ణి. స్కూల్లో ‘సిస్టమ్’కి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే భరించేవాణ్ణి కాదు. ఉన్నవాళ్ల పిల్లలను ఓ రకంగా, లేనివాళ్లను ఓ రకంగా ట్రీట్ చేస్తే ఊరుకునేవాణ్ణి కాదు. పిల్లలందరికీ ఫ్రెండ్... టీచర్స్‌కి మాత్రం విలన్‌నే.

 అయితే.. కాలేజ్‌లో ఇంకా రెబల్‌గా ఉండేవారేమో?
 వెంకటేష్: అవును. పక్క కాలేజీవాళ్లకీ మా కాలేజీవాళ్లతో మాటా మాటా వచ్చినప్పుడు గొడవపడటానికి ముందుండేవాణ్ణి.

 రామానాయుడి కొడుకు కాబట్టి.. స్కూల్, కాలేజ్‌లో మీరేం చేసినా చెల్లుబాటు అయ్యుంటుందేమో?
 వెంకటేష్: స్కూల్లో నన్నెప్పుడూ ప్రత్యేకంగా చూడలేదు. అల్లరి చేసినప్పుడు ‘గో అవుట్’ అంటూ టీచర్స్ నన్ను బయట నిలబెట్టిన రోజులు చాలానే ఉన్నాయి. నేను ‘రామానాయుడు కొడుకు’ అని ఎవరి దగ్గరా చెప్పుకునేవాణ్ణి కాదు. ‘నేను మామూలు వ్యక్తిని’ అనుకున్నప్పుడే లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేయగలుగుతాం అని నేను చిన్నప్పట్నుంచీ నమ్మేవాణ్ణి.

 కాలేజ్ డేస్‌లో బైక్ మీద ఫ్రెండ్స్‌తో బాగానే హల్‌చల్ చేసేవారా?
 వెంకటేష్: బీకామ్ ఫస్ట్ ఇయర్‌లో యమహా కొనుక్కున్నాను. ఫస్ట్ బైక్ థ్రిల్లే వేరు. ఆ బైక్‌ని మాడిఫై చేయించుకోవడం, గారేజ్‌కి తీసుకెళ్లి, పెయింటింగ్‌లు వేయించుకోవడం అంతా బాగుండేది. కొన్నాళ్లు హాయిగానే సాగింది. కానీ ఓసారి యాక్సిడెంట్ జరగడంతో ఇంట్లోవాళ్లు ఇక బైక్ వద్దన్నారు. ఆ విధంగా నా బైక్ రైడ్‌కి బ్రేక్ పడింది.

 అది సరే... ‘ప్రేమనగర్’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశారు కదా.. ఆ తర్వాత ఎందుకు కంటిన్యూ అవ్వలేదు?
 వెంకటేష్: అది అనుకోకుండా జరిగింది. ఓ రోజు నేనేదో ఆడుకుంటుంటే, మా మేనేజర్ అనుకుంటా.. నా దగ్గరికొచ్చి ‘నాన్నగారు రమ్మంటున్నారు.. యాక్ట్ చేయాలట. చేస్తే మీ బ్యాంక్‌లో డబ్బులు వేస్తారట’ అన్నాడు.  సరే.. వెళ్లాను. చేశాను. అంతేకానీ నాకు ప్రత్యేకంగా ఇంట్రస్ట్ ఏమీ లేదు.

 కనీసం చిన్నప్పుడు అద్దం ముందు నిలబడి, యాక్ట్ చేసి చూసుకోవడం కూడా చేసేవారు కాదా?
 వెంకటేష్: సినిమా వాతావరణంలో పెరిగినందువల్లో ఏమో.. మా ఆఫీస్ పైన ఉన్న కాస్ట్యూమ్ రూమ్‌లోకెళ్లి.. మా జానపద సినిమాలకు సంబంధించిన డ్రెస్‌లేసుకుని, అద్దం ముందు నిలబడి, ఏవో పిచ్చి పిచ్చి సైగలు చేయడం ఇంకా గుర్తుంది. అలాగే, మావాళ్లు అప్పుడప్పుడు, నన్ను డాన్స్ చేయమనేవాళ్లట. కొంతమంది స్టార్స్‌ని ఇమిటేట్ చేసేవాణ్ణట. ఇలాంటివన్నీ అన్నయ్య చెయ్యలేదు. నేనే చేశానంటే.. ఏదో మూల నాలో యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ ఉండేదేమో...!
  అన్నయ్య, మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారు?
 వెంకటేష్: మా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ లేదు కాబట్టి చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. ఇప్పుడూ అలానే ఉంటాం. అన్నయ్య మంచి స్పోర్ట్స్‌మేన్. క్రికెట్ బాగా ఆడేవాడు. ఫాస్ట్ బౌలర్. స్కూల్లో స్పోర్ట్స్ అంటే... అన్నయ్య పార్టిసిపేషన్ కంపల్సరీ.

 సౌత్‌లో నిర్మాతల కొడుకుల్లో మీ అంతగా సక్సెస్ అయినవాళ్లు లేరు. భవిష్యత్తుని ప్లాన్ చేయనన్నారు కాబట్టి... ఈ ఊహించని సక్సెస్ ఎలా అనిపిస్తోంది?
 వెంకటేష్: నా మొదటి సినిమా తర్వాత వరుసగా నాలుగైదు ఫ్లాప్‌లు వచ్చాయి. దాంతో, చాలా కామెంట్స్ వచ్చాయి. ‘నిర్మాతల కొడుకులు కష్టం’ అని కొందరు, ‘ఈ అబ్బాయికి యాక్టింగ్‌కి కుదరదు’ అని మరికొందరు వ్యాఖ్యలు చేశారు. అప్పటికే చిరంజీవిగారు, బాలకృష్ణగారు, నాగార్జునగారు సినిమాలు చేస్తున్నారు. ఆ సమయంలో ఓ నిర్మాత కొడుకుగా నేను ఎంటరయ్యాను. అయినా ఎవరి విమర్శలనీ పట్టించుకోలేదు. హిట్, ఫ్లాప్ గురించీ ఆలోచించలేదు. ఫస్ట్ సినిమాలో నన్ను నేను చూసుకుని ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, నేనెలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు. అబ్రాడ్ నుంచి రావడం రావడమే యాక్టింగ్ మొదలుపెట్టాను. డెరైక్టర్, ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్ ఏం చెబితే అది చేశాను. కొన్ని ఫ్లాపుల తర్వాత స్వర్ణకమలం, ప్రేమ, శ్రీనివాస కల్యాణం లాంటి డిఫరెంట్ మూవీస్‌కి అవకాశం వచ్చింది. దాంతో మంచి పేరొచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు డిఫరెంట్ మూవీస్ చేయడం, ఆడియన్స్ నన్ను అంగీకరించడం... అంతా కూల్‌గా జరిగిపోయింది. సో.. ముందుగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రేక్షకులకే.

 మీ కామెడీ టైమింగ్ బాగుంటుంది.. బేసిక్‌గా మీలో సెన్సాఫ్ హ్యుమర్ ఉందా?
 వెంకటేష్: ఇన్నర్‌గా హ్యుమర్ ఉంటే.. కామెడీ టైమింగ్ బాగా కుదురుతుంది.

 చిన్న వయసులో మాస్ సినిమాలు చేసి, ఆ తర్వాత ప్రేమకథా చిత్రాల్లో నటించారెందుకని?
 వెంకటేష్: రక్తతిలకం, బ్రహ్మపుత్రుడు, కూలీ నెం. 1 ఇలా వరుసగా మాస్, ఆ తర్వాత లవ్‌స్టోరీస్ చేశాను. మాస్ సినిమాలు చేసినప్పుడు ‘మెడ’కు గాయం తగిలింది. అది చాలా సివియర్‌గా ఉండేది. దాంతో మాస్ సినిమాలకన్నా కొంచెం సాఫ్ట్‌గా ఉండేవి చేస్తే బాగుంటుందనుకున్నా. అప్పుడు లవ్‌స్టోరీస్ చేశాను. అవి బాగా ఆడాయి. కాబట్టి.. ఆ గాయం తగలడం కూడా మేలే అయ్యిందని, ఏది జరిగినా అది మన మంచికే అనిపించింది. నాకున్న అనుభవంతో చెబుతున్నా. రిజల్ట్ అనేది 50 శాతం మనం హార్డ్‌వర్క్ చేసినందుకు వస్తుంది. మిగతా 50 శాతం రిజల్ట్ మిస్టీరియస్‌గా వచ్చేస్తుంది. అవతలి హీరోలు బిజీగా ఉన్నప్పుడు, వాళ్లు చేయాల్సిన మంచి సినిమా నాకు వచ్చి ఉండొచ్చు. లేకపోతే మనం ఖాళీగా ఉన్నాం కదా అని మనల్ని ఆ సినిమా కోసం అడిగి ఉండొచ్చు. అందుకే ఏ సక్సెస్ అయినా ‘నాది’ అనుకోను. అది అందరిదీ... ఆ టైమ్‌దీ అనుకుంటాను. ‘నా వల్ల, నేను’ అనే ఆలోచన మైండ్‌కి వస్తే.. మనం అయిపోయినట్లే. అది చాలా డేంజరస్ ఇగో.

