Feed Section

Search

Recent Readers

Powered by Blogger.

Saturday, 5 October 2013

Manchu Vishnu Interview

23:37 - By Swathi 0

నన్ను పోలీసాఫీసర్‌ను చేయాలనుకున్నారు! : మంచు విష్ణు


నన్ను పోలీసాఫీసర్‌ను చేయాలనుకున్నారు! : మంచు విష్ణు
మంచు విష్ణు బాడీ లాంగ్వేజ్
 హంబుల్‌గా భలే కండలు తిరిగి ఉంటుంది!
 విగరు తప్ప పొగరు లేని విగ్రహం.
 కత్తిలా మెరుస్తుంటాడు.
 ఆ మెరుపు అతడి వ్యక్తిత్వానిది.
 ఏ ఒరలోనైనా ఇట్టే సెట్ అయిపోతాడు.
 ఆ అణకువ అతడి పెంపకానిది.
 హిట్టూ, ఫట్టూ రెండూ ఒకటే విష్ణుకి.
 రెండూ మాయ అంటాడు.
 పడిన కష్టమే నిజమంటాడు.
 అదే అసలైన విజయం అంటాడు.
 ఈవారం ‘తారాంతరంగం’ చదవండి
 ఎబిలిటీ, సెన్సిబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ
 ఈ మూడూ కలిసిన...
 ఓ ఫుల్‌లెంగ్త్  హీరో కనిపిస్తాడు.

     మనోజ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశారని తెలుసు.. మీరూ చేశారా?
 విష్ణు: నాన్నగారు చేసిన ‘ప్రతిజ్ఞ’, ‘రగిలే గుండెలు’ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాను. కానీ, నాకేం పెద్ద పేరు రాలేదు. అప్పట్లో మా నాన్నగారికి మా విషయంలో కొన్ని కలలున్నాయి. నన్నేమో పోలీసాఫీసర్‌గానూ మనోజ్‌ని ఆర్టిస్ట్‌గానూ చూడాలనుకున్నారు. తన డైరీలో కూడా ఇదే రాసుకున్నారు. కానీ మా తమ్ముడితో పాటు నేను కూడా ఆర్టిస్ట్ అయిపోయాను.

     పర్టిక్యులర్‌గా మిమ్మల్నే పోలీసాఫీసర్‌ని చేయాలని ఎందుకనుకున్నట్లు?
 విష్ణు: సమాజాన్ని కాపాడే అత్యుత్తమ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అనేది నాన్నగారి కచ్చితమైన అభిప్రాయం. అందుకే నన్ను పోలీసాఫీసర్‌గా చూడాలనుకున్నారు.

     మరి.. మీరేం కావాలనుకున్నారు... సినిమాల్లోకి రావాలని అనుకోలేదా?
 విష్ణు: అనుకోలేదు. ఎందుకంటే నా లుక్స్ మీద నాకు   నమ్మకం ఉండేది కాదు. అంత బాగుండేవాణ్ణి కాదు. చిన్నప్పట్నుంచీ మనోజ్ హ్యాండ్‌సమ్‌గా ఉండేవాడు. అందుకని తను హీరో అవుతాడని అనుకునేవాణ్ణి.

     మరి.. మీ లుక్స్ మీద మీకెప్పుడు నమ్మకం కలిగింది?
 విష్ణు: ఇప్పటికీ లేదు.

     అయినా... ఎందుకు సినిమాల్లోకి రావాలనుకున్నారు?
 విష్ణు: సినిమా నేపథ్యం ఉండటంవల్లో ఏమో నా లుక్స్ మీద పెద్ద ఇంప్రెషన్ లేకపోయినా యాక్ట్ చేయాలనుకున్నాను. ఎలా ఉన్నా సరే.. నటుడిగా మాత్రం ప్రూవ్ చేసుకోవాలని బలంగా నిర్ణయించుకున్నాను.

     మొదట్లో బొద్దుగా ఉండేవారు.. ఆ తర్వాత సన్నబడటానికి కారణం?
 విష్ణు: దానికి కారణం కృష్ణవంశీగారు. ఓసారి ఆయన్ను ‘నాతో యాక్షన్ సినిమా చేస్తారా?’ అని అడిగితే.. ‘నీతో యాక్షనా? కామెడీ సినిమా చేస్తా’ అని ఇన్‌సల్ట్ చేశారు. బాగా సన్నబడి, మూడు నెలల తర్వాత ఆయన ముందుకెళితే, గుర్తు పట్టలేకపోయారు.

     ఆపరేషన్ చేయించుకుని తగ్గారని టాక్...
 విష్ణు: ... అని చాలామంది అనుకుంటారు కానీ, ఏ ఆపరేషన్ చేయించుకున్నా ఇంతలా ఎవరూ తగ్గరు. ‘ఒక్క నెల నీది కాదని ఫిక్స్ అవ్వన్నా.. తగ్గిపోతావ్’ అన్నాడు మనోజ్. కృష్ణవంశీగారు నన్నలా అన్న మూడు రోజులకు నాన్నగారు ‘ఏరా.. నాకు మంచి బాడీ అంటే ఇష్టం. డబ్బులు లేక అప్పట్లో నేను అనుకున్న బాడీని తెచ్చుకోలేకపోయాను. మీకు అన్నీ సమకూర్చాను కదా. మరి నేననుకున్న బాడీని మీరు తెచ్చుకోలేరా?’ అనడిగారు. ఆరోజు నాన్నగారి మాటల్లో ఆవేదన కనిపించింది. దాంతో బలంగా ఫిక్స్ అయ్యి, వర్కవుట్లు మొదలుపెట్టాను. ఈరోజు నా ఫిజిక్ బాగుంటుందని చాలామంది అంటున్నారు. కానీ ...వెయిట్ అండ్ సీ... నా శరీరాకృతిలో ఇంకా  మార్పుని చూస్తారు.