 మీకు చిన్నప్పట్నుంచీ ‘ఇగో’ లేదా?
 వెంకటేష్: నిరాడంబరంగా ఉండటం అనేది మా అమ్మానాన్నల జీన్స్ నుంచి సంక్రమించినది. తనో పెద్ద నిర్మాత అని నాన్నగారు ఎప్పుడూ ఫీలవ్వలేదు. అమ్మ చాలా నిరాడంబరంగా ఉంటుంది. నా బ్రదర్, సిస్టర్ కూడా చాలా సింపుల్ పీపుల్. నాది, నేను.. అనే ఆలోచన నాకు రాకపోవడం నా అదృష్టం. ఇంకో విషయం ఏంటంటే.. ఇగో ఉన్నవాళ్లని కూడా నేను నిందించను. ఎవరైనా ఎప్పుడైనా అగ్రెసివ్‌గా బిహేవ్ చేశారనుకోండి.. నేను వాళ్లని కామెంట్ చేయను. అప్పటి తన పరిస్థితి వల్ల, టైమ్ వల్ల, తను నేర్చుకున్న విషయాల ద్వారా అతను అలా చేశాడని అనుకుంటాను. అందుకే నేనెవరి మీద జడ్జ్‌మెంట్ పాస్ చేయను. అలాగే, ఎవరైనా తప్పు చేస్తే.. వెంటనే కాకుండా ఆ తర్వాత రియాక్ట్ అవ్వాలనేది నా సిద్ధాంతం.

 సో.. ఎవరి గురించీ తప్పుగా ఆలోచించరన్నమాట.. అయితే మీరు తప్పులు కూడా చేయరా?

 వెంకటేష్: సాధ్యమైనంతవరకు నేనవెరి గురించీ తప్పుగా ఆలోచించను. ఒకవేళ ఎవరైనా తప్పులు చేసినా.. ఏమో వాళ్లు ఏ పరిస్థితిలో ఉన్నారో అనుకుంటా. ఇక, తప్పులు చేయరా? అనడిగారు. గొప్ప గొప్పవాళ్లూ తప్పులు చేస్తారు. కానీ, ఒక్కోసారి సాదాసీదా వ్యక్తులు కూడా గొప్పగా ఆలోచిస్తారు. అదే జీవితం. కానీ తప్పులు చేయని మానవులు ఉండరు.

 ఓకే.. ఇప్పుడు మళ్లీ ‘ఆధ్యాత్మికత’ విషయానికొద్దాం.. అసలు మీకీ వైపుగా దృష్టి మళ్లడానికి గల కారణం ఏదైనా ఉందా?
 వెంకటేష్: నా సినిమాలు ఘనవిజయం సాధించినప్పుడు కూడా నేను మామూలుగా ఉండేవాణ్ణి. ఏదీ పెద్దగా ఆనందాన్నిచ్చేది కాదు. ఒకానొక దశలో ‘ఏంటి ఇలా ఉంటున్నాం. అన్నిటికీ సమానంగా స్పందిస్తున్నాం. అసలు మనం ఏంటి? మనం ఎవరు?’ అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ ప్రశ్నలు ఆధ్యాత్మిక బాటలో మళ్లేలా చేశాయి. ‘ప్రేమించుకుందాం రా’ సమయంలో ఈ మార్పు మొదలైంది. ఆ ఆధ్యాత్మిక ప్రయాణం అలా నిరాటంకంగా సాగుతోంది.

 జనరల్‌గా ఫిఫ్టీ ప్లస్‌లో ఆధ్యాత్మిక బాటలోకి వెళుతుంటారని అంటుంటారు. కానీ, మీరు చిన్న వయసులోనే ఇటువైపు ఎట్రాక్ట్ అయ్యారు...
 వెంకటేష్: ఆధ్యాత్మికతకు వయసుతో సంబంధం లేదు. మనం అన్ని విషయాల మీద అవగాహన పెంచుకున్న తర్వాత, ‘మనం అనుకున్నదే కరెక్ట్’ అనే భావనలో పడిపోతాం. అప్పుడు ఏ బాటలోనూ అంత సులువుగా వెళ్లలేం. చిన్నపిల్లలను ఓ ఉదాహరణగా తీసుకుందాం. వాళ్లు ఏదైనా త్వరగా నేర్చేసుకుంటారు. ఎందుకంటే, వాళ్లకి ‘నేను’ అనేది తెలియదు. వాళ్ల గురించి వాళ్లు ఒక ఇమేజ్‌లో పడిపోరు. అందుకే ‘నేను’ అనే భావన పెరిగేలోపే ఈ బాటలో వెళ్లాలి. ఎందుకంటే, ఆ తర్వాత వెళ్లలేం. అంతే తప్ప, అన్నీ అనుభవించేసిన తర్వాత చూద్దాంలే అనుకుంటే కరెక్ట్ కాదు.

 ‘ఆధ్యాత్మికం’ అంటారు కానీ, ఆడంబరాలు మాత్రం వదులుకోలేదని మీపై ఓ విమర్శ ఉంది. ఎందుకంటే, మణికొండ ఏరియాలో వైభవంగా ఇల్లు కట్టించుకున్నారు కదా?
 వెంకటేష్: ఆధ్యాత్మికం అంటే నిరాడంబరంగా ఉండాల్సిన అవసరం లేదు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు రాజ్యాలే ఏలారు. వైభవాలను అనుభవించారు. అదే విధంగా అంతర్గతంగా తామేంటో తెలుసుకున్నారు. శాశ్వతం, అశాశ్వతాలకు వ్యత్యాసాన్ని తెలుసుకున్నారు. దీన్నే ‘రాయల్ మిడిల్ పాత్’ అంటాం. ఆధ్యాత్మికం అంటే.. అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోవడం కాదు. నేనిక్కడ పుట్టాను కాబట్టి.. ఇక్కడ ఉండాల్సిందే. ఒకవేళ నేను అడవిలో ఎవరికో పుట్టి ఉంటే.. ఆ పరిస్థితులకు తగ్గట్టు ఉండి ఉండేవాణ్ణి. ఏది దొరికిందో అది యాక్సెప్ట్ చేస్తూ.. అది చేసుకుంటూ వెళ్లడమే. ఆధ్యాత్మిక బాటలో వెళ్లేవాళ్లు సంపాదించకూడదు, వాళ్లకి కుటుంబం ఉండకూడదు అనుకుంటే తప్పు.. ఇవేవీ లేకుండా ఉండాల్సిన అవసరంలేదు. నేనేం సన్యాసిని కాదు కదా.

 మీరిలా ‘నిజం తెలుసుకోవాలి.. నేనెవర్నో తెలుసుకోవాలి’లాంటివి మాట్లాడినప్పుడు మీ ఇంట్లోవాళ్లు భయపడలేదా?

 వెంకటేష్: మొదట్లో భయపడ్డారనుకుంటా! అయితే, ఆ తర్వాత వాళ్లు నా లైఫ్‌స్టయిల్‌ని గమనించారు. హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నానని, చక్కగా సంపాదించుకుంటున్నానని, కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నానని... అర్థం చేసుకున్నాక రిలాక్స్ అయ్యారు.

 మీ నలుగురు పిల్లల దగ్గర ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతుంటారా?
 వెంకటేష్: కొన్ని బోధిస్తాను. గైడ్ చేస్తాను. కానీ, నా అభిప్రాయాలను వాళ్ల మీద రుద్దను. ఇది ‘మెటీరియలిస్టిక్ వరల్డ్’ కాబట్టి.. ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు?లాంటివి చెబుతుంటాను. అలాగే వాళ్ల అనుభవాల ద్వారా కూడా జీవితం మీద అవగాహన కలిగించుకోవాలనుకుంటాను. చెప్పాల్సిన విషయాలు సరైన టైమ్‌లో చెప్పకపోతే ‘అయ్యయ్యో.. అప్పుడు చెప్పి ఉంటే బాగుండేది కదా’ అనుకోవాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు చెప్పాల్సినది అప్పుడు చెప్పెయ్యాలి.

 చిన్నప్పుడు మీరు యాక్ట్ చేశారు కదా.. మరి.. మీ అబ్బాయి (అర్జున్ రామ్‌నాథ్)ని చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎందుకు చేయించలేదు?

 వెంకటేష్: టైమ్ రావాలి. వాడూ ఏదో ఒకటి చేస్తాడు. చూద్దాం.. ఏం చేస్తాడో? ఇప్పుడు వాడికి పదేళ్లు. నేను నిర్మాత కొడుకుని. వాడు స్టార్ కొడుకు. వాడి ఆలోచనలు ఎలా ఉంటాయో చూడాలి. భవిష్యత్తులో తనేం అవుతాడో తనే డిసైడ్ చేసుకుంటాడు.