     ఇప్పుడు కృష్ణవంశీతో చేసే అవకాశం వస్తే?
 విష్ణు: తప్పకుండా చేస్తా. నా అభిమాన దర్శకుల్లో ఆయన ఒకరు. ఇంకా బాపుగారు, దాసరిగారు, రాఘవేంద్రరావుగారు.. ఇలా చాలామంది దర్శకులతో సినిమాలు చేయాలని ఉంది.

     ‘శ్రీరామరాజ్యం’లో అవకాశం ఇవ్వమని బాపూగారిని అడిగారట?
 విష్ణు: ‘అల్లరి’ నరేష్‌తో బాపుగారు ‘సుందరకాండ’ చేసినప్పుడు ఓ చిన్న పాత్రైనా ఇవ్వమని అడిగాను. ‘చిన్న వేషం  కాదు... నీతో ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తా’ అన్నారు. ఆ రోజు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నాకున్న మార్కెట్‌కి బాపూగారు నాతో సినిమా చేయగలరా? మమ్మల్ని పెట్టి ఎవరు సినిమా తీస్తారు? పోనీ, నేనైనా ఆయనతో సినిమా నిర్మించగలనా? అని ఆలోచించి, అయ్యే పని కాదని బాధపడ్డాను. ఆ తర్వాత ‘శ్రీరామరాజ్యం’లో భటుడి వేషం అయినా వేస్తా అని బాపూగారిని అడిగాను. చిన్న రోల్ బాగోదని ఇవ్వలేదు.

     హీరోగా వచ్చి పదేళ్లవుతోంది... ఏం సాధించాననుకుంటున్నారు?
 విష్ణు: గొప్ప నటుడవ్వాలనే లక్ష్యంతో స్టార్ట్ అయ్యాను. నిరూపించుకుంటూ వెళుతున్నాను. నటుడిగా నాకింకా ఎంతో జర్నీ ఉంది. ఆ జర్నీలో పదేళ్లనేది ఓ మైల్‌స్టోన్‌లాంటిది. ఈ పదేళ్లల్లో నేనేం సాధించానంటే.. ‘గుడ్ యాక్షన్ కామిక్ హీరో’ అనిపించుకోగలిగాను.

  గొప్ప నటుడవ్వాలనే లక్ష్యంతో స్టార్ట్ అయ్యానన్నారు... స్టార్ అవ్వాలనుకోలేదా?
 విష్ణు: స్టార్‌ని ఈజీగా మర్చిపోతారు. యాక్టర్‌ని మర్చిపోరు. రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, మోహన్‌బాబు.. వీళ్లందరూ గొప్ప యాక్టర్స్‌గా నిరూపించుకున్న తర్వాత స్టార్స్ అయ్యారు. వాళ్లని ఎవరూ మర్చిపోలేరు.

  నంబర్ వన్ స్థానం మీద కూడా ఆశ లేదా?
 విష్ణు: నాటితరం నటుల్లో బతికున్నవారిలో ఏయన్నార్ గారికన్నా నంబర్ వన్ ఎవరైనా ఉన్నారా? ఓ నటుడిగా అక్కినేనిగారి కాలిగోటికి కూడా సరిపోను. ఆయనకున్నంత లాంగ్ ఇన్నింగ్స్ నాకూ ఉంటే కచ్చితంగా నటుడిగా ప్రూవ్ చేసుకుంటాను. ఇప్పుడు హిమాలయాలు ఎక్కుతాం. కానీ అక్కడే ఉండిపోలేం కదా. ఎక్కినవాళ్లెవరైనా ఎప్పుడోసారి కిందకు దిగాల్సిందే. అందుకే నాకు నంబర్స్ మీద ఇంట్రస్ట్ లేదు.

  సినిమాలపరంగా స్కోర్ తక్కువగా ఉందనే ఫీలింగ్ ఉందా?
 విష్ణు: ఉంది. కానీ, నా పదేళ్ల కెరీర్‌ని మీరు పరిశీలిస్తే... ఏ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నష్టపోని విషయం తెలుస్తుంది. ‘ఇతని సినిమా కొని నేను నష్టపోయాను’ అని ఎవరూ చెప్పలేరు... వేలెత్తి చూపించలేరు.

  అంటే... మీ ఫ్లాప్ సినిమాల వల్ల కూడా ఎవరికీ నష్టం రాలేదా?
 విష్ణు: లేదు. మీరెవరినైనా కనుక్కోవచ్చు. నష్టం ఏదైనా వచ్చి ఉంటే.. అది మా కుటుంబానికే. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. నిర్మాతలుగా నాన్న, నేను పర్‌ఫెక్ట్‌గా ‘పేమెంట్’ ఇస్తుంటాం. హిట్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా మీ దగ్గర పేమెంట్స్ కరెక్ట్‌గా ఉంటాయని మాకు పని చేసినవాళ్లు అంటుంటారు.