 మీ పిల్లలు సింపుల్‌గానే ఉంటారా... స్టార్ కిడ్స్ స్టేటస్‌కి తగ్గట్టుగా ఉంటారా?
 వెంకటేష్: వాళ్లు చాలా ‘సింపుల్ చిల్డ్రన్’. నా పిల్లలే కాదు.. ఎవరైనా సరే సింపుల్‌గానే ఉండాలంటాను. నా పిల్లలు ‘వండర్‌ఫుల్’. వాళ్ల వల్ల నాకు, నా భార్యకూ ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.

 మీ పిల్లలను ఎప్పుడూ చూడలేదు కాబట్టి.. వాళ్లల్లో మీ మేనరిజమ్స్ గురించి చెప్పలేం. కానీ, నాగచైతన్య నడక, కొన్ని మేనరిజమ్స్ మీలానే ఉంటాయి. ఓ మేనమామగా మీ ఫీలింగ్?

 వెంకటేష్: వండర్‌ఫుల్ ఫీలింగ్. నాగచైతన్య ‘నైస్ బోయ్’. నా సిస్టర్ (నాగచైతన్య తల్లి లక్ష్మి)కి నేను చాలా క్లోజ్. అలానే చైతన్య! ‘ఐయామ్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్’. ఆ మాటకొస్తే.. ‘ఐయామ్ ఓపెన్ టు ఎవ్రిబడీ’.

 సినిమాలు కాకుండా మీకు నచ్చేవి?
 వెంకటేష్: చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఎందుకంటే, వాళ్లకి కల్లా కపటం తెలియదు. ఇగోలు, ఇండివిడ్యువాలిటీ ఉండవు. అలాంటివాళ్లతో గడపడం నాకిష్టం. పిల్లలు దైవసమానులని నా ఫీలింగ్.

 27ఏళ్ల కెరీర్ గ్రాఫ్ మీది. ఇన్నేళ్లు నిరాటంకంగా కొనసాగడం ఎలా ఉంది?

 వెంకటేష్: ఇదంతా బోనస్సే. ఎందుకంటే, ఏదైనా ఉద్యోగం లేదా వ్యాపారంతో.. ఎంతో కొంత డబ్బు సంపాదించుకునేవాణ్ణేమో. కానీ, దేవుడు నాకు చాలా ఇచ్చాడు. అందుకే ఎప్పుడో శాటిస్‌ఫేక్షన్ వచ్చేసింది.

 మీరెప్పుడూ దేనికీ బానిస అవ్వలేదా?
 వెంకటేష్: ఆధ్యాత్మికతకు బానిస అయ్యాను. ఇప్పుడు ఫర్వాలేదు కానీ.. ఒకప్పుడు ఎప్పుడు ఎక్కడికెళ్లాలనిపిస్తే.. అక్కడికి వెళ్లిపోయేవాణ్ణి. రిషికేష్, హిమాలయాస్... అప్పటికప్పుడు అనుకోవడం... వెళ్లిపోవడం. అంతే. అక్కడికి వెళితే ఏవో నిజాలు తెలుస్తాయని.. జీవిత సత్యాలు తెలుస్తాయని ఆరాటం. కానీ, ఇప్పుడు అది లేదు. కళ్లు మూసుకుని, హిమాలయాలు ముందున్నట్లుగా ఊహించుకోగలను. దేవుడు నా చుట్టుపక్కలే ఉన్నాడని ఊహించగలను. అంత పరిపక్వత వచ్చేసింది.

 మళ్లీ సినిమాల్లోకి వద్దాం... మీరు చేసిన సినిమాల్లో ‘సక్సెస్ రేట్’ ఎక్కువ. కానీ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలతో పోల్చితే మీకు అభిమానుల సంఖ్య తక్కువ. ఎందుకలా?
 వెంకటేష్: ఈ మాట నాతో చాలామంది అంటారు. 99వ రోజున థియేటర్లోంచి తీసేసిన నా సినిమాలు చాలా ఉన్నాయి. అభిమానులు వచ్చి అడిగితే, ‘అభిమానంతో మీరు ఇన్నాళ్లు చూశారు. నాకది చాలు’ అని చెప్పేస్తుంటాను. అంతకుమించి నేను రికార్డ్స్ గురించి ఆలోచించడం కానీ, అభిమానులను ఎంకరేజ్ చేయడం కానీ చేయలేదు. అఫ్‌కోర్స్.. ఇతర హీరోలు అలా చేశారని చెప్పడంలేదు. నేను నా గురించి చెప్పుకుంటున్నాను. ఏదీ శాశ్వతం కాదని నమ్ముతాను కాబట్టి.. రికార్డ్స్ గురించి పెద్దగా పట్టించుకోను. నాకెంతమంది అభిమానులు ఉండాలని రాసిపెట్టి ఉందో అంతమందే ఉంటారు.

 ఈ 16కి రామానాయుడుగారు నిర్మాతగా 50ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు.. మీరేం బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు?

 వెంకటేష్: బహుమతులు ఇచ్చి, పుచ్చుకోవడం మాకు అలవాటు లేదు. ‘ఈరోజు ప్రత్యేకం’ అని నేనెప్పుడూ అనుకోను. అన్ని రోజులూ అలానే ఉంటే ఏం? అనుకుంటాను. కాకపోతే, ఒక్కోసారి సెలబ్రేషన్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. వాటిని కాదనను.

 ఓ పది, పదిహేనేళ్ల తర్వాత రిటైర్‌మెంట్ గురించి ఆలోచిస్తారా?
 వెంకటేష్: ఆలోచిస్తాను. కానీ, ఏదీ మన చేతుల్లో ఉండదని కూడా తెలుసు. అప్పట్లో ఒకసారి శోభన్‌బాబుగారి దగ్గర ‘నాకు రిటైర్ అవ్వాలనే ఆలోచన వస్తోంది’ అన్నాను. కానీ, ఇప్పుడే కాదు... దానికి ఇంకా చాలా టైముంది అన్నారాయన. ఆ తర్వాత ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. ఎందుకంటే, మనం అనుకున్నదేదీ జరగదని నాకు తెలుసు.

 భవిష్యత్తు గురించి ఊహలు, కలలు వేస్ట్ అంటారా?
 వెంకటేష్: వేస్ట్ అనే అంటాను. రేపు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే, ఇవాళ సగం ఎనర్జీని వేస్ట్ చేసుకున్నట్లే. భవిష్యత్తులో ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది. కానీ అనవసరంగా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించి, ఈరోజు సగం ఎనర్జీని వేస్ట్ చేసేసుకుంటాం. అసలు, మనిషికి మనశ్శాంతి తగ్గేది ఎక్కువగా భవిష్యత్తు గురించి ఆలోచించడంవల్లే. అందుకే, ఈరోజుని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి.

 ఫైనల్‌గా... ఓ వ్యక్తిగా మీ జర్నీ గురించి ఏం చెబుతారు?
 వెంకటేష్: వండర్‌ఫుల్ జర్నీ. నా జీవితం గురించి నాకెలాంటి కంప్లయింట్స్ లేవు. ఇటు సినిమా పరిశ్రమ, అటు ప్రేక్షకుల ద్వారా నాకెలాంటి చేదు జ్ఞాపకాలు లేవు. కెరీర్ చాలా స్మూత్‌గా వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. సో.. నాకంతా బోనస్‌లా ఉంది!

- డి.జి. భవాని
 
 అప్పట్లో నా చెయ్యి మెడ దగ్గరకు వెళితే... యూనిట్ అంతా పరార్!
 సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో నాకు కొంచెం కోపం ఎక్కువగా ఉండేది. అయితే అది అప్పటి పరిస్థితి వల్ల. అప్పట్లో నా మెడకు దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తాలూకు ప్రభావం నా మీద చాలా ఉండేది. ఆ ఇరిటేషన్‌లో కోపంగా ఉండేవాణ్ణి. (నవ్వుతూ) అప్పట్లో నా చెయ్యి మెడ దగ్గరకు వెళితే.. యూనిట్ అంతా పరార్. అందులోనూ ఆ రోజుల్లో నాకు తెలుగు సరిగ్గా వచ్చేది కాదు.. నచ్చని సీన్స్ ఒకవైపు, నొప్పి ఒకవైపు, దాంతో సరిగ్గా పెర్‌ఫార్మ్ చేయలేకపోయేవాణ్ణి.  అయితే ఆ కోపం అంతా నా ఆరోగ్య పరిస్థితి వల్లే. అందుకే, అంటాను.. ఎవరికైనా కోపం వస్తే.. ఆ వ్యక్తికి ఎందుకు కోపం వచ్చింది? అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో అని ఆలోచించాలి. అంతేకానీ, తొందరపడి ఆ వ్యక్తి గురించి ఓ నిర్ణయానికి వచ్చేయకూడదు.

                           *************

 కష్టాల్లో ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు చాలామందికి. కానీ, ఎప్పుడూ ఆ దేవుడి గురించి ఆలోచిస్తే.. ఆపదలో ఉన్నప్పుడు వస్తాడు. కష్టాలొచ్చాయి కదా అని గుడికెళితే, ఎందుకు రెస్పాండ్ అవుతాడు? అందుకే, ఆ దేవుడు మనపక్కనే ఉన్నాడని ఎప్పుడూ అనుకోవాలి. ఎక్కడో లేడు.. మనలోనే ఉన్నాడనుకునేంత పరిపక్వత వస్తే.. ఇన్నర్‌గా చాలా బలంగా ఉంటాం.