     పెద్ద బేనర్స్‌లో సినిమా చేయడంలేదనే కొరత ఉందా?
 విష్ణు: కొరత అని చెప్పలేను. కాకపోతే కారణం చెబుతాను. నాతో సినిమా తీయాలనుకునేవాళ్లు ‘ఇతనికి ఇంత మార్కెట్ ఉందా? ఇంత బడ్జెట్ పెట్టొచ్చా? ఒకవేళ పెద్ద బడ్జెట్ పెడితే ఈరోజు ఇతనికి ఇంత సేలబులిటీ ఉందా?’ అని ఆలోచిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు పెద్ద దర్శకులు నాతో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ, నా సొంత బేనర్‌లోనే సినిమా చేద్దామంటున్నారు. బయటి బేనర్లో అయితే ‘బడ్జెట్ పెట్టరేమో’ అని వాళ్ల ఫీలింగ్. బయటి నిర్మాతలను తీసుకొచ్చే చాయిస్‌ని వాళ్లు నాకివ్వడంలేదు.

     ‘ఢీ’, ‘దేనికైనా రెడీ’ లాంటి సక్సెస్‌ల తర్వాత కూడా ఇదే పరిస్థితా?
 విష్ణు: ఇప్పుడా పరిస్థితి లేదు. బయటి బేనర్స్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. యాక్చువల్‌గా ‘దూసుకెళతా’ బదులు నేను ‘రావణ’ సినిమా చేసి ఉండాల్సింది. రాఘవేంద్రరావుగారు, నాన్నగారు, నేను అన్నీ ఫైనలైజ్ చేసుకున్నాం. ఆల్‌మోస్ట్ అన్నీ సెట్ అయ్యి, ఇక సెట్స్‌కి వెళదామనుకుంటున్న సమయంలో ఈ ప్రాజెక్ట్ వచ్చింది. తమ్ముడు కూడా బాగుందనడంతో ‘దూసుకెళతా’ చేయాలనుకున్నాం. అప్పటికప్పుడు వేరే నిర్మాతను అప్రోచ్ అయ్యే బదులు మా బేనర్లోనే మొదలుపెట్టాం. అదే సమయంలో సరైన కథ కుదరడంతో నాన్నగారు, మా కాంబినేషన్‌లో వేరే సినిమా కూడా మొదలుపెట్టాం. ఈ రెండు సినిమాల వల్ల బయటి బేనర్స్‌లో అవకాశాలు వచ్చినా ‘యస్’ చెప్పలేని పరిస్థితి. ఇక్కడ మరో విషయం చెప్పాలి. యాక్చువల్‌గా నాతో ఓ సినిమాని అశ్వనీదత్‌గారు తీయాల్సింది. రెండుమూడు నెలలైంది. సెట్స్‌కి వెళ్లే పరిస్థితి కనిపించకపోవడంతో మా బేనర్లోనే తీయాలనుకున్నాం. ఆ తర్వాత ‘సలీమ్’కి రిలయన్స్‌తో టై అప్ అయ్యాం. ‘దేనికైనా రెడీ’ని వేరే నిర్మాత తీయాల్సింది. కానీ ఆయన డిలే చేశారు. అప్పుడు ‘ఒకరి కోసం ఎందుకు వెయిట్ చేయడం? సినిమా తీసే శక్తిని ఆ భగవంతుడు మనకిచ్చాడు’ అన్నారు మా నాన్నగారు. దాంతో ఆ సినిమాని మా బేనర్లోనే చేశాం. అది మాకు గొప్పగా వర్కవుట్ అయ్యింది.

     మీ హిట్ సినిమా ‘దేనికైనా రెడీ’ బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసిందంటూ వివాదాలు రేగాయి. ఆ వివాదం గురించి ఏం చెబుతారు?
   విష్ణు:    ఏదో ఒక కమ్యూనిటీని కించపరచాలనే ఆలోచన ఏమాత్రం లేదు. కొంతమంది అనవసరంగా పెద్ద వివాదం చేశారు... దానికి నేనేం చేయను!

     మా అక్క లక్ష్మీప్రసన్న పెళ్లి చేసుకున్నది బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తినే. సో.. నిజంగానే వారిని కించపరిచే విధంగా నా సినిమా ఉండి ఉంటే.. ముందు మా ఇంటినుంచే వివాదం మొదలై ఉండేది.