 ఒక బుక్‌షాప్‌కి వెళ్లారనుకోండి.. త్వరగా డబ్బు సంపాదించడం ఎలా?, సక్సెస్ అవ్వడం ఎలా? అనే పుస్తకాలను కొంటుంటారు. వాటితో పాటు ఆధ్యాత్మికతకకు సంబంధించిన బుక్స్ కూడా కొనుక్కోవచ్చు కదా. కొంచెం జ్ఞానం సంపాదించుకుంటే ఏం పోతుంది? ఆధ్యాత్మిక సైడ్ వెళ్లిపోతే బద్ధకించేస్తాం. పనీ పాటా చెయ్యం అని కొంతమంది ఊహిస్తారు. అది తప్పు. ఈ బాటలో వెళ్లడంవల్ల ఇంకా షార్ప్ అవుతాం. నన్ను తీసుకోండి.. హాయిగా సినిమాలు చేసుకుంటున్నాగా.. బాగానే సంపాదిస్తున్నాగా.

 మనం అవతలివాడి గురించే ఎక్కువ ఆలోచిస్తాం. వాడికి సలహా ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఈ ప్రపంచంలో వచ్చే సమస్యలన్నీ ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడంవల్లే అని నా అభిప్రాయం.

 మొదట్లో ఏడుపు సీన్స్‌లో చేసేటప్పుడు... చిన్నప్పుడు చనిపోయిన నా ఫ్రెండ్‌ని తల్చుకునేవాణ్ణి. అప్పుడప్పుడు ఎస్వీ రంగారావుగారు, కైకాల సత్యనారాయణగారు, కమల్‌హాసన్‌గారిలాంటివాళ్లు చేసిన ఎమోషనల్ సీన్స్‌ని గుర్తు చేసుకుంటుంటాను.

                                   **************

 ‘చంటి’ చేసేటప్పుడు చాలామంది నవ్వారు. ‘పాపం మీవాడు రిస్క్ తీసుకుంటున్నాడు’ అని నాన్నగారితో అన్నారు. అందరూ ఇలా అంటున్నారేంటి? అని నేను కూడా కొంచెం సందేహపడ్డాను. అద్దం ముందు నిలబడి, సైడ్ పాపిడి తీసి, మొహానికి చిన్న బొట్టు పెట్టుకుని, అమాయకంగా మొహం పెట్టి, చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ ట్రై చేసేవాణ్ణి. ‘బాగానే ఉంది కదా’ అనిపించి, ఆ సినిమా చేయడానికే నిర్ణయించుకున్నాను. ఓ నమ్మకంతో ‘చంటి’ చేశాను. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు.

 కొత్త తరంవారికి నా బొబ్బిలి రాజా, ప్రేమించుకుందారా, రాజా సినిమాలు తెలియదు.  ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటివే తెలుసు. పదేళ్లలోపు పిల్లలు కూడా నన్ను ‘పెద్దోడు’ అంటున్నారు. సో.. న్యూ జనరేషన్‌కి రీచ్ అవుతున్నానని ఆనందంగా ఉంది.
 అసలు తను మనలోనే ఉన్నాడని చాలామంది అర్థం చేసుకోవడంలేదు. దేవుణ్ణి మనం బయటపెట్టుకుంటే తను అక్కడే ఉండిపోతాడు. లోపలికి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. మానవులు ఎప్పుడూ ఏదో కోరుతుంటారని దేవుడు పైకి వెళ్లిపోయాడు. అక్కడున్నా మానవులు వదల్లేదు. ఆ తర్వాత నీళ్ల లోపలకి కూడా వెళ్లిపోయాడు. అక్కడా వదిలిపెట్టలేదు. ఇక లాభం లేదని, ఇంతకంటే సేఫ్ ప్లేస్ లేదని మనలోనే ఉండిపోయాడు. అది తెలుసుకోలేక మనం బయట వెతుకుతున్నాం. అదే మనలోనే ఉన్నాడని గ్రహిస్తే... దేవుడు మనవాడే అనే ఫీలింగ్ కలుగుతుంది. మనం ‘గాడ్ ఫియరింగ్ నుంచి గాడ్ లవింగ్ అవ్వాలి’. అప్పుడు ఇక, మనకేం భయం లేదనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది.

Tags: venkatesh, venkatesh biography, venkatesh movies, venkatesh life history.

Link:
http://www.sakshi.com/news/family/exclusive-interview-with-victory-venkatesh-79507?pfrom=home-top-story
00:46 - By Swathi 0

Saturday, 26 October 2013

Kovai Sarala

భర్త, పిల్లలు, హాబీలు.. అన్నీ సినిమానే..!


హైదరాబాద్ : ఆడవాళ్లకు సినిమా పరిశ్రమలోనే కాదు,
 దేవాలయాల్లాంటి ప్రదేశాలలో కూడా
 చేదు అనుభవాలు ఎదురౌతున్నాయి.
  - కోట్ బై కోవై సరళ
 ‘ప్రేమించడం హత్య చేసినంత మహా పాపం’.
 - కోట్ బై కోవై సరళ
 జీవితంలో ఎవరూ ఎవరి మీదా ఆధారపడకూడదు.
 - కోట్ బై కోవై సరళ
 సినిమాలే నా లైఫు, పర్సనల్ లైఫూ.
 - కోట్ బై కోవై సరళ
  కోట్ బై అని అంతా చెప్పుకునే స్థాయిలో
 చాలా పెద్ద జీవితాన్ని చూశారు కోవై సరళ!
 సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లోనే...
 జీవితం ఆమెను రెండు వైపుల నుంచి నొక్కేసింది!
 ఏం చెప్పినా చిటికెలో చేసేస్తుంది - ఒకవైపు
 ఆ అమ్మాయి ఉంటే మేం చెయ్యం - రెండో వైపు.
 ఇవాళ పిలిచి అడ్వాన్స్ ఇచ్చేవాళ్లు - ఒకవైపు
 మర్నాడు ఫోన్ చేసి ఇచ్చేయ్‌మనేవాళ్లు - రెండో వైపు.
 ఇంకా... ఇలాంటివే చాలా, చాలా, చాలా.
 అన్నిటినీ తట్టుకుని నిలబడ్డారు కోవై సరళ.
 ఈవారం ‘తారాంతరంగం’ చదవండి.
 అవడానికి కమెడియనే అయినా...
 ఆమె ప్రతి అనుభవంలో మీకు హీరోయినే కనిపిస్తుంది!
 ఎస్.
 వడివేలును కుమ్మినట్లు...
 పరిస్థితులతో తలపడి నిలబడిన ప్రతి స్త్రీ... హీరోయినే.

  సరళగారూ... మీ ఇంటి పేరు కోవైనా?
 కోవై సరళ: కాదు. మా తమిళంవాళ్లకి ఇంటి పేర్లుండవు. నాన్నగారి పేరు ఇంటిపేరు అవుతుంది. మా సొంత ఊరు కోయంబత్తూర్. ఆ సిటీని ‘కోవై’ అని పిలుస్తారు. ఆ ఊరినుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి, పత్రికలవాళ్లు కోవై సరళ అని రాయడం మొదలుపెట్టారు. దాంతో  అది పాపులర్ అయిపోయింది.

 అయితే  పుట్టి పెరిగిందంతా కోయంబత్తూర్‌లోనేనా?
 కోవై సరళ: అవును. నా బాల్యం, చదువూ అంతా అక్కడే. ప్లస్ టూ వరకూ చదివా. ఇంగ్లిష్, తమిళ్‌లో టైప్‌రైటింగ్ హయ్యర్ పాసయ్యాను. అప్పట్లో నేను టైప్ చేస్తుంటే.. అందరూ ఆశ్చర్యంగా చూసేవాళ్లు. అంత స్పీడ్ అన్నమాట. నాకు చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ఇష్టం. ప్లస్ టు తర్వాత సినిమాల్లోకి వెళదామనుకున్నాను కానీ ఇంట్లో ఒప్పుకోలేదు.

 మీ నాన్నగారు ఏం చేసేవారు?
 సరళ: లారీలు, బస్సులు ఉండేవి. ఆ బిజినెస్‌లో నష్టం వచ్చిన తర్వాత ఆయన ఓ ప్రైవేట్ ఉద్యోగంలో చేరారు. మా నాన్న మిలిటరీలో కూడా చేశారు. దాంతో స్ట్రిక్ట్‌గా ఉండేవారు. చిన్న పనైనా ఓ పద్ధతి ప్రకారం చేయాలనేవారు. సినిమాలకు వెళ్లనిచ్చేవారు కాదు. స్కూల్, ఇల్లు, టైప్‌రైటింగ్ క్లాస్ తప్ప వేరే ప్రపంచం తెలియదు.

 మీకు బ్రదర్స్, సిస్టర్స్ ఉన్నారా?
 సరళ: నలుగురు అక్కయ్యలు, ఓ అన్నయ్య. నాన్నగారు స్ట్రిక్ట్ అయినప్పటికీ నాకేదైనా కావాలంటే మారాం చేసి, మంకు పట్టు పట్టి మరీ సాధించుకునేదాన్ని. డ్రామాల్లో అయినా యాక్ట్ చేయనివ్వాలంటూ స్ట్రైక్ చేశాను. అయినా నాన్న మనసు కరగలేదు. దాంతో ఓ రోజంతా ఉపవాసం ఉన్నాను. ఇక, లాభం లేదనుకుని అనుమతించారు. ఒక డ్రామాలో యాక్ట్ చేశా. భలే అనిపించింది. అమ్మానాన్నను బతిమాలుకుని ఎలాగోలా 20 డ్రామాల్లో యాక్ట్ చేసేశాను. డ్రామాల ద్వారా సంపాదించిన అనుభవంతో సినిమాల్లో యాక్ట్ చేయొచ్చన్నది నా అభిప్రాయం.

 మరి... సినిమాల్లోకి రావడానికి ఎంత పెద్ద స్ట్రయిక్ చేశారేంటి?
 సరళ: లక్కీగా అలా చేయాల్సిన అవసరంలేదు. డెరైక్టర్ భాగ్యరాజాగారి ఇల్లు మా ఇంటి పక్కనే. నేను చిన్నప్పట్నుంచీ ఆయనకు తెలుసు. ‘‘పెద్దయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు?’’ అని ఆయన అడిగితే.. ‘సినిమా యాక్టర్’ అవుతా అనేదాన్ని. సినిమాల్లోకి రాకముందు భాగ్యరాజాగారు డ్రామాలు వేసేవారు. సినిమా డెరైక్టర్ అయిన తర్వాత, మా నాన్నగారికి ఆరోగ్యం బాగా లేకపోతే భాగ్యరాజాగారు చూడ్డానికి వచ్చారు. నన్ను చూసి, ‘‘ఏం చేస్తున్నావ్’’ అనడిగితే, ై‘టెప్‌రైటింగ్’ చేస్తున్నా అని చెప్పాను. ‘‘నేను ‘ముందానై ముడిచ్చు’ అనే సినిమా చేస్తున్నా. గోపిచెట్టిపాల్యంలో షూటింగ్ జరుగుతోంది. అక్కడికొస్తే, నీకు మంచి కేరక్టర్ ఇస్తాను’’ అన్నారాయన. చెప్పింది భాగ్యరాజాగారు.. పైగా సినిమాల మీద నా పిచ్చి బాగా ముదిరిందని గ్రహించి, పెద్దగా బతిమాలించుకోకుండానే అమ్మానాన్న పర్మిషన్ ఇచ్చారు. దాంతో హుషారుగా కోయంబత్తూర్ టు గోపిచెట్టిపాల్యం బస్సెక్కేశా.

 ఫస్ట్ టైమ్ షూటింగ్ ఎలా అనిపించింది?
 సరళ: అప్పటివరకు నాది చాలా చిన్నప్రపంచం. లొకేషన్లో చాలామందిని చూసి, ఆశ్చర్యం అనిపించింది. కానీ భయపడలేదు. యాక్టింగ్ అంటే ఇంట్రస్ట్ కాబట్టి, తడబడకుండా చేసేశాను. ‘ముందానై ముడిచ్చు’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

 వెంటనే బోల్డన్ని అవకాశాలు వచ్చి ఉంటాయేమో?
 సరళ: ఫలానా కేరక్టర్ చేసింది ఎవరు? అంటూ కొంతమంది దర్శక, నిర్మాతలు ఆరా తీశారు. అయితే నేను ‘ముందానై ముడిచ్చు’ సినిమా చేసి, కోయంబత్తూర్‌లోనే ఉండిపోయాను. అందుకని, నన్ను కాంటాక్ట్ చేయలేకపోయారు. ఆరు నెలలు గడిచిన తర్వాత ఇలా అయితే లాభం లేదనుకుని మద్రాసు వెళ్లాలని నిర్ణయించుకున్నా.

 ఊరు కాని ఊరికి పంపించడానికి ఇంట్లోవాళ్లు భయపడలేదా?
 సరళ: నాతో పాటు నాన్నగారు కూడా వచ్చారు. మద్రాస్‌లోని తేనాంపేటలో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాం. ఇక, నేను మద్రాసు వచ్చానని తెలుసుకుని, చాలామంది అప్రోచ్ అయ్యారు. ‘కళ్యాణరామన్’, ‘ఉయిరే ఉనక్కాగ’... ఇలా నేను చేసిన సినిమాలన్నీ వంద రోజులాడటం, నా కామెడీ నచ్చడంతో పాపులర్ అయ్యాను.

 అసలు సినిమాల మీద మీకు ఇష్టం ఏర్పడటానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
 సరళ: నేను ఎమ్జీఆర్‌కి వీరాభిమానిని. ఇంట్లో సినిమాలు చూడనిచ్చేవాళ్లు కాదని చెప్పాను కదా. అప్పుడప్పుడు గొడవపడో, బతిమాలుకునో ఎమ్జీఆర్ సినిమాకెళ్లేదాన్ని. తెరపై ఆయన కనిపించగానే అభిమానులు విజిల్స్ వేయడం, ఆరాధనగా చూడటం భలే అనిపించేది. మనం కూడా సినిమా ఆర్టిస్ట్ అయితే అలానే చూస్తారుగా అనుకునేదాన్ని. సో.. నేను ఆర్టిస్ట్ అవాలనుకోవడానికి ఓ కారణం ఎమ్జీఆర్ అనే చెప్పాలి.

 అది సరే... ఎవరైనా హీరోయిన్ అవ్వాలనుకుంటారు... మీరు కామెడీనే ఎందుకు టార్గెట్ చేశారు?
 సరళ: నా టార్గెట్ హీరోయినా, కమెడియనా, కేరక్టర్ ఆర్టిస్టా? అని కాదు. స్క్రీన్ మీద నా మొహం కనిపిస్తే చాలనుకున్నాను. పబ్లిక్‌లో కనిపించినప్పుడు ‘అదిగో కోవై సరళ...’ అని నన్ను గుర్తుపడితే ఈ జన్మ సార్ధకమైనట్లు అనుకునేదాన్ని. ఒకవేళ నేను హీరోయిన్‌కి టార్గెట్ చేసి, పరిస్థితుల ప్రభావం వల్ల కామెడీతో సరిపెట్టుకోవాల్సి వస్తే... చాలా అప్‌సెట్ అయ్యుండేదాన్ని.

 మీరు రంగప్రవేశం చేసే నాటికి కమెడియన్‌గా, కేరక్టర్ ఆర్టిస్ట్‌గా మనోరమ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. మరి... మీకేమైనా అభద్రతాభావం, భయం ఉండేవా?
 సరళ: నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ. సీన్ ఇలా చెప్పగానే అలా చేసేదాన్ని. చెట్లెక్కమంటే ఎక్కేసేదాన్ని, పై నుంచి దూకమంటే అమాంతంగా దూకేసేదాన్ని. దాంతో కోవై సరళ ఏం చెప్పినా, చిటెకెలో చేసేస్తుందని ప్రచారం జరిగింది. అలాగే నేను చేసే కామెడీ కూడా ప్రేక్షకులకు నచ్చడంతో అవకాశాలకు కొదవ ఉండేది కాదు. అందుకే, మనం పెట్టే బేడా సర్దుకుని కోయంబత్తూర్ వెళ్లాల్సి వస్తుందేమోననే భయం ఉండేది కాదు.

 మనోరమ.. ఆ తర్వాత మీరు... మీ తర్వాత పెద్దగా హాస్యనటీమణులు రాణించకపోవడానికి కారణం ఏంటి... మగవాళ్లల్లో చాలామంది కమెడియన్లు ఉన్నారు కదా?
 సరళ: తమిళ పరిశ్రమకు సంబంధించినంతవరకు మగవాళ్ల డామినేషన్ ఉంటుంది. లేడీస్‌కి తక్కువ ప్రోత్సాహం ఉంటుంది. అందుకే, మా తర్వాత లేడీ కమెడియన్స్ షైన్ అవలేదు. ఒకరిద్దరు వచ్చినా, పూర్తిగా ఇన్‌వాల్వ్ అవ్వలేకపోయారు. ఒకవేళ ఇన్‌వాల్వ్ అయినా ఎంకరేజ్‌మెంట్ లభించలేదు.

 నిజం చెప్పండి... ఇక్కడ మీకేమైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయా?
 సరళ: నన్ను పైకి రానివ్వకుండా చేయాలని కొంతమంది ట్రై చేశారు. ‘ఆ అమ్మాయి ఉంటే మేం సినిమా చెయ్యం’ అని నిర్దాక్షిణ్యంగా చెప్పేవాళ్లు. దాంతో నాకు కొన్ని అవకాశాలు పోయేవి.