     సెన్సార్ బోర్డ్ అధ్యక్షురాలు ధనలక్ష్మితో కూడా మీకు వివాదం ఉందనిపిస్తోంది.. ఇటీవల ‘దూసుకెళతా’ ట్రైలర్‌లో ఓ పదాన్ని తొలగించకపోతే.. సర్టిఫికెట్ ఇవ్వనన్నారు. ఆమెతో మీకు ‘దేనికైనా రెడీ’ అప్పట్నుంచే వివాదం మొదలైనట్టుంది...
 విష్ణు: నిజమే, ఆ సినిమాకి ఆవిడ నాలుగైదు కట్స్ చెప్పారు. కొన్ని డైలాగ్స్ ‘మ్యూట్’ చేయమన్నారు. ఓకే అన్నాను. సోమవారం సర్టిఫికెట్ తీసుకోమన్నారు. కట్ చేస్తే... సోమవారం కొత్త సెన్సార్ ఆఫీసర్‌తో కలిసి ఆ చిత్రం మలయాళ వెర్షన్ చూశారామె. రూల్‌ప్రకారం అలా వేరే కొత్త ఆఫీసర్‌తో చూడకూడదు. సరే చూశారు. చూసిన తర్వాత 26 కట్స్ ఇచ్చారు. దాంతో, ‘మీరు నా సినిమాకి సెకండ్ టైమ్ సెన్సార్ చేస్తున్నారా?’ అనడిగాను. అక్కణ్ణుంచి గొడవ మొదలైంది. న్యాయం మావైపు ఉంది కాబట్టి, రివైజింగ్ కమిటీవారు చూసి, సర్టిఫికెట్ ఇచ్చారు. బుధవారం సినిమా రిలీజ్ అంటే.. మంగళవారం సాయంత్రం సర్టిఫికెట్ వచ్చింది. ఓవర్సీస్‌కి ప్రింట్స్ పంపించి వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఎంత టెన్షన్‌గా ఉంటుందో అర్థం చేసుకోండి.

     ఓకే... మీ వ్యక్తిగత విషయానికొద్దాం... విరానికాతో మీ లవ్‌స్టోరి ఎప్పుడు మొదలైంది?
 విష్ణు: వినీ (విరానికా) వాళ్ల తాతగారు (సీసీ రెడ్డి) బర్త్‌డే ఫంక్షన్‌కి నాన్నగారు నన్ను తీసుకెళ్లారు. అక్కడే వినీని చూశాను. తొలిచూపులోనే ప్రేమలో పడిపోయా.

     తొలి చూపు ప్రేమ ట్రాష్ అనీ, ఎక్కువ కాలం నిలబడదనీ చాలామంది అంటారు..?
 విష్ణు:  అది నేను నమ్మను. తొలి చూపులో ప్రేమలో పడ్డవాళ్లకే ఆ మహిమ తెలుస్తుంది. నేనూ వినీ కలిసి ఇప్పటికి ఎనిమిదేళ్లయ్యింది. మా బంధం నిలబడినట్లేగా!
      తొలిచూపులోనే విరానికాయే మీ ‘బెటర్ హాఫ్’ అవుతుందని ఎలా జడ్జ్ చేయగలిగారు?
 విష్ణు: అసలంత దూరం ఆలోచించలేదు. తనను చూసిన క్షణంలోనే ప్రేమలో పడిపోయా. నేను సన్నబడిన తర్వాత చాలా బాగున్నానని చాలామంది అంటున్నారు. కానీ నేను 113 కేజీల బరువు ఉన్నప్పుడు వినీ నన్ను ప్రేమించింది.

     పెళ్లి తర్వాత కూడా తగ్గమని చెప్పలేదా?
 విష్ణు: అస్సలు లేదు.

     మీ లవ్‌స్టోరీ తెలిసి, ఇంట్లోవాళ్లు ఏమన్నారు?
 విష్ణు: స్టార్టింగ్‌లో వినీవాళ్ల ఇంట్లో కొంచెం అపోజిషన్ ఉండేది. మా ఇంట్లో మేం నాన్నగారికి చెప్పడానికి భయపడ్డాం. కానీ చెప్పిన తర్వాత నాలుగైదు రోజులకే నాన్నగారు ఓకే అనేశారు.

     వైఎస్సార్‌గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కదా విరానికా. మీరు ఆయన్ని ముందెప్పుడైనా కలిశారా?
 విష్ణు: వినీతో నా లవ్‌కి ముందే వైఎస్సార్‌గారితో నాకు పరిచయం ఉంది. రెండు మూడు సార్లు మాట్లాడాను. వినీతో పరిచయమైన తర్వాత ఆ కుటుంబంలో ఎవర్నీ కలవకూడదనుకున్నాను.  కానీ, అందరి ఆమోదం లభించిన తర్వాత కలవడం మొదలుపెట్టాను.

     ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోతే ఏం చేసేవారు?
 విష్ణు: ప్రేమలో పడ్డ తర్వాత నేనూ వినీ ఒకటే అనుకున్నాం... ఒకవేళ ఇంట్లో ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకోకూడదని! మా సంతోషం కోసం పెద్దల్ని నొప్పించాలనుకోలేదు. అయితే లక్కీగా మాకు రెండువైపులా గ్రీన్‌సిగ్నల్ లభించింది.

     వైవాహిక జీవితం గురించి..?
 విష్ణు: ఉదయం నిద్ర లేచిన తర్వాత.. మనకోసం మన పక్కనే ఓ వ్యక్తి ఉందనే ఫీలింగ్ ఇచ్చే ఆనందానికి సాటే ఏదీ రాదు. అమ్మానాన్న ఎలాగూ ఉంటారు. కానీ, ఏదైనా టెన్షన్ పెట్టే విషయాలను చెప్పి, వాళ్లని బాధపెట్టలేను. భార్యతో అయితే చెప్పుకోవచ్చు. వినీ నా బెస్ట్‌ఫ్రెండ్. ఆరి, వివీలాంటి రెండు ఆణిముత్యాలను ఇచ్చినందుకు తనకెప్పుడూ ఋణపడి ఉంటాను.

     నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిలయ్యారు. మరి.. కవల పిల్లలు పుట్టబోతున్నారని తెలిసినప్పుడు ఎలా ఫీలయ్యారు?
 విష్ణు: ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను! వినీ ప్రెగ్నెంట్ అని తెలియగానే, నా ఫ్రెండ్స్ చాలామంది ‘ఆడపిల్లయితే బాగుంటుంది. ఆ ఫీలింగే వేరు’ అన్నారు. నాకా భగవంతుడు ఇద్దరు ఆడపిల్లలను బహుమతిగా ఇచ్చాడు. అక్క ఎంత అల్లరి చేసినా ఏమీ అనని నాన్న, మేం చిన్న తప్పు చేసినా ఎందుకు తంతారో నాకు ఆడపిల్లలు పుట్టిన తర్వాత అర్థమయ్యింది.

  పిల్లలకు డైపర్లు ఎప్పుడైనా మార్చారా?
 విష్ణు: పిల్లలు పుట్టిన మొదట్లో ఎవర్నీ తాకనిచ్చేవాణ్ణి కాదు. నేనే డైపర్లు మార్చేవాణ్ణి. ఒకట్రెండు రోజులు వినీ పిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. నేనే డైపర్లు మార్చి బాటిల్‌లో పాలు పట్టేవాణ్ణి. ఒక్కోసారి నాన్నగారు డైపర్లు మార్చేవారు. పిల్లల పక్కన కూర్చుని, ఏవో దేవుడి పద్యాలు చెబుతూ, పాలు తాగించేవారు. అవన్నీ బ్యూటిఫుల్ మూమెంట్స్!
     ఆరియానా, వివియానా మీ జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఏర్పడిన మార్పు?
 విష్ణు: అంతకుముందు మాకు పని గురించి తప్ప వేరే వేరే డిస్కషన్స్ ఉండేవి కాదు. ఇప్పుడు అందరి డిస్కషన్స్ పిల్లల గురించే. అందరి గోల్ కామన్‌గా ఒకటే. వాళ్లని మెప్పించడానికి ఏం చేయాలి? అని! వాళ్లు చేసే ఏ చిన్న పనైనా పెద్ద డిస్కషన్ అయిపోతుంది. వండర్‌ఫుల్‌గా ఉంది.

     మీ పిల్లలిద్దరూ ఒకే రకంగా ఉంటారా?
 విష్ణు: ఆరియానా నాలా ఉంటుంది. కానీ, వినీని వదిలి ఉండలేదు. వివియానా వినీలా ఉంటుంది. తను నన్నొదిలి ఉండలేదు.

     కట్నంగా వినీ వందల కోట్లు తెచ్చారని అందరూ అంటుంటారు.. నిజమేనా?
 విష్ణు: డబ్బు తెచ్చిందో లేదో చాలామందికి తెలుసు. మా పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత నాన్నగారు ఒకటే అన్నారు. ‘కట్నం వద్దు. నేను సంపాదించింది చాలు. అయితే ఒకే ఒక్క విషయం. అందరం కలిసే ఉండాలి’ అన్నారు. వినీ కూడా అందరం కలిసే ఉండాలని కోరుకుంది.

     ఓకే.. మళ్లీ ఫ్లాష్‌బ్యాక్‌లోకెళదాం... మీరు చెన్నయ్‌లో చదువుకున్నారు కదా. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఎలా అనిపించింది?
 విష్ణు: చెన్నయ్‌లో ఎర్లీ మార్నింగే లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ తొమ్మిది, పదికి కానీ షాప్స్ తెరిచేవాళ్లు కాదు. నాకైతే అడవిలో ఉన్నట్లనిపించేది. ఇప్పుడు చెన్నయ్‌లానే ఇక్కడ కూడా ఉంటుందనుకోండి. ఇంకో విషయం ఏంటంటే.. మద్రాసులో ‘ఫాల్స్ ప్రెస్టీజ్’ ఉండేది కాదు. కానీ, ఇక్కడ మీకిచ్చే మర్యాద మీ దగ్గరున్న కార్ల వల్ల, మీరు వేసుకున్న బట్టల వల్లే! మద్రాసులో ఎన్ని వేల కోట్లున్నా.. 15, 20 లక్షలు ఖరీదు చేసే కార్లే వాడతారు. కానీ, ఇక్కడ 5 కోట్లున్నవాళ్లు కూడా 2 కోట్లు విలువ చేసే కార్లు వాడతారు.

 మీ దగ్గరా ఖరీదు గల కార్లు ఉన్నాయిగా?
 విష్ణు: కొనుక్కోవచ్చు. అందులో తప్పు లేదు. నెససిటీ వేరు.. స్టేటస్ సింబల్ వేరు. అవి మేం స్టేటస్ సింబల్ కోసం కొనుక్కోలేదు. నేను చాలా యంగ్‌గా ఉన్నప్పుడే ఇండియాలో ఫస్ట్ పోర్‌షే కారు కొనుక్కున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ‘నీకో కారు కొనాలనుకుంటున్నా’ అని నాన్నగారు అన్నారు. అప్పుడు ‘ఫెంటాస్టిక్‌గా ఉంటుందన్నా. ఆ కారు కొనుక్కో’ అని తారక్ (ఎన్టీఆర్) సజెస్ట్ చేస్తే, పోర్‌షే కారు కొన్నాను.