 అలా చేసినవాళ్లెవరు?... ఆ డామినేషన్‌ని తట్టుకోవడానికి మీరేం చేసేవారు?
 సరళ: పేర్లు చెప్పను. నేను కామెడీ ఆర్టిస్ట్‌ని కాబట్టి, నా అవకాశాల విషయంలో హీరోల జోక్యం ఉండదు కదా. కొంతమంది కమెడియన్లే నాతో యాక్ట్ చేయకూడదనుకునేవాళ్లు. అయినా నా పని నేను చేసుకునేదాన్ని. ఓ పది సినిమాలు చేతిలో ఉన్నప్పుడు ఒకటీ రెండు సినిమాలు పోతే ఏమవుతుంది?

 అడ్వాన్స్ తీసుకున్న తర్వాత కూడా వెనక్కి వెళ్లిన అవకాశాలు ఉన్నాయా?
 సరళ: చాలా ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం వెయ్యి రూపాయలంటే పెద్ద విషయం. అప్పట్లో నేనో సినిమా కమిట్ అయ్యానంటే, వెయ్యిరూపాయలు అడ్వాన్స్ ఇచ్చేవారు. అయితే కొంతమంది కమెడియన్లు నేనుంటే.. యాక్ట్ చెయ్యనని చెప్పేయడంతో ఇచ్చిన అడ్వాన్స్‌ని వెనక్కివ్వమని అడిగేవాళ్లు. ఒక సినిమాకి అవకాశం వస్తే.. సంతోషంతో నాకా రోజంతా నిద్రపట్టేది కాదు. కానీ, ఉదయమే అడ్వాన్స్ వెనక్కివ్వమని ఫోన్ రావడమో, డెరైక్ట్‌గా మనిషి రావడమో జరిగేది. అప్పుడు బాగా ఏడ్చేదాన్ని. ఆ సమయంలో మా నాన్నగారు ఇచ్చిన ధైర్యాన్ని నేనెప్పటికీ మర్చిపోలేదు. ‘మనకేది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. నీకు టాలెంట్ ఉంది’ అంటూ ఊరడించేవారు. నాన్న ముందు కన్విన్స్ అయ్యేదాన్ని కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చేదాన్ని.

 ఆ బాధలో బ్యాక్ టు కోయంబత్తూర్ అనే నిర్ణయం ఎప్పుడైనా తీసుకున్నారా?
 సరళ: అంత పిరికిగా ఆలోచించలేదు. బాధపడుతూ ఇంట్లో కూర్చునేంత ఖాళీ ఉండేది కాదు. పైగా నేను చేసేది కామెడీ కాబట్టి.. షూటింగ్‌కి వెళ్లగానే బాధ తగ్గేది. అలాగే, ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. హాస్యనటుల కెరీర్ మహా అయితే 10, 15 ఏళ్లు ఉంటుంది. వాళ్లతో పోల్చితే నటీమణుల కెరీర్‌కి ఎక్కువ స్పాన్ ఉంటుంది. అందుకు ఉదాహరణ నా 30 ఏళ్ల కెరీరే. నా కళ్లముందే ఎంతోమంది మగ కమెడియన్లు వచ్చారు.. వెళ్లారు. కానీ, నేను మాత్రం అలానే ఉన్నాను. ఎంతమంది కమెడియన్లు వచ్చినా.. వాళ్లకి దీటుగా నిలబడగలననే విషయం నాకు చాలా త్వరగానే అర్థమైంది. దాంతో నా వెనక గోతులు తవ్వినా పట్టించుకునేదాన్ని కాదు. మహా అయితే నాలుగైదేళ్లు ఇతను ఉంటాడేమో.. కానీ మనకు లాంగెవిటీ ఉంటుందనే ఆత్మవిశ్వాసంతో ఉండేదాన్ని. అదే నిజమైంది.

 హాస్యనటుల కెరీర్ పదేళ్లే అని ఎలా అంటున్నారు... కోట, బ్రహ్మానందం, బాబుమోహన్, అలీ.. ఇలా చాలామంది ఏళ్ల తరబడి ఏలుతున్నారు కదా?
 సరళ: నేను చెప్పింది తమిళ పరిశ్రమ గురించి. నాకు తెలిసి తెలుగులో డెరైక్టర్, ప్రొడ్యూసర్, రైటర్స్ సెలక్ట్ చేసిన కమెడియన్లనే ఎన్నుకుంటున్నారనిపిస్తోంది. తమిళంలోలా ‘నేను కోవై సరళతో యాక్ట్ చేయను’ అని చెప్పే కమెడియన్లు ఇక్కడ లేరు. అందుకే, నాకిక్కడ అవకాశాలొస్తున్నాయి.

 ఇలాంటి పరిస్థితిలో ‘సతీలీలావతి’లో మిమ్మల్ని కమల్‌హాసన్ హీరోయిన్‌గా ఎంపిక చేసినప్పుడు ఎలా అనిపించింది?
 సరళ: ఆయన సినిమాలో నేను కామెడీ కేరక్టర్స్ చేశాను.ఆ విధంగా కమల్‌తో  నాకు మంచి అనుబంధం ఉంది. నా మేనేజర్ వచ్చి ‘కమల్‌సార్ సరసన మీరు హీరోయిన్‌గా నటించాలి’ అన్నాడు. జోక్‌లేసి నవ్వించే నాకే జోక్ చెబుతున్నావా? అనడిగాను. ‘కాదు మేడమ్.. సీరియస్‌గానే చెబుతున్నా’ అనడంతో నమ్మకం కుదిరింది. ఆ సినిమా ఓ మర్చిపోలేని మంచి అనుభవం.

 మీకు బాగా పేరొచ్చాక కూడా, మిమ్మల్ని తొక్కాలని ఎవరైనా ప్రయత్నించారా?
 సరళ: ప్రయత్నించారు. అయితే నాకు పేరొచ్చేసింది కాబట్టి... మొహం మీద చెప్పేవాళ్లు కాదు. లేడీ కమెడియన్‌గా ఎవరు చేస్తున్నారు? అని అడిగి, ‘ఆవిడా.. అయితే మా డేట్స్ ఖాళీగా లేవు’ అని చెబుతుంటారు. ఆ విధంగా ఎవరెవరు చెబుతున్నారో నాకర్థమయ్యింది. అందుకని, నిర్మాతలను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక, ‘ముందు ఆ ఆర్టిస్ట్ దగ్గర డేట్స్ ఓకే చేయించుకోండి. ఒకవేళ ఆయన ఇస్తే.. నాకేం అభ్యంతరం లేదు’ అని చెబుతుంటాను. కానీ, ఆ నిర్మాతలు ఆ తర్వాత నాతో టచ్‌లోకి రారు. అది నేనూహించిందే కాబట్టి, నవ్వేసి ఊరుకుంటాను.

 ఎందుకని మీరంటే ఆ ‘కొంతమంది ఆర్టిస్ట్’లకు పడదు?
 సరళ: ఒకవేళ యాక్టింగ్‌లో డామినేట్ చేస్తాననో లేక వాళ్లకి ఈక్వల్‌గా యాక్ట్ చేస్తున్నాననే ఫీలింగ్ వల్లో... లేకపోతే ఇంకా ఏమైనా కారణాలున్నాయేమో నాకు తెలియదు.

 జనరల్‌గా సినిమా నిడివి ఎక్కువైతే.. కత్తెర పడేది దాదాపు కమెడియన్ల పాత్రలకే. మీ విషయంలో అలా జరిగిన సందర్భలున్నాయా?
 సరళ: లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. ఈ పాత్ర మనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఓ నమ్మకంతో చేసి, ఆ సినిమా విడుదల కోసం బాగా ఎదురు చూసేదాన్ని. కానీ, సినిమా నిడివి పెరిగినందున నా పాత్ర నిడివి ఆటోమేటిక్‌గా తగ్గిపోయేది. దాంతో రావాల్సినంత పేరు వచ్చేది కాదు. అప్పుడు చాలా నిరుత్సాహపడేదాన్ని. కొన్ని ఎదురు దెబ్బలు మనకు మంచి పాఠాలవుతాయి. ఆ పాఠాలు మన దిశను నిర్దేశిస్తాయి. ఆ విధంగా సినిమాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే నేను ఎంచుకున్న దిశ ‘ఆధ్యాత్మికం’.

 ఏ వయసులో ఈ దారిని ఎంచుకున్నారు?
 సరళ: అది కరెక్ట్‌గా చెప్పలేను. చిన్నప్పట్నుంచే నా ఆలోచనలు ఆధ్యాత్మికంగా ఉండేవి. అయితే ఆ వయసులో దాని పేరు ఆధ్యాత్మికం అని తెలిసే అవకాశం లేదు కదా. పెద్దయిన తర్వాత వివేకానంద, ఓషో పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. ఆధ్యాత్మికతకు సంబంధించిన క్లాస్‌లకు వెళ్లేదాన్ని. ‘జీవితం నిరంతరం కాదు. ఎప్పటికైనా మట్టిలో కలవాల్సిందే. ఈ రోజు ఉన్నాం. రేపు ఉంటామో లేదో తెలియదు. అందుకని ఈరోజు నవ్వుతూ, హాయిగా ఉందాం. చుట్టుపక్కలవాళ్లని సంతోషపెడదాం’ అనేంత మానసిక పరిపక్వత నాలో రావడానికి కారణం ఆ పుస్తకాలే.

 ఓషో ద్వారా ఇంకా ఎలాంటివి తెలుసుకున్నారు?
 సరళ: ఉదాహరణకు చెయ్యి మీద పెద్ద దెబ్బ తగిలిందనుకుందాం. ‘రక్తం కారుతోంది’ అని మాత్రం అనుకుంటే, నొప్పి తెలియదు. బాగా నొప్పిగా ఉంది అనుకుంటే, నొప్పి తెలుస్తుంది. అసలు నొప్పే లేదనుకుంటే, నిజంగానే నొప్పి తెలియదు. నేనిది టెస్ట్ చేసి చూసుకున్నా. ఓషో బుక్స్ వల్ల దేన్నయినా తేలికగా తీసుకునే పరిపక్వత వచ్చేసింది.

 తెలుగులో మీ పాత్రలకు ఎంచక్కా డబ్బింగ్ చెప్పేస్తున్నారు. అసలు తెలుగు ఎలా నేర్చుకున్నారు?
 సరళ: నా డైలాగులన్నీ తమిళంలో రాసుకుని, బట్టీపట్టి లొకేషన్లో చెప్పేస్తుంటాను. తెలుగులో నేను డబ్బింగ్ చెప్పడానికి మొదటి కారణం కోడి రామకృష్ణగారు. ‘పెళ్లాం చెబితే వినాలి’ అప్పుడు ఆయన డబ్బింగ్ చెప్పమన్నారు.. ఆ సినిమాకి కో-డెరైక్టర్‌గా చేసిన రాధాకృష్ణ దగ్గరుండి మరీ నాతో డబ్బింగ్ చెప్పించారు. నాకు బాగానే పేరొచ్చింది.. కానీ నాతో డబ్బింగ్ చెప్పించి, ఆయనకు చుక్కలు కనిపించాయి (నవ్వుతూ). తెలుగు మాట్లాడటానికి నేను ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. తమిళ్ ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడేస్తాను. ఆ శ్లాంగ్ అందరికీ నచ్చడం నా లక్.

 మీ సినిమాల్లో కమెడియన్స్‌ని ఫుట్‌బాల్ ఆడేస్తుంటారు. అసలు ఈ కొట్టడం అనేది ఎవరితో మొదలైంది?
 సరళ: వడివేలుతో మొదలుపెట్టా. అది బాగా పండటంతో అప్పట్నుంచి నాతో కొట్టించడం ఆనవాయితీ అయ్యింది.

 ఈ కొట్టే ప్రక్రియ ఓవర్‌గా ఉంటుందనే విమర్శ ఉంది...?
 సరళ: ఏ కొద్దిమందో అంటున్నారేమో. కానీ, మొగుడూ పెళ్లాలూ కొట్టుకోవడం నేను రోడ్డు మీద చాలా చూశాను. మందు కొడితే చాలు.. మృగంలా మారిపోయి, భార్యలను రోడ్డు మీద కొట్టే మగవాళ్లను స్వయంగా చూశాను. అది తట్టుకోలేక తిరగబడ్డ ఆడవాళ్లనూ చూశాను. నేను కొట్టడం ఓవర్ అని మీరంటున్నారు. కానీ, చాలామంది ఆడవాళ్లు.. ‘‘మేడమ్... మీరే మాకు ఇన్‌స్పిరేషన్. మా మగవాళ్లు అడ్డదిడ్డంగా బిహేవ్ చేసినప్పుడు ‘కోవై సరళలా మారతాం... జాగ్రత్త అని బ్లాక్‌మెయిల్ చేస్తుంటాం’’ అంటుంటారు. మగవాళ్లకు నా మీద కోపం ఉంటుందేమో. కానీ, ఆడవాళ్లు తమను తాము రక్షించుకోవడం కోసం నా పేరు వాడుకోవడం నాకు బాగానే అనిపిస్తోంది.

 కొంచెం ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే... సినిమా పరిశ్రమలో ఆడవాళ్లు చాలా విషయాల్లో రాజీపడాలంటారు. హీరోయిన్ నుంచి కామెడీ ఆర్టిస్ట్‌ల వరకూ ఇది వర్తిస్తుందా?
 సరళ: హీరోయిన్ల నుంచీ కామెడీ ఆర్టిస్ట్‌ల వరకు కాదు.. జూనియర్ ఆర్టిస్టులకూ ఇది వర్తిస్తుంది. అయితే ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. మన దగ్గర బిర్యానీ తినడానికి డబ్బులు లేకపోతే పచ్చడి మెతుకులతో సరిపెట్టుకోవాలనుకుంటే.. ఏ విషయంలోనూ రాజీపడాల్సిన అవసరంరాదు. కానీ, బిర్యానీయే తినాలనుకుంటే మాత్రం రాజీ పడాలి.

 రాజీపడకపోతే.. అవకాశాలు రావంటారు?
 సరళ: ఒకట్రెండు సినిమాలు పోతాయేమో. దానికే కంగారుపడిపోతే రాజీపడాలనే ధోరణి మొదలవుతుంది. కానీ, మనకు రావాలని రాసి పెట్టి ఉంటే, వచ్చే అవకాశాలను ఎవరూ ఆపలేరు. నాకు చాలా సినిమాలు మిస్ అయ్యాయి. అయినా డోంట్ కేర్ అన్నట్లుగానే వ్యవహరించాను. ఆడవాళ్లకు సినిమా పరిశ్రమలోనే కాదు.. దేవాలయాల్లాంటి స్కూల్స్, కాలేజ్‌లు, హాస్పిటల్స్‌లో కూడా చేదు అనుభవాలు ఎదురవుతాయి. వాటి నుంచి తప్పించుకునే నేర్పు ఉంటే, సేఫ్‌గా వెళ్లిపోవచ్చు.

 ఇక... మీ తోడబుట్టినవాళ్లతో మీ అనుబంధం గురించి?
 సరళ: నా అక్కయ్యల పిల్లలు నా దగ్గరే పెరిగారు. అందర్నీ చదివించాను. ఒకబ్బాయి దుబాయ్‌లో, ఇద్దరు యూఎస్‌లో, ఒకరు లండన్‌లో... ఇలా అందరూ మంచి జాబ్స్‌లో సెటిలయ్యారు.

 మీ నలుగురు అక్కలు చక్కగా పెళ్లి చేసుకుని, సెటిలయ్యారు.. మీకెప్పుడూ పెళ్లి చేసుకోవాలనిపించలేదా?
 సరళ: పెళ్లి గురించి ఆలోచించలేనంత బిజీగా ఉండేదాన్ని. సినిమాలు తప్ప నా పర్సనల్ లైఫ్ ఇలా ఉండాలని ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. పైగా సమాజంలో ఎన్నో విడాకుల కేసులు చూశాను. ఇక పెళ్లెందుకు అనిపించేసింది.

 అమ్మానాన్న పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయలేదా?
 సరళ: పెళ్లి చేసుకో అన్నారు. ఇష్టం లేదంటే, వదిలేశారు. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ అని చెప్పాను కదా. స్కూల్‌కి వెళ్లేటప్పుడు వంచిన తల ఎత్తకూడదు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ఇలా ఓ స్ట్రిక్ట్ వాతావరణంలో పెరిగినందువల్లో ఏమో నాకు ప్రేమ మీద కూడా దృష్టి మళ్లలేదు. ఒకవేళ అప్పట్లో ఎవరితోనైనా ప్రేమలో పడి ఉంటే, పెళ్లి చేసుకుని ఉండేదాన్నేమో. కానీ, నేను లవ్‌కి ఆపోజిట్. ప్రేమించడం అనేది హత్య చేసినంత మహా పాపం అని నా మనసులో బలంగా ముద్రించుకుపోయింది.

 మరి.. మీకు ఎవరూ ‘ఐ లవ్ యు’ చెప్పలేదా?
 సరళ: నన్ను చూసి ఎవరైనా ‘ఐ లవ్ యు’ చెబుతారా? నేను చేసిన కేరెక్టర్ల ప్రభావం నా జీవితం మీద కూడా పడి ఉంటుందేమో. సినిమాల్లో సహ నటులను ఓ రేంజ్‌లో కొట్టే నేను నిజజీవితంలో కూడా అలానే ఉంటాననుకుని ఉండొచ్చు. అందుకని, ఎవరూ నాకు ప్రపోజ్ చేయలేదు.

 వయసులో ఉన్నంతవరకూ ఓకే. కానీ, వయసు మీద పడిన తర్వాత ఓ తోడు ఉండాలంటారు కదా?
 సరళ: పుట్టినప్పుడు మనం ఒంటరిగానే పుడతాం. ఇది మీ అమ్మ.. ఇది నాన్న... వీళ్లు నీ అక్క, చెల్లెళ్లు అని ఎవరో ఒకరు చెబితేనే మనకు తెలుస్తుంది. దాంతో ‘మనవాళ్లు’ అనే భావన మొదలవుతుంది. పెరిగే కొద్దీ అనుబంధం బలపడుతుంది. కానీ, పెళ్లి చేసుకున్న తర్వాత ‘నా కుటుంబం’ అనే భావన మొదలవుతుంది. అప్పుడు తోబుట్టువుల మీద కొంత ప్రేమ తగ్గుతుంది. అలా మెల్లి మెల్లిగా దూరం పెరిగిపోతుంది. ఒకవేళ పెళ్లి చేసుకున్నామే అనుకోండి. భర్త చనిపోతే ఒంటరిగా బతకాల్సిందేగా. అందుకే నేను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయా. నా దృష్టిలో జీవితంలో ఎవరూ ఎవరి మీదా ఆధారపడకూడదు.