     ఆ తర్వాతా బోల్డన్ని కార్లు కొన్నారు కదా?
 విష్ణు: ప్రతి నాలుగేళ్లకోసారి కొత్త కారు కొంటాం. 70వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత కారు మార్చేస్తాం. మనోజ్‌కి కారు కొనాల్సిన టైమ్ వచ్చినప్పుడు తనకు తెలియకుండా ‘రేంజ్ రోవర్’ బుక్ చేశాం. ఇంటికి డెలివరీ వచ్చిన తర్వాత, వాడి చేతిలో తాళాలు పెడితే, ఆశ్చర్యపోయాడు.

     తమ్ముణ్ణి సర్‌ప్రైజ్ చేసేంత ప్రేమ ఉందని అర్థమవుతోంది. బయట మాత్రం మనోజ్‌తో, మీ అక్కతో మీకు పడదనే టాక్ ఉంది?
 విష్ణు: అక్కా తమ్ముడు ఒక టీమ్. ఇద్దరూ పార్టీలు ఇష్టపడతారు. లేట్‌గా నిద్రపోతారు.. లేట్‌గా లేస్తారు. నాకు పార్టీలు ఇష్టం ఉండదు. నాకు త్వరగా నిద్రపోవడం, తెల్లవారుజాము నాలుగున్నర, ఐదింటికల్లా నిద్రలేవడం అలవాటు. ఆ ఒక్క విషయంలో మినహా మిగతా అన్ని విషయాల్లో మేం ఒక మాట మీదే ఉంటాం.

     మీరెప్పుడూ వాళ్లకి సలహా ఇవ్వరా?
 విష్ణు: నాకెవరైనా సలహా ఇస్తే నచ్చదు. ఉచిత సలహాలు బోల్డంతమంది ఇస్తారు. ఒక్కో సలహాకి ఐదువేలు ఇవ్వాలంటే.. ఒక్కళ్లు కూడా ఇవ్వరు. నేను కూడా ఎవరికీ సలహా ఇవ్వను. అయినా అక్కా తమ్ముడు తప్పు చేస్తే సలహా ఇవ్వొచ్చు. కానీ వాళ్లు తప్పులు చేయరు.

     ఫలానా కారు కొనమని సలహా ఇచ్చారంటే తారక్‌కీ మీకూ మంచి స్నేహం ఉందన్నమాట?
 విష్ణు: హైదరాబాద్‌లో కలిసే పెరిగాం. తను నన్ను ‘అన్నా’ అని పిలుస్తాడు. నాకు మనోజ్ ఎలానో తనూ అలానే. రేపు ఎవరో నేను చెప్పలేను కానీ, ఈరోజు తను నాకన్నా పెద్ద సూపర్ స్టార్. తన సంస్కారం చాలా నచ్చుతుంది.

     సీసీఎల్ టీమ్‌ని సొంతం చేసుకున్నారు కదా.. స్పోర్ట్స్ అంటే ఇష్టమా?
 విష్ణు: సౌతిండియన్ యూనివర్శిటీస్‌కి ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా ఉండేవాణ్ణి. కాలేజ్‌లో బాస్కెట్‌బాల్‌లో ఇండియాకి వైస్ కెప్టెన్‌గా ఉండేవాణ్ణి. సో.. స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం.

     24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థను ఏ ఆశయంతో ప్రారంభించారు?
 విష్ణు: యాక్చువల్‌గా టీవీ షోస్ చేయాలని, లో బడ్జెట్ చిత్రాలు నిర్మించాలని ప్రారంభించాం. అనివార్య కారణాల వల్ల ‘వస్తాడు నా రాజు’ని ఈ సంస్థలో తీయాల్సి వచ్చింది. అప్పుడు శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బేనర్‌లో ‘ఝుమ్మంది నాదం’ సినిమా నిర్మాణంలో ఉంది. ఒకే బేనర్ మీద రెండు సినిమాలకు ఫైనాన్స్ కుదరదనడంతో ‘వస్తాడు నా రాజు’ని 24 ఫ్రేమ్స్‌లో తీయాల్సి వచ్చింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే... విదేశాల నుంచి అక్క ఇక్కడకు వచ్చిన తర్వాత ‘లక్ష్మీ టాక్ షో’ని డెరైక్ట్ చేసి, ప్రొడ్యూస్ చేసింది నేనే. అందుకే, ఆ షోకి డెరైక్షన్ ‘వీఎం’ అని ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ ప్రాజెక్ట్‌ని అక్కకు అప్పజెప్పాను. అక్క బ్రహ్మాండంగా చేసింది. ఆ తర్వాత సక్సెస్‌ఫుల్ సీరియల్స్ చాలా చేశాం. ఇప్పుడు మాత్రం సినిమా నిర్మాణంపైనే దృష్టి పెట్టాం.

     మీ డ్రెస్ కోడ్ డిఫరెంట్‌గా ఉంటుంది. రంగు రంగుల ప్యాంట్లు వేసుకుంటారు? ఎవరు సెలక్ట్ చేస్తారు?
 విష్ణు: నా బట్టలు బాగుంటే విన్నీ ఊళ్లో ఉన్నట్లు ...లేకపోతే ఊళ్లో లేనట్లే. నా డ్రెస్‌లన్నీ తనే సెలక్ట్ చేస్తుంది. ఒకవేళ వినీ లేకపోతే హన్సికను అడుగుతాను. ‘దేనికైనా రెడీ’ అప్పుడు బ్రయన్ ఆడమ్స్‌ని కలవడానికి అమెరికా వెళ్లాను. అప్పుడు బ్రైట్ కలర్స్ ప్యాంట్స్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. అవి ఫొటోలు తీసి, ఇక్కడికొచ్చిన తర్వాత వినీకి చూపించాను. అప్పుడు అమెరికాలో వినీ ఫ్రెండ్స్ నాకోసం షాపింగ్ చేసి, పంపించారు. వాటినే ‘దేనికైనా రెడీ’ ఇంట్రడక్షన్ సాంగ్‌లో వాడాం. అవి చూసి చాలామంది ‘ఏంటీ కలర్ ప్యాంట్స్’ అన్నారు. కానీ ఆ తర్వాత చాలామంది ఆ ట్రెండ్‌ని ఫాలో అయ్యారు.

    డ్రెస్ల విషయంలో హన్సిక సలహా తీసుకుంటానన్నారు. అంత క్లోజా?
 విష్ణు: వినీ, హన్సిక మంచి ఫ్రెండ్స్. మా పిల్లలంటే హన్సికకు ప్రాణం. మాసీ (పిన్ని) అని పిలిపించుకుంటుంది. పిల్లలు పుట్టిన వెంటనే, వాళ్లని వదిలి నేను ‘దేనికైనా రెడీ’ షూటింగ్‌లో పాల్గొనాల్సి వచ్చింది. దాంతో మా పిల్లల గురించి హన్సికకు చెబుతుండేవాణ్ణి. వాళ్ల ఫొటోలు కూడా చూపించేవాణ్ణి. ఆ విధంగా తనక్కూడా పిల్లలతో ఎటాచ్‌మెంట్ కుదిరింది. నేచురల్‌గా మా ఫ్యామిలీకి కూడా క్లోజ్ అయ్యింది.

     అందమైన హీరోయిన్లతో మీరు జత కడుతుంటారు కదా. మీ వినీకి అభద్రతాభావం కానీ సందేహాలు కానీ ఉండవా?
 విష్ణు: ఈ ప్రపంచంలో ఇప్పటివరకు వినీకన్నా గొప్ప అందగత్తెని చూడలేదు. చూసినప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందేమో (నవ్వుతూ).

     మీ ఇద్దరిలో ఎవరికి కోపం ఎక్కువ?
 విష్ణు: నాకు కోపం వస్తే.. మౌనంగా ఉండిపోతాను. వినీకి కోపం ఎక్కువ. నాన్నగారికి ఎంత కోపమో తనకూ అంతే. మేం గొడవపడం అంటే అబద్ధం చెప్పినట్లే. మా మధ్య గొడవలు జరుగుతాయి. ఓసారి వినీ హోటల్‌కెళదామంటే కుదరదన్నాను. కోపం వచ్చి, ఏడవడం మొదలుపెట్టింది. కాసేపు ఏడ్చి ఊరుకుంటుందిలే అనుకున్నాను. కట్ చేస్తే... ‘ఐయామ్ గోయింట్ టు డ్రైవ్’ అని వెళ్లింది. కాసేపటికి వెనక్కొచ్చింది. ఏంటా? అని ఆలోచనలో పడ్డాను. వెనకాలే నాన్నగారు కూడా వచ్చారు. ‘అమ్మాయిని ఏడిపిస్తావా’ అని చెడామడా తిట్టేశారు. నాన్న ఎప్పుడూ వినీనే సపోర్ట్ చేస్తారు.

  చిన్నప్పట్నుంచీ అంతేనా?
 విష్ణు: అవును. నేను తాగను, సిగరెట్లు కాల్చను.

     అవునా.. నమ్మొచ్చా?
 విష్ణు: నమ్మొచ్చు (నవ్వుతూ). నాకు స్మోకింగ్ పడదు. మందు కొట్టడం ఇష్టం ఉండదు.
     ఫైనల్‌గా... దేవుడు మీకెంతో ఇచ్చాడు కాబట్టి సేవా కార్యక్రమాలేమైనా చేస్తుంటారా?
 విష్ణు: తిరుపతిలో ఉన్న మా విద్యానికేతన్ స్కూల్ చుట్టుపక్కల ఉన్న పది గ్రామాలను దత్తత తీసుకున్నాను. ప్రస్తుతానికి అక్కడ ‘ఆర్మీ గ్రీన్’ అని స్టార్ట్ చేసి, విలేజెస్‌ని క్లీన్ చేస్తున్నాం. ఆ చెత్తంతా ఊరి బయట వేస్తే, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్లొచ్చి, ఇక్కడ వెయ్యకూడదు, మా ల్యాండ్ అన్నారు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. అక్కడున్న స్కూల్స్‌లో టాయ్‌లెట్స్ లేవు. దాంతో చాలామంది ఆడపిల్లలు స్కూల్‌కెళ్లడం మానేశారు. ఒకవేళ వెళ్లినా టాయ్‌లెట్‌కి వెళ్లాల్సి వస్తుందని, నీళ్లు తాగడంలేదట. సో.. ముందు టాయ్‌లెట్స్ కట్టించాలి. ఇంకా చాలా చెయ్యాలి. దానికి బోల్డంత డబ్బు సమకూర్చుకోవాలి. నా సినిమాల ద్వారా అది నెరవేర్చుకుంటాను. అప్పుడు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తా. ఆ భగవంతుడు ఇచ్చినదాంట్లో నాకు వీలు కుదిరినంతవరకు ఇతరులకు సహాయపడాలనేది నా ఆశయం.