 పెళ్లి చేసుకున్న తర్వాత తోడబుట్టినవాళ్లతో అనుబంధాలు తగ్గుతాయన్నారు. మీవాళ్లు ఆ జాబితాకి చెందినవారేనా?
 సరళ: ఎంతో కొంత ఆ జాబితాకే చెందుతారు. పెళ్లయిన తర్వాత వాళ్లల్లో మార్పొచ్చింది. ‘నా కుటుంబం, నా పిల్లలు, నా సమస్య’... అంటూ నన్ను వేరు చేసి మాట్లాడుతున్నారు. ‘ఓకే.. నాకు మంచి పాఠం నేర్పించారు’ అని డెరైక్ట్‌గా వాళ్లతోనే చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి.

 మీవాళ్లు అలా చేయడం బాధగా లేదా?
 సరళ: నేను కూడా మనిషేనండి. ఓషో, వివేకానంద పుస్తకాలు చదివినంత మాత్రాన ప్రతి విషయాన్ని తేలికగా తీసేసుకుంటానని అనుకోవద్దు. అయితే ఒకే ఒక్క విషయంలో నేను ఆనందపడ్డాను. మంచి వయసులో ఉన్నప్పుడే నాకు అందరి మనస్తత్వాలు అర్థం అయ్యాయి. అదే నేను బాగా ముసలిదాన్ని అయిన తర్వాత తెలిసిందనుకోండి.. ఆ వయసులో తట్టుకునేంత ధైర్యం నాకు ఉండేది కాదు. ఇప్పుడు నాకు బాగా స్టామినా ఉంది. మానసికంగా చాలా ధైర్యం ఉంది. అందుకే, తట్టుకున్నాను.

 అసలు మీ లైఫ్‌స్టయిల్ ఎలా ఉంటుంది?
 సరళ: చాలా నార్మల్‌గా. కొన్ని రోజులు ఉదయం ఐదున్నర గంటలకు వాకింగ్ వెళుతుంటాను. బద్దకం అనిపించినప్పుడు మానేస్తా. చెబితే నమ్మరు కానీ.. పదేళ్ల క్రితం రాత్రి రెండున్నర గంటలకు నిద్రలేచి, మూడుగంటలకల్లా మెరీనా బీచ్‌కి వెళ్లేదాన్ని. ఓ గంట వాక్ చేసి, నాలుగున్నరకి ఇంటికొచ్చేసేదాన్ని. ఆ తర్వాత మేకప్ చేసుకుని ఏడుకల్లా షూటింగ్‌కి వెళ్లేదాన్ని. అలా ఆరు నెలలు చేశాను. ఆ తర్వాత కొన్నాళ్లు వాకింగ్ మానేశాను. ఇంట్లోనే త్రెడ్‌మిల్ మీద వాక్ చేసేదాన్ని. అది వర్కవుట్ కాలేదు. ఈ మధ్య ఉదయం నాలుగున్నరకల్లా నిద్ర లేచి, వాకింగ్, చిన్నపాటి వ్యాయామాలు చేస్తున్నాను. ఆ తర్వాత సింపుల్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. నాన్‌వెజ్ పెద్దగా తినను.

 ఫైనల్‌గా కథానాయికల కెరీర్‌కన్నా మీ కెరీర్‌కి లాంగ్విటీ ఎక్కువ కాబట్టి.. ఎప్పుడైనా హీరోయిన్స్‌కన్నా మనమే బెస్ట్ అనిపించిందా?
 సరళ: హీరోయిన్‌గా చేసి ఉంటే.. ఇప్పుడు ‘సాక్షి’కి ఈ ఇంటర్వ్యూ ఇచ్చి ఉండేదాన్ని కాదేమో. మా కోయంబత్తూర్‌లో పాత రోజులను నెమరువేసుకుంటూ కాలక్షేపం చేసేదాన్నేమో. 1983లో సినిమాల్లోకొచ్చాను. ఒకవేళ హీరోయిన్ అయ్యుంటే ఐదు, పదేళ్లకే వెనక్కి వెళ్లిపోయుండేదాన్ని. కామెడీలో ఉన్నాను కాబట్టే 30 ఏళ్లయినా స్టేల్ అవ్వలేదు. ఇప్పటికీ ‘కోవై సరళ’ కామెడీ బోర్ కొట్టలేదు. అందుకే, ‘కామెడీలో నేనే హీరోయిన్’ అనుకుంటాను. నా భర్త, నా పిల్లలు, నా హాబీ సినిమాలే. చివరి శ్వాస వరకు యాక్ట్ చేయాలన్నదే నా కోరిక.

 - డి.జి. భవాని

 మీరు ఎవరితోనూ ఫోన్‌లో టచ్‌లో ఉండరు... ఎందుకు?
 సరళ: ఫోన్లో మాట్లాడటం నాకు అలర్జీ. ఎవరైనా గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతుంటే, అంతసేపు ఎలా మాట్లాడుతున్నారు? అనుకుంటాను. మీకో విషయం చెప్పనా? ఆరు నెలల క్రితం వెయ్యి రూపాయలతో రీచార్జ్ చేయించు కున్నాను. ఇప్పటికీ నా ఫోన్‌లో బాలెన్స్ ఉంది. దాన్ని బట్టి ఎంత మితంగా ఫోన్ వాడతానో అర్థం చేసుకోవచ్చు.

 ఫంక్షన్స్‌లో కూడా ఎక్కువ కనిపించరు?
 సరళ: ఫంక్షన్స్‌కి వెళ్లడం చాలా తక్కువ. ఫంక్షన్‌కి వెళ్లాలనుకోండి... దానికోసమే ప్రత్యేకంగా తయారవ్వాలి. తయారై, ట్రాఫిక్‌ని కూడా లెక్క చేయకుండా వెళ్లిన తర్వాత అక్కడ జరిగేది ఏంటి? ‘బాగున్నారా..’.. ‘ఆ బాగున్నాను’ అంటూ పలకరింపులు. వెనక్కి తిరగ్గానే ‘ఆ ఏం బాగులే...’ అని వెక్కిరింతలు. పెదాల మీద నవ్వుని మెయిన్‌టైన్ చెయ్యాలి. ఇంటికొచ్చేసరికి ఆ నవ్వు తాలూకు బుగ్గల నొప్పిని భరించాలి. ఇవన్నీ ఎందుకు? అని ఫంక్షన్స్‌ని తగ్గించేశాను.


 ఓ సినిమా సక్సెస్ అయితే హీరో, డెరైక్టర్, హీరోయిన్స్‌కి ఎక్కువ క్రెడిట్ ఇస్తారు. ఆ తర్వాతే కమెడియన్స్ గురించి మాట్లాడుకుంటారు. దీని గురించి మీరేమంటారు?

 సరళ: నాకు సంబంధించినంతవరకు అది కరెక్టే అంటాను. ఎందుకంటే, హీరోలు నిజంగానే కష్టపడాలి. ఫిజిక్ మెయిన్‌టైన్ చెయ్యాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలు కంపల్సరీ. ఆహార విషయాల్లో కూడా చాలా నియమాలుంటాయి. ఇక, ఫైట్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. సినిమా మొత్తం దాదాపు హీరో మీదే నడుస్తుంది కాబట్టి.. ఎక్కువ శాతం క్రెడిట్ వాళ్లకే ఇవ్వాలి. హీరోయిన్స్ కూడా సన్నగా మెరుపు తీగలా ఉండాలి కాబట్టి... నచ్చిన ఆహారం తినలేరు. డ్యూయెట్ సాంగ్స్‌లో డాన్సులు చేయడం చిన్న విషయం కాదు. అందుకని, హీరోయిన్‌కీ క్రెడిట్ ఇవ్వాలి. సినిమా మొత్తాన్ని ఏకతాటిపై నడిపించేది దర్శకుడు, అసలా సినిమా తీయడానికి కారణం ప్రొడ్యూసర్ కాబట్టి.. ముందు వాళ్ల గురించే మాట్లాడాలి. ఇక, ఆ తర్వాతి క్రెడిట్ విలన్, కమెడియన్స్, క్యారక్టర్ ఆర్టిస్ట్‌లకు దక్కుతుంది.
http://www.sakshi.com/news/family/exclusive-interview-with-kovai-sarala-76157?pfrom=home-top-story
22:43 - By Swathi 0

WIDGET #1

Text Widget

Blogroll

Followers

Discrimination

ఈ బ్లాగులోని విషయాలు , సమాచారం మీకు ఉపయోగపడకలదు అని బావించి ఇంటర్నెట్ మరియు ఇతర వెబ్సైటు ల నుండి సేకరించడం జరిగింది.

Discussion

Powered by Blogger.
back to top