 మోహన్‌బాబుగారు క్రమశిక్షణ గల వ్యక్తి. ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. అందుకే, ఆయన ‘వివాదాస్పద వ్యక్తి’ అని కొంతమంది అంటారు. ఓ కొడుకుగా మీరేమంటారు?

 విష్ణు: అలా అన్నవాళ్లు నాన్నగార్ని సరిగ్గా అర్థం చేసుకోలేదంటాను. చిన్న ఉదాహరణ చెబుతాను. వందేళ్ల భారతీయ సినిమా వేడుకలకు ఆయనో లెటర్ రాసిన విషయం మీకు తెలుసు. తమ్మారెడ్డి భరద్వాజ్‌గారు, నలుగురు రైటర్స్, నేను ఓ పది రోజులు ఈ వేడుకలకు సంబంధించిన సన్నాహాలు చేసుకుంటూ వచ్చాం. సడన్‌గా ఓ రోజు ‘మన రాష్ర్ట పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ వేడుకల్లో టాలీవుడ్ నుంచి ఎవరూ పెర్‌ఫామ్ చేయకూడదని లెటర్ రాశాను’ అన్నారు నాన్నగారు. నేను షాక్ అయ్యాను. ఇప్పుడెందుకు నాన్నా ఇలా చేశారు? అనడిగితే - ‘నా అభిప్రాయం చెప్పాను. ఒకవేళ అందరూ వెళితే నేనూ వెళతాను’ అన్నారు. కానీ నాన్నగారి అభిప్రాయాన్ని చాలామంది ఆమోదించారు. అప్పుడనిపించింది... నేనింకా ఎదగాలని!

  విదేశాల్లో షూటింగ్ చేసేటప్పుడు వినీ, పిల్లలు, అమ్మానాన్నలను కూడా తీసుకెళుతుంటాను.
  ఆరియానా, వివియానా సంస్కృతం పేర్లు.  ఆరియానా అంటే ‘ఫుల్ ఆఫ్ లైఫ్’. వివియానా అంటే ‘సన్‌లైట్ అండ్ జాయ్’ అని అర్థం.

     ‘దేనికైనా రెడీ’ పాటలు నా కెరీర్‌లోనే బెస్ట్ అని చెప్పొచ్చు. మా అమ్మాయిలు ఆ పాటలు తప్ప వినరు. నా కెరీర్‌లో ఎంత బెస్ట్ ఆల్బమ్ అయినా, అవి వింటుంటే నా చెవుల్లోంచి రక్తం వచ్చినంత పనవుతోంది. అన్నిసార్లు వింటారు.

     ‘రావణ’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అది. ఆ సినిమా తీయాలంటే చాలా డబ్బులు కావాలి. అందుకే, ఇప్పుడు నేను చేస్తున్న ‘దూసుకెళ్తా’, నాన్నగారు, మా కాంబినేషన్‌లో చేస్తున్న సినిమా హిట్టవ్వాలనుకుంటున్నాను. భారతదేశం గర్వించే స్థాయిలో అద్భుతమైన టెక్నికల్ వండర్‌గా ‘రావణ’ సినిమా ఉంటుంది. డిసెంబర్‌లో షూటింగ్ మొదలుపెడతాం.

     మా ముగ్గురిలో కాస్తో కూస్తో చదివింది నేనే. మనోజ్ చిన్నప్పట్నుంచీ అల్లరోడే. అక్క డీసెంట్ మార్క్స్ తెచ్చుకునేది. ఎప్పుడైనా మార్కులు తక్కువొస్తే అమ్మ మమ్మల్ని మామూలుగా కొట్టేది కాదు.

     దీపావళి పండగను మేం బాగా చేసుకుంటాం. మాకంటే ఎక్కువగా మా నాన్నగారు ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతికి వీలైనంతవరకు మా ఊరికి వెళతాం. వినీ క్రిస్టియన్. తను రాక ముందు నుంచీ క్రిస్మస్ సెలబ్రేట్ చేసేవాళ్లం. తను వచ్చిన తర్వాత క్రిస్మస్ ట్రీ కూడా పెడుతున్నాం.


http://www.sakshi.com/news/family/i-want-to-be-a-police-officer-manchu-vishnu-70986

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Pellentesque volutpat volutpat nibh nec posuere. A die shopuf pogest concludi cum administrasset slushie intus calidum brioche.
Follow me @Bloggertheme9
Subscribe to this Blog via Email :

0 comments:

WIDGET #1

Text Widget

Blogroll

Followers

Discrimination

ఈ బ్లాగులోని విషయాలు , సమాచారం మీకు ఉపయోగపడకలదు అని బావించి ఇంటర్నెట్ మరియు ఇతర వెబ్సైటు ల నుండి సేకరించడం జరిగింది.

Discussion

Powered by Blogger.
back to top